nayem
-
గ్యాంగ్‌స్టర్ నయీం జీవితాధారంగా సినిమా.. ట్రైలర్ విడుదల
కరుడుగట్టిన నేరస్థుడు గ్యాంగ్‌స్టర్ నయీం జీవితాధారంగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దాము బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు 'నయీం డైరీస్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వశిష్ట సింహ ప్రధాన పాత్రలో నటించగా, సీఏ వరదరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు సంపత్ నంది సోమవారం రిలీజ్ చేశారు. ఇలాంటి నిజ జీవిత కథలతో సినిమాలు చేస్తున్నప్పుడు కచ్చితంగా ఆసక్తికరంగా ఉంటుందని సంపత్ నంది తెలిపారు. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. హీరో వశిష్ట్ మాట్లాడుతూ 'ఆత్మవిశ్వాసంతో చెబుతున్నా ఈ చిత్రం కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. నాకు చాలా ప్రత్యేకమైన సినిమా అవుతుంది.' అని అన్నారు. ' ఈ సినిమాలో నయీం ఎందుకు క్రిమినల్‌గా మారాడు. అతన్ని మించిన నేరస్థులు సమాజంలో ఎవరున్నారు ? అనేది సినిమాలో చూపిస్తున్నాం.' అని చిత్ర దర్శకుడు బాలాజీ తెలిపారు. నయీం కథ వినగానే యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో బాగుంటుందని చేశామని నిర్మాత వరదరాజు తెలిపారు. వశిష్ట తామనుకున్న దానికన్న బాగా చేశారని కొనియాడారు. -
ఒంగోలులోనూ నయీం డెన్
-
నయీమ్ కేసు సీబీఐకి అప్పగించాలి
యాదగిరిగుట్ట/వలిగొండ: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత రాజకీయ పార్టీల నాయకులవి, పలు శాఖల అధికారుల చరిత్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న క్రమంలో కేసును సీబీఐకి అప్పగించాలని ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట, వలిగొండ మండలం నాతాళ్లగూడెంలో వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. 20ఏళ్లలో గ్యాంగ్‌స్టర్ సంపాదించిన అక్రమ ఆస్తులను బయటపెట్టాలని, ఆయనకు సహకరించిన ప్రజాప్రతినిధులను, అధికారులను కఠినంగా శిక్షించాలన్నారు. తెలంగాణ, ఆంధ్రపదేశ్లోనే కాకుండా మరో ఐదు రాష్ట్రాల్లో ఆయన కార్యకలాపాలు విస్తరించాయని, ఎంతో మంది అమాయక ప్రజల ఆస్తులను లాగేసుకొని రోడ్డుపాలు చేశారన్నారు. జిల్లాలో 99శాతం మంది అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు నయీమ్‌తో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపించారు. నయీమ్ పేరుతో వందల కోట్ల రూపాయలు వసూలు చేశారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా భువనగిరికి చెందిన కౌన్సిలర్లను నయీమ్‌తో బెదిరింపజేసి అధికారపార్టీలో చేర్పించుకున్నారన్నారు. నయీమ్ చనిపోయిన తర్వాత ఆయన ఇంట్లో లభించిన డైరీలో ఎంతో మంది రాజకీయ నాయకుల చరిత్రలు ఉన్నాయని, వాటిని సీఎం కేసీఆర్ బయట పెట్టాలన్నారు. సిట్ విచారణ లో వెల్లడైన విషయాలను గోప్యంగా ఉంచి అధికార పార్టీకి చెందిన నాయకులను కేసు నుంచి తప్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. నÄæూమ్ మెుత్తం ఆస్తులను చూపెట్టకుండా రూ.2.80కోట్లు మాత్రమే చూపెట్టడం విడ్డూరమన్నారు. ఆస్తులను పేదలకు పంచాలని కోరారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జెడ్పీమాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, బీర్ల అయిలయ్య, తంగళ్లపల్లి రవికుమార్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, సుడుగు శ్రీనివాస్‌రెడ్డి, గుండ్లపల్లి నర్సింహగౌడ్ తదితరులున్నారు. -
పోలీసుల అదుపులో నయీం అనుచరులు..?
యాదగిరిగుట్ట : గ్యాంగ్‌స్టర్ నయీం మరణించడంతో తన అనుచర వర్గం ఒక్కొక్కరుగా బయటకి వస్తున్నారు. భువనగిరి డివిజన్‌కు అతి సమీపంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో సైతం అతడి అనుచరులు ఉండడంతో పోలీసులు ప్రత్యేక నిఘాపెట్టి శుక్రవారం రాత్రి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిని పోలీస్‌స్టేషన్‌లో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. యాదగిరిగుట్ట ప్రాంతంలో భూములు ఏమైన కబ్జా చేశారా లేకా నయీం ఏవరినైనా బెదిరింపులకు గురి చేసి డబ్బులు వసూలు చేశారా అనే కోణాల్లో విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.