New India Assurance
-
న్యూ ఇండియా అష్యూరెన్స్ నుంచి డ్రోన్లకు బీమా..
ముంబై: డ్రోన్లకు కూడా బీమా కవరేజీ అందించేలా న్యూ ఇండియా అష్యూరెన్స్ (ఎన్ఐఏ) కొత్త పథకాన్ని ఆవిష్కరించింది. తద్వారా ఎన్ఐఏ ఈ తరహా పాలసీలను అందించే తొలి ప్రభుత్వ రంగ బీమా సంస్థగా నిల్చింది. పెద్ద ఎయిర్‌క్రాఫ్ట్‌ల నుంచి సోలో ఫ్లయింగ్ గ్లైడర్లు మొదలైన వాటికి ఈ పథకం వర్తిస్తుంది. డ్రోన్ ఓనర్లు, ఆపరేటర్లు, తయారీ సంస్థలకు కవరేజీ అందించనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 15 యాడ్ ఆన్ కవర్స్ కూడా అందిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ ఎర్గో, ఐసీఐసీఐ లాంబార్డ్, టాటా ఏఐజీ జనరల్ తదితర సంస్థలు డ్రోన్ పాలసీలను అందిస్తున్నాయి. -
జనరల్ ఇన్స్యూరెన్స్ ఉద్యోగులకు త్వరలో తీపికబురు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ(పిఎస్‌యు) జనరల్ ఇన్స్యూరెన్స్ లో పనిచేసే ఉద్యోగులు చివరకు రాబోయే కొద్ది రోజుల్లో 15 శాతం వేతన సవరణ జరిగే అవకాశం ఉన్నట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపిన సమాచారం ప్రకారం.. 60 వేల మంది పిఎస్‌యు ఉద్యోగులకు వేతనాల సవరణలు 2021లో జరగనున్నాయి. అంటే రాబోయే రోజుల్లో వీరికి గుడ్‌న్యూస్ అందే అవకాశం ఉంది. వేతన సవరణ సాధారణంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. జనరల్ ఇన్స్యూరెన్స్ ఉద్యోగులకు చివరిసారిగా 2017లో వేతన సవరణ జరిగింది. అందువల్ల, వేలాది మంది ఉద్యోగులు తమ వేతనాల పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల, జీఐపీఎస్‌ఏ ఛైర్మన్, న్యూ ఇండియా అస్యూరెన్స్ సీఎండీ అతుల్ సహాయ్ మాట్లాడుతూ.. " వేతన సవరణ సమస్య త్వరలో పరిష్కరించబడుతుంది. డిసెంబర్లో ఉద్యోగులకు వేతన పెంపు ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని అన్నారు. కానీ, ఉద్యోగులు బకాయిల కోసం పోరాడటానికి సిద్ధంగా ఉండాలి" అని ఆయన ఉద్యోగుల బృందాన్ని ఉద్దేశించి ప్రసంగించారని నివేదిక తెలిపింది. ప్రస్తుతం సాధారణ బీమా రంగంలో నాలుగు పిఎస్‌యులు ఉన్నాయి. అని నేషనల్ ఇన్స్యూరెన్స్, న్యూ ఇండియా అస్యూరెన్స్, ఓరియంటల్ ఇన్స్యూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్. 60,000 మందికి పైగా ఉద్యోగులు ఈ సంస్థలలో పనిచేస్తున్నారు. నాలుగు సంస్థలలో న్యూ ఇండియా అస్యూరెన్స్ మాత్రమే పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ, ఇది ఒకటి మాత్రమే మంచి ఆర్థిక స్థితిలో ఉన్నట్లు కనిపిస్తుంది. మార్కెట్ వాటా తగ్గడం, ప్రైవేట్ సంస్థల నుంచి పెరుగుతున్న పోటీ కారణంగా మిగిలిన బీమా కంపెనీలు ప్రస్తుతం ఆర్థికంగా నష్టపోతున్నాయి. (చదవండి: ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాలకు అడ్డాగా భారత్.. లక్షల కోట్ల బిజినెస్!) -
న్యూ ఇండియా అష్యూరెన్స్‌దీ అదే దారి!
