new tasks
-
మా బుజ్జిగాడూ... దేవుడు మెచ్చే నా అబద్ధాలు!!
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి విషయంలో చికాకులు తొలగుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులకు అనుకూల మార్పులు. రాజకీయరంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం మధ్యలో వివాదాలు. తీర్థయాత్రలు. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) యుక్తితో సమస్యలు పరిష్కరించుకుంటారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వివాహయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు పైస్థాయి వారినుంచి ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బాధ్యతల సమర్థవంత నిర్వహణకు ప్రశంసలు పొందుతారు. జీవితాశయం నెరవేరుతుంది. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. కళారంగం వారికి కొత్త అవకాశాలు. వారం చివరిలో ఆస్తి వివాదాలు. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. పనులు శ్రమానంతరం పూర్తి. ఇరుగు పొరుగుతో సఖ్యత. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. పారిశ్రామికవర్గాలకు అరుదైన ఆహ్వానాలు. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) కొన్ని పనులు నత్తనడకన సాగుతాయి. బంధువులతో మాటపట్టింపులు. విద్యార్థులకు ఫలితాలు సంతృప్తినిస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులు బాధ్యతలపై మరింత శ్రద్ధ వహించాలి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనల్లో మార్పులు. వారం వాహనయోగం. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,) కొత్త వ్యక్తుల పరిచయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాల సర్దుబాటు. విద్యార్థులకు కోరుకున్న విద్యావకాశాలు. ఇంటాబయటా అనుకూలం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవర్గాలకు అనుకోని ఆహ్వానాలు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. అనారోగ్యం. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.) ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. మిత్రులు, బంధువులతో వివాదాలు తీరతాయి. సేవలకు తగిన గుర్తింపు. సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు పదవులు. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. వ్యయప్రయాసలు. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్త పనులు ప్రారంభిస్తారు. గౌరవమర్యాదలు పొందుతారు. జీవిత భాగస్వామితో వివాదాల పరిష్కారం. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వాహనయోగం. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో ఆరోగ్యభంగం. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) బంధువులతో వివాదాలు తీరతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. పనుల్లో జాప్యం. బంధువులతో అకారణంగా వివాదాలు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. నిర్ణయాలలో తొందరవద్దు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. వారం మధ్యలో స్వల్ప ధనలాభం. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. కళారంగం వారికి సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) బంధువుల నుంచి శుభవార్తలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. విద్యార్థులు ప్రతిభను చాటుకుంటారు. వాహనయోగం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉత్సాహవంతం. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు. -
‘ఉపాధిహామీ’లో కొత్త పనులు..
మోర్తాడ్ : ఉపాధి హామీ పథకం కింద 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను కొత్త పనులను గుర్తించి ప్రణాళికను తయారు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఆదేశించడంతో అధికారులు రంగంలోకి దిగారు. పనుల గుర్తింపునకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసింది. కొత్త పనుల గుర్తింపునకు మండల స్థాయిలో మూడు బృందాలను ఏర్పాటు చేశారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి ఉపాధి పనుల ద్వారా ప్రజలకు బహుళ ప్రయోజనాలు కలిగించే పనులను బృందాలు గుర్తించాల్సి ఉంది. మండల పరిషత్ అభివృద్ధి అధికారి, ఉపాధి హామీ అసిస్టెంట్ ప్రోగ్రామ్ అధికారి, ఉపాధి హామీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ అధికారుల ఆధ్వర్యంలో పనుల గుర్తింపునకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రజలకు బహుళ ప్రయోజనాలు కలిగించే 35 రకాల పనులపై దృష్టి సారించాలని గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. జిల్లాలోని 718 గ్రామ పంచాయతీల్లో గత సంవత్సరం గుర్తించిన పనుల్లో 2,75,365 పనులకు సాంకేతిక ఆమోదం లభించింది. ఇప్పుడు కూడా ఇంచు మించు అదే స్థాయిలో పనులను గుర్తించడానికి