నవీపేట,న్యూస్‌లైన్ : కౌమార బాల బాలికల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా 18 యువ క్లినిక్‌లు ఏర్పాటు చేశామని జాతీయ కౌమార ఆరోగ్య కార్యక్రమం(ఆర్‌కేఎస్‌కే) రాష్ట్ర కో ఆర్డినేటర్ జనార్దన్ తెలిపారు. గత నెల 24వ తేదీన నవీపేటలో ఏర్పాటు చేసిన క్లినిక్‌ను బుధవారం ఆయన డీఎంహెచ్‌ఓతో కలిసి పనితీరును పరిశీలించారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు.ఈ క్లినిక్‌లలో 10-19 సంవత్సరాల వయస్సు గల కౌమార బాలబాలికలకు ఆరువారాల పాటు ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాలు,గ్రామ పంచాయతీ కార్యాలయం,పాఠశాలల్లో ఈ క్లినిక్‌లను నిర్వహిస్తున్నామని చెప్పారు. కౌమార దశలోనే వయస్సుకు తగిన ఆహారాన్ని తీసుకోక ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారని అన్నారు. కౌమార దశలోనే బాలబాలికలు అనారోగ్యాలతో బాధపడుతున్నారని చెప్పారు. సంపూర్ణ ఆరోగ్యానికి కావల్సిన ఆరోగ్య నియమాలు క్లినిక్‌లలో వివరిస్తారని దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఆరోగ్యసిబ్బందిపై డీఎంహెచ్‌ఓ ఆగ్రహం
మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి బుధవారం తనిఖీకి వచ్చిన డీఎంహెచ్‌ఓ గోవింద్ వాగ్మారే ఆరోగ్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ కౌమార ఆరోగ్య కార్యక్రమం(ఆర్‌కేఎస్‌కే) పనితీరును పరిశీలించేందుకు వచ్చిన రాష్ట్ర కో ఆర్డి నేటర్ జనార్దన్ వెంట ఆయన ఆస్పత్రికి వచ్చారు.ఆస్పత్రికి రాగానే గాయపడ్డ పాఠశాల విద్యార్థిని అసిఫా బేగమ్ వద్దకు వెళ్లారు.ఏమైందని ప్రశ్నిస్తుండగా ఆమె బంధువైన రెహ్మాన్ ఖాన్ జోక్యం చేసుకుని ‘ వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నరు..గంట సేపైనా మా పాపను పట్టించుకోవడం లేదని..’ తన గోడును విన్నవించుకున్నాడు.దీంతో ఆగ్రహానికి గురైన డీఎంహెచ్‌ఓ, సిబ్బందిపై మండిపడ్డారు.వైద్యులు రాకేష్‌ను మందలించారు. వెంటనే విద్యార్థినికి ప్రాథమిక చికిత్స చేయాలని ఆదేశించారు.ఆస్పత్రి సిబ్బంది ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మరికొంత మంది డీఎం హెచ్‌ఓకు ఫిర్యాదు చేశారు.
జిల్లాలో 18 యువక్లినిక్‌లు
Published Thu, Mar 27 2014 3:12 AM | Last Updated on Wed, Sep 18 2019 3:24 PM
Advertisement