NGRI scientist
-
భూకంప కేంద్రాన్ని గుర్తించిన అధికారులు
-
భూకంప కేంద్రాన్ని గుర్తించిన అధికారులు
సాక్షి, సూర్యాపేట : ఆంధ్ర, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజామున సంభవించిన భూకంప ప్రకంపనలకు చింతలపాలెం మండలం వెల్లటూరు వద్ద 7 కిలోమీటర్ల లోతులో భూకంప నాబి కేంద్రంగా గుర్తించినట్లు ఎన్జీఆర్ఐ చీఫ్ సైటింస్ట్ నగేశ్ వెల్లడించారు. కాగా తెల్లవారుజామున సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైనట్లు భూకంప కేంద్రం నిపుణులు తెలపారు. ఇక్కడి నుంచి వచ్చిన తరంగాలతోనే ఏపీలోని గుంటూరు, కృష్ణా, తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో భూకంపం సంభవించిందని నగేశ్ పేర్కొన్నారు. కాగా రెండున్నర వారాలుగా ఈ ప్రాంతంలో భూమిలోపల భూకంపాలు సంభవిస్తున్నాయని , పగుళ్ల కారణంగానే భూమి కంపిస్తుందని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు సంభవించిన భూకంపాన్ని స్పెసిఫిక్ జోన్-2గా గుర్తించామని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో భద్రాచలంలో 1969లో రిక్టర్ స్కేల్‌పై 5.3గా నమోదైందని, దాని తర్వాత మళ్లీ భూకంపం రావడం ఇదేనన్నారు. అయితే కట్టడాలు బలంగా ఉండడంతోనే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చీఫ్ సైంటిస్ట్ నగేష్ పేర్కొన్నారు. (కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూప్రకంపనలు) -
పోలవరం రోడ్డుకు మరోసారి బీటలు
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ (జలాశయం)లో నాణ్యత లోపాలు మరోసారి బహిర్గతమయ్యాయి. హెడ్ వర్క్స్ ప్రాంతానికి వెళ్లే మార్గంలోని రెస్టారెంట్ ఎదురుగా ప్రధాన రహదారి ఆదివారం మరోసారి భారీగా బీటలు వారి 6 అడుగుల వరకు కుంగిపోయింది. ఇది చూసి సమీప ప్రాంతాల్లో పనులు చేస్తున్న కూలీలు, ఇతరులు భయాందోళనకు గురయ్యారు. ఆ మార్గంలో ప్రయాణించే ఏజెన్సీ ప్రాంత గిరిజనులు కూడా ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేసి.. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో అయోమయంగా ఉండిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఇంజనీరింగ్ అధికారులు, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను, వాహనాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. యంత్రాలను రప్పించి పగుళ్లు బారిన రహదారికి తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. గతంలో ఇదే రహదారి ఒక్కసారిగా 20 అడుగులు పైకి ఎగదన్ని నెర్రెలు బారి.. ముక్కలు ముక్కలుగా కుంగిపోయిన విషయం తెలిసిందే. స్పిల్ ఛానల్ ప్రాంతంలో బెడ్ లెవల్లో మట్టి తవ్వకం పనులు జరుగుతున్నాయని.. దాంతో భూమి పైభాగం నుంచి ఒత్తిడి ఏర్పడటం వల్ల రోడ్డు కుంగిపోయి ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. కమీషన్లకు కక్కుర్తి పడిన ప్రభుత్వ పెద్దలు నిబంధనలు తుంగలో తొక్కి కాంట్రాక్టర్లకు వంతపాడటం వల్లే పోలవరం రోడ్డుకు ఈ దుస్థితి దాపురించిందని జలవనరుల శాఖ అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తల సూచనలు బుట్టదాఖలు రహదారి పనుల్లో నాణ్యత లోపాలను, డంపింగ్ యార్డ్ ఏర్పాటులో అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వ పెద్దలు యధాప్రకారం అబద్ధాలను పదే పదే చెబుతున్నారు. మట్టిలో తేమ శాతం తగ్గిందని, వాతావరణంలో మార్పుల వల్ల మట్టి ఉబికి రావడం, కుంగిపోవడం సహజమంటూ అధికారులతో చెప్పిస్తున్నారు. కానీ.. నిబంధనలు తుంగలో తొక్కి చిన్న నీటి వనరులను విధ్వంసం చేసి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం, రహదారిని నాసిరకంగా నిర్మించడం వల్లే ఇలాంటి ఘటనలు సంభవిస్తున్నాయని ఆ ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్న కొందరు అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాయి, మట్టి నమూనాలను ప్రాథమికంగా పరిశీలించిన సెంటర్ ఫర్ సాయిల్ అండ్ మెటీరియల్ రెసెర్చ్ స్టేషన్(కేంద్ర మట్టి, రాయి పరిశోధన