సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలొస్తోంది..
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య కొత్తగా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపనున్నారు. సికింద్రాబాద్-విజయవాడల మధ్య ఈ రైలు ప్రయాణిస్తుంది.
ఈ నెల 20న రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రైలును ప్రారంభిస్తారు. ఈ నెల 22 నుంచి సికింద్రాబాద్-విజయవాడ మధ్య రెగ్యులర్ సర్వీసులను నడపనున్నారు. ప్రతిరోజు ఉదయం 5:30 గంటకు సికింద్రాబాద్‌లో బయల్దేరి 11 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.