Neckless Road
-
‘నేను పోలీసుని.. మీ గురించి ఇంట్లో వాళ్లకు చెప్తాను’
రాంగోపాల్‌పేట్: పోలీసునని చెప్పి నెక్లెస్ రోడ్డుకు వచ్చే జంటలను బెదిరించి డబ్బు, నగదును బలవంతంగా తీసుకుని వెళుతున్న ఓ పాత నేరస్తుడిని మహంకాళి పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాస్ తెలిపిన మేరకు.. బోరబండకు చెందిన మరాఠి సృజన్‌కుమార్ (45) పాత నేరస్తుడు. విలాసాలకు అలవాటు పడిన సృజన్ సులభంగా డబ్బు సంపాదించడం కోసం నెక్లెస్‌రోడ్‌తో పాటు నగరంలోని వివిధ పార్కులకు వచ్చే జంటలను టార్గెట్ చేసేవాడు. పార్కులకు వెళ్లి అక్కడ ఉండే జంటకు తాను పోలీసునని చెప్పి మీ విషయం మీ ఇంట్లో వారికి చెబుతానని బెదిరించే వాడు. కేసు లేకుండా చేయాలంటే తాను అడిగినంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసేవాడు. ఇలాగే ఈ నెల 15వ తేదీన ఓ జంట నెక్లెస్‌రోడ్‌లో ఉండగా నిందితుడు వెళ్లి తాను పోలీసునని ఇక్కడేం చేస్తున్నారని బెదిరించాడు. పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వెళతానని మీ ఇంట్లో వాళ్లని పిలిపించాలని చెప్పాడు. అలా చేయకూడదంటే తనకు రూ.2లక్షల డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం ఇంట్లో తెలిస్తే బాగుండదని నగదు ఇచ్చేందుకు వారు సిద్ధద్దమయ్యారు. అయితే అంత డబ్బ తమ వద్ద లేని చెబితే వారిని ప్యాట్నీ సెంటర్లోని చందన బ్రదర్స్ షోరూమ్‌కు తీసుకుని వెళ్లి రూ.2 లక్షల విలువ చేసే 45 గ్రాముల బంగారు నగలు కొనుగోలు చేశాడు. వాటి బిల్లును ఈ జంట ఏటీఎం కార్డు నుంచి కట్టించాడు. తర్వాత తాము మోసపోయామని గ్రహించిన ఈ జంట మరుసటి రోజు మహంకాళి పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న డీఐ పురుషోత్తం డీఎస్ఐ నరేష్‌తో కలిసి ధర్యాపుత చేపట్టి నిందితున్ని సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 22 గ్రాముల బంగారంతో పాటు మొబైల్ ఫోన్, పల్సర్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై నగరంలో నగరంలో 12, విశాకపట్టణంలో 4, వరంగల్‌లో 1 రాబరీ, కిడ్నాప్ కేసులు నమోదై ఉన్నాయి. చదవండి: హైదరాబాద్‌లో ‘ఫ్రీ చాయ్ బిస్కెట్’: ఎక్కడంటే? -
‘ఏకలవ్య’కు ప్రత్యేక సొసైటీ!
సాక్షి, హైదరాబాద్: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు (ఈఎంఆర్ఎస్) సరికొత్త కళ సంతరించుకోనున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర గిరిజన గురుకుల సొసైటీ పరిధిలో కొనసాగిన ఈ స్కూళ్లు ఇకపై కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ప్రత్యేక సొసైటీ ద్వారా కొనసాగనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రత్యేక సొసైటీ కింద నడపాలని నిర్ణయించిన కేంద్ర గిరిజన శాఖ తాజాగా సొసైటీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13 ఏకలవ్య స్కూళ్లు ఉన్నాయి. వీటికి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వమే నిధులిస్తున్నా గురుకుల సొసైటీ వీటి నిర్వహణ చూసుకుంటోంది. ప్రత్యేక సొసైటీ పరిధిలో కొనసాగనున్నందున నిధుల విడుదల సమస్యల పరిష్కారం తదితర అంశాలన్నీ నేరుగా జరగనున్నాయి. శాశ్వత నిర్మాణాలు దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య పాఠశాలలకు శాశ్వత భవనాలు ఉండాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొత్త నిర్మాణాలు కూడా చేయనుంది. ప్రస్తుతం చాలా వరకు శాశ్వత భవనాలున్నా మౌలిక వసతుల లేమి తీవ్రంగా ఉంది. దీన్ని పరిష్కరించి అత్యున్నత విద్యాలయాలుగా తీర్చి దిద్దాలని కేంద్రం భావిస్తోంది. -
మణిహారం.. నిధుల ఫలహారం
నెల్లూరు సిటీ: నెక్లెస్ రోడ్డు పనులు 40 శాతం కూడా పూర్తి కాకుండానే మంత్రి నారాయణ ఎన్నికలు సమీపిస్తున్నాయని హడావుడిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ఈ ఏడాది ఫిబ్రవరి 19న ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టారు. రాత్రికిరాత్రి టైల్స్ ఏర్పాటు, రోడ్డు నిర్మాణ పనులు చేయడంతో రోడ్డుకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఘాట్ వద్ద వేసినæ టైల్స్ ఊడి బయటకు వచ్చేస్తున్నాయి. మరోవైపు రోడ్డు నిర్మాణంలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నిరాశతో వెనుదిరుగుతున్న నగర ప్రజలు మంత్రి నారాయణ నెక్లెస్ రోడ్డును