ముంబై: మొన్న ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్... నిన్న జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్... నేడు న్యూ ఇండియా అష్యూరెన్స్!!. పబ్లిక్ ఇష్యూలకు వచ్చిన ప్రభుత్వ బీమా కంపెనీలు ఇన్వెస్టర్లకు లాభాలు పంచటం మాట అటుంచి... లిస్టింగ్ రోజే నష్టాలు చూపిస్తున్నాయి. పబ్లిక్ ఇష్యూకు ఎందుకు దరఖాస్తు చేశామా..! అని ఆలోచించేలా చేస్తున్నాయి. సోమవారం నాడు ప్రభుత్వ రంగ న్యూ ఇండియా అష్యూరెన్స్ షేర్లు మార్కెట్లో లిస్టవుతూనే... కుదేలయ్యాయి. ఇష్యూ ధర రూ.800తో పోలిస్తే ఏకంగా 9 శాతానికిపైగా క్షీణించాయి. సోమవారం బీఎస్ఈలో ప్రారంభంలోనే 6.38% తగ్గి రూ.748.90 వద్ద ఈ షేర్లు లిస్టయ్యాయి. ఒక దశలో 10.28% మేర పతనమై రూ.717.75 స్థాయిని కూడా తాకాయి. చివరికి 9.36% నష్టంతో రూ.725.05 వద్ద క్లోజయ్యాయి. ఎన్ఎస్ఈలో 9.11% తగ్గుదలతో రూ. 727.10 వద్ద ముగిశాయి. బీఎస్ఈలో 4.3 లక్షలు, ఎన్ఎస్ఈలో 25 లక్షల షేర్లు చేతులు మారాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ.59,744 కోట్లుగా ఉంది. దాదాపు రూ. 9,600 కోట్ల సమీకరణ కోసం నవంబర్ 1–3 మధ్య వచ్చిన న్యూ ఇండియా అష్యూరెన్స్ ఐపీవో 1.19 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. చిన్న మదుపరులు కనక ఐపీఓకు దరఖాస్తు చేసుకోకుండా సోమవారం లిస్టింగ్ తరువాత కొనుగోలు చేసి ఉంటే... ఈ షేర్లు 10% తక్కువ ధరకే లభ్యమై ఉండేవి. ఈ ఐపీఓకు ఎక్కువ మంది దరఖాస్తు చేయకపోవటంతో చేసినవారికి పూర్తి స్థాయిలో షేర్లు అలాట్ కావటం గమనార్హం. ఎస్బీఐ లైఫ్, జీఐసీ కూడా అంతే..!! ఇటీవల పబ్లిక్ ఇష్యూలకు వచ్చిన ప్రభుత్వ రంగ బీమా కంపెనీలు ఎస్బీఐ లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇదే తరహాలో ఇన్వెస్టర్లకు నష్టాలు మిగిల్చాయి. ఎస్బీఐ లైఫ్ షేర్లు రూ.700 చొప్పున అలాట్ చేయగా... లిస్టింగ్ నాడు మాత్రమే కొంత పెరిగాయి. ఆ తరువాత నుంచీ తగ్గుతూ వచ్చి... ప్రస్తుతం రూ.665 వద్ద ట్రేడవుతున్నాయి. అలాగే జనరల్ ఇన్సూరెన్స్ (జీఐసీ) షేరును రూ.912 చొప్పున ఇష్యూ చేశారు. కానీ లిస్టింగ్ నుంచీ నష్టాలే చూపిస్తూ.. ప్రస్తుతం రూ.811 వద్ద ట్రేడవుతోంది. ఈ బీమా సంస్థలను లిస్ట్ చేయటం ద్వారా ప్రభుత్వం వాటిలో తనకున్న వాటాను తగ్గించుకుంటున్న విషయం తెలిసిందే. ఇందుకోసం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఎంత సమీకరించాలనేది ప్రభుత్వం ముందే టార్గెట్ పెట్టుకుంది. దీనికి అనుగుణంగా ఆయా కంపెనీల షేర్లను భారీ ప్రీమియానికి విక్రయిస్తుండటంతో విలువ ఎక్కువ ఉందనే కారణంతో కొనుగోలుదార్లు ముందుకు రావటం లేదన్నది విశ్లేషకుల మాట. దీంతో పబ్లిక్ ఇష్యూకు స్పందన కూడా అంతంత మాత్రంగానే వస్తోంది. ఫలితం!! లిస్టింగ్ అయ్యాక ఆయా షేర్లు నేలచూపులు చూస్తున్నాయి. -
నవంబర్ తొలివారంలో ‘న్యూఇండియా’ ఐపీఓ
