సాక్షి, మంచిర్యాల : చీకట్లను చీల్చేందుకు చిరుదివ్వె వెలిగించినా చాలనే లక్ష్యంతో నవతరం కదులుతోంది.. ప్రజాక్షేత్రంలో సత్తా చాటుకునేందుకు యువతరం సిద్ధమవుతోంది. జిల్లాలోని మున్సిపాలిటీ ఎన్నికల బరిలోకి దిగాలని పెద్ద ఎత్తున యువత ఉత్సాహం చూపడమే ఇందుకు నిదర్శనం. నేతలు విసిరే ఆకర్షణల వలలో చిక్కి అనుచరులుగా మిగలటం కంటే తామే నాయకులుగా ఎదిగేందుకు యువతీయువకులు రె‘ఢీ’ అవుతున్నారు.
తమ జీవితం.. ఐదంకెల జీతం ముఖ్యం కాదని.. సమాజ శ్రేయస్సే ధ్యేయమని ‘పుర’ బరిలో దిగారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. దిగ్గజాల అనుభవం కంటే ద్విగుణీకృతమైన జ్ఞానమే మిన్న అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పురపాలక ఎన్నికల్లో జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో దాదాపు అన్నిచోట్లా దాదాపు 25 శాతం యువతీయువకులు బరిలో ఉన్నారు. సమాజాన్ని తాము పరి శీలించిన కోణం, తామున్న మున్సిపాలిటీ సమస్యలను పరిష్కరించేందుకు తమ దగ్గరున్న ఆలోచనలే తమ అస్త్రా లని వారు పేర్కొంటున్నారు. ఆయా మున్నిపాలిటీల్లో పెద్ద ఎత్తున ఉన్న యువ ఓట్లు తమకు పెట్టని కోట అని చెప్పుకొస్తున్నారు.
నయా ఆలోచనలు
ఆయా వర్గాల ఓటర్ల కోసం పలురకాల మే నిఫెస్టోల రూపకల్పనలో కాబోయే యువ ప్రతినిధులు సిద్ధం చేస్తున్నారు. సమాజానికి, యువతరానికి పెద్ద అవరోధంగా మా రిన నిరుద్యోగం రూపుమాపేదిశగా ప్రత్యేక ఆలోచనలు చేస్తున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో ప్రత్యేక శిక్ష ణ కేంద్రాలు ఏర్పాటు చేసి వివిధ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం, ఉపాధి కల్పన కోసం పరిశ్రమలను ప్రోత్సహించడం వంటి ప్రయత్నాలను ప్రోత్సహిస్తామని పేర్కొంటున్నారు. దీంతోపాటు మ హిళా సాధికారత దిశగా స్వయం ఉపాధి, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటన్నింటితోపాటు మంచినీరు, విద్య, వైద్యం, పారిశుధ్యం సమస్యలు తొలగించేందుకు తమ పాత్రను నెరవేరుస్తామని చెప్తున్నారు.
ఆరు బల్దియాల బరిలో 257 మంది యువతీయువకులు
Published Mon, Mar 24 2014 1:18 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM
Advertisement