నేడు బీర్పూర్లో అంతర్మథనం
సారంగాపూర్, న్యూస్‌లైన్ : నక్సల్స్ అణిచివేత చర్యలలోనూ.. తీవ్రవాద వ్యతిరేక కార్యక్రమాల అమలులోనూ ప్రత్యేక గుర్తింపు పొందిన కరీంనగర్ జిల్లా శాఖ మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో నాడు.. నేడు నెలకొన్న పరిస్థితులను బేరీజు వేస్తూ నక్సలిజం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందనే సందేశాన్ని ప్రజలకు అందిస్తోంది. ‘నక్సలైట్లు మా గ్రామాలకు రావద్దు....’ అంటూ ఈసారి మావోయిస్టు పార్టీ దళపతి గణపతి ఉరఫ్ ముప్పాళ లక్ష్మణ్‌రావు స్వగ్రామాన్ని ప్రారంభ
ఏం చేస్తారంటే..
‘నక్సలైట్లు రావద్దు...’ అంటూ గ్రామస్తులతో నిరసన దీక్షలు చేయిస్తారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లో దాదాపు మూడు కిలోమీటర్లు శాంతి ర్యాలీ నిర్వహిస్తారు. ఎనిమిదేళ్ల కిందట గ్రామ పొలిమేరల్లో పోలీసు యంత్రాంగం నిర్మించిన శాంతిస్తూపం వద్ద నక్సల్స్ చేతుల్లో మృతి చెందిన వారికి నివాళులర్పిస్తారు. నక్సలైట్లు అజ్ఞాతం వీడి ఇంటిబాట పట్టాలని, ఆలోచనలో మార్పు రావాలని, అభివృద్ధి, శాంతి దృక్పథంతో జనజీవనంలోకి రావాలని, అభివృద్ధికి పాటుపడాలని ప్రత్యేక నినాదాలతో ర్యాలీ నిర్వహించనున్నారు.
అనంతరం గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేసి, వారితో సమావేశం కానున్నారు. మావోయిస్టులు ఊళ్లోకి రాకుండా కాపలా కాసేందుకు అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. సాయంత్రం పోలీసు అధికారులు ప్రత్యేకంగా గ్రామసభ నిర్వహిస్తారు. శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించటంతోపాటు సాంఘిక దురాచారాలను రూపుమాపడం, ప్రజల ఇబ్బందులు, గ్రామంలో మౌలిక సదుపాయాల గురించి సభలో చర్చిస్తారు. రాత్రి పోలీసు అధికారులు బీర్‌పూర్‌లోనే బస చేస్తారు.
5వేల మందితో..
కనీసం ఐదువేల మందిని ఈ సభకు సమీకరించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ర్యాలీ ప్రారంభించి, 4గంటలకు శాంతిస్తూపం వద్ద నక్సల్స్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తారు. సాయత్రం 4.30గంటల నుంచి రాత్రి 7గంటల వరకు ఇతర కార్యక్రమాలు ఉంటాయి.