nightclub fire
-
నైట్ క్లబ్లో కాల్పుల కలకలం...ప్రమాదవశాత్తు స్నేహితుడిని కాల్చిన వ్యక్తి
ఇటీవలకాలంలో క్లబ్లో కాల్పులు జరపడం సర్వసాధారణం అయిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా నైట్ క్లబ్‌లను తెల్లవార్లు తెరిచే ఉంచుతున్నారు కొంతమంది యజమానులు. అక్కడకు వచ్చిన కొంతమంది పీకలదాక తాగి ఆ మత్తులో చిన్న తగాదాకే ఒకరినొకరు చంపుకునేంత వరకు వెళ్లిపోతున్నారు. నిజానికి అక్కడ ఎలాంటి కారణం ఉండదు. ఆ మత్తులో తూలుతూ ఒళ్లుమరిచి ఇలాంటి దారుణాలకు తెగబడుతుంటారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి కూడా అలాంటి దారుణానికే ఒడిగట్టాడు. వివరాల్లోకెళ్తే...హర్యానాలో నైట్ క్లబ్లో ఒక వ్యక్తి మహిళతో కలిసి పబ్ నుంచి బయటకు వచ్చాడు. వాళ్లతోపాటు మరికొంతమంది కూడా వస్తున్నారు. వారంతా కారు పార్కింగ్ వద్దకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏమైందో ఏమో ఇంతలో ఒక వ్యక్తి ఒక్కసారిగా జేబులోంచి పిస్టల్ తీసి అక్కడే ఉన్న క్లబ్ బౌన్సర్ల పై కాల్పులు జరపడం ప్రారంభించాడు. అంతే అతడు జరిపిన కాల్పుల్లో ప్రమాదవశాత్తు ఒక బుల్లెట్ అతని స్నేహితుడి శరీరంలోకి వెళ్లింది. దీంతో అతని స్నేహితుడి బాధతో విలవిలలాడుతూ కింద పడిపోయాడు. ఆ వ్యక్తి పక్కనే ఉన్న మహిళా స్నేహితురాలు నివారించేందుకు యత్నించినా ఆమె పై కూడా కాల్పులు జరిపాడు. దీంతో అక్కడే ఉన్న క్లబ్ బౌన్సర్లు అతన్ని అడ్డుకోవడమే కాకుండా అతని వద్ద ఉన్న పిస్టల్ని లాక్కున్నారు. ఐతే కాసేపటికి గాయపడిన వ్యక్తితో సహా నలుగురు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన మొత్తం సమీపంలో ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీంతో పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజాము వరకు క్లబ్ తెరిచి ఉన్నందుకు యజమాని పైనా, కాల్పులకు పాల్పడిన వ్యక్తి పైనా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. #WATCH | Panchkula, Haryana| At around 4.30am accused open-fired outside Coco cafe in wee hours of July 3. He injured his friend & a bouncer. We've registered a case against accused & another against cafe for keeping it open till so late: PS sector 5 incharge Sukhbir Singh pic.twitter.com/C53n0uDE1p — ANI (@ANI) July 5, 2022 (చదవండి: రాహుల్ గాంధీ ఫేక్ వీడియో కేసులో న్యూస్ యాంకర్ అరెస్టు!) -
ప్రధాని పదవికే ఎసరు..!
బుకారెస్ట్: ఓ అగ్ని ప్రమాదం నేపథ్యంలో వెల్లువెత్తిన నిరసన ఆందోళన రొమేనియా దేశ ప్రధాని పదవికి ఎసరుపెట్టింది. రొమేనియాలోని బుకారెస్ట్‌లో గల ఓ నైట్‌క్లబ్‌లో పేలుడు, అగ్నిప్రమాదం సంభవించి దాదాపు 30 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో మిన్నంటిని నిరసనలకు ప్రతిఫలంగా ఆదేశ ప్రధాని 'విక్టోర్ పాంటా' రాజీనామా చేసే ఆలోచన చేస్తున్నట్లు సోషల్ డెమొక్రటిక్ నేత లియు డ్రాగ్నియా తెలిపారు. 'నా బాధ్యతలు ఎవరికైనా అప్పగించాలనుకుంటున్నాను. నేను రాజీనామా చేస్తున్నాను' అని పాంటా చెప్పినట్లు డ్రాగ్నియా చెప్పారు. బుకారెస్ట్ నైట్‌క్లబ్‌లో పేలుడు, అగ్నిప్రమాదం సంభవించి 33 మంది మరణించి, 180 మందికి పైగా గాయపడ్డారు. టపాసులతో కూడిన రాక్ సంగీత కచేరీ నిర్వహించిన సందర్భంగా ఈ ప్రమాదం జరిగినట్లు రొమేనియా ప్రభుత్వాధికారులు తెలిపారు. కానీ, క్లబ్ లోపల టపాసులు కాల్చేందుకు ప్రయత్నించడం వల్లే ఈ దారుణం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ఘటనకు బాధ్యత వహించి వెంటనే ప్రధాని రాజీనామా చేయాలని, ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని మంగళవారం భారీ ఎత్తున ఆందోళన కారులు బుకారెస్ట్ వీధుల్లోకి వచ్చి ఆందోళన నిర్వహించారు. దాదాపు 20 వేల మంది ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కొంత హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఆ ఘటనకు బాధ్యత వహించి పార్టీ నేతలతో చర్చించిన తర్వాత ప్రధాని పదవికి పాంటా రాజీనామా చేస్తారని తెలుస్తోంది