breaking news
Nizamabad District Latest News
-
బీమా.. రైతన్నకు ధీమా
డొంకేశ్వర్(ఆర్మూర్): రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని అమలు చేస్తోంది. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే వారి కు టుంబసభ్యులకు బాసటగా నిలుస్తోంది. రూ.5లక్షల ఆర్థిక సాయం బాధిత కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతోంది. ఈ పథకానికి రైతులపై భా రం లేకుండా ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లి స్తోంది. ప్రస్తుతం బీమా చేసుకోవడానికి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నెల 13వరకు గడువు ఉండగా అర్హులైన రైతులు దరఖాస్తులు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. జిల్లాలో 1.69లక్షల మంది నమోదు రైతుబీమా పథకానికి జిల్లాలో ఇప్పటి వరకు 1.69లక్షల మంది నమోదు చేసుకున్నారు. వీరికి ప్రభుత్వం ఏడాదికోసారి ప్రీమియం చెల్లించి రెన్యువల్ చేస్తూ వస్తోంది. గడిచిన ఏడేళ్లలో 7,135మంది రైతులు మరణించగా, వారి కుటుంబాలకు రూ.357.10కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ప్రస్తుతం జూన్ 5నాటికి కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతులు జిల్లా వ్యాప్తంగా ఐదారు వేల మంది ఉన్నట్లుగా వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. వీరు బీమా కోసం దరఖాస్తు చేసుకుంటే లబ్ధిదారుల సంఖ్య పెరగనుంది. అర్హతలు ఇవే.. జూన్ 5వ తేదీ నాటికి పట్టాదారుగా నమోదై ఉండాలి. 18–59 సంవత్సరాల వయసు ఉండాలి. రైతు, నామినీ ఆధార్ కార్డు, పట్టాదారు పుస్తకం జిరాక్స్ పత్రాలతోపాటు దరఖాస్తు ఫారాన్ని నేరుగా రైతువేదికల్లో ఏఈవోలకు సమర్పించాలి. పట్టా పుస్తకం రానివారు ఆన్లైన్లో డిజిటల్ సైన్ ఉన్నా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏడేళ్లుగా బీమా పొందిన రైతు కుటుంబాలు కొత్త దరఖాస్తులకు ఆహ్వానం జూన్ 5నాటికి పట్టాపాస్ పుస్తకాలు పొందిన రైతులకు అవకాశం ఈ నెల 13 వరకు గడువు ఏఈవోలను సంప్రదించాలి రైతుబీమా పథకాన్ని అర్హులైన ప్రతి రైతు సద్వినియో గం చేసుకోవాలి. కొత్త పట్టా పాసు పుస్తకాలు వచ్చిన వారు దరఖాస్తు చేసుకోవాలి. నేరుగా రైతు వేదికల్లోని ఏఈవోలను సంప్రదించాలి. – మేకల గోవింద్, జిల్లా వ్యవసాయాధికారి -
రాజకీయ దురుద్దేశంతోనే దుష్ప్రచారం
నిజామాబాద్ సిటీ: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద రాజకీయ కక్షతోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్యాలు ప్రచారం చేస్తూ, ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయకుండా రైతాంగానికి అన్యా యం చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మె ల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలి సి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని చివరి ఆయకట్టు వరకు మూడు పంటలకు సాగునీరివ్వాలన్న ఆలోచనతోనే కాళేశ్వ రం ప్రాజెక్టు నిర్మించామన్నారు. ప్రాజెక్టులోని చిన్న సమస్యను పరిష్కరించకుండా కొండంత చేసి దుష్ప్రచారం చేయడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకున్నదన్నారు. మేడిగడ్డను పండబెట్టి బనకచర్లకు గో దావరి నీళ్లను దోచిపెడుతూ తన గురువు చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి గురుదక్షిణ ఇచ్చాడని విమర్శించారు. కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్ర బాబు, బీజేపీ కలిసి ఇచ్చిన రిపోర్టునే జస్టిస్ ఘోష్ ఇచ్చారని, అది కోర్టులో చెల్లదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో సుంకిశాల గోడలు, ఎస్ఎల్బీసీ ట న్నెల్ కూలిపోయిందని, పెద్దవాగుకు గండపడినా సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై ఎందుకు విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్, హరీశ్‌రావులను ఎ లా బాధ్యులను చేస్తారన్నారు. 20 నెలల కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయ ని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ కేంద్ర సహాయమంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ ఘోష్ కమిషన్ ముందుకు వె ళ్లడం ఏమిటని ప్రశ్నించారు. బండి సంజయ్ బజా రు భాష మాట్లాడుతున్నారని, కేటీఆర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలకు సభ్యసమాజం సిగ్గుపడుతుందన్నారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రె డ్డి, మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, సత్యప్రకాశ్, సి ర్పరాజు, సుజిత్ సింగ్, దొన్కంటి నర్సయ్య, బాజిరెడ్డి రమాకాంత్, లక్ష్మీనర్సయ్య పాల్గొన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌పై రాజకీయ కక్ష అది ఘోష్ కమిటీ కాదు.. ఘోస్ట్ కమిటీ చంద్రబాబు మెప్పుకోసమే బనకచర్లకు నీళ్లు కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్‌ను టార్గెట్ చేశాయి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి -
చేపపిల్లల ఉత్పత్తి ప్రయోగం విఫలం
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువన ఉన్న జాతీయ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో చేపపిల్లల ఉత్పత్తి ప్రయోగం రెండుసార్లు విఫలమైంది. దీంతో సుమారు కోటి స్పాన్ ఉత్పత్తికి నష్టం ఏర్పడింది. ప్రస్తుత సంవత్సరం 54 లక్షల చేప పిల్లల ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకోగా అందుకు 2.4 కోట్ల స్పాన్ ఉత్పత్తి కావాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు 1.75 కోట్ల స్పాన్ మాత్రమే ఉత్పత్తి అవ్వగా, మిగతా స్పాన్ కోసం ఎకో హేచరీలో రెండుసార్లు ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం విఫలం కావడంతో స్పాన్ ఉత్పత్తి కావడం లేదు. దీంతో ప్రభుత్వ సొమ్ము వృథా అవుతోంది. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం కొరవడడం కూడా ఒక కారణంగా మత్స్యకారులు చెప్తున్నారు. ఉత్పత్తిపై అనుమానాలు చేపపిల్లల ఉత్పత్తికి జూలై, ఆగస్టు నెలలు అనుకూల సమయం. చెరువులు, ప్రాజెక్టుల్లో సహజ సిద్ధంగానే ఈ రెండు నెలల్లో చేపలు పిల్లలను ఉత్పత్తి చేస్తాయి. కానీ, ప్రతికూల వాతావరణం కారణంగానే స్పాన్ ఉత్పత్తి ప్రయోగం విఫలమైనట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో చేపపిల్లల ఉత్పత్తి అంశంపై ఉన్నతాధికారులు స్పందించాలని మత్స్యకారులు కోరుతున్నారు. 5 కోట్ల చేపపిల్లలు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న కేంద్రంలో ప్రస్తుతం 10శాతం కూడా చేపపిల్లల ఉత్పత్తి జరిగేలా లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు కోటి స్పాన్‌కు నష్టం ప్రస్తుత సీజన్లో రెండుసార్లు ఫెయిల్ ప్రతికూల వాతావరణమే కారణమంటున్న అధికారులు లక్ష్యాన్ని పూర్తి చేస్తాం ప్రస్తుతం వాతావరణం చల్లగా లేకపోవడంతోనే రెండుసార్లు చేపపిల్లల ఉత్పత్తి ప్రయోగం విఫలమైంది. సుమారుగా కోటి స్పాన్ ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. ప్రస్తుత సంవత్సర లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. ఐస్ వేసి చేపపిల్లల ఉత్పత్తి చేపడ్తాం. – దామోదర్, మత్స్య అభివృద్ధి అధికారి, పోచంపాడ్ -
రెడ్ నోటీస్
నిజామాబాద్కట్టడి చేసినా.. జిల్లాలో గంజాయి కట్టడికి పోలీసులు ఎంత ప్రయత్నం చేస్తున్నా.. స్మగ్లర్లు ఏదో ఒకవిధంగా తమ దందాను కొనసాగిస్తున్నారు. సోమవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 2025– 8లో uనిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దశాబ్దాలుగా పన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్న వారిపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 1996 నుంచి పన్ను చెల్లించని వారి జాబితాను రూపొందించారు. వివిధ కారణాలు చూపుతూ కోర్టుకు వెళ్లిన వారు.. నాటి నుంచి పాత, కొత్త పన్ను చెల్లించడం లేదు. అధికారులు ప్రశ్నిస్తే వ్యవహారం కోర్టులో ఉందంటూ తప్పించుకుంటున్నారు. అయితే రూ.26 కోట్ల మొండి బకాయిలను వసూలు చేసే లక్ష్యంతో అధికారులు శుక్రవారం నుంచి రెడ్ నోటీసులు జారీ చేస్తున్నారు. నిజామాబాద్ సిటీ: మొండి బకాయిలు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు తలకుమించిన భారంగా మారాయి. కోట్లాది రూపాయల వసూలుకాకపోవడంతో బల్దియా ఆదాయానికి గండిపడుతోంది. పలువురు బడా వ్యాపారులు కోర్టుల్లో కేసులు వేసి పన్నులు చెల్లించకుండా దర్జాగా వ్యాపారాలు చేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. బల్దియాకు చెల్లించాల్సిన పన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మొండి బకాయిలపై జిల్లా కలెక్టర్, ప్రత్యేక అధికారి వినయ్‌కృష్ణారెడ్డి బకాయి వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో పెండింగ్ పన్ను వసూళ్ల కోసం కమిషనర్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. కోర్టు కేసులంటూ.. అధికారులు పన్ను ఎక్కువ వేశారంటూ కొందరు కోర్టులో కేసులు వేశారు. అయితే తీర్పు రాకపోవడాన్ని సాకుగా చూపుతున్నారు. ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన పన్ను సైతం చెల్లించడం లేదు. నగరంలోని రెండు ప్రముఖ హోటళ్లే రూ.13 కోట్ల మేర చెల్లించాల్సి ఉందని తెలిసింది. వీరితోపాటు బహుళ అంతస్తుల భవనాలు, మల్టీప్లెక్స్‌లు, ఫర్నిచర్ షాపులు, ఆస్పత్రులు కూడా మొండి బకాయిల లిస్టులో ఉన్నట్లు తెలిసింది. పెద్దలను ఎందుకు వదిలేస్తారు.. సాధారణ పౌరులు బల్దియాకు పన్ను చెల్లించకుంటే ఇంటికి వచ్చి మరీ వసూలు చేస్తున్నారు. పెద్దవాళ్లని ఎందుకు వదిలేస్తున్నారు. స్టార్ హోటళ్లు, పెద్ద దుకాణదారులను ఉపేక్షించడం సరికాదు. అందరికీ ఒకే న్యాయం ఉండాలి. పన్ను రికవరీలో బల్దియా అధికారుల ఉదాసీనత సరికాదు. – వి.ప్రభాకర్, న్యూడెమోక్రసీ (మాస్‌లైన్) రాష్ట్ర నాయకుడుస్పెషల్ డ్రైవ్‌తో.. కార్పొరేషన్ పరిధిలో రూ. 26 కోట్లు పెండింగ్ బకాయిలున్నట్లు గుర్తించాం. చెల్లించాల్సిన వారికి రెడ్‌నోటీసులు జారీచేస్తున్నాం. గడువులోగా చెల్లించకుంటే కఠిన చర్యలు తప్పవు. అవసరమైతే సీజ్‌లు చేస్తాం. ప్రతి ఒక్కరూ విధిగా పన్ను చెల్లించాలి. ఎవరినీ ఉపేక్షించేది లేదు. – దిలీప్‌కుమార్, బల్దియా కమిషనర్1200 అసెస్మెంట్లు పన్ను చెల్లించకుండా తప్పించుకుంట్నువారిని బల్దియా రెవెన్యూ అధికారులు గుర్తించారు. వారిలో 1996 నుంచి పన్ను చెల్లించని వారి పేర్లు సైతం ఉన్నాయి. మొత్తం 1200 అసెస్మెంట్లను గుర్తించిన అధికారులు వారికి రెడ్ నోటీసులు అందజేస్తున్నారు. వారం రోజుల్లో పన్ను చెల్లించకుంటే చర్యలు తప్పవని, స్పందించని పక్షంలో సీజ్ చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కలెక్టర్ ప్రత్యేక దృష్టి బకాయి వసూళ్లపై కలెక్టర్, కార్పొరేషన్ ప్రత్యేక అధికారి వినయ్‌కృష్ణారెడ్డి దృష్టి సారించారు. కోర్టు కేసులంటూ తప్పించుకునేవారిని ఉపేక్షించొద్దని అధికారులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నోటీసులు ఇవ్వాలని, నోటీసులు తీసుకుని స్పందించని పక్షంలో కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఉన్నతస్థాయి నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో రూ.26 కోట్లు వసూలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. న్యూస్‌రీల్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌పై ప్రత్యేక దృష్టి 1996 నుంచి పన్ను చెల్లించని వారి జాబితా సిద్ధం రూ.26 కోట్ల మేర పాతబకాయిలు రెండు స్టార్ హోటళ్లు చెల్లించాల్సింది రూ.13 కోట్లు.. కోర్టు కేసులంటూ అసలుకే చెల్లించని వైనం కలెక్టర్ ఆదేశాల మేరకు నోటీసులిస్తున్న అధికారులు -
నులిపురుగులను నివారిద్దాం
నిజామాబాద్‌నాగారం/బోధన్ రూరల్: నులి పురుగులతో నెలల వయసు నుంచి పెద్దల వరకు ఇబ్బందులు పడుతుంటారు. ఇవి సులువుగా పొట్టలోకి చేరి హాని కలిగిస్తున్నాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ నెల 11న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం సందర్భంగా 1–19 ఏళ్లలోపు పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు వేయించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. నాలుగు లక్షలకు పైగా.. జిల్లాలో 1500 అంగన్వాడీ కేంద్రాలు, 1262 ప్రభుత్వ, 569 ప్రైవేటు పాఠశాలలున్నాయి. వీటితోపాటు కేజీబీవీ, మోడల్, సోషల్, బీసీ, ట్రైబల్, మైనార్టీ వెల్ఫేర్ విద్యాసంస్థలతోపాటు మదర్సాలున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో 1,10,032 మంది చిన్నారులుండగా, పాఠశాలలు, కళాశాలల్లో 2,95,411 మంది విద్యార్థులున్నారు. వీరందరికీ సోమవారం అల్బెండజోల్ మాత్రలను వైద్య సిబ్బంది వేయనున్నారు.మాత్రలు ఇలా వేసుకోవాలి 1– 2 సంవత్సరాల పిల్లలకు సగం మాత్రను పొడిగా చేసి నీటిలో కలిపి వేయించాలి. 2– 3 సంవత్సరాల పిల్లలకు ఒక మాత్రను పూర్తిగా పొడి చేసి కొద్దిగా నీటిని కలిపి వేయాలి. 3 –19 సంవత్సరాల పిల్లలకు ఒక మాత్రను బాగా చప్పరించి, నమిలి మింగేలా చూడాలి. భోజనం తర్వాతే ఈ మాత్ర వేయాలి. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు వేయొద్దు. అల్బెండజోల్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి జిల్లాలో 4లక్షలకుపైగా 1–19 సంవత్సరాల పిల్లలు నేడు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం -
భయపెడుతున్న చిరుత పులి
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ సిద్ధుల గుట్టపై మూడు నె లల క్రితం చిరుత సంచారం పట్టణ ప్రజలతోపాటు సందర్శకులను కంటి మీద కునుకులేకుండా చేసింది. తాజాగా గుట్టకు అతి సమీపంలోని పెద్దమ్మ ఆ లయ పరిసరాల్లో చిరుత సంచారం ప్రజలను కలవరపెడుతోంది. శుక్రవారం ఆలయానికి వచ్చిన భక్తులకు చిరుత కదళికలు భయాందోళనకు గురిచేశా యి. అంకాపూర్‌కు చెందిన ఓ గొర్రెల మంద నుంచి రెండు మేకలు కనిపించకపోవడం చిరుత సంచారానికి బలం చేకూర్చింది. విషయం తెలుసుకున్న ఫారెస్టు అధికారులు ఆదివారం చిరుత ఆనవాళ్ల కోసం కొండ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. కాగా, శనివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో ఆనవాళ్లేమీ కనిపించలేదు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లొద్దని అధికారులు సూచించారు. మొన్న సిద్ధుల గుట్టపై, ఇప్పుడు పెద్దమ్మ గుడి పరిసరాల్లో.. ఆర్మూర్ పట్టణ ప్రజల్లో కలవరం -
కట్టడి చేసినా.. గంజాయి సరఫరా..
మోర్తాడ్(బాల్కొండ): జిల్లాలో గంజాయి కట్టడికి పోలీసులు ఎంత ప్రయత్నం చేస్తున్నా.. స్మగ్లర్లు ఏదో ఒకవిధంగా తమ దందాను కొనసాగిస్తున్నారు. జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలోగల పలు గ్రామాలకు పొరుగు జిల్లాల నుంచి గంజాయి సరఫరా కొనసాగుతోంది. నిందితులను పోలీసులు పట్టుకుంటూ, గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నా స్మగ్లర్లు దందాను ఆపడం లేదు. ఇదీ పరిస్థితి.. బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో పొరుగు జిల్లాలైన జగిత్యాల్, నిర్మల్ల నుంచి గంజాయి స్మగ్లర్లు వచ్చి తమ దందాను కొనసాగిస్తున్నారు. తాజాగా కమ్మర్‌పల్లిలో పోలీసులు మెట్‌పల్లికి చెందిన నాంపల్లి వికాస్‌ను అతడికి సహకరిస్తున్న స్థానికుడైన షేక్ ఇమ్రాన్‌ను అరెస్టు చేయడం పరిశీలిస్తే పొరుగు జిల్లాల నుంచి గంజాయి దిగుమతి అవుతుందని వెల్లడవుతోంది. నాంపల్లి వికాస్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతడికి గంజాయి అందించేవారు ఎవరు? ఎంత మొత్తంలో సరఫరా చేస్తారు? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. గంజాయి దందాకు కీలకమైన వ్యక్తులను పట్టుకుంటేనే ఈ దందాను పూర్తిగా అంతమొందించవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కౌన్సెలింగ్ ద్వారానే మార్పు.. గంజాయికి బానిసలైన యువకులను గుర్తించి వారికి, వారి తల్లితండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తేనే గంజాయికి పూర్తిస్థాయిలో చెక్ పెట్టవచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది. గతంలో మోర్తాడ్ ఎస్సైగా పనిచేసిన సంపత్ గంజాయికి బానిసలైన వారితోపాటు వారి తల్లిదండ్రులను పోలీసు స్టేషన్‌కు రప్పించి అందరి సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఉన్నతాధికారులు స్పందించి కౌన్సెలింగ్ ద్వారానే యువతలో మార్పు తీసుకరావాలని పలువురు సూచిస్తున్నారు. పొరుగు జిల్లాల నుంచి బాల్కొండ నియోజకవర్గ గ్రామాలకు సప్లయ్ పోలీసులు పట్టుకుంటున్నా వెరవని స్మగ్లర్లు ఎవరు విక్రయించినా ఉపేక్షించం గంజాయిని ఎవరైన, ఎక్కడైన విక్రయిస్తే ఉపేక్షించేది లేదు. గంజాయి విషయంలో మా యంత్రాంగం సీరియస్‌గా ఉంది. గంజాయి విక్రయించేవారి గురించి సమాచారం ఇస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. ప్రజల సహకారంతోనే గంజాయిని నిర్మూలించడం సాధ్యమవుతుంది. – సత్యనారాయణ, సీఐ, భీమ్‌గల్ -
కళాశాలల్లో ‘మధ్యాహ్న భోజనం’ కలేనా?
నందిపేట్(ఆర్మూర్): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ‘మధ్యాహ్న భోజన పథకం’ కలగానే మిగిలిపోతుందేమోనని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని గతంలో ప్రతిపాదనలు పంపించినా ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కళాశాలలకు దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు, పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పరిస్థితి.. మారుమూల గ్రామాల నుంచి పేద విద్యార్థులు ఆర్టీసీ బసుల్లో, సైకిళ్లపై సమీప పట్టణాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు వచ్చి చదువుకుంటారు. దూరప్రాంతాల విద్యార్థులు ఇంటి నుంచి ఉదయం తొందరగా బయలుదేరితేనే కళాశాలకు సకాలంలో చేరుకుంటారు. ఈక్రమంలో కొందరు విద్యార్థులు ఇంట్లో ఉదయం టిఫిన్ తయారీతో ఆలస్యం కావడంతో టిఫిన్ బాక్స్‌లు తెచ్చుకోకుండానే కళాశాలకు వెళుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జూనియర్ కళాశాల తరగతులు నిర్విహిస్తుండటంతో వారు అర్ధాకలితో అలమటిస్తున్నారు. దీంతో విద్యార్థులు పూర్తిస్థాయిలో చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు. జిల్లాలో 31 కళాశాలలు.. జిల్లాలో 31 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నా యి. ఇందులో సుమారు 9850 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో కొందరు విద్యార్థులు మా త్రమే నిత్యం తమ ఇంటి వద్ద నుంచి టిఫిన్ బాక్సు లతోపాటు వాటర్ బాటిళ్లు తెచ్చుకుంటున్నారు. మి గిలిన వారు అర్ధాకలితోనే విద్యను కొనసాగిస్తున్నా రు. ప్రభుత్వం స్పందించి కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అమలుకు నోచుకోని పథకం ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు -
ఎస్సారెస్పీలోకి గుర్రపు డెక్క
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటితో పాటు గుర్రపు డెక్క కొట్టుకువస్తోంది. దీంతో ప్రాజెక్ట్ నీటిలో గుర్రపు డెక్క మొక్కలు భారీగా పేరుకుపోగా, కొన్ని ఆనకట్ట అంచున వచ్చిచేరాయి. గుర్రపు డెక్క పేరుకుపోతే ఆనకట్టకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుర్రపు డెక్కతో అనర్థాలు.. గుర్రపు డెక్క నీటిలో పెరిగే కలుపు మొక్క. ఇది వేగంగా పెరిగి నీటి వనరులను మూసుకు పోయే లా చేస్తుంది. దీని వలన నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడుతుంది. ప్రాజెక్ట్ అనకట్ట అంచున గురప్రుడెక్క పేరుకుపోతే రివిట్మెంట్లోకి నీరు అధికంగా వెళ్లి అనకట్టకు గండి పడే ప్రమాదం ఏర్పడుతుంది. చేపల పెంపకాననికి అంటకంగా మారుతుంది. దీని వలన అధికంగా దోమలు, ఇతర కీటకాలు పెరిగి నీటి నాణ్యతను దెబ్బతీస్తుంది. గుర్రపు డెక్క నీటిలో ఆక్సిజన్ స్థాయిలను తగ్గిస్తుంది. వ్యాధుల వ్యాప్తికి కారణమవుతుంది. ఒక్కసారి నాటుక పోతే తొలిగించడానికి చాలా ఖర్చు అవుతుంది. దీంతో ఆర్థికంగా కూడ తీవ్రంగా ప్రభావం చూపుతుంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఆనకట్ట అంచున పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలిగించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరదతోపాటు కొట్టుకువస్తున్న వైనం పట్టించుకోని అధికారులు ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం.. గుర్రపు డెక్క ప్రాజెక్ట్‌లోకి వరదల వలన కొట్టుకువస్తోంది. తొలిసారి రావడం ఆశ్చర్యంగా ఉంది. గుర్రపు డెక్క సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటుంది. గుర్రపు డెక్క పెరగక ముందే తొలిగించుటకు ఉన్నత అధికారులతో చర్చలు జరుపుతున్నాం. – చక్రపాణి, ఈఈ, ఎస్సారెస్పీ -
మద్యంమత్తులో యువకుడి వీరంగం
నిజామాబాద్ రూరల్: మండలంలోని గూపన్పల్లి గ్రామంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించి, ముగ్గురిపై దాడిచేసి గాయపర్చాడు. నిందితుడిని పోలీసులు పట్టుకొని రిమాండ్‌కు తరలించా రు. రూరల్ ఎస్‌హెచ్‌వో మహ్మద్ ఆరీఫ్ తెలిపిన వి వరాలు ఇలా.. గ్రామానికి చెందిన మదన్ అనే వ్యక్తి శనివారం రాత్రి కల్లుబట్టిలో మద్యం తాగి సమీపంలో గల అనిల్ అనే వ్యక్తి ఇంటి ఎదుట నిద్రించాడు. కొద్దిసేపటికి ఇంటికి చెందిన అనిల్, శైలేందర్లు ఇంట్లోకి వెళుతుండగా మదన్‌కు కాళ్లు తగలడంతో మేల్కొన్నాడు. దీంతో మదన్ వారితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం మదన్ పగిలిన కల్లుసీసాతో శై లేందర్ ఎడమచేతిని గాయపరిచారు. అనిల్, అతడి అక్క దీపిక అడ్డురావడంతో మదన్ వారిపై సైతం దాడిచేసి గాయపర్చారు. వెంటనే గ్రామ పెద్దలు ఘటన స్థలానికి చేరుకొని ఇరువురిని సముదాయించి అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటనపై బాధితులు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ముగ్గురిపై కల్లుసీసాతో దాడి నిందితుడిని రిమాండ్‌కు తరలించిన రూరల్ పోలీసులు -
క్రైం కార్నర్
డ్రెయినేజీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఖలీల్‌వాడి: నగరంలోని రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫారెస్ట్ ఆఫీస్ వద్ద గల డ్రెయినేజీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై సయ్యద్ ముజాహిద్ తెలిపారు. మురికి కాలువలో మృతదేహాన్ని ఆదివారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటన స్థలానికి వచ్చి పరిసరాలను పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని, అడి వయస్సు సుమా రు 40ఏళ్లు ఉంటాయని ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు వివరించారు. చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి ఖలీల్‌వాడి: నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఆరో టౌన్ ఎస్సై వెంకట్రావు తెలిపిన వివరాలు ఇలా.. నగరంలోని నెహ్రూనగర్ బస్టాండ్ దగ్గర నెల రోజుల క్రితం ఒక గుర్తుతెలియని వ్యక్తి అనారోగ్య సమస్యలతో అపస్మారక స్థితి లో పడిఉన్నాడు. అతడిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అతడిని చికిత్స నిమి త్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి వయస్సు సుమారు యాబై ఏళ్లు ఉంటాయని, ఎవరైనా అతడిని గుర్తిస్తే పోలీస్ స్టేషన్లో గాని, లేదా 8712659848, 8712659734కు సంప్రదించాలన్నారు. చోరీకి గురైన బైక్ రికవరీ సదాశివనగర్(ఎల్లారెడ్డి): చోరీకి గురైన బైక్‌ను నిందితుడి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా.. మండలంలోని పద్మాజివాడి చౌరస్తా వద్ద పోలీసులు ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటు చేసి, వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఓ వ్యక్తి అనుమానాస్పదంగా బైక్‌పై వెళుతుండగా పోలీసులు అతడిని ఆపారు. వివరాలు సేకరించగా బైక్‌ను చోరీ చేసి తీసుకువస్తున్నట్లు అతడు పేర్కొన్నాడు. వెంటనే పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకొని, వాహన యజమానికి సమాచారం అందించారు. పట్టుబడ్డ నిందితుడిని కామారెడ్డి పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. -
రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పతకాల పంట
కామారెడ్డి అర్బన్ : ఆదిలాబాద్‌లో ఈనెల 7, 8 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సీనియర్ యోగాసన పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. జిల్లాకు ఎనిమిది పతకాలు వచ్చాయని యోగా అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు యోగా రాంరెడ్డి తెలిపారు. డి.సురేందర్ బ్యాక్ బెండింగ్ విభాగంలో బంగారు, ట్రెడిషన్ విభాగంలో రజత పతకాలు సాధించారని పేర్కొన్నారు. సీహెచ్.రాజ్‌కుమార్ ట్విస్టింగ్, సుపైన్లో కాంస్యం, ఫార్వర్డ్ బెండింగ్‌లో వెండి పతకాలు, యు.అనిల్‌కుమార్ ఫార్వర్డ్ బెండింగ్‌లో కాంస్యం, సీహెచ్.తిరుపతి హ్యాండ్ బ్యాలెన్స్‌లో కాంస్యం, ఏ.రాజు ట్రెడిషన్ విభాగంలో వెండి పతకాలు సాధించారని తెలిపారు. మరికొందరు క్రీడాకారులు ప్రశంసా పత్రాలు అందుకున్నారన్నారు. -
ఉప్లూర్ చెరువులో మొసలి
కమ్మర్పల్లి: మండలంలోని ఉప్లూర్ నల్ల చెరువులో ఆదివారం ఉదయం మొసలి కనిపించడం కలకలం రేపింది. చెరువు మధ్యలో నీటిపై ఏదో కదులుతున్నట్లు కనిపించడంతో స్థానిక రైతుతు తమ సెల్‌ఫోన్ కెమెరాల్లో బంధించారు. మొసలి కావడంతో గ్రామ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేయడంతో ఈ విషయం కలకలం రేపుతోంది. చెరువు విస్తీర్ణం పెదద్దిగా ఉండడంతో మొసలి ఎటు వైపు ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. మూడు నాలుగు నెలల క్రితం కూడా చెరువులో మొసలి కనిపించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి మొసలిని పట్టుకొని బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు. రోడ్లపై నిలుస్తోన్న వాన నీరు ● కేకేవై రహదారిలో వాహనదారులకు ఇబ్బందులు కామారెడ్డి అర్బన్: కామారెడ్డి పట్టణం గుండా వెళ్లే కేకేవై (కరీంనగర్–కామారెడ్డి–ఎల్లారెడ్డి) వంద ఫీట్ల రోడ్డు కబ్జాలు ఒకవైపు, మరో వైపు ఉన్న రోడ్డుకు ఇరువైపులా డ్రెయినేజీలు నిర్మించకపోవడంతో రోడ్లపై నీరు నిలుస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంద ఫీట్ల కేకేవై రోడ్డు పట్టణంలో సిరిసిల్లరోడ్డు, స్టేషన్‌రోడ్డు, పోలీసు స్టేషన్, రైల్వే బ్రిడ్జి మీదుగా ఉంది. ఈ రోడ్డులో ఎక్కడికక్కడ అక్రమ కట్టడాలతో కబ్జా చేశారు. సిరిసిల్ల రోడ్డులో కేకేవై నుంచి రామేశ్వరపల్లి వెళ్లే జాతీయ రహదారి సర్వీసు రోడ్డు సైతం ఇలాగే వాన నీటితో నిండిపోయింది. జాతీయ రహదారి నిర్వాహకులు మూసుకుపోయిన మురికికాల్వల్లో మట్టిని తొలగించకపోవడంతో నీరు రోడ్డుపై నిలుస్తోంది. ఉన్నతాధికారులు స్పందించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అడవి పందుల దాడిలో మొక్కజొన్న పంట ధ్వంసం రాజంపేట : ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతుకు ఏదో ఒక రూపంలో కష్టాలు తప్పడం లేదు. రాజంపేట మండలం బస్వన్నపల్లి గ్రామంలోని రాజిరెడ్డి అనే రైతు తనకున్న రెండు ఎకరాల భూమిలో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నాడు. శనివారం రాత్రి అడవి పందులు మొక్కజొన్న పంటపై దాడి చేసి బీభత్సాన్ని సృష్టించాయి. దీంతో మొక్కజొన్న పంట మొత్తం నేలవాలింది. అడవి పందులు రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేసిన వాటి దాడుల నుంచి పంటను కాపాడుకోలేకపోతున్నామని బోరున విలపిస్తున్నారు. తూము గండికి మరమ్మతులు గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని గుజ్జుల్ డ్యాం ఎడమ కాలు తూముకు గండి పడి నీరు వృథాగా పోతున్న విషయం తెలిసిందే. నీటి పారుదల శాఖ అధికారులు రెండు రోజులుగా తూము గండిని పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం కూడ మరమ్మతు పనులు కొనసాగాయి. ఆయకట్టు పొలాల్లో నీరు చేరి పంటలకు నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
తీజ్ సందడి
మోపాల్ : మండలంలోని ఎల్లమ్మకుంటలో ఆదివారం తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. పెళ్లి కాని యువతులు 9 రోజులపాటు గోధుమబుట్టలకు ప్రత్యేక పూజలు చేశారు. చివరిరోజు గోధుమబుట్టలను ఊరేగింపుగా తీసుకెళ్లి స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేశారు. అంతకుముందు సేవాలాల్ మహరాజ్, జగదాంబ మాతా ఆల యాల్లో పూజలు చేసి, బోగ్‌భండార్ నిర్వహించా రు. వేడుకలకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటే ల్ కులాచారి, కాంగ్రెస్ ఆదివాసీ, గిరిజన జిల్లా చై ర్మన్ కెతావత్ యాదగిరి, జెడ్పీటీసీ మాజీ సభ్యు డు మోహన్ నాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధా న కార్యదర్శి నరేశ్ నాయక్, బుజ్జి రతన్, తండా నాయక్ జోర్సింగ్ , కారొబార్ ప్రకాశ్ ఉన్నారు. మాక్లూర్: మండలంలోని అమ్రాద్ తండా, మద న్పల్లితండా, సట్లాపూర్తండా, కృష్ణానగర్తండాలలో గిరిజనులు తీజ్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. గిరిజన యువతులు ముందుగా మొలకెత్తిన గోధుమ నారును నెత్తిన పెట్టుకుని సేవాలాల్ మందిరం వరకు ఊరేగింపుగా వెళ్లా రు. గిరిజన మహిళలు వారి సంప్రదాయ దుస్తుల ను ధరించి నృత్యాలు చేశారు. అనంతరం సేవాలాల్ మహరాజ్ మందిరం వద్ద నైవేద్యాలు సమర్పించి వన భోజనాలు చేశారు. -
ఏజెంట్ల మోసంపై విచారణ
మోర్తాడ్(బాల్కొండ): జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఏజెంట్ల మోసానికి గురికాగా, ఈ ఘటనపై భా రత విదేశాంగ శాఖ విచారణ ప్రారంభించింది. వివరాలు ఇలా.. వేల్పూర్ మండలం పడి గెల వాసి గంగాప్రసాద్ యూర ప్ వెళ్లే ప్రయత్నంలో ఏజెంట్ల మోసానికి గురై దుబాయ్‌లో మూడేళ్ల నుంచి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండిపోయాడు. ఏజెంట్లు బాధితుడి నుంచి రూ.8.77 లక్షలు వసూలు చేసి టోకరా వేసిన విషయం విధితమే. ఈ విషయంపై బాధితుడి తండ్రి భోజన్న ఇటీవల ప్రవాసీ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. మరోవైపు గంగాప్రసాద్ సామాజిక మాధ్యమం ద్వారా ఎంపీ అర్వింద్ కార్యాలయానికి ఫిర్యాదు చేశాడు. దీంతో రెండ్రోజుల క్రితం దుబాయ్‌లో ఉన్న గంగాప్రసాద్‌ను విదేశాంగశాఖ అధికారులు ఎంబసీకి పిలిపించుకున్నారు. వారు ఏజెంట్ల పేర్లు, వారి వివరాలను నమోదు చేసుకున్నట్లు బాధితుడు ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు. తన వీసా గడువు ముగిసిపోగా ఈ అంశంపై ఉన్నతాధికారులతో చర్చిస్తామని హామీ ఇచ్చారన్నారు. మరోవైపు ప్రవాసీ ప్రజావాణి లేఖ మేరకు విచారణ చేపట్టాలని వేల్పూర్ ఎస్సై సంజీవ్‌ను సీపీ సాయి చైతన్య ఆదేశించారు. దీంతో సదరు ఏజెంట్ల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ● దుబాయ్‌లో చిక్కుకున్న జిల్లావాసితో మాట్లాడిన ఎంబసీ అధికారులు ● వేల్పూర్లోనూ పోలీసుల ఆరా -
వృద్ధురాలి ఆత్మహత్య
సిరికొండ: మండలంలోని చీమన్‌పల్లి గ్రామంలో ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన చందాల లక్ష్మీ(63) అనే వృద్ధురాలు గత కొన్ని రోజుల నుంచి మానసిక స్థితి సరిగా ఉండటం లేదు. ఒంటరిగా నివసించడంతో తీవ్ర మనోవేదనకులోనై తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. హాస్టల్ వార్డెన్.. ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పట్టణంలోని ఎస్సీ కళాశాల బాలికల వసతి గృహం వార్డెన్ షబానా ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన షబానా గత సంవత్సరం ఆగస్టులో ఆర్మూర్‌లోని ఎస్సీ హాస్టల్లో విధుల్లో చేరింది. ఆర్మూర్ పట్టణంలోనే ఉంటూ విధులు నిర్వహిస్తుండేది. కాగ రెండు రోజులు సెలవులు రావడంతో ఆమె జగిత్యాలలోని ఆమె ఇంటికి వెళ్లింది. ఆమె స్వగృహంలో శనివారం సాయంత్రం ఉరి వేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది.ఈ ఘటనపై తోటి ఉద్యోగులు, హాస్టల్ విద్యార్థినులు విచారం వ్యక్తం చేశారు. -
అన్నివర్గాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం
నిజామాబాద్ సిటీ: దేశ స్వాతంత్య్ర పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమం కీలక ఘట్టమని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హుందాన్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో క్విట్ ఇండియా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ భవన్లో తాహెర్‌బిన్ జాతీయ జెండాను, నుడా చైర్మన్ కేశ వేణుతో కలిసి ఎగురవేశారు. యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ భవన్లో కాంగ్రెస్ జెండాను జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్‌గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో తాహెర్‌బిన్ మాట్లాడుతూ.. మహత్మాగాంధీ శాంతియుతంగా చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిషర్లను దేశం వదిలేలా చేసిందన్నారు. అన్నివర్గాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. ఈకార్యక్రమంలో నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్‌గౌడ్, నాయకులు నరాల రత్నాకర్, రామర్తి గోపి, నరేందర్‌గౌడ్, లవంగ ప్రమోద్‌కుమార్, మొయిన్, వంశీ, దినేశ్ తదితరులు పాల్గొన్నారు. -
గురుకులంలో విశ్వ సంస్కృత భాషా దినోత్సవం
మద్నూర్(జుక్కల్): భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిరూపం సంస్కృత భాష అని సంస్కృత భాష ప్రచార సమితి జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బి.వెంకట్ అన్నారు. మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం విశ్వ సంస్కృత భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. అన్ని భాషలకు సంస్కృతం అమ్మభాష అని అన్నారు. వేదాలు, పురాణాలు, శాస్త్రాలు, కావ్యాలు, రామాయణం, మహాభారతం తదితర గ్రంథాలు దేవనాగరిలిపిలో రచించబడ్డాయని చెప్పారు. భారతదేశంలో అనేక విశ్వవిద్యాలయాల్లో సంస్కృతం బోధిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ సంస్కృత భాషను ప్రేమించాలని, నేర్చుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులు సంస్కృత గేయాలు, సుభాషితాలను, శ్లోకాలను ఆలపించారు. పాఠశాల ప్రిన్స్‌పాల్ గంగాకిషోర్, ఉపాధ్యాయులు సుమన్, నరహరి, సంజీవ్, ఆశోక్, ప్రవీణ్, హన్మండ్లు, నరేష్, బస్వరాజు, విద్యార్థులున్నారు. -
పండుగ పూట విషాదం
నవీపేట: రాఖీ పండుగను పురస్కరించుకొని ఓ సోదరుడు అక్కతో రాఖీ కట్టించుకొని స్కూటీపై తిరిగి వస్తుండగా అనంత లోకాలకు వెళ్లిన ఘటన నవీపేట మండలం అబ్బాపూర్ (ఎం) శివారులో చోటు చేసుకుంది. ఎస్సై వినయ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా బాసరకు చెందిన వర్గంటి సాయినాథ్, కవితలకు కుమార్తె సాయిప్రియి, కుమారుడు సాయిబాబు అలియాస్ బబ్లూ(21) ఉన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాజుల్‌పేట్‌లో ఉంటున్న కవిత వద్దకు బబ్లూ రాఖీ పండుగ సందర్భంగా శనివారం ఉదయం స్నేహితుడు అరవింద్‌తో కలిసి స్కూటీపై వెళ్లాడు. అక్కతో రాఖీ కట్టించుకొని తిరిగి వస్తుండగా అబ్బాపూర్(ఎం)–జగ్గారావు ఫారమ్ మధ్యలో ముందు వెళ్తున్న కంటెయినర్‌ను ఓవర్టేక్ చేయబోయి దానిని ఢీకొన్నారు. ఈ ఘటనలో బబ్లూ కిందపడి తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అరవింద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడి మేనమామ బలగం రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.● రాఖీ కట్టించుకొని తిరిగి వెళ్తుండగా ప్రమాదం ● కంటెయినర్ ఢీకొని యువకుడి మృతి -
మెరుగైన వైద్య సేవలు అందించాలి
● డిచ్పల్లి సీహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్ డిచ్పల్లి: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. శనివారం డిచ్పల్లి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్, ఇన్ పేషంట్, జనరల్ వార్డు, ల్యా బ్ తదితర విభాగాల పనితీరును పరిశీలించారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీసిన కలెక్టర్ అటెండెన్స్ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా కృషి చేయాలని వైద్యులకు సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, రౌండ్ ది క్లాక్ ఆస్పత్రుల్లో అన్ని సమయాల్లో వైద్యులు, సిబ్బంది విధుల్లో ఉండాలని ఆదేశించారు. ప్రతీ నెల రెండో శనివారం ప్రత్యేకంగా నిర్వహించే ఆరోగ్యశ్రీ శిబిరానికి అన్ని విభాగాల స్పెషలిస్టు డాక్టర్లు హాజరయ్యేలా చూడాలని, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల పనితీరును ప్రతి రోజు పర్యవేక్షణ చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీని ఆదేశించారు. భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలి భూభారతి దరఖాస్తుల పై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. డిచ్పల్లి తహసీల్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యల గురించి తహసీల్దార్ సతీశ్‌రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
ఎస్సారెస్పీలోకి పెరిగిన వరద
బాల్కొండ: ఎస్సారెస్పీలోకి స్థానిక ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల వరద మరింత పెరిగింది. ప్రాజెక్ట్‌లోకి 14630 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 3 వేల క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 3 వేలు, లక్ష్మికాలువ ద్వారా 150, సరస్వతి కాలువ ద్వారా 300, అలీసాగర్ లిప్టు ద్వారా 180, గుత్ప లిప్టు ద్వారా 270, ఆవిరి రూపంలో 462, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగుల నీ రు కాగా శనివారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1078.40(40.8 టీఎంసీలు) అడుగుల నీటి ని ల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు. టీఎన్జీవీఏ నూతన కార్యవర్గం ఎన్నిక డొంకేశ్వర్: తెలంగాణ నాన్ గెజిటెడ్ వెటరినేరియన్స్ అసోసియేషన్ (టీఎన్జీవీఏ) నూతన కార్యవర్గం ఎన్నికై ంది. జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో శనివారం జరిగిన ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులుగా తిరుమల వినీత ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. కార్యదర్శి గా గంగరాజు, సహాధ్యాక్షుడిగా వినోద్, కోశాధికారిగా వెంకటి, ఉపాధ్యాక్షులుగా రమేశ్, ప ద్మావతి, నారాయణ, గంగాధర్, చంద్రశేఖర్ ఎన్నికయ్యారు.నూతన కార్యవర్గాన్ని టీఎన్జీవో స్ జిల్లా అధ్యక్షుడు సుమన్‌తో పాటు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బింగి సురే శ్,అభిషేక్ రెడ్డిలుసన్మానించి అభినందించారు. క్యాంపస్‌లో కొనసాగుతున్న తీజ్ ఉత్సవాలు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ లో శనివారం ఆరో రోజు తీజ్ ఉత్సవాలు కొనసాగాయి. ఈ సందర్భంగా తెయూ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు సాగర్‌నాయక్ మాట్లాడుతూ.. బంజారాల సంస్కృతి, సాంప్రదాయాలకు తీజ్ పండుగ ప్రతికగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో రవీందర్‌నాయక్, గిరిజనశక్తి విద్యార్థి సంఘం అధ్యక్షుడు శ్రీనురాథోడ్, సచిన్, మోహన్, రాము, రాజు, విద్యార్థినులు సంద్య, అశ్విని పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
దుస్తుల షాపు దగ్ధం మాక్లూర్: మండలంలోని ముల్లంగి(బి)లో శనివారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో బట్టల షాపు దగ్ధం కాగా సుమారు రూ. 12 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన నీరడి ప్రశాంతి నాలుగేళ్ల క్రితం గ్రామంలో కిరాణ షాపుతో పాటు బట్టల షాపును నిర్వహిస్తున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా పెద్ద మొత్తంలో చీరలు కొనుగోలు చేసి దుకాణంలో పెట్టారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారు జామున షార్ట్‌సర్క్యూట్ జరగడంతో షాపులో ఉన్న వస్తువులు, బట్టలన్నీ కాలిపోయాయి. ప్రమాద విషయమై తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ పంచనామా నిర్వహించినట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు కోరుతున్నారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం ఇందల్వాయి: మండలంలోని చంద్రాయన్పల్లి గ్రామ శివారులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై సందీప్ శనివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. చంద్రాయన్పల్లి శివారులోని జాతీయ రహదారి పక్కన కుళ్లిన స్థితిలో వ్యక్తి మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉందని, మృతుడి ఒంటిపై నెవీ బ్లూ కలర్ ప్యాంట్, తెల్లటి బనియన్, వైట్ అండ్ బ్రౌన్ చెక్స్ కలిగిన షర్ట్ ధరించి ఉన్నాడన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712659854 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్సై కోరారు. పేకాట స్థావరంపై దాడి తాడ్వాయి: మండల కేంద్రంలోని పేకాట స్థావరంపై దాడి చేసినట్లు ఎస్సై మురళి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రంలోని ఓ రేకుల షెడ్డు వద్ద పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో ఇద్దరిని పట్టుకోగా వారి నుంచి రూ. 1700 నగదును, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా పేకాట ఆడితే కేసులు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించారు. విద్యుత్‌షాక్‌తో మేకలు మృతి ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని అడివిలింగాల గ్రామ శివారులో విద్యుత్ షాక్ తగిలి రెండు మేకలు మృతి చెందినట్లు స్థానికులు శనివారం తెలిపారు. గ్రామంలోని మహ్మద్ సలీంకు చెందిన మేకలు గ్రామ శివారులో మేత మేస్తుండగా ట్రాన్స్ఫార్మర్కు సంబంధించిన విద్యుత్ తీగలు తగలడంతో షాక్ తగిలి మృతి చెందాయి. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి నష్ట పరిహారం అందేలా చూడాలని బాధితుడు కోరుతున్నాడు. యువకుడి అదృశ్యం మోపాల్: మండలంలోని నర్సింగ్‌పల్లికి చెందిన దుబ్బాక సాయితేజ అదృశ్యమైనట్లు ఎస్సై జాడె సుస్మిత శనివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాయితేజ విజయ్ రూరల్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. అక్కడే హాస్ట ల్లో ఉంటున్నాడు. సెలవుల కోసం నర్సింగ్‌పల్లికి వచ్చిన సాయితేజ ఆ తర్వాత హాస్టల్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. సుమారు రెండు నెలల నుంచి సాయితేజ కనిపించకపోవడంతో స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. తల్లి దుబ్బాక సావిత్రి ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
చోరీకి పాల్పడిన ముగ్గురి నిందితుల అరెస్ట్
మాక్లూర్: మండలంలోని కృష్ణనగర్‌లో ఇటీవల శ్రీహరి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ముగ్గురి నిందితులను మాక్లూర్ పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ రాజారత్నం తన చాంబర్లో నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 1న కృష్ణనగర్‌లో తాళం వేసి ఉన్న శ్రీహరి ఇంట్లో నిందితులు చోరీకి పాల్పడగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో శనివారం మాణిక్‌బండార్ చౌరస్తాలో అనుమానంగా తిరుగుతున్న ముగ్గురి నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారిని తమదైన శైలిలో విచారింగా కృష్ణనగర్‌లో చోరీకి పాల్పడింది తామేనని నిందితులు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి 4.8 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. పదివేల నగదు, రెండు ఫోన్లు, ఐదు బైక్‌లు, రూ. 50 వేలు విలువ చేసే రోల్డ్ గోల్ బంగారాన్ని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. పట్టుబడిన వారిలో కామారెడ్డి జిల్లాకు చెందిన చాకలి రాజు, కన్నె లింగం, మరొకరు నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం దూపల్లికి చెందిన నగేశ్ పోలీసులు గుర్తించారు. వీరు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన మాక్లూర్ ఎస్సై రాజశేఖర్‌ను ఏసీపీ అభినందించారు. -
విస్తృత స్థాయిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి
సుభాష్‌నగర్: గ్రామ పంచాయతీ భవనం మొదలు కుని రాష్ట్ర సచివాలయం వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, తద్వారా విద్యుత్ ఉత్పత్తి పెంచాలని రాష్ట్ర ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాద్‌లోని బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి శనివారం ఆయన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్, రెడ్కో సీఎండీ అనిల్ తదితరులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, ఆర్వోఎఫ్ఆర్ భూముల్లో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం అమలు, ఇరిగేషన్, దేవాదాయ తదితర శాఖల పరిధిలోని ఖాళీ భూములు, అవకాశమున్న చోట్ల సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు అన్నీ కూడా ఒకే నమూనాలో నిర్మించినందున సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుకూలమైన డిజైన్లను హైదరాబాద్ నుంచి ఎంపిక చేసి పంపిస్తామని తెలిపారు. ఏవైన మంచి డిజైన్లు ఉంటే, వాటిని పంపాలని సూచించారు. నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ పరిధిలో పెద్ద ఎత్తున ఖాళీ స్థలాలు ఉన్నాయని, వాటి వివరాలు సైతం పంపాలన్నారు. ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని జాప్యానికి తావు లేకుండా వారం రోజుల్లోపు వివరాలు పంపాలని సూచించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, టీజీ రెడ్కో డీఎం రమణ, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రవీందర్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లల్లో యూనిట్లు ఏర్పాటు చేయాలి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
ఖలీల్‌వాడి: వినాయక చవితి వేడుకల్లో ఎవరైన ని బంధనలు అతిక్రమిస్తే ఎంతటివారైన చర్యలు తప్పవని సీపీ పోతరాజు సాయి చైతన్య హెచ్చరించారు. నగరంలోని సీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని ఆయా పోలీస్‌స్టేషన్ ఎస్సైలకు తగిన ఆదేశాలు ఇప్పటికే జారీ చేశామన్నారు. గణేష్మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. విగ్రహాలను వివాదాస్పద స్థలాల్లో పెట్టవద్దని, ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండపాల వద్దకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తగిన పార్కింగ్ స్థలం కూడ ఎంపిక చేసుకోవాలన్నారు. పోలీసుల అను మతి లేనిదే మండపం పెట్టవద్దన్నారు. రాత్రి 10 తర్వాత డీజే సౌండ్స్ నిషేదం అన్నారు. మండపాలకు విద్యుత్ కనెక్షన్ కోసం సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు. డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఏసీపీలు రాజావెంకట్‌రెడ్డి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీశైలం, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
కిటకిటలాడిన బస్టాండ్
నిజామాబాద్ బస్టాండ్‌లో గుమిగూడిన ప్రయాణికులు నిజామాబాద్ బస్టాండ్ శనివారం ప్రయాణికులతో కిటకిటలాడింది. రాఖీ పండుగను పురస్కరించుకొని సోదరులకు రాఖీ కట్టేందుకు, కుటుంబ సభ్యులతో కలిసి పండుగ చేసుకోవడానికి తమ ఊర్లకు వెళ్లేందుకు మహిళలు భారీగా బస్టాండ్‌కు తరలివచ్చారు. బస్సుల కోసం ఎదురుచుస్తున్న ప్రయాణికులతో బస్టాండ్ సందండిగా మారింది. రద్దీ ఎక్కువ ఉండటంతో సీట్ల కోసం ప్రయాణికులు బస్సులు రాగానే ఎగబడ్డారు. మరికొందరూ కిటికీల నుంచి దూరి సీట్లను దక్కించుకున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
ఏదైనా స్ట్రెయిట్‌గా..
నిజామాబాద్‌అర్బన్: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా హవానే జోరుగా సాగుతోంది. ముఖ్యంగా సమాచార పంపిణీలో వాట్సాప్ అగ్రగామిగా నిలుస్తోంది. ప్రతి ఒక్కరూ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వాట్సాప్ వాడకం తప్పనిసరిగా మారిపోయింది. వాట్సాప్‌లోని స్టేటస్ ఫీచర్ ద్వారా ఒకరి అభిరుచులను, ఒకరి విషయాలను, ఒకరి చెడు, మంచి ఘటనలను తేలికగా తెలుసుకోగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ స్టేటస్‌పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ప్రతిభను కనబర్చినా.. చాలామంది తమ వ్యక్తిగత ప్రతిభ చాటడానికి స్టేటస్‌ను ఉపయోగించుకుంటున్నారు. విద్యా, ఉద్యోగం, క్రీడలు ఇలా ఎందులోనైనా వారు ప్రతిభ సాధించి ఉంటే అప్పటికప్పుడు స్టేటస్‌లో పోస్ట్ చేస్తున్నారు. లేదా వారి కుటుంబ సభ్యులు ఎవరు ప్రతిభ కనబర్చినా పోస్ట్ చేస్తున్నారు. ఈ పోస్టులు చూసినవారు వారిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. మనోభావాలను వ్యక్తపరుస్తూ.. కొందరు వారి మనోభావాలను తెలియజేసే విషయాలను ఎంపిక చేసుకొని స్టేటస్‌లో పోస్ట్ చేస్తున్నారు. చాలా మంది వారికి జరిగిన మంచి, చెడులను ఇతరులకు చెప్పేందుకు స్టేటస్‌ను ఆశ్రయిస్తున్నారు. అలాగే కొందరు ప్రతిరోజు ఉదయమే వారానికి తగ్గట్టు దేవుళ్ల ఫొటోలు, పాటలతో స్టేటస్ పెడుతుంటారు. ప్రత్యేక రోజులు, పండుగల్లోనూ శుభాకాంక్షలు తెలుపుతూ స్టేటస్ పెట్టేవారు కూడా చాలామంది ఉన్నారు. చూసేవారు ఎక్కువే.. వాట్సాప్‌ను ఉపయోగించే వారందరూ స్టేటస్‌లో వారికి నచ్చిన అంశాలను పోస్ట్ చేయడంతోపాటు ఇతరుల స్టేటస్‌ను చూస్తూ ఉంటున్నారు. ఐదేళ్ల క్రి తం వరకు వాట్సాప్ యాప్ ఉపయోగించే వారిలో పది నుంచి 20 శాతం మాత్రమే స్టేటస్ ఫీచర్‌ను ఉ పయోగించేవారు. ఇప్పుడు 80 శాతం మంది వర కు ఈ ఫీచర్‌ను చూస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు రోజుల్లో నాలుగైదు సార్లు స్టేటస్‌ను చూడందే నిద్రపోవడం లేదు. వారు పెట్టిన పోస్టులను ఎంతమంది చూశారు? ఎవరైన ప్రతి స్పందించారా అన్న ఆత్రుత కోసం వెతికేవారు ఎంతోమంది ఉన్నారు. ఇలా వారు పెట్టిన పోస్ట్‌కు ఎవరు స్పందించకపోతే తీవ్ర అసంతృప్తి గురయ్యే వారు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా వాట్సాప్ స్టేటస్‌తో వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వల్ల తమ భద్రతకు, వ్యక్తిగ త గోప్యతకు భంగం కలుగుతుందన్న విషయాన్ని కూడా గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు. తానేంటో తెలుపుతూ..స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. ఇటీవల కాలంలో వాట్సాప్ యాప్‌లోని స్టేటస్ ఫీచర్‌ను ఉపయోగించుకుంటున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఆధునిక టెక్నాలజీకి అలవాటు పడ్డ చాలా మంది స్టేటస్ పోస్ట్ పెట్టడం అనేది ఒక స్టేటస్‌గా భావిస్తున్నారు. ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ తదితర మాధ్యమాలు ఉన్నప్పటికీ ఎక్కువగా వాట్సాప్ స్టేటస్ వేదికగా వాడుకుంటున్నారు. తానేంటో తెలిపేందుకు, ఇతరుల విషయాలు తెలుసుకునేందుకు స్టేటస్ ముఖ్య భూమిక పోషిస్తుంది. రోజువారి జీవితంలో చేసే పనులను, వెళ్లిన ప్రదేశాలను వాట్సాప్ స్టేటస్‌గా పెడుతూ ఎప్పటికప్పుడు తాము ఉన్న స్థితిని తెలియజేస్తున్నారు. వ్యాపారానికి ప్రచారం..వ్యాపార అభివృద్ధికి సోషల్ మీడియా ఒక ప్రచార వేదికగా మారింది. అందులోనూ అందరూ ఎక్కువగా చూసే వాట్సాప్ స్టేటస్‌ను చాలామంది వ్యాపారులు తమ వ్యాపార అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటున్నారు. వ్యాపారం గురించి బ్రోచర్లు ముద్రించి స్టేటస్ లో పోస్ట్ చేస్తున్నారు. ఇక విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు పాఠశాలకు సంబంధించిన వివరాలను ప్రతిరోజు స్టేటస్‌లో ప్రదర్శిస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్, హోట ల్స్, వివిధ దుకాణాలు, మాల్స్ ఇలా అన్ని వ్యాపార రంగాల వారు తమ ఆఫర్లను, సర్వీసులను స్టేటస్‌లో పెడుతూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. -
నిరీక్షణ ఇంకెన్నాళ్లు..?
● పెండింగ్‌లోనే అభివృద్ధి పనుల బిల్లులు ● నిధుల కోసం ఎదురుచూస్తున్న మాజీ సర్పంచులు మోర్తాడ్(బాల్కొండ): గ్రామాల్లో గత సర్పంచులు చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు ఇప్పటికీ విడుదల కాలేవు. దీంతో వారు నెలల తరబడి నిధుల రాక కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఫిబ్రవరి 2024లో సర్పంచ్ల పదవీ కాలం ముగిసిపోయింది. అంతకుముందు నుంచే వారికి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. సర్పంచ్‌లుగా వ్యవహరించిన వారికి బిల్లులు మంజూరు చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాదిపాటు కాలయాపన చేసింది. అప్పట్లో ఆ పార్టీకి చెందిన వారే సర్పంచ్‌లుగా ఎ క్కువ మంది ఉండటంతో బిల్లుల గురించి అప్పటి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించలేకపోయారు. ప్రస్తు తం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా మాజీ సర్పంచ్ల బిల్లులకు మోక్షం లభించడం లేదు. జిల్లాలో రూ.15 కోట్లకు పైగా పెండింగ్.. జిల్లాలోని మాజీ సర్పంచ్‌లకు దాదాపు రూ.15 కో ట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అంచనా. 15వ ఆర్థిక సంఘం, ఎస్ఎఫ్సీ నిధులకు సంబంధించి బిల్లులు చేసి పంపినా ట్రెజరీల్లోనే చెల్లింపులు నిలిచిపోయాయి. కొందరు సర్పంచ్‌లకు టోకెన్లు జారీ చేసినా నిధులు లేకపోవడంతో ఖాతాల్లో సొమ్ము జ మ కావడం లేదు. తమ బిల్లుల కోసం మా జీ స ర్పంచ్‌లు అనేక మార్లు సచివాలయం, అసెంబ్లీ ము ట్టడికి పిలుపునిచ్చారు. ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడానికి యత్నించగా పోలీసులు ముందస్తు అరెస్టులతో అడ్డుకున్నారు. గత ప్రభుత్వాన్ని బిల్లుల కోసం ప్రశ్నించని నాయకులు ఇప్పు డు నిరసన తెలియజేస్తూ ఈ ప్రభుత్వం పరువు తీయాలని చూస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ముడుపులు ఇస్తామంటూ.. బిల్లులకు సంబంధించి పలువురికి టోకెన్లను ఆర్థి క శాఖ జారీ చేసింది. కాగా బిల్లుల చెల్లింపులు మొ త్తం హైదరాబాద్ నుంచి పెండింగ్‌లో ఉండటంతో ఒక్కో బిల్లుకు 18 శాతం వరకు ముడుపులు ఇస్తా మని ఉద్యోగులను ప్రలోభపెట్టాలని చూస్తున్నారు. కానీ మాజీ సర్పంచ్‌లు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకపోయింది. ఏదేమైనా మాజీ సర్పంచ్‌లు తమ బి ల్లుల కోసం నిరీక్షించక తప్పదని స్పష్టమవుతోంది. మోర్తాడ్ మండలం సుంకెట్ గ్రామ సర్పంచ్ కడారి శ్రీనివాస్ తన పదవీ కాలంలో పలు అభివృద్ధి పనులు చేపట్టగా, అందుకు సంబంధించి రూ.58 లక్షల బిల్లు ప్రభుత్వం నుంచి మంజూరు కావాల్సి ఉంది. అలాగే మోర్తాడ్ గ్రామ సర్పంచ్‌గా పని చేసిన ధరణికి కూడా పలు పనులకు సంబంధించి రూ.70 లక్షల బిల్లు మంజూరు కావాల్సి ఉంది. వీరి పదవీ కాలం ముగిసిపోయి ఏడాదిన్నర కాలం అవుతున్నా ఇప్పటికీ బిల్లులు మాత్రం రాలేదు. దీంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల మాజీ సర్పంచ్‌లకు సైతం బిల్లులు మంజూరు కాకపోవడంతో మానసిక వేదనకు గురవుతున్నారు.ప్రభుత్వం స్పందించాలి.. ప్రజలు మాపై నమ్మకంతో సర్పంచ్‌లుగా ఎన్నుకున్నారు. వారికి సౌకర్యాలను కల్పించడానికి అభివృద్ధి ప నులకు సొంతంగా అప్పులు చేసి పనులు పూర్తి చేశాం. రూ.లక్షల్లో అప్పులు చేసిన ఎంతోమంది వడ్డీ చెల్లించడానికి అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి. – కడారి శ్రీనివాస్, మాజీ సర్పంచ్, సుంకెట్ ఆస్తులు అమ్ముకుంటున్నారు.. సర్పంచ్‌లుగా పని చేసిన వా రికి రూ.లక్షల్లో బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో అప్పు లు తీర్చడం కోసం ఆస్తులు అమ్ముకుంటున్నారు. వడ్డీ భారంతో ఎంతో మంది అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే కొంతమంది మాజీ సర్పంచ్‌లు దిగులుతో మరణించిన విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి. – గడ్డం చిన్నారెడ్డి, మాజీ సర్పంచ్, తిమ్మాపూర్ -
స్టేటస్..
నిజామాబాద్ఆదివారం శ్రీ 10 శ్రీ ఆగస్టు శ్రీ 2025మనం ఆనందంలో ఉన్నా, కొత్త ప్రదేశానికి వెళ్లినా, మూవీకి వెళ్లినా, మంచి ఫుడ్ తిన్నా, బాధాకరమైన సమాచారం ఉన్నా, లేదా ఇంట్లోనే ఉన్నా, ఈ విషయాలను ఎవరికీ చెప్పకున్నా, వాట్సాప్ స్టేటస్‌లో ఫొటో కానీ, వీడియో కానీ పెట్టేస్తే అందరికీ తెలిసిపోతుంది. అలాగే ఎవరికై నా బర్త్‌డే, మ్యారెజ్ డే విషెస్, సంతాపం తెలపాలన్నా స్టేటస్‌లో పెట్టేస్తే, వారికి చెప్పకనే చెప్పేస్తుంది. ప్రస్తుత ఆన్లైన్ కాలంలో అన్నింటికీ ప్రచార వేదికగా వాట్సాప్ స్టేటస్ మారిపోయింది. న్యూస్‌రీల్ నేటి తరంలో క్రేజీ.. ప్రజలకు మరింత చేరువవుతున్న వాట్సాప్ స్టేటస్ ఫీచర్ ప్రతి నిత్యం తమ భావోద్వేగాన్ని పంచుకుంటున్న ప్రజలు మెరుగుపడుతున్న కమ్యూనికేషన్ -
సంక్షిప్తం
రజతోత్సవ మహాసభల్లో సత్యానంద్ నిజామాబాద్‌అర్బన్: కోల్‌కతలో ఈ నెల 8 నుంచి10వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రజతోత్సవ మహాసభలకు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి సత్యానంద్ హాజరయ్యారు. ఈ మహాసభల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి సుమారుగా 37 మంది ప్రతినిధులు హాజరుకాగా జిల్లా నుంచి డి. సత్యానంద్ పాల్గొన్నారు. మహాసభల్లో జాతీయ విద్యా విధానాన్ని పునరుద్ధరించాలని, మధ్యాహ్న భోజన స్లాబ్ రేట్స్ పెంచాలని, విద్యార్థులకు సరిపడా అన్ని రకాల స్టేషనరీ అందించాలన్న అంశలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. హైమాస్ట్ లైట్ల ప్రారంభం సిరికొండ: మండలంలోని తూంపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను బీజేపీ నాయకులు శుక్రవారం ప్రారంభించారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ మంజూరు చేసిన నిధులతో లైట్లను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. పార్టీ మండల ఉపాధ్యక్షుడు అన్నారం గంగామురళి, మండల కార్యదర్శి జినుక రాజేందర్, బూత్ అధ్యక్షుడు అరిగెల రమేశ్, సత్తూర్ రవి, బూస రాజు, గంగాధర్, రాజేశ్వర్, నరేశ్, రాజు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్యసమాజ్‌లో యజ్ఞం నిజామాబాద్ రూరల్: ఇందూరు ఆర్యసమాజ్‌లో శ్రావణమాస యజుర్వేద పారాయణ యజ్ఞములను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వరలక్ష్మి వ్రతాల సందర్భంగా రామగిరి సుదర్శన ముని సిద్ధిరాములు, కరిపె సూర్యప్రకాశ్, మల్లికార్జున, ప్రశాంత్ దంపతులు పూజలు చేశారు. వీడీసీల ఆగడాలను అరికట్టాలి నిజామాబాద్ అర్బన్: జిల్లాలో వీడీసీల ఆగడాలని అరికట్టాలని దళిత సంఘాల బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ప్రసాద్ శుక్రవారం డిమాండ్ చేశారు. ఇటీవల ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్‌లో మాదిగ కులస్తులను గ్రామ అభివృద్ధి కమిటీ బహిష్కరించడం అన్యాయం అన్నారు. ఆ గ్రామంలో మడిగెల పంపిణీ విషయంలో తలెత్తిన వివాదంలో వీడీసీ కులస్తులను బహిష్కరించి వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందకుండా చేయడం దారుణమన్నారు. వ్యవసాయ పనులు జరగకుండా, నిత్యావసర సరుకులు అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు స్పందించి వీడీసీ సభ్యులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. భూభారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి ఇందల్వాయి: భూభారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఆర్డీవో రాజేంద్ర కుమార్ అధికారులకు సూచించారు. ఇందల్వాయి తహసీల్ కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. భూభారతి రెవెన్యు సదస్సుల్లో రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆలస్యం చేయకుండా తొందరగా విచారణ చేపట్టి సమస్యలను వేగంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రేషన్‌కార్డుల దరఖాస్తులను విచారణ చేపట్టి అర్హులకు రేషన్‌కార్డులు అందేలా చూడాలన్నారు. తహసీల్దార్ వెంకట్రావు, డీటీ శైలజ, ఆర్ఐ మోహన్, సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్ పాల్గొన్నారు. -
వైభవంగా వరలక్ష్మి వ్రతశోభ
నిజామాబాద్ రూరల్/ డిచ్పల్లి: వరాలను అందించే వరలక్ష్మి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించారు. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో ఆడపడుచులు వైభవంగా వరలక్ష్మి వ్రతాలు చేశారు. దీంతో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పలు ఆలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో సామూహిక వ్రతాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. నగరంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, శివాజీనగర్‌లో ఉన్న గీత ఆలయం, న్యాల్కల్ రోడ్డులో ఉన్న లలితాదేవి ఆలయం, దుబ్బలో ఉన్న మహాలక్ష్మి ఆలయం, కోటగల్లిలో ఉన్న మార్కండేయ మందిరం, నల్లపోచమ్మ ఆలయం, వినాయక్‌నగర్‌లో ఉన్న భూలక్ష్మి ఆలయం, మారుతినగర్, నాందేవాడలో ఉన్న అమ్మవారి ఆలయాల్లో, డిచ్పల్లి మండల కేంద్రంలో, పోలీస్ బెటాలియన్‌లోని ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. -
హరిచరణ్లో జీవన్ దాత వందన ఉత్సవం
నిజామాబాద్ రూరల్: మార్వాడీ యువ మంచ్ నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో హరిచరణ్ మార్వాడీ హిందీ విద్యాలయంలో ‘జీవన్ దాత వందన ఉత్సవం’ నిర్వహించారు. స్కూల్లో విద్యార్థులు తమ తల్లిదండ్రుల పాదాలు కడిగి వారిని నమస్కరించారు. అనంతరం దుబ్బా ప్రాంతంలోని అక్షరధామ్ స్కూల్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో మార్వాడీ యువ మంచ్ అధ్యక్షుడు సందీప్ సార్డా, అఖిల భారతీయ మార్వాడీ యువ మంచ్ జాతీయ అధ్యక్షుడు సురేశ్ ఎం జైన్, ఆంధ్రా–తెలంగాణ మార్వాడీ యువ మంచ్ ప్రాంతీయ అధ్యక్షుడు మనీష్ నహర్, శ్రీకాంత్ ఝన్వర్, ఉదయ ఉపాధ్యాయ్, అనురాగ్ భంగడియా, రాఘవ ఉపాధ్యాయ్ పాల్గొన్నారు. -
ట్రీగార్డులు వృథాగా..
