New age
-
చిన్నారులకు ఆత్మీయ నేస్తం
పిల్లల కోసం పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తుల తయారీలోగ్రామీణ మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. న్యూ ఏజ్ పేరెంట్స్‌ను ఆకట్టుకునేలా చేస్తున్న ఈ ప్రయత్నానికి మంచి స్పందన వస్తోందని, పిల్లలకు ఈ బొమ్మలు ఆత్మీయ నేస్తాలు అవుతున్నాయని ఆనందంగా వివరిస్తోంది స్వాతి. ‘‘పిల్లల మనసులు తెల్లని కాగితాల్లాంటివి. వాటిపై మనం ఏది రాస్తే అదే వారి భవిష్యత్తు. పదేళ్లుగా వందలాది మంది చంటి పిల్లలతో ఆడిపాడి, వారికి నచ్చినట్టు చెప్పే పద్ధతులను నేనూ నేర్చుకుంటూ వచ్చాను. డిగ్రీ చేసిన నాకు స్వతహాగా పిల్లలతో గడపడంలో ఉండే ఇష్టం నన్ను టీచింగ్ వైపు ప్రయాణించేలా చేస్తోంది. ప్లే స్కూల్ పిల్లలతో ఆడుకోవడం, వారితో రకరకాల యాక్టివిటీస్ చేయించడం ఎప్పుడూ సరదాయే నాకు. నాకు ఒక బాబు. వాడి వల్లనే ఈ ఇష్టం మరింత ఎక్కువైందనుకుంటాను. బాబుతోపాటు నేనూ ఓ స్కూల్లో జాయిన్ అయి, నా ఆసక్తులను పెంచుకున్నాను. ఆలోచనకు మార్గం పదేళ్లుగా చంటి పిల్లల నుంచి పదేళ్ల వయసు చిన్నారుల వరకు వారి ఆటపాటల్లో నేనూ నిమగ్నమై ఉన్నాను కనుక వారి ముందుకు ఎలాంటి వస్తువులు వచ్చి చేరుతున్నాయనే విషయాన్ని గమనిస్తూ వచ్చాను. కానీ, నేను అనుకున్న విధంగా అన్నింటినీ ఒక దగ్గరకు చేర్చడం ఎలాగో తెలియలేదు. కరోనా సమయంలో వచ్చిన ఆలోచన నాకు నేనుగా నిలబడేలా చేసింది. ఒకప్రా జెక్ట్ వర్క్‌లాగా పిల్లల మానసిక వికాసానికి ఏమేం వస్తువులు అవసరం అవుతాయో అన్నీ రాసుకున్నాను. నేను ఏయే పద్ధతుల్లో పిల్లలకు నేర్పిస్తున్నానో, దాన్నే నాకు నేనేప్రా జెక్ట్ వర్క్‌గా చేసుకున్నాను. ఏ వస్తువులు ఏ ప్రాంతానికి ప్రత్యేకమైనవి, నాకు నచ్చినట్టుగా ఏయే వస్తువులను తయారు చేయించాలి అనేది డిజైన్ చేసుకున్నాను కాబట్టి అనుకున్న విధంగా పనులు మొదలుపెట్టాను. కిండోరా టాయ్స్ పేరుతో రెండేళ్ల క్రితం ఈప్రా జెక్ట్నుప్రా రంభించాను. అన్నింటా ఎకో స్టైల్ పిల్లలకు దంతాలు వచ్చే దశలో గట్టి వస్తువులను నోటిలో పెట్టేసుకుంటారు. వాటిలోప్లాస్టిక్వీ వచ్చి చేరుతుంటాయి. అందుకని సాఫ్ట్ ఉడ్‌తో బొమ్మలను తయారు చేయించాను. వీటికోసం మన తెలుగు రాష్ట్రాల్లోని కొండపల్లి, నిర్మల్ నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల్లోని టాయ్ మేకింగ్ వారిని కలిసి నాకు కావల్సిన విధంగా తయారు చేయించాను. ఇంద్రధనుస్సు రంగులను పరిచయం చేయడానికి సాఫ్ట్ ఉడ్ మెటీరియల్, కలర్, బిల్డింగ్ బాక్స్‌లే కాదు... ఐదేళ్ల నుంచి చిన్న చిన్న అల్లికలు, కుట్టు పని నేర్చుకోవడానికి కావల్సిన మెటీరియల్, క్రోచెట్ అల్లికలు వంటివి కూడా ఉండేలా శ్రద్ధ తీసుకున్నాను. సాఫ్ట్ టాయ్స్తోపాఠం మన దేశ సంస్కృతిని పిల్లలకు తెలియజేయాలంటే మన కట్టూ బొట్టునూ పరిచయం చేయాలి. అందుకు ప్రతి రాష్ట్రం ప్రత్యకత ఏమిటో డెకొరేటివ్ బొమ్మల ద్వారా చూపవచ్చు. ఇవి కూడా ఆర్గానిక్ మెటీరియల్స్ తో తయారు చేసినవే. డెకరేటివ్ సాఫ్ట్ టాయ్స్ స్వయంగా నేను చేసినవే. ఆర్గానిక్ కాటన్ మెటీరియల్‌తో చేయించిన సాఫ్ట్ టాయ్స్‌లో జంతువులు, పండ్లు, పువ్వుల బొమ్మలు కూడా ఉంటాయి. వీటివల్ల చిన్న పిల్లలకు ఎలాంటి హానీ కలగదు. రంగురంగులుగా