ముంబై: ఇండియాలో అతిపెద్ద సాధారణ బీమా కంపెనీ అయిన న్యూఇండియా అష్యూరెన్స్ (ఎన్ఐఏ) రూ. 10,000 కోట్లు సమీకరించేందుకు నవంబర్ మొదటి వారంలో తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) జారీచేయనుంది. ఇటీవలే మరో సాధారణ బీమా కంపెనీ జీఐసీ రూ. 11,370 కోట్ల ఐపీఓ 1.35 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా గత ఒకటిన్నర నెలల్లో ఇతర బీమా కంపెనీలు ఐసీఐసీఐ లాంబార్డ్, ఎస్బీఐ లైఫ్‌లు కూడా ఐపీఓలు జారీచేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యం లో ప్రభుత్వ రంగ ఎన్ఐఏ భారీ పబ్లిక్ ఇష్యూరానుండటం విశేషం. ఇండియాతో పాటు 28 దేశా ల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న న్యూ ఇండి యా అష్యూరెన్స్ ఐపీఓ నవంబర్ మొదటివారంలోనే పూర్తవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఖచ్చితంగా ఎంత మొత్తానికి ఐపీఓ జారీచేయబోయేదీ, ఇష్యూ దర ఎంతనేది ఈ వారం లో ప్రకటించనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. వందేళ్లు..: త్వరలో శత వార్షికోత్సవం జరుపుకోనున్న న్యూఇండియా అష్యూరెన్స్‌కు ప్రస్తుతం సాధారణ బీమా మార్కెట్లో 16 శాతం వాటా వుంది. 31 పోటీ కంపెనీలున్నప్పటికీ, గత ఐదేళ్లుగా మార్కెట్ వాటాను పెంచుకుంటూ వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 26,000 కోట్ల ప్రీమియం ఆదాయాన్ని అంచనావేస్తున్న ఈ కంపెనీకి రూ. 69,000 కోట్లకుపైగా ఆస్తులున్నాయి. 2017 జూన్ క్వార్టర్ ముగింపునాటికి ఈ కంపెనీ పెట్టుబడుల మార్కెట్ విలువ రూ. 63,100 కోట్లు వుంది. అత్యధిక టాప్ కార్పొరేట్లు ఈ కంపెనీకి దీర్ఘకాలిక కస్టమర్లుగా ఉన్నాయి. -
ఐపీవోకు న్యూ ఇండియా అష్యూరెన్స్
ముంబై: ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థ న్యూ ఇండియా అష్యూరెన్స్ ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా షేర్లు జారీ చేయాలని యోచిస్తోంది. ప్రభుత్వం నుంచి తుది అనుమతులు వచ్చిన వెంటనే పబ్లిక్ ఇష్యూకి రావాలని భావిస్తున్నట్లు సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయిదు ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థల్లో ప్రస్తుతం 100 శాతంగా ఉన్న వాటాలను దశలవారీగా 75 శాతానికి తగ్గించుకోవాలని కేంద్రం యోచిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముందుగా న్యూ ఇండియా అష్యూరెన్స్, జీఐసీ ఆర్ఈ సంస్థల ఐపీవోలు ఉండనున్నాయి. ఆ తర్వాత నేషనల్ ఇన్సూరెన్స్ ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థలు జాబితాలో ఉన్నాయి. -
తీవ్ర నిర్లక్ష్యం : భారీ మూల్యం
-
తీవ్ర నిర్లక్ష్యం : భారీ మూల్యం
చెన్నై: చెన్నైలోని టీనగర్ లోని ‘చెన్నై సిల్క్స్’ భవనంలో చెలరేగిన అగ్ని కీలలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. కనీస భద్రతా చర్యల్ని పాటించడంలో చూపిన తీవ్ర నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత వెరసి కోట్ల రూపాయల మూల్యం. దాదాపు 32 గంటలపాటు అగ్ని గుండంలా మండిన ఏడంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అంటుకున్న మంటల్ని ఆపడానికి అగ్నిమాపక సిబ్బంది అష్టకష్టాలు పడ్డారు. స్కై లిఫ్ట్ రప్పించి మరీ రక్షణ చర్యలు చేపట్టారు. సుమారు 160 ఫైరింజన్లతో 250 మంది అగ్నిమాపక సిబ్బంది, చెన్నై సిల్క్స్ షాపింగ్ మాల్ సిబ్బంది, స్థానికులు, పోలీసులు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. ఈ అగ్ని ప్రమాదంలో విలువైన లక్షల లీటర్ల వృధా కావడంతో పాటు కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. 