Nellore Court
-
Krithi Shetty: నెల్లూరులో షాపింగ్ మాల్ ప్రారంభించిన ఉప్పెన భామ కృతిశెట్టి (ఫొటోలు)
-
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను: మంత్రి కాకాణి
సాక్షి, నెల్లూరు: నెల్లూరు కోర్టులో చోరీ కేసుపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు విచారణలు ఎదుర్కోవాలి. నెల్లూరు కోర్టులో చోరీ కేసుపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను. సీబీఐ విచారణ జరపాలని నేను అఫిడవిట్ దాఖలు చేశాను. టీడీపీ అధినేత చంద్రబాబులాగా స్టేలతో తప్పించుకోవాలని నేను చూడలేదు. నాపై టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేశారు. సీబీఐ విచారణలో నిజాలు నిగ్గు తేలుతాయి అని స్పష్టం చేశారు. -
నెల్లూరు కోర్టులో చోరీ కేసు విచారణను సీబీఐకి అప్పగించిన హైకోర్టు
-
ఎవరా జడ్జి.. శిక్షణ సరిగా లేదా?.. సుప్రీంకోర్టు అసహనం
సాక్షి, న్యూఢిల్లీ: బెయిలు మంజూరు చేయాలంటూ ఇచ్చిన ఆదేశాలు సరిగా అర్థం చేసుకోలేకపోయిన జడ్జి ఎవరు? జ్యుడీషియల్ అకాడమీ శిక్షణ సరిగా లేదా? అని నెల్లూరు అదనపు సెషన్ జడ్జిపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నెల్లూరు కేంద్ర కారాగారంలో గృహహింస, హత్య కేసులో దోషిగా తొమ్మిదేళ్లు శిక్ష అనుభవిస్తున్న గోపిశెట్టి హరికృష్ణ అనే వ్యక్తిని మూడు రోజుల్లో ట్రయల్ కోర్టులో ప్రవేశపెట్టాలని, బెయిలు మంజూరు చేయాలని సెప్టెంబర్ 28, 2020న సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. చదవండి: ఏపీ సీఐడీ అదుపులో మాజీ మంత్రి నారాయణ 3 రోజుల్లో జైలు అధికారులు హరికృష్ణను ప్రవేశపెట్టని కారణంగా ట్రయల్ కోర్టు బెయిలు నిరాకరించింది. దీనిపై ఓ న్యాయవాది సుప్రీంకోర్టుకు లేఖ రాయడంతో ఏప్రిల్ 2022లో హరికృష్ణ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ సమయంలో జైలు అధికారులు, ట్రయల్ కోర్టు జడ్జి, సుప్రీంకోర్టు రిజిస్ట్రీలు వివరణ ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. ఈ కేసును సోమవారం జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్రభట్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం విచారించింది. గతంలో కోర్టు ఉత్తర్వులు తదనంతరం పరిణామాలను ధర్మాసనం ప్రస్తావించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ అయినా హరికృష్ణ కస్టడీలో కొనసాగారు. ఉత్తర్వులు ఎలక్ట్రానిక్ పద్ధతిలో పంపగా అక్టోబర్ 6న జైలు అధికారులకు అందాయని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ చెబుతోంది. మరోవైపు సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వుల్ని ట్రయల్ కోర్టు సరిగా అర్థం చేసుకున్నట్టు కనిపించడం లేదు. మూడు రోజుల్లో ప్రవేశపెట్టాలంటే త్వరగా ప్రవేశపెట్టాలని అంతేకానీ తర్వాత ప్రవేశపెడితే బెయిల్ ఇవ్వకూడదని అర్థం కాదు. ఒక న్యాయాధికారి ఈ విధంగా అర్థం చేసుకోవడం ఆశ్చర్యంగా ఉంది’’అని ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యవహారమంతా హైకోర్టుకు వదిలేస్తున్నామంది. 6 వారాల్లో హైకోర్టు వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. కింది కోర్టులు నెలవారీ నివేదికలను హైకోర్టుకు ఇస్తుంటే ఇలాంటివి జరగవని ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి చెప్పారు. విచారణ సందర్భంగా ట్రయల్ కోర్టు జడ్జిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఆ జడ్జికి పదేళ్ల సర్వీసు పూర్తయిందా.. ఇలాంటి న్యాయాధికారులు ఉండటంపై క్షమించండి.. అంటూ వ్యాఖ్యానించింది. -
నెల్లూరు కోర్టు సంచలన తీర్పు
సాక్షి, నెల్లూరు: డబుల్ మర్డర్ కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2013లో జరిగిన తల్లీకూతుళ్ల హత్యకేసులో న్యాయస్థానం గురువారం తీర్పును వెల్లడించింది. నిందితుడు షేక్ ఇంతియాజ్‌కు ఉరిశిక్ష విధిస్తూ ఎనిమిదో అదనపు న్యాయమూర్తి సత్యనారాయణ తీర్పునిచ్చారు. కాగా హరినాథపురం 4వ వీధికి చెందిన దినకర్ రెడ్డి భార్య శకుంతలతో పాటు మెడిసిన్ చదువుతున్న కుమార్తె భార్గవిని ముగ్గురు దుండగులు దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే నగరంలోని వాగ్దేవి డి-ఫార్మసీ కళాశాల కరెస్పాండెంట్ దినకర్ రెడ్డి, స్థానిక హరనాథపురంలో భార్య, కుమార్తెతో నివాసం ఉండేవారు. ఆయన కుమార్తె భార్గవి ఎంబీబీఎస్ చదువుతోంది. 2013 ఫిబ్రవరి 12న దినకర్‌రెడ్డి నూతన గృహానికి సంబంధించిన ప్లాన్ ఇచ్చేందుకు వచ్చిన ముగ్గురు..శకుంతల, భార్గవిపై కత్తులు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర రక్తగాయాలైన తల్లీకూతురు కిందపడిపోయారు. వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. -
సైకో కిల్లర్‌కు ఉరిశిక్ష
► నెల్లూరు అదనపు సెషన్స్ కోర్టు తీర్పు నెల్లూరు (లీగల్): అతి కిరాతకంగా నలుగురిని హత్య చేసి.. మరో నలుగురిని హతమార్చేందుకు ప్రయత్నించిన ఉన్మాది కుక్కపల్లి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేష్‌కు ఓ కేసులో ఉరి శిక్ష విధిస్తూ నెల్లూరు 4వ అదనపు సెషన్స్ కోర్టు గురువారం సంచలన తీర్పునిచ్చింది. నిందితుడు ప్రస్తుతం జంట హత్యల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తుండగా.. మహిళను హత్య చేసిన మరో కేసులో అతడికి ప్రాణం పోయేవరకు ఉరి తీయాలంటూ సెషన్స్ కోర్టు జిల్లా జడ్జి బి.శ్రీనివాసరావు తీర్పు వెలువరించారు. టీచర్‌గా పనిచేస్తూ నెల్లూరు శ్రీసాయి నగర్లో నివాసముండే రావిప్రోలు ప్రభావతిని గత ఏడాది జూలై 9న వెంకటేష్ దారుణంగా హతమార్చాడు. ఆమె ఇంట్లో ఉండగా.. వెంకటేష్ ఇంట్లో జొరబడి ప్రభావతి తలపై సుత్తితో విచక్షణా రహితంగా కొట్టాడు. అడ్డుకునేందుకు వెళ్లిన ఆమె సోదరి కుమారుడు అనంతకృష్ణ, సోదరి కుమార్తె మాధురిపైనా దాడి చేసి వారి తలలు పగులగొట్టాడు. వారి బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లను అపహరించుకుపోతుండగా.. ప్రభావతి భర్త నాగేశ్వరరావు అటకాయించారు. స్థానికులు వచ్చి వెంకటేష్‌ను పట్టుకుని బాలాజీ నగర్ పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన ప్రభావతి మృతి చెందారు. అనంతకృష్ణ, మాధురి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వెంకటేష్ చేసిన నేరం రుజువు కావడంతో అతనికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ న్యాయమూర్తి బి.శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా నిందితుడు వెంకటేష్ పెద్దచెరుకూరు శివాలయం పూజారి దంపతులు నూతలపాటి చంద్రమౌళీశ్వరరావు, పుష్పవేణిలను హత్య చేసిన కేసులో ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. కావలి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ హత్య కేసులోనూ అతను నిందితుడు. వెంకటేష్ మొత్తం నాలుగు హత్యలు, నాలుగు హత్యాయత్నాలకు పాల్పడ్డాడు. ఇతడిపై పలు దోపిడీ కేసులు ఉన్నాయి. ఉరిశిక్ష పడ్డ ఉన్మాది.. చంద్రబాబుకు వీరాభిమాని సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నాలుగు హత్యలు.. నాలుగు హత్యాయత్నాలు.. అనేక దోపిడీ, చోరీ కేసుల్లో దోషి అయిన కుక్కపల్లి వెంకటేశ్వర్లు అలియాస్ సైకో సుత్తి అలియాస్ వెంకటేష్ సీఎం చంద్రబాబుకు వీరాభిమాని. అతడు టీడీపీలో క్రియాశీలక కార్యకర్తగా ఉండేవాడు. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన పాదయాత్రలో ఆయనతో కలసి నడిచాడు. ఇందుకు గుర్తుగా చంద్రబాబుతో కలసి తీసుకున్న ఫొటోలను ఫేస్‌బుక్‌లోనూ ఆప్‌లోడ్ చేశాడు. హిందూపురంలోని బంధువుల ఇంట్లో ఉన్న వెంకటేష్ అక్కడ టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. తన మోటార్‌సైకిల్‌పై చంద్రబాబు, బాలకృష్ణ ఫొటోలు ఉంచుకుని తిరిగేవాడు. -
సైకో కిల్లర్‌కు ఉరిశిక్ష
నెల్లూరు అదనపు సెషన్స్ కోర్టు తీర్పు నెల్లూరు (లీగల్): అతి కిరాతకంగా నలుగురిని హత్య చేసి.. మరో నలుగురిని హతమార్చేందుకు ప్రయత్నించిన ఉన్మాది కుక్కపల్లి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటే‹ష్కు ఓ కేసులో ఉరి శిక్ష విధిస్తూ నెల్లూరు 4వ అదనపు సెషన్స్ కోర్టు గురువారం సంచలన తీర్పునిచ్చింది. నిందితుడు ప్రస్తుతం జంట హత్యల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తుండగా.. మహిళను హత్య చేసిన మరో కేసులో అతడికి ప్రాణం పోయేవరకు ఉరి తీయాలంటూ సెషన్స్ కోర్టు జిల్లా జడ్జి బి.శ్రీనివాసరావు తీర్పు వెలువరించారు. టీచర్‌గా పనిచేస్తూ నెల్లూరు శ్రీసాయి నగర్లో నివాసముండే రావిప్రోలు ప్రభావతిని గత ఏడాది జూలై 9న వెంకటేష్ దారుణంగా హతమార్చాడు. ఆమె ఇంట్లో ఉండగా.. వెంకటేష్ ఇంట్లో జొరబడి ప్రభావతి తలపై సుత్తితో విచక్షణా రహితంగా కొట్టాడు. అడ్డుకునేందుకు వెళ్లిన ఆమె సోదరి కుమారుడు అనంతకృష్ణ, సోదరి కుమార్తె మాధురిపైనా దాడి చేసి వారి తలలు పగులగొట్టాడు. వారి బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లను అపహరించుకుపోతుండగా.. ప్రభావతి భర్త నాగేశ్వరరావు అటకాయించారు. స్థానికులు వచ్చి వెంకటేష్‌ను పట్టుకుని బాలాజీ నగర్ పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన ప్రభావతి మృతి చెందారు. అనంతకృష్ణ, మాధురి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వెంకటేష్ చేసిన నేరం రుజువు కావడంతో అతనికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ న్యాయమూర్తి బి.శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా నిందితుడు వెంకటేష్ పెద్దచెరుకూరు శివాలయం పూజారి దంపతులు నూతలపాటి చంద్రమౌళీశ్వరరావు, పుష్పవేణిలను హత్య చేసిన కేసులో ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. కావలి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ హత్య కేసులోనూ అతను నిందితుడు. వెంకటేష్ మొత్తం నాలుగు హత్యలు, నాలుగు హత్యాయత్నాలకు పాల్పడ్డాడు. ఇతడిపై పలు దోపిడీ కేసులు ఉన్నాయి.