సోనారికా బాటలో 'బాలికా వధు' నటి | After Sonarika Bhadoria, Balika Vadhu actress Neha Marda posts bikini pic | Sakshi
Sakshi News home page

సోనారికా బాటలో 'బాలికా వధు' నటి

Published Fri, Jun 3 2016 9:18 AM | Last Updated on Mon, Sep 4 2017 1:35 AM

సోనారికా బాటలో 'బాలికా వధు' నటి

సోనారికా బాటలో 'బాలికా వధు' నటి

సోనారికా భడోరియాకు తానేం తక్కువ కాదంటోంది హిందీ టీవీ నటి నేహా మర్దా. 'దేవోన్‌ కా దేవ్‌ మహదేవ్‌' సీరియల్‌లో పార్వతి పాత్రలో నటించిన సోనారికా గతవారం కురచ దుస్తుల్లో కుర్రకారు హార్ట్ బీట్ పెంచగా.. ఇప్పుడు 'బాలికా వధు' ఫేం నేహా కూడా అదేపని చేసింది. బికినీలో కనిపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేసేందుకు థాయలాండ్ వెళ్లిన అమ్మడు అక్కడి బీచుల్లో సేదతీరింది. సముద్రతీరంలో సెలవులను సరదాగా గడిపింది.

ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రాఫ్ పేజీలో పోస్టు చేసింది. ఒడ్డున నిలబడి నీలాకాశం, సముద్రంను చూడడం అద్భుతంగా ఉందని, ఈ దృశ్యం తనకెంతో నచ్చిందని కూడా రాసింది. అయితే నేహా ఫొటోలు అభిమానులకు కనువిందు చేస్తున్నాయి. సోనారికా బికినీ ఫొటోలపై సోషల్ మీడియాలో దుమారం రేగినా పట్టించుకోకుండా నేహా తన ఫొటోలు పోస్ట్ చేయడం గమనార్హం. పవిత్రమైన పార్వతిదేవి పాత్రలో నటించి బికినీ ఫొటోలా? అంటూ సోనారికాపై నెటిజన్లు కారాలు-మిరియాలు నూరారు.
 

పవిత్రమైన పాత్రలో నటించి.. బికినీ ఫొటోలా?

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement