నేటి నుంచి ప్రైవేట్ వ్యవసాయ కళాశాలల కౌన్సెలింగ్
గుంటూరు రూరల్ : ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ యూనివర్సిటీ పరి«ధిలో అనుమతులు కలిగిన ప్రైవేటు కళాశాలల్లో సీట్ల భర్తీకి గురువారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభించానున్నామని వర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ టీవీ సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం ప్రకాశం జిల్లా మార్కాపూర్లోని ఎన్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రైవేటు వ్యవసాయ కళాశాలకు అనుమతులు ఇచ్చామన్నారు. గతంలో అనుమతులు ఇచ్చిన 5 ప్రైవేటు కళాశాలలతో కొత్తగా అనుమతులు ఇచ్చిన కళాశాలకు ఎంసెట్ ప్రాతిపదికన కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకూ కౌన్సెలింగ్ కొనసాగుతుందన్నారు. గతంలో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులు మాత్రమే పాల్గొనేందుకు అవకాశం ఉంటుందన్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలతో సర్టిఫికెట్లను తీసుకొని కౌన్సెలింగ్కు హాజరు కావాలన్నారు.