నేటి చిత్రంనిజామాబాద్ సిటీ: మొక్కల రక్షణ కోసం కొనుగోలు చేసిన ట్రీగార్డులను మున్సిపల్ అధికారులు వృథాగా పడేశారు. గతేడాది హరితహారం కార్యక్రమంలో కొనుగోలు చేసిన వీటిని పెద్ద సంఖ్యలో జోన్–2లోని గోల్హనుమాన్ శానిటేషన్ కార్యాలయంలో ఓ మూలన పడేశారు. ఓ పక్కన నాటిన మొక్కలు పశువులు తింటున్నాయి. మరోపక్క రూ. లక్షలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన ట్రీగార్డులను వృథాగా పడేశారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి. – రామగిరి శంకర్, కసాబ్‌గల్లి మీ ప్రాంతంలో నెలకొన్న సమస్యను, ఫొటోను మాకు వాట్సాప్‌లో పంపించండి. ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాము. నిజామాబాద్ అర్బన్ – 95531 30597 నిజామాబాద్ రూరల్ – 97053 46541 మాకు ఫొటో పంపండి -
అలుగు పారుతున్న చెరువులు
మోపాల్/ నిజామాబాద్ రూరల్: మోపాల్ మండలంలోని కాల్పోల్ ఊర చెరువు అలుగు పారుతోంది. గురువారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు అటవీ ప్రాంతాల గుండా వరద చెరువులోకి వచ్చి చేరుతోంది. అదే విధంగా మంచిప్ప పెద్ద చెరువుతోపాటు బాడ్సి, కంజర్, ముదక్పల్లి, సిర్పూర్, తదితర చెరువుల్లోకి కూడా వరద వచ్చి చేరుతోంది. ఊర చెరువు అలుగు పారడంతో అటవీ ప్రాంతంలో ఉన్న కాల్పోల్ వాటర్ ఫాల్స్ సందడిగా మారనుంది. రూరల్ మండలంలోని మల్కాపూర్ తండా చెరువు గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నిండుకుండలా మారి అలుగు పారుతోంది. దీంతో గ్రామస్తులు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
నిజామాబాద్ రూరల్: చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని రాష్ట్ర చేనేత గౌరవ అధ్యక్షుడు చెలివేరి గణేశ్ అన్నారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని చేనేత సహకార సంఘం భవనంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. చేనేత కార్మికులకు తక్కువ ధరకే వారు తయారు చేసే మెటీరియల్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుతాన్ని ఆయన కోరారు. అంతకుమందు పలువురు చేనేత కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సిలివేరి శంకర్, రాష్ట్ర సలహాదారులు కొండి రమేశ్, బీమర్తి రవి, బొట్టు వెంకటే్‌శ్, కార్మికులు, మహిళలు పాల్గొన్నారు. -
అటవీశాఖ అధికారులను సస్పెండ్ చేయాలి
మోపాల్: మండలంలోని బైరాపూర్ శివారులోని మోతీరాంనాయక్ తండాలో గిరిజనులు సాగు చేస్తున్న మొక్కజొన్న పంటపై గడ్డి మందు చల్లి ధ్వంసం చేసిన అటవీశాఖ అధికారులను సస్పెండ్ చేయాలని ఏఐబీఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామావత్ మోహన్ నాయక్ డిమాండ్‌చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి, అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీహరి నాయక్, చౌహన్ మోహన్ నాయక్, పీర్సింగ్, గంగాధర్, రవి రాథోడ్, బాలు నాయక్, ఇందల్, జలంధర్, గౌతమ్, కమలాజీ, రమేశ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. వసతిగృహ అధికారికి ఆర్థికసాయం నిజామాబాద్‌అర్బన్: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వసతి గృహ అధికారి రాజేందర్‌కు శుక్రవారం వార్డెన్ల సంక్షేమ సంఘం ఆర్థిక సహాయాన్ని అందించింది. కామారెడ్డి జిల్లా జుక్కల్ వసతి గృహాధికారిగా విధులు నిర్వహిస్తున్న రాజేందర్ ఈనెల 6న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ పరిస్థితి బాగా లేకపోవడంతో సంక్షేమ వసతి గృహ అధికారులు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు సుమన్, కార్యదర్శి శేఖర్ ఆధ్వర్యంలో సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సురేశ్ రూ. 80 వేల ఆర్థికసాయాన్ని అందించారు. కార్యక్రమంలో వసతి గృహాధికారుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మచ్చెందర్, టీఎన్జీవోస్ జనరల్ సెక్రెటరీ జాఫర్ తదితరులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి నిజామాబాద్ నాగారం: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని లయన్స్ క్లబ్ జిల్లా అదనపు కోశాధికారి లక్ష్మీనారాయణ అన్నారు. నగరంలోని వివేకానందనగర్ కాలనీలో శుక్రవారం వనమహోత్సవం నిర్వహించారు. కాలనీవాసులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.లింబాద్రి, పి.రాఘవేందర్, కోశాధికారి ఎ.రాజేందర్, జి.రామకృష్ణ రెడ్డి, గంగాదాస్, వెంకటరమణ, బాబుకృష్ణ, రాజశేఖర్, కాలనీవాసులు నర్సింహారెడ్డి, నర్సారెడ్డి, తుకారాం, విజయలక్ష్మి, శారద, రవి, కృష్ణ, నవీన్ కుమార్ పాల్గొన్నారు. ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు జక్రాన్‌పల్లి: ఆయిల్ పామ్ పంట సాగుతో అధిక లాభాలు పొందవచ్చని మండల వ్యవసాయ అధికారిణి దేవిక సూచించారు. శుక్రవారం మండలంలోని కొలిప్యాక్‌లో ఆయిల్ పామ్ పంట సాగు పై రైతులకు అవగహన సదస్సు నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు రాయితీ కింద డ్రిప్ సౌకర్యం పొందవచ్చని తెలిపారు. హార్టికల్చర్ అధికారి రాజు, ఏఈవో శివ ప్రసాద్, ప్రీ యూనిక్ కంపెనీ క్లస్టర్ ప్రతినిధి రాకేశ్, గ్రామ మాజీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. -
వర్సిటీ హాస్టల్ డిపాజిట్ ఫీజు తగ్గించాలి
తెయూ(డిచ్పల్లి): రాష్ట్రంలో ఏ ఇతర యూనివర్సిటీల్లో లేని విధంగా తెలంగాణ యూనివర్సిటీ హాస్టల్ డిపాజిట్ ఫీజులు ఆకాశన్నంటుతున్నాయని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేశ్ విమర్శించారు. శుక్రవారం తెయూ న్యూబాయ్స్ హాస్టల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు రూ.10 వేలు, నాన్ స్కాలర్షిప్, ఓసీ విద్యార్థులకు రూ.18వేల చొప్పున డిపాజిట్ వసూలు చేస్తున్నారన్నారు. వెంటనే వర్సిటీ ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజు, వర్సిటీ అధ్యక్షుడు జీషన్, ఉపాధ్యక్షులు నాగేంద్ర, నిరంజన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
డీఈవోకు వినతి
నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధ్యాయ పదోన్నతుల్లో స్వచ్ఛందంగా తమకు పదోన్నతి వద్దు అనుకునే వారికి నాటు విల్లింగ్ ఇచ్చి పదోన్నతి నుంచి తప్పుకునే అవకాశాన్ని కల్పించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమేశ్, గంగాధర్ కోరారు. డీఈవో అశోక్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మేతరి మల్లేశ్, శీను, ప్రతాప్, శ్రీనివాస్, లక్ష్మణ్, రవి, అశోక్, రవీందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ముర్రుపాలు పట్టించాలి జక్రాన్‌పల్లి: పుట్టిన బిడ్డకు ముర్రుపాలు పట్టించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ సునంద అన్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లిలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. పౌష్టికాహారంపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ గోడ గంగలక్ష్మి, కవిత, సవీణ ఏఎన్ఎం స్వరూపం, ఆశా వర్కర్ లత పాల్గొన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి నిజామాబాద్ రూరల్: విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని స్కిల్ డెవలప్మెంట్ ఎంప్లాయీమెంట్ ట్రెయినర్ గోపిక అన్నారు. నగరంలోని వాణి ఒకేషనల్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని రాఖీలు తయారు చేయించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ రమేశ్ గౌడ్, మహేశ్ కుమార్, ప్రిన్సిపాల్ స్వప్న, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆత్మీయ భరోసాను అమలు చేయాలి సిరికొండ: భూమి లేని పేదలకు ఇందిరా ఆత్మీయ భరోసాను వెంటనే అమలు చేయాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి కిశోర్ డిమాండ్ చేశారు. మండలంలోని గడ్కోల్‌లో జీపీ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శికి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. నాయకులు లింబాద్రి, కిరణ్, అనీస్, కిశోర్, కట్ట రాములు, ఎర్రన్న, రాములు, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు ప్ర‘యోగం’ ఎప్పుడో?
నందిపేట్(ఆర్మూర్): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రయోగాలు చేసే యోగం ఎప్పుడొస్తుందోనని ఎదురుచూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సర్కార్ బడులకు ఆరేళ్లుగా నిధులు విడుదల కాకపోవడం, సరిపడా సైన్స్ పరికరాలు లేకపోవడంతో విద్యార్థులు ప్రయోగ విద్యకు దూరమవుతున్నారు. అయినా సంబంధిత అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ‘ఉన్నత’ విద్యార్థుల కోసం.. జిల్లాలో 1042 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఇందులో 77,224 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైన్స్ విద్యను అందిచాలనే లక్ష్యంతో ప్రయోగశాలలు ఏర్పాటు చేసినా కొన్నేళ్లుగా నిధుల లేమితో లక్ష్యం నీరుగారుతోంది. విధిలేని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ఉన్న పరికరాలతోనే పాఠాలు బోధించి మమ అనిపిసున్నారు. 6వ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు సైన్స్ సబ్జెక్టులలో ఎక్కువ భాగం ప్రయోగాలతో కూడిన పాఠ్యాంశాలు ఉంటాయి. వాటిని ప్రయోగం చేసి చూపితే గాని అర్థం కాని పరిస్థితి. దీంతో ప్రయోగాత్మక బోధనపై సంబందిత సబ్జెక్టుకు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రయోగ పరికరాలు, రసాయనాల కొనుగోలుకు గతంలో విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అప్పట్లో అరకొర నిధులు మంజూరు చేయగా కొద్దిపాటి పరికరాలు కొనుగోలు చేశారు. కొద్దిపాటి పరికరాలతో ప్రయోగాలు సంపూర్ణంగా చేసే అవకాశం లేకపోవడంతో పలు పాఠశాలల్లో అవిసైతం మూలన పడ్డాయి. 2019 నుంచి.. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ద్వారా ప్రతి ఉన్నత పాఠశాలకు 2019లో రూ. 50వేలు, ప్రాథమిక పాఠశాలలకు రూ. 22వేలు విడుదల చేశారు. వీటి ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఆరేళ్ల క్రితం కొన్ని పరికరాలు కొనుగోలు చేశారు. ఫలితంగా పాఠశాలల్లో ప్రయోగాత్మక బోధన నిర్వహణ కష్టతరంగా మారింది. అందులో ఉన్న పరికరాలతో పాటు కాలం చెల్లిన రసాయనాలతో ఉపాధ్యాయులు, విద్యార్థులతో ప్రయోగాలు చేయిస్తూ మమ అనిపిస్తున్నారు. ప్రయోగాలపై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడంతో సైన్స్ పోటీలకు విద్యార్థులు దూరంగా ఉంటున్నారు. ఏటా ప్రభుత్వం నిర్వహించే సైన్స్‌ఫేర్, ఇన్స్‌స్పైర్ అవార్డుల్లో వెనుకబడుతున్నారు. ప్రతిభ ఉన్నా సరిపడా శిక్షణ, అవగాహన లేక విద్యార్థులు సత్తా చాటలేకపోతున్నారు. ఇప్పటికై నా విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రయోగాత్మక బోధనకు అవసరమైన పరికరాలు సమకూర్చాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కానరాని సైన్స్ పరికరాలు కొన్నేళ్లుగా విడుదల కాని నిధులునిధులు మంజూరు కాలేదు.. సైన్స్ పరికరాల కొనుగోలుకు నిధులు మంజూరు కాలేదు. నిధులు మంజూరు కాగానే పరికరాలు కొనుగోలు చేస్తాం. విద్యార్థులకు కావాల్సిన కొన్ని సైన్స్ పరికరాలను ఉపాధ్యాయులు తయారు చేసి అవగాహన కల్పిస్తున్నారు. – అవదూత గంగాధర్, ఎంఈవో, నందిపేట -
సీఎంసీ మోసంలో.. అసలు సూత్రధారులెవరూ?
