సాక్షి, మంచిర్యాల : జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(జెడ్పీటీసీ), మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(ఎంపీటీసీ) మొదటి విడత పోలింగ్ ప్రశాంతగా జరగగా, రెండో విడత గందరగోళంగా మారింది. రెండో విడతలో ఆదిలాబాద్, నిర్మల్, ఉట్నూర్ డివిజన్‌ల పరిధిలోని 31 మండలాల్లో ఎన్నికలు శుక్రవారం జరిగాయి. 31 జెడ్పీటీసీ స్థానాలకు 159 మంది, 373 ఎంపీసీటీ స్థానాలకు 1,534 మంది అభ్యర్థులు
పోటీ పడ్డారు. పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పో లింగ్ శాతం క్రమంగా పెరిగింది. మూడు డివిజన్‌లలో 8,76,246 మంది ఓటర్లకు గాను, 6,98,865 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొ త్తం పోలింగ్ శాతం 79.16 శాతం నమోదైంది. అత్యధికంగా నిర్మల్‌లో 81.74 శాతం, అత్యల్పంగా ఉట్నూర్‌లో 76.38 శాతం నమోదైంది. ఇక ఆదిలాబాద్‌లో 79.36 శాతంగా నమోదైంది.
ఓటు వేసిన ప్రముఖులు
ఏజెన్సీలో అధికారుల చర్యలతో చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో గిరిజనులు తిరగబడ్డారు. అధికారులు మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోవడంతో ఎండలో సైతం ఓటర్లు క్యూలో నిలబడి ఓటు వేశారు. వేసవి తాపాన్ని తట్టుకోలేక ఇబ్బంది పడ్డారు. సమస్యలు పరిష్కరించలేదని కొన్ని గ్రామాల ప్రజలు ఓటింగ్‌ను బహిష్కరించారు. కాగా, అధికారులు ఓటింగ్ జరిగే కేంద్రాలను తిరుగుతూ పరిశీలించారు. ఆదిలాబాద్ డివిజన్‌లోని కైలాస్‌నగర్ గల 32వ వార్డులో కలెక్టర్ అహ్మద్‌బాబు ఈయన సతీమణి సయీద్ సలీమ్‌ఖాన్‌తో కలిసి ఓటు వేశారు.
అలాగే ఉట్నూర్ మండలం గంగన్నపెట్ పోలింగ్ కేంద్రంలో ఐటీడీపీ పీవో దంపతులు జనార్దన్ నివాస్, పపిత ఓటు వేశారు. ఆయా కేంద్రాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు, ప్రముఖులు కూడా ఓటు వేశారు. కొన్నిచోట్ల ఎన్నికల సిబ్బంది భోజనం సక్రమంగా పెట్టలేదని ఆందోళన చేశారు. ఆంధ్రా-మహారాష్ట్ర వివాదాస్పద సరిహద్దులోని రెండు గ్రామాల పంచాయతీలైన పరందోళి, అంతాపూర్ ప్రజలు రెండ్రోజుల్లో రెండు రాష్ట్రాల్లో రెండు సార్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఆదిలాబాద్ డివిజన్‌లో..
జై నథ్ మండలం కంఠ గ్రామపంచాయతీ పరిధి లో పిప్పల్‌గావ్‌లో గ్రామస్తులు పోలింగ్‌ను బహిష్కరించారు. 315 మంది ఓటర్లుండగా 12 మంది ఓటుహక్కు వినియోగించుకున్న అనంతరం పోలింగ్ ప్రక్రియను మిగతా ఓటర్లు బహిష్కరించారు. తమకు తాగునీటి వసతి, రోడ్లు, మురికికాలువలు, విద్యుత్‌దీపాలు లేవని పేర్కొంటూ పోలింగ్ బహిష్కరణ చేశారు. రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వారితో చర్చించినా ఫలితం లేకపోయింది. దీంతో పోలింగ్ అధికారులు నిర్దేశిత సమయం వరకు ఎదురు చూసినా సంబంధిత ఓటర్లు పోలింగ్ పాల్గొనలేదు. సమస్యలు తీరుస్తామని స్పష్టమైన హామీ ఇస్తేనే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ఓట్లు వేస్తామని లేదంటే వాటిని కూడా బహిష్కరిస్తామని గ్రామస్తులు తెలిపారు. తాంసి మండలంలోని పిప్పల్ కోటిలో టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఉట్నూర్ డివిజన్ పరిధిలో..