సంస్థ) శాస్త్రవేత్తలు, నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు గతంలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తల సూచనల మేరకు పనులు నాణ్యంగా చేసి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని అధికారవవర్గాలు పేర్కొంటున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనుల్లో నాణ్యత లోపాలను కాగ్ ఎత్తిచూపినా.. సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) సభ్యులు వైకే శర్మ నేతృత్వంలో కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ స్పిల్‌వే పనులు నాసిరకంగా ఉన్నాయని తేల్చిచెప్పినా రాష్ట్ర సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఎన్జీఆర్ఐ సైంటిస్టుకు జాతీయ అవార్డు
సాక్షి, హైదరాబాద్: సీఎస్ఐఆర్– ఎన్జీఆర్ఐలో చీఫ్ సైంటిస్టు ఎన్.పూర్ణచందర్‌రావుకు కేంద్ర గనులశాఖ అందించే ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు దక్కింది. భూగర్భ అంశాల్లో ఆయన సేవలకుగాను కేంద్రం ‘నేషనల్ జియోసైన్స్ అవార్డు’కు ఎంపిక చేసింది. భూకంపాలు, భూగర్భంలో జరిగే అంతర్గత మార్పులపై పలు పరిశోధనలను జరిపిన ఆయన ‘భూకంప అధ్యయనంలో శాస్త్రీయ తవ్వకాలు’ పరిశోధనలకు బృంద నాయకునిగా వ్యవహరిస్తున్నారు. -
1934 తర్వాత ఇదే అతిపెద్ద భూకంపం
-
1934 తర్వాత ఇదే అతిపెద్ద భూకంపం
- మరో 10-15 రోజులు భూకంపాలు కొనసాగే అవకాశం - ఎన్జీఆర్ఐ భూకంప శాస్త్రవేత్త ఆర్కే చద్దా హైదరాబాద్: ప్రస్తుతం భూకంపం సంభవించిన నేపాల్ ప్రాంతంలో మరో 10-15 రోజులపాటు చిన్న చిన్న భూకంపాలు వస్తాయని జాతీయ భౌగోళిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) ముఖ్య శాస్త్రవేత్త ఆర్కే చద్దా తెలిపారు. శనివారం నేపాల్ రాజధాని ఖాట్మండుకు 80 కిలోమీటర్ల దూరంలో సంభవించిన భారీ భూకంపం.. మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో దీని ప్రభావం, భవిష్యత్తు పరిణామాలు, రాష్ట్రంలో భూకంపాల వాతావరణం తదితర అంశాలపై హైదరాబాద్‌లోని ఎన్జీఆర్ఐ ముఖ్య శాస్త్రవేత్త ఆర్కే చద్దాను సాక్షి ప్రతినిధి సంప్రదించారు. వివిధ అంశాలపై ఆయన అందించిన వివరాలిలా ఉన్నాయి. నేపాల్ ప్రాంతంలో 1934 తర్వాత ఇదే అతి పెద్ద భూకంపం. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.9 గా నమోదైంది. పరిమాణం రీత్యా దీనిని భారీ భూకంపంగా వర్గీకరిస్తారు. సాధారణంగా ఇంత భారీ భూకంపం ప్రభావం ఆ ప్రాంతంపై 10 నుంచి 15 రోజులపాటు ఉంటుంది. ఈ కాలంలో చిన్న చిన్న భూకంపాలు వస్తాయి. అయితే ప్రభావం తక్కువగా ఉంటుంది. ఎన్జీఆర్ఐ రికార్డుల ప్రకారం శనివారం మధ్యాహ్నం 11.41 గంటలకు నేపాల్ రాజధాని ఖాట్మండుకు నార్త్ వెస్ట్గా 80 కిలోమీటర్ల దూరంలో 15 కిలోమీటర్ల లోతులో భారీ భూకంపం సంభవించింది. తదుపరి సాయంత్రం 4.30 గంటలలోపు వరుసగా 15 భూకంపాలు నమోదయ్యాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 5 నుంచి 6.6గా నమోదైంది. నేపాల్ రీజియన్, పరిసర ప్రాంతాల్లో ఇది అతి పెద్ద భూకంపం. 1934లో నేపాల్ - బీహార్ సరిహద్దులో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.4గా నమోదైంది. తర్వాత ఇదే పెద్దది. అప్పుడూ ఇప్పుడూ అదే ప్రాంతంలో.... 1934లో భూకంపం వచ్చిన ప్రాంతంలోనే ఇప్పుడు కూడా వచ్చింది. ఇది అతి ప్రమాదకరమైన అయిదో జోన్ (హిమాలయాల ప్రాంతం)లో ఉంది. భూకంప ప్రభావిత ప్రాంతాలను తీవ్రతను బట్టి శాస్త్రవేత్తలు అయిదు జోన్లుగా వర్గీకరించారు. ఇందులో హిమాలయాల ప్రాంతం అయిదో జోన్ కిందకు వస్తుంది. ఈ ప్రాంతంలో భూకంపాలు సంభవించడం సర్వసాధారణం. అందువల్ల వీటిని తట్టుకునే విధంగా భవనాలు నిర్మించుకుంటారు. ఇప్పుడు నేపాల్‌లో కూలిపోయిన భవనాలు పురాతనమైనవే. గతంలో భారీ భూకంపం వచ్చిన సందర్భంగా జపాన్‌లోనూ ఇలాగే పురాతన భవనాలన్నీ కూలిపోయాయి. భూకంప తీవ్రతను తట్టుకునే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన భవనాలకు ఎటువంటి ప్రమాదం ఉండదు. -
క్యాపిటల్ కన్స్టృక్షన్లో జాగ్రత్తలు పాటించాలి: ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త