Neha Marda
-
పండంటి పాపకు జన్మనిచ్చిన 'చిన్నారి పెళ్లికూతురు' నటి
బుల్లితెర నటి నేహా మర్దా బాలికా వధు(తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకుంది. డోలీ అర్మానో కి, క్యున్ రిష్టన్ మే కట్టి బట్టి లాంటి చిత్రాల్లోనూ నటించింది. గతంలోనే గర్భం ధరించినట్లు సోషల్ మీడియాలో వెల్లడించిన నటి.. తాజాగా పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవలే గర్భధారణ సంబంధిత సమస్యలతో నేహా మర్దా ఆసుపత్రిలో చేరారు. ఎప్పటికప్పుడు తన ఆరోగ్య స్థితిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. నేహా తన ఇన్‌స్టాలో రాస్తూ..'మా జీవితంలో అత్యుత్తమ క్షణాలు. మాకు ఇప్పుడే పాప పుట్టింది. తను రాగానే ఒక చిన్న మెరుపును తీసుకొచ్చింది. తానొక అద్భుతం. ఈ కొత్త జీవితంలో మమ్మల్ని తల్లిదండ్రుల్ని చేసినందుకు ధన్యవాదాలు. మా పాపకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నా.'అంటూ పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నటికి కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా.. నేహా ఫిబ్రవరి 2012లో పాట్నాకు చెందిన వ్యాపారవేత్త ఆయుష్మాన్ అగర్వాల్‌ను వివాహం చేసుకుంది. గతేడాది గర్భం దాల్చినట్లు నేహా ప్రకటించింది. View this post on Instagram A post shared by Neha Marda (@nehamarda) -
చిన్నారి పెళ్లికూతురు నటి సీమంతం.. పిక్స్ వైరల్
చిన్నారి పెళ్లికూతురు ఫేం నేహా మర్దా సీమంతం వేడుక ఘనంగా జరిగింది. పదేళ్ల క్రితం ఆయుష్మాన్ అగర్వాల్‌ను పెళ్లి చేసుకుంది. గతంలోనే తాను గర్భం దాల్చినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది నేహా. సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో ఈ శుభవార్త పంచుకుంది. ఇటీవల జరిగిన సీమంతం వేడుక ఫోటోలను అభిమానులతో పంచుకుంది చిన్నారి పెళ్లికూతురు. ఈ వేడుకల్లో బంధువులతో పాటు పలువురు బుల్లితెర నటులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. నేహా మర్దా బాలిక వధు(తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్‌తో గుర్తింపు పొందింది. అందులో ఆమె అత్త పాత్ర పొషించింది. అంతేకాదు ఆమె పలు టీవీ షో, డాన్స్‌లో షోలో పాల్గొంది. View this post on Instagram A post shared by Neha Marda (@nehamarda) -
తల్లి కాబోతున్న చిన్నారి పెళ్లికూతురు ఫేం
చిన్నారి పెళ్లి కూతురు ఫేం, నటి నేహా మర్దా తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 10 ఏళ్ల క్రితం ఆయూష్మాన్ అగర్వాల్‌ను పెళ్లి చేసుకున్న ఆమె త్వరలో ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ సందర్భంగా నేహా తన భర్తతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో ఈ శుభవార్త పంచుకుంది. 2023లో బేబీ తమ జీవితాల్లోకి రాబోతున్నట్లు ఆమె స్పష్టం చేసింది. కాగా నేహా మర్దా బాలిక వధు(తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్‌తో గుర్తింపు పొందింది. అందులో ఆమె అత్త పాత్ర పొషించింది. అంతేకాదు ఆమె పలు టీవీ షో, డాన్స్‌లో షోలో పాల్గొంది. View this post on Instagram A post shared by Neha Marda (@nehamarda) చదవండి: ఘనంగా అలీ కూతురు హల్దీ ఫంక్షన్, ఫొటోలు వైరల్ నాకు స్ఫూర్తినిచ్చిన అంశాలన్నీ మీతోనే వెళ్లిపోయాయి నాన్నా: మహేశ్ ఎమోషనల్ -
సోనారికా బాటలో 'బాలికా వధు' నటి
సోనారికా భడోరియాకు తానేం తక్కువ కాదంటోంది హిందీ టీవీ నటి నేహా మర్దా. 'దేవోన్ కా దేవ్ మహదేవ్' సీరియల్లో పార్వతి పాత్రలో నటించిన సోనారికా గతవారం కురచ దుస్తుల్లో కుర్రకారు హార్ట్ బీట్ పెంచగా.. ఇప్పుడు 'బాలికా వధు' ఫేం నేహా కూడా అదేపని చేసింది. బికినీలో కనిపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేసేందుకు థాయలాండ్ వెళ్లిన అమ్మడు అక్కడి బీచుల్లో సేదతీరింది. సముద్రతీరంలో సెలవులను సరదాగా గడిపింది. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను తన ఇన్స్టాగ్రాఫ్ పేజీలో పోస్టు చేసింది. ఒడ్డున నిలబడి నీలాకాశం, సముద్రంను చూడడం అద్భుతంగా ఉందని, ఈ దృశ్యం తనకెంతో నచ్చిందని కూడా రాసింది. అయితే నేహా ఫొటోలు అభిమానులకు కనువిందు చేస్తున్నాయి. సోనారికా బికినీ ఫొటోలపై సోషల్ మీడియాలో దుమారం రేగినా పట్టించుకోకుండా నేహా తన ఫొటోలు పోస్ట్ చేయడం గమనార్హం. పవిత్రమైన పార్వతిదేవి పాత్రలో నటించి బికినీ ఫొటోలా? అంటూ సోనారికాపై నెటిజన్లు కారాలు-మిరియాలు నూరారు. పవిత్రమైన పాత్రలో నటించి.. బికినీ ఫొటోలా?