కనిపించే ఈ బొమ్మల ద్వారా చెప్పేపాఠాలను పిల్లలు ఆసక్తిగా వింటారు. వీటితోపాటు పిల్లలను అలరించే పుస్తకాలు కూడా అందుబాటులో ఉండేలా చూసుకున్నాను. ఒక విధంగా చె΄్పాలంటే ఈ కాలపు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి మానసిక వికాసపు బొమ్మలు కావాలనుకుంటారో అవన్నీ నా దగ్గర ఉండేలాప్లాన్ చేసుకున్నాను. నా ఆసక్తే పెట్టుబడి.. ఉద్యోగం చేయగా వచ్చిన డబ్బుల నుంచి చేసుకున్న పొదుపు మొత్తాలను ఇందుకోసం ఉపయోగించాను. ముందు చిన్నగా స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆన్లైన్ వేదికగా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. నాతోపాటు ఈ పనిలో గ్రామీణ మహిళలు భాగస్వామ్యం కావడం మరింత ఆనందాన్ని ఇస్తోంది. ప్లే స్కూళ్లు, ఆన్లైన్, ఆఫ్ లైన్ ద్వారా వచ్చే ఆర్డర్లను బట్టి సాఫ్ట్ టాయ్స్ తయారీలో కనీసంపాతికమంది మహిళలుపాల్గొంటున్నారు. ముందుగా వర్క్‌షాప్ నిర్వహించి, టాయ్స్ మేకింగ్ నేర్పించి వర్క్ చేయిస్తుంటాను. పూర్తి ఎకో థీమ్ బేస్డ్ కావడంతో ఈ కాలం అమ్మలు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. నేననుకున్న థీమ్ ఎంతో కొంతమందికి రీచ్ అవడం నాకు చాలా ఆనందంగా ఉంది’’ అని వివరించింది స్వాతి.– నిర్మలారెడ్డి ఫొటోలు: మోహనాచారి -
మార్కెట్లో న్యూఏజ్ టెక్ షేర్ల వెల్లువ.. జాబితాలో పేటీఎం, జొమాటో, నైకా
గత కొద్ది నెలలుగా పబ్లిక్ ఇష్యూలకు వచ్చి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన పలు కొత్తతరం(న్యూఏజ్) టెక్ కంపెనీల షేర్లు కొద్ది రోజులుగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇందుకు ఐపీవోకు ముందు కంపెనీలో ఇన్వెస్ట్‌చేసిన సంస్థల షేర్లపై లాకిన్ గడువు తీరనుండటం కారణమవుతోంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఐపీవోకు ముందు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు లేదా 20 శాతానికి మించిన ప్రమోటర్ల వాటాకు లాకిన్ గడువును ఏడాది నుంచి ఆరు నెలలకు కుదించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వివరాలు చూద్దాం.. గతేడాది నవంబర్ మొదలు ఈ ఏడాది మే నెలవరకూ పబ్లిక్ ఇష్యూలకు వచ్చిన పలు న్యూఏజ్, ఫిన్‌టెక్ కంపెనీలు, స్టార్టప్‌ల షేర్లకు లాకిన్ గడువు ఈ నెలలో ముగియనుంది. 12 నెలల నుంచి 6 నెలల గడువు తీరనుండటమే దీనికి కారణం. నేటి నుంచి క్యాంపస్ యాక్టివ్‌వేర్ షేర్లు అందుబాటులోకి రానుండగా.. ఎఫ్ఎస్ఎన్ ఈకామర్స్, రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ షేర్లకు రేపు(10న) లాకిన్ గడువు తీరనుంది. ఈ జాబితాలో ఫినో పేమెంట్స్ బ్యాంక్(12న), పీబీ ఫిన్‌టెక్(15న), పేటీఎమ్, శాఫైర్ ఫుడ్స్(18న), డెల్హివరీ(24న), టార్సన్ ప్రొడక్ట్స్(26న) పారదీప్ ఫాస్ఫేట్స్(27న), గో ఫ్యాషన్ ఇండియా(30న) తదితరాలున్నాయి. దీంతో ఈ షేర్లు స్టాక్ ఎక్సే్ఛంజీలను తాకనున్నాయి. వెరసి పలు కంపెనీల కౌంటర్లలో అందుబాటులోని ఈక్విటీ ఒక్కసారిగా పెరగనుంది. అయితే నైకా, రెయిన్బో చిల్డ్రన్స్, క్యాంపస్ యాక్టివ్‌వేర్, శాఫైర్ ఫుడ్స్, గోకలర్స్ తదితర కొన్ని కౌంటర్లు ఐపీవో ధరతో పోలిస్తే భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. దీంతో లాభాల స్వీకరణకు