ఘనంగా నిర్మించానని ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. నెక్లెస్‌రోడ్డు నిర్మాణం పూర్తయిందనే ఉద్దేశంతో నగర ప్రజలు నెక్లెస్‌రోడ్డును చూసేందుకు దూరప్రాంతాల నుంచి వస్తున్నారు. అయితే ప్రకటనల్లో చెబుతున్నట్లు నెక్లెస్‌రోడ్డు నిర్మాణం 50 శాతం కూడా పూర్తికాకపోవడంతో ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు. అమరావతి గ్రాఫిక్స్‌లా నెక్లెస్‌రోడ్డు కూడా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెండర్ దశ నుంచే దోపిడీ నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(నుడా) ఆధ్వర్యంలో నెల్లూరు చెరువు చుట్టూ నెక్లెస్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు చేసింది. ఇందుకుగాను రూ.25.85 కోట్లతో సుందరీకరణ పనులకు టెండర్లు పిలిచారు. ఇక్కడే మొత్తం వ్యవహారం అవినీతిమయంగా మారింది. అధికారపార్టీ నేతల ధనదాహం, అవినీతి కారణంగా అనర్హుడికి ఈ కాంట్రాక్ట్ దక్కింది. ఈ పనులకు సంబంధించిన టెండర్‌ను గతేడాది అక్టోబర్ 8వ తేదీన పిలిచారు. 24వ తేదీన అంటే కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఆర్‌ఎమ్‌ఎన్ ఇన్ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ కంపెనీతో నుడా ఒప్పందం కుదుర్చుకుంది. అర్హత లేని కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించేందుకు టీడీపీ నేతలు భారీగా ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెక్లెస్‌రోడ్డు పనులను చేపట్టేందుకు ఆర్‌ఎమ్‌ఎన్ కంపెనీకి అర్హత లేనప్పటికీ పనులు అప్పగించేందుకు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి చక్రం తిప్పారని సమాచారం. సదరు కాంట్రాక్ట్ సంస్థ టెండర్ వేసే సమయంలో 50 పనులు చేస్తున్నట్లు చూపారు. అయితే కేవలం రూ.36. 59 కోట్ల పనులు చేపట్టేందుకు మాత్రమే అర్హత కలిగి ఉంది. ఇదే సంస్థ హైదరాబాద్‌లో ఇప్పటికే రూ.44 కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్‌లు చేస్తుండగా ఆ పనులను టెండర్లో చూపలేదు. అంటే అర్హతకు మించి పనులు చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థకు నెల్లూరు నెక్లెస్‌రోడ్డు పనులు అప్పగించడం వెనుక అధికారపార్టీ నేతల జోక్యం, మతలబు ఉందని స్పష్టమవుతోంది. దీనికి సం బంధించి ఒక కాంట్రాక్టర్ సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించడంతో అసలు విషయం వెలుగుచూసింది. నెక్లెస్‌రోడ్డు పనుల్లో సుమారు రూ.2.50 కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టర్ నాసిరకంగా నిర్మాణం చేపడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నెక్లెస్‌రోడ్డు నెల్లూరు నగరానికి మణిహారంగా ఉంటుందంటూ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ ఆర్భాటంగా ప్రకటనలు చేయగా నిర్మాణం పూర్తికాక ముందే రోడ్డుకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. నగరంలోని ఇరుకళల అమ్మవారి ఆలయం నుంచి బారాషాహిద్ దర్గా వరకు నిర్మించిన నెక్లెస్‌రోడ్డును కాంట్రాక్టర్ నాసిరకంగా నిర్మిస్తున్నారు. రోడ్డు నిర్మాణం హెచ్చుతగ్గులుగా ఉంది. మరోవైపు ఇరుకళల అమ్మవారి ఆలయం వద్ద ఘాట్ నిర్మాణంలో టైల్స్ ఊడిపోయాయి. అయినా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. కేవలం కాంట్రాక్టర్‌కు నిధులు ఫలహారంగా ఇచ్చేందుకే ఈ పనులు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. -
పరుగు పందెంలో కేటీఆర్!
హైదరాబాద్: ఎయిర్ టెల్ నిర్వహిస్తున్న హైదరాబాద్ మారథాన్ పోటీల్లో తెలంగాణ ఐటీశాఖ మంత్రి కే.తారకరామారావు(కేటీఆర్) ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద మొదలైన మారథాన్ లో కేటీఆర్ ఉత్సాహంగా పరుగులు తీశారు. మారథాన్ ను ఫుల్ మారథాన్ (42.195 కిలోమీటర్లు)గా, హాఫ్ మారథాన్ (21.1 కిలోమీటర్లు) గా విభజించారు. మారథాన్ పోటీలు గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగిస్తాయి. ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల రన్నర్లు, విదేశీయులు భారీ ఎత్తున తరలివచ్చారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శనివారం ఏర్పాటు చేసిన ఎక్స్‌పోకు వేలాదివుంది తరలివచ్చి టీ షర్ట్లు, బూట్లు, గూడీ, బ్యాగ్‌లు తీసుకున్నారు.