నార్నూర్ మండలం తాడిహత్నూర్‌లో ఓ ఎస్సై దురుసుగా ప్రవర్తించారు. పోలింగ్ వద్ద ఓటర్లు బారులు తీరిన సమయంలో పలువురికి దాహం గా ఉండటంతో జామ్డా గ్రామానికి ఓంనాథ్ వారి కి నీటి ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. ఇది గమనిం చిన కౌటాల ఎస్సై ప్రశాంత్ ఎందుకు పంపిణీ చే స్తున్నావంటూ ఆయనపై దాడి చేయడంతో ఉద్రిక్త త నెలకొంది. అయితే అక్కడే ఉన్న పలువురు గ్రా మపెద్దలు వారికి సర్దిచెప్పారు. ఇదే పోలింగ్ కేం ద్రం మరోమారు వివాదానికి కేంద్రం అయింది. నీటి ప్యాకెట్ల పంపిణీ ద్వారా ప్రలోభాలకు గురి చేస్తున్నారని పలువురు అభ్యర్థులు ఫిర్యాదు చేయడంతో ఉట్నూర్ సీఐ సదానందం అక్కడికి చేరుకున్నారు. పంపిణీ చేస్తున్న సదరు యువకుడు ఓం నాథ్‌పై లాఠీ ఝుళిపించారు. దీనిపై ఆగ్రహించిన ఓటర్లు ఆ సీఐ దాడికి దిగారు.
ఎస్సై, సీఐలను తరుముకుంటూ పోలింగ్ కేంద్రం బయటకు తీసుకువచ్చారు. సుమారుగా 500 మంది మహిళలు, ఓటర్లు దాదాపుగా రాళ్ల దాడి చేయడానికి సిద్ధపడారు. దీంతో సీఐ స్థానిక సర్పంచ్ ఇంట్లో తలదాచుకున్నారు. సీఐని వదిలివేయాలని గ్రామ సర్పం చ్ నచ్చచెప్పినప్పటికీ వినకుండా ఆయన ఇంటి తలుపులు బద్దలు చేశారు. సమాచారం తెలుసుకున్న డీఎస్పీ ఘటనా స్థలానికి చేరి సర్దిచెప్పారు. అయితే సీఐ,ఎస్సీలను సస్పెండ్ చేసి, ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు మూడు గంటల పాటు ఈ హైడ్రామా కొనసాగింది. అలాగే ఖానాపూర్ మండలం శెట్‌పల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు ఆందోళనకు దిగారు. తమను అకారణంగా కొట్టారని ఎస్సై వాహనాన్ని అడ్డగించారు. చివరకు సీఐ కరుణాకర్ చొరవతో గొడవ సద్దుమణిగింది.
ఆంధ్రా, మహారాష్ట్ర వివాదాస్పద సరిహద్దులోని రెండు గ్రామాల పంచాయతీలైన పరందోళి, అంతాపూర్ ప్రజలు రెండ్రోజుల్లో రెండు రాష్ట్రాల్లో రెండు సార్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గురువారం మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాకు చెందిన పార్లమెంటు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. శుక్రవారం జిల్లాలో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఓటు వేశారు. ఎంపీ ఎన్నికల్లో ఎడమచేయి చూపుడు వేలుకి సిరా చుక్కవేయగా, శుక్రవారం జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎడమచేయి మధ్యవేలికి సిరా చుక్కవేశారు.
నిర్మల్ డివిజన్‌లో..
కుభీర్ మండలం నిగ్వా గ్రామంలో ఓటింగ్‌లో పాల్గొన్న మోలా గ్రామస్తురాలైన ఓ మిహ ళపై కానిస్టేబుల్ చేయి చేసుకున్నారు. దీంతో తాము ఓటేయబోమని గ్రామస్తులు నిరసనకు దిగారు. పోలీసు అధికారులు వారితో చర్చించి ఓటింగ్‌లో పాల్గొనేలా చేశారు. భైంసా మండలం ఇలేగాం పంచాయతీ పరిధిలోని బడ్‌గావ్ వాసులకు స్థానికంగా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయలేదు. దీంతో 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీరాలాలో ఓటు వేయాల్సి వచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో ఇలేగాంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసి ప్రస్తుతం ఆ సౌలభ్యం కల్పించకపోవడంతో సమస్య తలెత్తింది. మామడ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఎన్నికల సిబ్బంది ఎన్నికలు ముగిసిన అనంతరం తిరిగి వెళ్లె సమయంలో ఆందోళన చేశారు.
పోలింగ్ ఉద్రిక్తం
Published Sat, Apr 12 2014 2:18 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM
Advertisement
Advertisement