బృందాలు కసరత్తు చేస్తున్నాయి. వ్యవసాయ క్షేత్రాల్లో మొక్కల పెంపకం, ప్రభుత్వ భూముల్లో మొక్కలు నాటి వాటిని పరిరక్షించడం, ఫీడర్ ఛానల్స్ మరమ్మతులు, వర్షం నీరు వృథాగా పోకుండా దానిని పరిరక్షించడం కోసం ఏర్పాట్లు చేయడం, గ్రామాల్లో ఉన్న రోడ్లపై గుంతలు ఏర్పడితే వాటిని పూరించడం, ప్రభుత్వ విభాగంలోని కార్యాలయాల ఆవరణల్లో గుంతలు ఉంటే పూడ్చటం, సాగునీటి వసతి, పశువులు నీటిని తాగడానికి కుండీలను నిర్మించడం, వ్యవసాయ క్షేత్రాల్లో ఫ్లాట్‌ఫాంలను నిర్మించడం, బీడు భూముల అభివృద్ధి, పండ్ల మొక్కలను నాటి వాటిని పరిరక్షించడం తద్వారా ఉపాధికి ఊతమివ్వడం తదితర రకాలైన 35 రకాల పనులను చేపట్టాల్సి ఉంది. గతంలో మాదిరిగా ఒకే తరహా పనులను కాకుండా ప్రజలకు ఎక్కువ ప్రయోజనాలను కలిగించే పనులను గుర్తించి వాటి ద్వారా కూలీలకు వంద రోజుల పాటు ఖచ్చితంగా పని కల్పించాలని గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశించింది. గ్రామ స్థాయిలో వివిధ శాఖల ఉద్యోగులను భాగస్వామ్యం చేసి పనుల గుర్తింపును పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గ్రామంలోని సర్పంచ్, వార్డు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో గుర్తించిన పనులు ఆమోదం పొందాల్సి ఉంటుంది. గ్రామ స్థాయిలో పనుల గుర్తింపు పూర్తి అయిన తరువాత మండల స్థాయిలో ఆమోదం పొందాల్సి ఉంది. కొత్త పనుల గుర్తింపును త్వరిత గతిన పూర్తి చేసి నిధుల వ్యయంపై అంచనా వేయాల్సి ఉంది. రానున్న ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కానుండగా ఇప్పుడు గుర్తించిన పనులను అప్పటి నుంచి ప్రారంభించాల్సి ఉంది. నిధుల కేటాయింపు కోసం గుర్తించిన పనులకు ఎంత వ్యయం అవుతుందో అంచనావేయాల్సి ఉంది. సమయం తక్కువగా ఉండటంతో పనుల గుర్తింపునకు అధికారులు వేగంగా దూసుకుపోతున్నారు. -
కోడ్ కూస్తుందని..
అధికారుల హైరానా నోటిఫికేషన్‌కు ముందే పనుల మంజూరుకు కసరత్తు రూ.100 కోట్ల పథకాలకు అవకాశం.. విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇంకా నోటిఫికేషన్ రాకముందే వేడి రాజుకుంది. రాజకీయ పక్షాలు వారి వారి వ్యూహాల్లో బిజీగా ఉండగా ఇటు అధికార యంత్రాంగం కూడా ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవుతోంది. దీంతోబాటు ఇటు ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించింది. ఒకవైపు ఎన్నికల సిబ్బంది నియామకం, వారికి శిక్షణా తరగతులు వంటి కార్యక్రమాలపై కసరత్తు చేస్తూనే.. మరోవైపు వచ్చే వేసవికి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రజాప్రతినిధులు కూడా ప్రజలపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటి వరకు గుర్తుకు రాని నియోజకవర్గ అభివృద్ధి నిధులతో కొత్త పనులు చేపట్టేందుకు అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. రూ.100 కోట్లు పనులకు శ్రీకారం: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఓట్ల లెక్కింపు వరకు నియమావళి అమలులో ఉంటుంది. ఆ కాలంలో ఎటువంటి కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు ప్రారంభించే అవకాశం ఉండదు. దీంతో నోటిఫికేషన్‌కు ముందే జిల్లాలో చేపట్టాల్సిన పనులపై అధికారులు దృష్టి సారించారు. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కార్యాచరణను ఇప్పటికే సిద్ధం చేశారు. అలాగే నీటి పారుదల శాఖ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, హౌసింగ్ శాఖలకు సంబంధించి ప్రారంభించాల్సిన పనులను వెంటనే ప్రారంభించేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఈ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు అన్ని శాఖలకు కలిపి మొత్తంగా రూ.100 కోట్లు విలువ చేసే పనులను ప్రారంభించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల సిబ్బంది నియామకం: ఎన్నికల సిబ్బంది నియామకంపై జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల వివరాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికీ ఆయా ఉద్యోగుల జాబితా సిద్ధమైనట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ శాఖల నుంచి ఉద్యోగుల వివరాలు కలెక్టరేట్‌కు చేరుకుంటున్నాయి. ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో నోడల్ అధికారితో పాటు సెక్టోరల్ ఆఫీసర్ నియామకాలు పూర్తయ్యాయి. పీఓ, ఏపీఓల నియామకాలకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో 3506 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కేంద్రాల సంఖ్య కంటే పది శాతం అధికంగా 3857 మంది పీఓలను నియమించనున్నారు. ఇలా అన్ని స్థాయిల్లో కలిపి మొత్తంగా 22 వేల మంది ఉద్యోగులను వినియోగించనున్నారు. రిటర్నింగ్ అధికారుల జాబితాను ఎన్నికల సంఘానికి పంపించారు. అక్కడ ఆమోద ముద్ర లభించిన వెంటనే రిటర్నింగ్, పోలీసు అధికారులు సున్నిత, అతిసున్నిత ప్రాంతాలను గుర్తించనున్నారు.