Nikita gokhale
-
న్యూడ్ గా నటించేందుకు సై
ముంబై: న్యూడ్ గా నటించేందుకు అభ్యంతరం లేదంటోంది మరాఠి మోడల్, నటి నికిత గోఖలే. ఎక్స్ పోజింగ్ చేయబోనని గతంలో చెప్పిన ఆమె ఇప్పుడు మనసు మార్చుకోవడం విశేషం. పాత్ర డిమాండ్ చేస్తే ఎటువంటి సంకోచాలు లేకుండా నటిస్తానని చెప్పి అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. 'సినిమాలో నా పాత్ర డిమాండ్ చేస్తే న్యూడ్ గా నటించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదు. బండిట్ క్వీన్ కోసం సీమా బిశ్వాస్ నగ్నంగా నటించింది. ఇందులో తప్పుబట్టడానికి ఏమీ లేదు. పాత్రకు అనుగుణంగా ఆమె అలా నటించింది. నేను మాత్రం ఇలా ఎందుకు నటించకూడదు? కెరీర్ ఆరంభ దశలో ఉన్నాను కాబట్టి ఫలానా పాత్రలే కావాలని డిమాండ్ చేయలేన'ని నికిత గోఖలే పేర్కొంది. ప్రస్తుతం మరాఠిలో సినిమాలో నటిస్తున్న ఆమె త్వరలోనే రవి జాదవ్ తో కలిసి పనిచేయనున్నట్టు తెలిపింది. -
నికిత డేర్!
క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎలాంటి దుస్తులు వేసుకోవడానికైనా రెడీ అన్న నటీమణులను చూస్తూనే ఉంటాం. కానీ... మరాఠీ నటి నికిత గోఖలే మాత్రం అందుకు భిన్నం. అసలెవరూ అడగకపోయినా... ప్లే బాయ్ మ్యాగజైన్ ‘హగ్ హెఫ్నర్’ కోసం నగ్నంగా నటించడానికి కూడా వెనకాడనంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ దెబ్బకు ఫిల్మ్ సర్కిల్ షేకయింది. ఇంతలా డేర్‌గా అమ్మడు రెడీ అంటోందేంటని మరాఠీ ఇండస్ట్రీలో చెవులు కొరుక్కుంటున్నారట. ప్రస్తుతం ఈ గుమ్మ చేసిన మరాఠీ ఫిల్మ్ ‘కాలేజీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రముఖ మోడల్ కూడా అయిన నికిత... ప్రస్తుతం విదేశీ టూర్లలో యమ బిజీగా గడిపేస్తోంది. మ్యాగజైన్ ఫొటో షూట్స్‌తో బాగా పాపులర్ అయిన ఈ సెక్సీ సుందరి... ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో తన అప్డేట్స్ పోస్ట్ చేసి కిక్కెస్తోంది. -
ఐయామ్ స్పెషల్!
వారసత్వంగా ఇండస్ట్రీని ఏళ్లకు ఏళ్లు ఏలేస్తున్నాయన్న కసో... తనకు అంత స్థాయి లేదన్న బాధో... మొత్తానికి సెక్సీ తార నికితా గోఖలే తన అక్కసు వెళ్లగక్కింది. బాలీవుడ్లో సూపర్‌స్టార్ అవ్వాలంటే కపూర్, బచన్ ఫ్యామిలీ నుంచే ఎంట్రీ ఇవ్వక్కర్లేదంటూ సామాజిక సైట్లో తెగ ఇదైపోయింది. టాప్‌లెస్ పోజులతో ‘ప్లేబాయ్’ షూట్లో పాల్గొన్న ఈ ముద్దుల గుమ్మ ‘టాలెంట్ ఉంటే ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ అక్కర్లేదు. నేను దాన్నే నమ్ముకున్నా’ అని తన సోషల్ సైట్ పేజీలో రాసుకుంది.