new sub stations
-
ఏపీ ట్రాన్స్‌కో కొత్త సబ్ స్టేషన్లు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఐదు నూతన సబ్ స్టేషన్లను ప్రారంభించడంతో పాటు, 14 సబ్ స్టేషన్లు, లైన్లకు సీఎం చంద్రబాబు ఈ నెల 7న భూమి పూజ చేయనున్నారని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ట్రాన్స్ కో సీఎండీ కె.విజయానంద్ వెల్లడించారు. సీఆర్డీఏ పరిధిలో 400/220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్(జీఐఎస్) ప్రారంభానికి సంబంధించి తాళ్లాయపాలెంలో సీఎం కార్యక్రమ ఏర్పాట్లను విజయానంద్ మంగళవారం పరిశీలించి విద్యుత్ శాఖ అధికారులకు తగు సూచనలు చేశారు.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మిగతా నాలుగు సబ్ స్టేషన్లను తాళ్లాయపాలెం నుంచి వర్చువల్ విధానంలో సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. అలాగే మొత్తం 14 సబ్ స్టేషన్లు , లైన్ల నిర్మాణాలకు సంబంధించి భూమి పూజ కూడా చేస్తారని చెప్పారు. రూ.5407 కోట్లతో ఎన్టీఆర్, గుంటూరు, చిత్తూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, శ్రీకాకుళం, అనకాపల్లి, కృష్ణా, ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాల పరిధిలోని 132/33 కేవీ, 220/132 కేవీ, 400/220 కేవీ, వివిధ సామర్థ్యాలతో సబ్ స్టేషన్లు, లైన్లను నూతనంగా ఏర్పాటు చేస్తున్నట్లు విజయానంద్ వివరించారు. -
12 కొత్త సబ్ స్టేషన్లను ప్రారంభిచనున్న సీఎం వైఎస్ జగన్
-
జిల్లాకు నూతన సబ్స్టేషన్లు
కడప అగ్రికల్చర్: జిల్లాలో ట్రాన్స్‌కో సంస్థ నూతనంగా ఐదు ప్రాంతాల్లో సబ్స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర డైరక్టర్ ఆర్ నాగరాజస్వామి వెల్లడించారు. బు«ధవారం జిల్లా కేంద్రమైన కడపలోని శంకరాపురం వద్దనున్న ఫవర్ హౌస్‌ను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లా వాసులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకుగాను కొత్తగా శాటిలైట్ సిటీ, బ్రహ్మంగారి మఠం, కలసపాడు, చిన్న ఓరంపాడు, వి కోటల్లో 400 కేవీ సబ్స్టేషన్లను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబందించి టెండర్లు పిలుస్తామని తెలిపారు. అలాగే లైన్‌లాస్ తగ్గించడానికి పాత సబ్స్టేషన్లలో ఉన్న పాత ట్రాన్స్ఫార్మర్లను తొలగించనున్నామని వివరించారు. కడప ఫవర్ హౌస్‌లో ఉన్న పాత ట్రాన్స్ఫార్మర్లను, కంట్రోల్ మిషన్లను, ప్యానెల్ బోర్డులను మార్చి వేసి నూతన సాంకేతిక ఆటోమేటిక్ మిషన్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీటి కోసం రూ. 4.50 కోట్లు ఖర్చు చేయనున్నామని తెలిపారు. అలాగే జమ్మలమడుగు ప్రాంతంలో మరో రెండు 220 కేవీ సబ్స్టేషన్లు నిర్మించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. 220 కేవీ సబ్ స్టేషన్ పోరుమావిళ్లలో ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా లో ఓల్టేజీ లేకుండా చేస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వంతుగా రూ. 112 కోట్లు అందిస్తోందన్నారు. ఈ సబ్స్టేషన్లు పూర్తి కావాలంటే ఒకటిన్నర సంవత్సరం పడుతుందన్నారు. డైరక్టర్ వెంట ట్రాన్స్‌కో ఎస్ఈ వెంకటస్వామి, డీఈలు రాజగోపాల్‌రెడ్డి, శ్రీరామచంద్రమూర్తి, ఏడీఇలు వీరభద్రయ్య, రవీంద్ర, అరుణ్‌కుమార్, శ్రీనాధుడు, వాసు, రామ్మోహన్, ఏఈఓలు కమలాకర్, మల్లిఖార్జున తదితరులు ఉన్నారు. -
జిల్లాకు సబ్స్టేషన్లు మంజూరు
కడప కోటిరెడ్డి సర్కిల్ : జిల్లాలో కొత్తగా 11 విద్యుత్ సబ్స్టేషన్లు మంజూరయ్యాయని, వాటికి త్వరలో టెండర్లను ఆహ్వానించనున్నామని జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీరు ఎన్వీఎస్ సుబ్బరాజు తెలిపారు. గురువారం సాయంత్రం కడప నగరంలోని విద్యుత్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు కొత్తగా 11 సబ్స్టేషన్లు మంజూరయ్యాయని, వాటి నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామన్నారు. అలాగే కడప, ప్రొద్దుటూరులో ఇండోర్ సబ్స్టేషన్ల నిర్మాణాలు చేపట్టనున్నామని పేర్కొన్నారు. ఇండోర్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి 5–10 సెంట్ల స్థలం, అవుట్డోర్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి 40 సెంట్ల స్థలం కావాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో ఇటీవల ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేశామని, అవి కాలిపోయినట్లు ఫిర్యాదులు రావడంతో వాటి స్థానంలో కొత్త బల్బులు ఇస్తున్నామని తెలిపారు. కాలిపోయిన బల్బులు, కరెంటు బిల్లుల జిరాక్స్ తీసుకెళ్లి ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలలో పొందవచ్చన్నారు. విద్యుత్ చౌర్యం అరికట్టేందుకు విజిలెన్స్ స్వా్కడ్ తిరుగుతోందన్నారు. ఎవరైనా విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. కనుక విద్యుత్‌ను అక్రమంగా వాడుకునే వారు రూ. 125 చెల్లించి దీన్ దయాళ్ స్కీం కింద సర్వీసును పొందితే దాదాపు రూ. 7 వేల మెటీరియల్‌ను ఉచితంగా ఇస్తామన్నారు. నగదును ఏ విధంగా ఏటీఎంలలో తీసుకోవడం, డిపాజిట్ చేస్తున్నామో అదేవిధంగా కడప నగరంలో ఏపీపీలను ఏర్పాటు చేశామని, అందులో విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చని తెలిపారు. ఇవి 24 గంటలు పని చేస్తాయని, వినియోగదారులు ఎప్పుడైనా బిల్లులు చెల్లించవచ్చన్నారు. ఎవరైనా వినియోగదారుల నుంచి డబ్బులు అడిగితే తమకు ఫోన్ నంబర్: 94408 11751కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. మరిన్ని వివరాలకు టోల్‌ఫ్రీ నంబర్: 1800 425155 333లో సంప్రదించాలని ఆయన వివరించారు.