300 కోట్ల రూపాయల మేరకు ఆస్తినష్టం సంభవించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలగా, నార్త్ రీజియన్, ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ జాయింట్ డైరెక్టర్ ఎం. షాహుల్ హమీద్ అంచనా ప్రకారం రూ .420 కోట్లు. కొంత బంగారాన్ని తరలించారనిఅధికారులు చెబుతున్నప్పటికీ సుమారు 400 కేజీల బంగారు ఆభరణాలు, 2 వేల కిలోల వెండి నగలు కరిగి బుగ్గి పాలయ్యాయి. 20 కోట్ల రూపాయల విలువైన వజ్రాభరణాలు సైతం అగ్ని అహూతైనట్టు సమాచారం. దీంతోపాటు మొదటి అంతస్తు నుంచి ఆరో అంతస్తు వరకు భద్రపరచిన 80 కోట్ల రూపాయలకు పైగా విలువైన దుస్తులు మంటల్లో బూడిదగా మారాయి. అయితే నష్టాన్ని అంచనావేసేందుకు న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కసరత్తు చేస్తోంది. త్వరలో ప్రమాదానికి గురైన చెన్నై సిల్క్స్ షోరూమ్‌ను తమ సర్వేయర్లు సందర్శించనున్నారని సీనియర్ బీమా అధికారి ఒకరు చెప్పారు. అలాగే రెవిన్యూ మంత్రి ఉదయకుమార్ అందించిన సమాచారం ప్రకారం, అగ్నిమాపక సిబ్బంది 31 గంటల పోరాటం తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. 85 వాటర్ ట్యాంకర్లను వినియోగించారు. బుధవారం రాత్రి 10 గంటల వరకు 75 వాటర్ ట్యాంకర్లను, గురువారం ఉదయం 10 మంది ట్యాంకర్లు పిలిపించారు. ఒక్కో ట్యాంకర్ సామర్ద్యం 6వేల నుంచి 9 వేల లీటర్లు. ఈ లెక్కల ప్రకారం 5 నుంచి 7లక్షల 65వేల లీటర్ల నీటిని ఈ ఒకటిన్నర రోజులుగా కురిపించారు. ఈ భారీ వ్యయంతో అసలే తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న చెన్నై నగరం మరింత విలవిల్లాడింది. 3.5 లక్షల కుటుంబాలు ఇబ్బందుల పాలయ్యాయి .ప్రధానంగా వెంటిలేషన్ లేకపోవడంతో దట్టమైన నల్లటి పొగ ఆవిరించి అగ్నిమాపకదళాలు లోనికి ప్రవేశించకుండా అడ్డుకుంది. చివరికి క్రేన్స్ సహాయంతో భవనం ఎంట్రన్స్ పగలగొట్టాల్సి వచ్చింది. అగ్నిమాపక భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందువల్లే ఈ భారీ మంటలు చెలరేగాయని, నియంత్రణ కూడా చాలా కష్టమైందని అగ్నిమాపక అధికారులు చెప్పారు. ఇక సందర్భంగా నగరంలో నెలకొన్న ట్రాఫిక్ సంగతి సరేసరి. మరోవైపు సీటీ పోలీసులు ప్రమాదవశాత్తూ జరిగిన అగ్ని ప్రమాదంగా కేసు నమోదు చేశారు. ఉద్దేశ పూర్వక చర్య లేదా కుట్ర లాంటి సంకేతాలేవీలేవని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అలాగే జనరేటర్లకోసం కొన్ని బారెళ్ల డీజిల్ ను సెల్లార్ లో ఉంచినట్టు తమ విచారణలో తేలిందన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, ఫోరెన్సిక్ నిపుణులు దీనిపై పరిశీలన చేయనున్నారని చెప్పారు.