ninth position
-
ఆనంద్‌కు తొమ్మిదో స్థానం
సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్యూ ఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు తొమ్మిదో స్థానం లభించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ టోర్నమెంట్లో ఆనంద్ వరుసగా ఏడో ‘డ్రా’ నమోదు చేశాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో ఆడిన ఆనంద్ 36 ఎత్తుల్లో గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు. మొత్తం 10 మంది గ్రాండ్‌మాస్టర్లు తలపడిన ఈ టోర్నీలో ఓవరాల్‌గా ఆనంద్ 3.5 పాయింట్లతో తొమ్మిదో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆరు పాయింట్లతో లెవాన్ అరోనియన్ (ఆర్మేనియా) విజేతగా అవతరించగా... ఐదు పాయింట్లతో కార్ల్సన్ రన్నరప్‌గా నిలిచాడు. -
తొమ్మిదో స్థానం కోసం భారత్ పోరు
హేగ్: హాకీ ప్రపంచ కప్‌లో నాకౌట్ రేసు నుంచి వైదొలిగిన భారత్ తొమ్మిదో స్థానం కోసం బరిలోకి దిగనుంది. ఈ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ ఆసియా చాంపియన్ దక్షిణ కొరియాతో తలపడనుంది. గత ప్రపంచ కప్‌లో ఎనిమిదో స్థానం సాధించిన భారత్.. ఈ సారి దాని కంటే మెరుగైన స్థితిలో నిలవలేకపోయింది. తాజా ప్రపంచ కప్ గ్రూపు దశలో ఐదు మ్యాచ్‌లకు గాను భారత్ ఒక్కో విజయం, డ్రా నమోదు చేసింది. దీంతో ఏ గ్రూపులో భారత్ అట్టడుగు స్థానంలో నిలిచింది.