new boyfriend
-
బోయ్‌ఫ్రెండు కావాలంటున్న హీరోయిన్
ప్రముఖ గాయని, హీరోయిన్ సెలెనా గోమెజ్‌కు ఓ బోయ్ ఫ్రెండు కావాలట. ఇంతకుముందు తనతో కలిసి కార్ పూల్ కరావోకే షో హోస్ట్ అయిన జేమ్స్ కార్డెన్కు ఈ బాధ్యత అప్పజెప్పింది. తనకు మంచి బోయ్‌ఫ్రెండును చూసిపెట్టాలని కార్డెన్ను కోరిందీ అమ్మడు. ఈనెల 20వ తేదీన వీళ్లిద్దరూ కలిసి కార్‌పూల్ కారవోకే ఎపిసోడ్ చేశారు. ఆ సెషన్లో 23 ఏళ్ల సెలెనా తన హిల్ ఆల్బంల లోంచి కొన్ని పాటలు పాడింది. తన జీవితం గురించి, ప్రేమ గురించి కూడా చాలా ముచ్చట్లు చెప్పింది. టేలర్ స్విఫ్ట్ స్క్వాడ్ చాలా సెక్సీగా ఉంటుందని, అందులో సెలెనా గోమెజ్ కూడా ఉంటే మరింత బాగుంటుందని కార్డెన్ కామెంట్ చేశాడట. అయితే అందులో అందరూ అమ్మాయిలే ఉన్నారు తప్ప అబ్బాయిలను అసలు పిలవడం లేదని బుంగమూతి పెట్టుకున్నాడట. సరిగ్గా అదే సమయంలో సెలెనా గోమెజ్ కలగజేసుకుని, ముందు తనకో బోయ్‌ఫ్రెండును చూసిపెట్టాలని కోరింది. దాంతో కుర్రాడు ఒక్కసారిగా షాకయ్యాడట. నిజంగా కొత్త బోయ్ప్రెండు కోసం వెతుకుతున్నావా అని అడిగితే.. అవును, అందులో తప్పేంటని వాదించిందట ఆ బుల్లెమ్మ. -
ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్‌కు గాయాలు
లాస్ ఎంజెల్స్: హాలీవుడ్ ప్రముఖ సంగీత గాయని మిరందా లాంబర్ట్ కొత్త బాయ్ ఫ్రెండ్ ఆండర్సన్ ఈస్ట్ (27) గాయపడ్డాడు. కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా వారిద్దరు కలిసి బయటకు వెళ్లినప్పుడు అతడు స్కేటింగ్ చేస్తుండగా అదుపుతప్పి కిందపడటంతో గాయపడ్డాడు. దీంతో కొత్త సంవత్సరం వేడుకలకు వారిద్దరు దూరం కావాల్సివచ్చింది. కానీ, ఈ ప్రమాదం మాత్రం వారిద్దరినీ మరింత దగ్గరచేసినట్లు ఆ అమ్మడు మురిసిపోతోంది. గాయపడిన అతడిని స్వయంగా ఆస్పత్రికి తీసుకెళ్లడమేకాకుండా ప్రస్తుతం దగ్గరుండి సపర్యలు చేస్తుందట. 'కొత్త సంవత్సర వేడుకల్లో తన బాయ్ ఫ్రెండ్ ఆండర్సన్ తో కలిసి మిరందా పాల్గొంది. అయితే, స్కేటింగ్ చేస్తుండగా అతడు స్వల్పంగా గాయపడ్డాడు. చిన్నగాయమే అయినప్పటికీ అతడిని ఆమె ఆస్పత్రికి తీసుకెళ్లింది. సేవలు చేస్తోంది. వారు హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేయలేకపోయారు. కానీ అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉన్నారు. ఆమె స్వయంగా అతడికి సపర్యలు చేస్తూ మురిసిపోతుంది' అని స్థానిక మేగజిన్ ఒకటి పేర్కొంది. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే లాంబర్ట్ అతడితో గత నెల రోజుల నుంచే డేటింగ్ చేస్తుందట. కొన్ని విభేదాల కారణంగా ఆమె గాయకుడు బ్లేక్ షెల్టాన్ తో విడిపోయింది. ఆండర్సన్ ఈస్ట్ కూడా ఓ గాయకుడే.