అవకాశమున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఐపీవోకు ముందు ఇన్వెస్ట్‌చేసిన సంస్థలు ఆయా షేర్లను విక్రయించేందుకు ఆసక్తి చూపేదీ లేనిదీ వేచి చూడవలసి ఉన్నట్లు మరికొందరు అభిప్రాయపడ్డారు. జొమాటో ఎఫెక్ట్ ఈ ఏడాది జులైలో లాకిన్ గడువు ముగిసిన వెంటనే జొమాటో షేర్లు జులైలో 22 శాతం పతనంకావడం గమనార్హం. ప్రీఐపీవో ఇన్వెస్టర్లు ఉబర్, టైగర్ గ్లోబల్ తదితరాలు షేర్లను విక్రయించడం ప్రభావం చూపింది. ఒక అంచనా ప్రకారం 14 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1,15,000 కోట్లు) విలువైన షేర్లకు లాకిన్ గడువు తీరనుంది. వీటిలో నైకా 31.9 కోట్ల షేర్లు, పాలసీ బజార్ 2.8 కోట్ల షేర్లు అందుబాటులోకి రానున్నట్లు అంచనా. దీంతో పలు కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే పేటీఎమ్ షేరు ఐపీవో ధరతో పోలిస్తే 70 శాతం పతనంకాగా.. గత నెల రోజుల్లోనే డెల్హివరీ 35 శాతం, పీబీ ఫిన్‌టెక్ 26 శాతం, ఫినో పేమెంట్స్ బ్యాంక్ 21 శాతం చొప్పున డీలా పడ్డాయి. చదవండి: ‘వెనక ఇంత జరిగిందా’.. ఉద్యోగులకు ఊహించని షాకిచ్చిన ప్రముఖ ఐటీ కంపెనీ! -
ఆరు బల్దియాల బరిలో 257 మంది యువతీయువకులు
సాక్షి, మంచిర్యాల : చీకట్లను చీల్చేందుకు చిరుదివ్వె వెలిగించినా చాలనే లక్ష్యంతో నవతరం కదులుతోంది.. ప్రజాక్షేత్రంలో సత్తా చాటుకునేందుకు యువతరం సిద్ధమవుతోంది. జిల్లాలోని మున్సిపాలిటీ ఎన్నికల బరిలోకి దిగాలని పెద్ద ఎత్తున యువత ఉత్సాహం చూపడమే ఇందుకు నిదర్శనం. నేతలు విసిరే ఆకర్షణల వలలో చిక్కి అనుచరులుగా మిగలటం కంటే తామే నాయకులుగా ఎదిగేందుకు యువతీయువకులు రె‘ఢీ’ అవుతున్నారు. తమ జీవితం.. ఐదంకెల జీతం ముఖ్యం కాదని.. సమాజ శ్రేయస్సే ధ్యేయమని ‘పుర’ బరిలో దిగారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. దిగ్గజాల అనుభవం కంటే ద్విగుణీకృతమైన జ్ఞానమే మిన్న అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పురపాలక ఎన్నికల్లో జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో దాదాపు అన్నిచోట్లా దాదాపు 25 శాతం యువతీయువకులు బరిలో ఉన్నారు. సమాజాన్ని తాము పరి శీలించిన కోణం, తామున్న మున్సిపాలిటీ సమస్యలను పరిష్కరించేందుకు తమ దగ్గరున్న ఆలోచనలే తమ అస్త్రా లని వారు పేర్కొంటున్నారు. ఆయా మున్నిపాలిటీల్లో పెద్ద ఎత్తున ఉన్న యువ ఓట్లు తమకు పెట్టని కోట అని చెప్పుకొస్తున్నారు. నయా ఆలోచనలు ఆయా వర్గాల ఓటర్ల కోసం పలురకాల మే నిఫెస్టోల రూపకల్పనలో కాబోయే యువ ప్రతినిధులు సిద్ధం చేస్తున్నారు. సమాజానికి, యువతరానికి పెద్ద అవరోధంగా మా రిన నిరుద్యోగం రూపుమాపేదిశగా ప్రత్యేక ఆలోచనలు చేస్తున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో ప్రత్యేక శిక్ష ణ కేంద్రాలు ఏర్పాటు చేసి వివిధ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం, ఉపాధి కల్పన కోసం పరిశ్రమలను ప్రోత్సహించడం వంటి ప్రయత్నాలను ప్రోత్సహిస్తామని పేర్కొంటున్నారు. దీంతోపాటు మ హిళా సాధికారత దిశగా స్వయం ఉపాధి, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటన్నింటితోపాటు మంచినీరు, విద్య, వైద్యం, పారిశుధ్యం సమస్యలు తొలగించేందుకు తమ పాత్రను నెరవేరుస్తామని చెప్తున్నారు.