nayyar
-
బాపూజీ బాటలో...
మనసు పవిత్రం అయితే మాట కూడా పవిత్రమవుతుంది. దానికి మంత్రబలం లాంటిది వస్తుంది. బాపూజీ మాట ఎందరినో తమను తాము తెలుసుకునేలా చేసింది. తమ జీవితాన్ని కాంతి మంతమైన కొత్త బాటలోకి నడిపించుకు వెళ్లేలా చేసింది. దీనికి బలమైన ఉదాహరణ ఈ ముగ్గురు మహిళలు... మెడెలిన్ స్లెడ్ మీరాబెన్‌గా ఎలా మారింది? ‘మెడె లిన్ స్లెడ్ ఎవరు?’ అంటే టక్కున గుర్తుకురాకపోవచ్చు. అయితే ‘మీరాబెన్’ అంటే మాత్రం గాం«ధీజీ గుర్తుకు వస్తారు. బ్రిటిష్ సైనిక అధికారి సర్ ఎడ్మండ్ కుమార్తె అయిన మెడె లిన్‌కు సంగీతం వినడం, పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ఒకానొక సందర్భంలో ఫ్రెంచ్ రచయిత రోమైన్ రోలెండ్ గాంధీజీ జీవితంపై రాసిన పుస్తకం చదివింది. ఈ పుస్తకం తనను ఎంత ప్రభావితం చేసిందంటే ‘సబర్మతీ ఆశ్రమానికి రావాలనుకుంటున్నాను’ అని గాంధీజీకి లేఖ రాసింది. ‘తప్పకుండా రావచ్చు’ అని ఆహ్వానిస్తూనే ఆశ్రమ క్రమశిక్షణ వాతావరణాన్ని గుర్తు చేశారు గాంధీ. 1925లో అహ్మదాబాద్‌కు వచ్చింది మెడెలిన్. గాంధీజీలో ఒక దివ్యకాంతిని దర్శించింది. ఆ కాంతి తనను పూర్తిగా మార్చేసింది. మద్యపానం, మాంసాహారం మానేసేలా చేసింది. ‘భగవద్గీత’ అధ్యయనం ఆమె జీవితాన్ని వెలుగుమయం చేసింది. తన పేరు ‘మీరాబెన్’గా మారింది. ఉద్యమాల్లో భాగంగా గాంధీజీతో పాటు జైలుకు కూడా వెళ్లింది. ‘సేవాగ్రామ్’ ఏర్పాటులో కీలకపాత్ర పోషించింది. రిషికేష్‌కు సమీపంలో ‘పశులోక్ ఆశ్రమం’ ఏర్పాటు చేసింది. బాపు తనకు రాసిన ఉత్తరాలను పుస్తకంగా ప్రచురించింది. కోట దాటి పేదల పేటకు వచ్చిన రాజకుమారి అమృత్‌కౌర్ పెరిగిన వాతావరణానికి, ఆ తరువాత ఉద్యమకారిణి గా ఆమె జీవితానికి ఎక్కడా పొంతన కనిపించదు. కోటలో రాజకుమారి పేట పేటకు తిరిగి స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడానికి స్ఫూర్తి గాంధీజీ. కపూర్థలా రాజు హరినామ్సింగ్ కుమార్తె అయిన అమృత్‌కౌర్ ఇంగ్లండ్‌లో చదువుకుంది. గాంధీజీకి ఆమె ఎన్నో ఉత్తరాలు రాసేది. ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు ఆమె దిశను మార్చేసాయి. 1934లో గాంధీని కలుసుకుంది. ఆ తరువాత ఆశ్రమంలో చేరింది. తన ఖరీదైన రాచరిక జీవనశైలికి, ఆశ్రమ వాతావరణానికి బొత్తిగా సంబంధం లేదు. చాలా కష్టం కూడా అనిపించవచ్చు. కాని ఎండకన్నెరుగని రాజకుమారి సామాన్యురాలిగా మారి ఆ ఆశ్రమంలో సేవ చేసింది. గాంధీజీ వ్యక్తిగత కార్యదర్శిగా 16 సంవత్సరాలు పనిచేసింది. ఉప్పుసత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా జైలుకు కూడా వెళ్లింది. గాంధీజీ తనకు రాసిన ఉత్తరాలు ‘లెటర్స్ టు రాజకుమారి’ పేరుతో పుస్తకంగా వచ్చింది. వైద్యం నుంచి ఉద్యమం వరకు... కుంజా (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) అనే చిన్న నగరం లో జన్మించింది సుశీల నయ్యర్. ఆమెకు ప్యారేలాల్ అనే అన్న ఉండేవాడు. అన్నాచెల్లెళ్లకు గాంధీజీ తత్వం అంటే బాగా ఇష్టం. ఎప్పుడూ దాని గురించి చర్చించుకునేవారు. దిల్లీలో వైద్యవిద్యను అభ్యసించింది సుశీల. 1939లో తన సోదరుడిని ‘సేవాగ్రామ్’లో చేర్పించడానికి వచ్చింది. అలా గాంధీజీతో పరిచయం పెరిగింది. పేదలకు ఆమె చేసే వైద్యసహాయం గాంధీజీ ప్రశంసలు అందుకునేలా చేసింది. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా జైలుకు కూడా వెళ్లింది. ఇదంతా వారి తల్లిదండ్రులకు మొదట్లో నచ్చలేదు. అయితే ఆ తరువాత కాలంలో వారి ఆలోచన విధానంలోనూ మార్పు వచ్చింది. మహత్మాగాంధీ: ఫైనల్ ఫైట్ ఫర్ ఫ్రీడమ్, మహాత్మాగాంధీ: సాల్ట్ సత్యాగ్రహ... మొదలైన పుస్తకాలు రాసింది డా.సుశీల నయ్యర్. -
సికింద్రాబాద్‌లో ఆర్మీ కల్నల్ ఇంట్లో దోపిడి
-
ఆర్మీ కల్నల్ ఇంట్లో దోపిడి
హైదరాబాద్: సికింద్రాబాద్‌లో నివసిస్తున్న ఆర్మీ కల్నల్ నయ్యర్ ఇంట్లో శనివారం వేకువజామున భారీ చోరీ జరిగింది. కల్నల్ నయ్యర్ స్వంత పనిపై శుక్రవారం బెంగళూరు వెళ్ళాడు. ఆయన కుమారుడు ఇంట్లో ఉన్నాడు. అతనికి రేచీకటి ఉన్నందున ఇంటికి కాపలాగా ఇద్దరు సెక్యూరిటీ గార్డులను పెట్టుకున్నాడు. అయితే శనివారం వేకువజామున ఒక సెక్యూరిటీ గార్డు లేని సమయంలో నలుగురు దుండగులు ఇంట్లోకి వచ్చి నయ్యర్ కుమారుడిని కత్తులతో బెదిరించి తాళ్లతో కట్టివేసి ఇంట్లోని ఒక కిలో బంగారు నగలు దోచుకెళ్ళారు. చోరీ జరిగిన తర్వాత ఇంట్లో ఉండే నేపాల్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు కనిపించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించారు. వేలిముద్రలు తీసుకున్నారు. ఇంటి బయట ఉన్న సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. -
హెచ్‌సీఎల్ బోర్డ్ నుంచి నాయర్ నిష్ర్కమణ
న్యూఢిల్లీ: ఐటీ రంగ కురు వృద్ధుడు వినీత్ నాయర్ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ బోర్డ్ నుంచి వైదొలిగారు. తాను ఏర్పాటు చేసిన ఫౌండేషన్, సంపర్క్‌కు మరింత సమయం కేటాయించేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ శుక్రవారం తెలిపింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు, హెచ్‌సీఎల్ కార్పొరేషన్లకు ఇకపై సీనియర్ సలహాదారుగా నయ్యర్ తన సేవలందిస్తారు. ఇతరులకు ఆదర్శం సంస్థ పట్ల వినీత్ నాయర్ ఆలోచనలు, అంకిత భావం చాలా మంది కంపెనీ ఉద్యోగులకు స్ఫూర్తినిచ్చిందని, పెద్ద పెద్ద కలలు కనేందుకు తోడ్పాటునందించిందని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్, చైర్మన్ శివ్ నాడార్ వ్యాఖ్యానించారు. ఈ సంస్థలో పనిచేయడానికి, ప్రయోగాలు చేయడానికి, నేర్చుకోవడానికి శివ్‌నాడార్, ఇతర కంపెనీ ఉద్యోగులు తనకు అపారమైన అవకాశాలిచ్చారని, అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని ఈ సందర్భంగా వినీత్ నాయర్ తెలిపారు.