షణ్ముకకు ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ సహకారం?● ప్రజాప్రతినిధులు అడిగినా లీజుకు ఇవ్వని సీఎస్ఐ మెదక్ డయాసిస్ పెద్దలు ● షణ్ముక మహాలింగానికి అనుమతులు ● పెట్టుబడుల రూపంలో వైద్యుల నుంచి రూ. కోట్లు వసూలు చేసిన షణ్ముక ● మోసపోయిన పలువురు జిల్లా డాక్టర్లు నిజామాబాద్‌నాగారం/ డిచ్పల్లి: డిచ్పల్లి మండ లం సుద్దపల్లి శివారులో గల సీఎంసీ (క్రిస్టియన్ మెడికల్ కాలేజ్) పున:ప్రారంభం పేరిట వైద్యులను మోసం చేసిన విషయంలో సూత్రధారులెవరనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. మాజీ ఐఏఎస్ పేరిట వై ద్యులను నమ్మించి, కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించి మోసం చేసిన షణ్ముక మహాలింగం వెనక ఎవరున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. పక్కా పథకం ప్రకారమే వైద్యుల డబ్బులకు ఎసరు పెట్టారనే చర్చ నడుస్తోంది. పేరు మార్చి తాత్కాలిక అనుమతులు సీఎంసీని పున:ప్రారంభిస్తామని, అందులో భాగంగా 50 పడకలతో ఆస్పత్రిని సైతం అందుబాటులోకి తేస్తామని గతేడాది ఏప్రిల్ 27న జిల్లా వైద్యారోగ్యశాఖలో డాక్టర్ ముద్దమాల ఇసాక్ అభిలాష్ పేరిట దరఖాస్తు చేశారు. మూడు నెలల్లో అన్ని వస తులు ఏర్పాటు చేసి, వైద్యులను నియమించుకొని సేవలు అందిస్తామని దరఖాస్తులో పేర్కొన్నా రు. దీంతో నిబంధనల ప్రకారం డీఎంహెచ్‌వో తాత్కాలికంగా మూడు నెలల అనుమతి ఇచ్చారు. కాగా, జూలై 26తో గడువు ముగియడం, ఎంసీఐ అను మతి రాకపోవడంతో మెడికల్ కాలేజీ ప్రారంభం కాలేదు. మళ్లీ ఈ ఏడాది మే 19న మరోసారి సీఎంసీ పున:ప్రారంభం కోసం సీఎస్ఐ మెడికల్ ట్రస్ట్ పేరిట డాక్టర్ విమల్‌కుమార్ సుకుమార్, డాక్టర్ ముద్దమాల ఇసాక్ అభిలాష్ దరఖాస్తు చేశారు. గ తంలో మాదిరిగానే మూడు నెలల్లో వసతులు, సౌ కర్యాలు కల్పిస్తామని వైద్యాధికారులతో పేర్కొన్నా రు. అయితే ప్రస్తుత డీఎంహెచ్‌వో అనుమతి ఇవ్వడానికి ససేమేరా అనడంతో పలువురితో ఒత్తిడి తీ సుకువచ్చారు. ఐఎంఏ ప్రతినిధులు వచ్చి విన్నవించడంతోపాటు 26 మంది వైద్యుల పేర్లతో కూడిన జాబితాను అందజేయడంతో తాత్కాలిక అనుమతులు ఇచ్చారు. ఆ గడువుకు కూడా ఈ నెల 18తో ముగియనుండడం గమనార్హం. తెరమీదకు రిటైర్డు ఐఏఎస్ పేరు.. దేశ, రాష్ట్రస్థాయిలో పలుకుబడి ఉన్న జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు అడిగినా లీజుకు ఇచ్చేందుకు సీఎస్ఐ మెదక్ డయాసిస్ మెడికల్ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఒప్పుకోలేదు. కానీ, కర్ణాటకకు చెందిన షణ్ముక మహాలింగం తాను రిటైర్డ్ ఐఏ ఎస్‌ను అని చెప్పుకోగానే లీజు ఒప్పందం చేసు కోవడం విస్మయం కలిగిస్తోంది. షణ్ముక మహాలింగంను ట్రస్ట్ సభ్యులు ఎలా నమ్మారో అర్థం కావడం లేదని స్థానిక క్రిస్టియన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నా రు. షణ్ముక మహాలింగంకు జిల్లాలోని వైద్యులతో నేరుగా సంబంధాలు ఉన్నాయా? లేదంటే ఇక్కడికి ఎలా వచ్చారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతేడాది దరఖాస్తు చేసిన ఇసాక్ అభిలాష్ మళ్లీ ఈసారి కూడా దరఖాస్తు చేసుకోవడం చూస్తే పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా జరిగిందనే అభిప్రాయా లు వినిపిస్తున్నాయి. డాక్టర్ అజ్జ శ్రీనివాస్‌కు డైరెక్టర్ పదవి ఇస్తామని చెప్పి అతడితో రూ.2.20 కోట్లు పెట్టుబడులు పెట్టించడంతోపాటు మరో 26మంది వైద్యుల నుంచి సుమారు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు షణ్ముక మహాలింగం వసూలు చేసినట్లు తెలుస్తోంది. సీఎంసీకి ఎంసీఐ అనుమతి నిరాకరణతోనే ఈ మోసాలన్నీ బయటకు రావడం గమనార్హం. అసలు షణ్ముకను ఇక్కడికి రప్పించిందెవరు? షణ్ముకకు ఢిల్లీలో మంచి సంబంధాలున్నాయని, ఎంసీఐ నుంచి మెడికల్ కళాశాలకు సులువు గా అనుమతి తీసుకువస్తారని జిల్లాలోని వైద్యులను నమ్మించిందెవరు? అనేది తెలియాల్సి ఉంది. ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెచ్చినా..దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హ యాంలో అప్పటి మంత్రి సుదర్శన్‌రెడ్డి వినతి మేరకు జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మంజూరు చేశారు. అప్పటికే డిచ్‌పల్లిలో ఉన్న సీఎంసీ మూడు సంవత్సరాలు నడిచిన తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) అనుమతి నిరాకరణతో మూతపడింది. అయితే హాస్పిటల్‌తోపాటు మెడికల్ కాలేజీకి అవసరమైన అన్ని వసతి సౌకర్యాలు ఉండటంతో ప్రభుత్వం లీజు ప్రతిపాదన చేసింది. కానీ, లీజు ఇవ్వడానికి మెదక్ డయాసిస్ ప్రతినిధులు నిరాకరించారు. దీంతో ప్రభుత్వ మెడిక ల్ కాలేజీని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరోసారి సీఎంసీ తెరమీదకు వచ్చింది. మాజీ ఎంపీ సీఎంసీ లీజుకు ఎంతగానో ప్రయత్నించినా సీఎస్ఐ మెడికల్ ట్రస్టు సభ్యులు నిరాకరించడంతో వీలు కాలేదు. ఖలీల్‌వాడి: సీఎంసీ పేరిట డాక్టర్ల వద్ద నుంచి రూ.కోట్లు నొక్కేసిన షణ్ముక మహాలింగానికి ఓ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ సహకరించినట్లుగా తెలుస్తోంది. కొన్నేళ్ల నుంచి ఇంటెలిజెన్స్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌కు తెలిసిన వారి ద్వారా షణ్ముక మహాలింగం పరిచయమయ్యాడు. దీంతో తన ఇంటి పక్కనే అతనికి ఓ ఇంటిని అద్దెకు ఇప్పించడంతో పాటు షణ్ముకకు కావాల్సిన వాటిని కానిస్టేబుల్ కుటుంబసభ్యులే చూసుకునేవారని తెలిసింది. షణ్ముక నిజామాబాద్ నుంచి సీఎంసీకి వెళ్లేందుకు ఓ కారు డ్రైవర్‌ను సైతం సమకూర్చినట్లు తెలుస్తోంది. కాగా, మూడు నెలలైనా షణ్ముక వేతనం చెల్లించకపోవడంతో సదరు డ్రైవర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సదరు కానిస్టేబుల్ తనకున్న పలుకుబడితో పీఎస్‌లో కేసును సెటిల్మెంట్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయినా జీతం డబ్బులు చెల్లించకపోవడంతో షణ్ముక ఇంటికి డ్రైవర్ తాళం వేయడంతో కానిస్టేబుల్ వెళ్లి సమస్యను పరిష్కరించినట్లు తెలిసింది. మాజీ డీఎస్పీతో పరిచయం సీఎంసీ పున:ప్రారంభిస్తున్నారని ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ నగరానికి చెందిన ఓ మాజీ డీఎస్పీకి షణ్ముకను పరిచయం చేసినట్లు తెలిసింది. దీంతో సదరు మాజీ డీఎస్పీతో తరుచూ టాచ్‌లో ఉండేవారని తెలుస్తోంది. సీఎంసీకి సంబంధించిన వివరాలను కానిస్టేబుల్ సమక్షంలోనే వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. దీంతో మాజీ డీఎస్పీకి సీఎంసీలో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారనే చర్చ జరుగుతోంది. నెల క్రితమే పోలీసుల విచారణ! కర్నాటకకు చెందిన షణ్ముక మహాలింగంను నెల క్రితం పోలీసులు విచారణ చేసినట్లు తెలిసింది. మాజీ ఐఏఎస్ అధికారిని అని చెప్పుకున్నట్లు వ చ్చిన ప్రచారంపై పోలీసులు ఆరా తీయగా, నకిలీ ఐఏఎస్‌గా విచారణలో తేలినట్లు సమాచారం. కా గా, పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో ష ణ్ముక మహాలింగం వెంటే ఇంటెలిజెన్స్ కానిస్టేబు ల్ సతీమణి ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆమెను పోలీసులు ప్రశ్నించగా, సీఎంసీలో ఉద్యోగిగా పని చేస్తున్నానని, తన భర్త ఇంటెలిజెన్స్‌లో పని చేస్తార ని చెప్పినట్లు తెలుస్తోంది. ఏదైనా తన భర్తే చూసుకుంటారని చెప్పినట్లు పోలీస్‌వర్గాల్లో చర్చ జరుగుతోంది. డిచ్పల్లి పోలీసులు షణ్ముకను తీసుకువెళ్లినప్పుడు సైతం ఆమె వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. విచారణ అనంతరం డిచ్పల్లి పీఎస్‌లో షణ్ముకపె చీటింగ్ కేసు నమోదైంది. ఏదేమైనా ఈ కేసులో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. తాత్కాలిక అనుమతి ఇచ్చాం జిల్లాలో ఏ ఆస్పత్రి ఏర్పాటు చేసినా తాత్కాలికంగా మూడు నెలల అనుమతి ఇవ్వడానికి ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం మూడు నెలల్లో పూర్తిస్థాయిలో వైద్యులు, వసతులు ఏర్పాటు చేయించాలని తాత్కాలిక అనుమతులు ఇచ్చాం. మూడు నెలల్లో నిబంధనల ప్రకారం ఫీజును డీడీ రూపంలో చెల్లించి, అన్నీ పక్కాగా ఉంటే అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. లేకుంటే రద్దు చేస్తాం. మరో 10 రోజులు తాత్కాలిక అనుమతుల గడువు ఉంది. దీనిపై పోలీసు అధికారులు అడిగితే సమాచారం కూడా పంపించాం. – రాజశ్రీ, జిల్లా వైద్యాఽధికారి -
సెర్ప్ సీఈవోకు ‘కమ్మర్పల్లి’ పిండివంటలు
కమ్మర్పల్లి: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో మ హిళా సమాఖ్య సభ్యులు తయారుచేసిన పిండి వంటలు రాష్ట్ర రాజధానికి చేరాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సె ర్ప్) రాష్ట్ర ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) దివ్య దేవరాజన్‌కు శుక్రవారం ఐకేపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కమ్మర్పల్లి ఎర్గట్ల ఏపీఎం కుంట గంగాధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. శాఖలో బదిలీల ప్రక్రియ పూర్తి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కమ్మర్పల్లి సమాఖ్య సభ్యులు వనజ ‘పెద్దమ్మ తల్లి హోమ్ ఫుడ్స్’ పేరుతో తయారుచేసిన పిండి వంటలను వారు ఆమెకు అందజేశారు. మహిళా సంఘం ద్వారా రుణం పొంది ఉపాధి పొందుతున్న సభ్యులు తయారుచేసిన లడ్డులను అందించడంతో ఆమె సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఏపీఎం కుంట గంగాధర్ వెల్లడించారు. మహిళా సంఘ సభ్యులు తయారుచేసిన పిండివంటలకు విస్తృత ప్రచారం లభించేలా చూడాలని అధికారి పేర్కొన్నట్లు వెల్లడించారు. రాష్ట్ర జేఏసీ నాయకులు ఏపూరి నర్సయ్య, బాణాల రాజారెడ్డి, మహేష్, జానయ్య, యాదగిరి, రాజప్ప తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్లో రాఖీల కొనుగోళ్ల సందడి
నిజామాబాద్ రూరల్/సాక్షి ఫొటోగ్రాఫర్, నిజామాబాద్: నిజామాబాద్ నగర మార్కెట్లో రాఖీల కొనుగోళ్లతో సందడి నెలకొంది. రాఖీ పౌర్ణమి(రక్షాబంధన్) సందర్భంగా మహిళలు, యువతులు వివిధ రకాల రాఖీలు, స్వీట్లు కొనుగోలు చేయడానికి శుక్రవారం నగరానికి భారీగా తరలివచ్చారు. గత వారం రోజులుగా రాఖీల విక్రయాలు కొనసాగుతుండగా, పండుగ సమీపించడంతో నగరంలోని ప్రధాన చౌరస్తాలు, దుకాణాల్లో రద్దీ నెలకొంది. కుమార్గల్లి, పెద్దబజార్, గాయత్రినగర్చౌరస్తా, వినాయక్‌నగర్, కంఠేశ్వర్లలో దుకాణాలు పెట్టి వ్యాపారాలు సాగే అన్నిచోట్లా సందడి నెలకొంది. మార్కెట్లో రకరకాల రాఖీలు అందుబాటులో ఉండగా, కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. సోదర, సోదరీమణుల అనుబంధానికి ప్రతీక.. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. శ్రావణ పౌర్ణమి రోజున ఈ పర్వదినాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఎక్కడెక్కడో ఉన్న సోదరసోదరీమణులు పండుగ పూట తప్పకుండ కలుసుకుంటుంటారు. సోదరులకు సోదరీమణులు రాఖీలు కట్టి, మురిసిపోతారు. సోదరులు వారికి తోచిన కట్నం అందించి, వారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఆనందంగా ఉంటుంది.. రాఖీ పౌర్ణమి రోజున తమ్ముడికి రాఖీ కడితే చాలా సంతోషంగా ఉంటుంది. ఏటా రాఖీ పౌర్ణమి నాడు తమ్ముడికి రాఖీకడుతాను. ఈ పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తాను. – నిక్షిత, ధర్మారంపుట్టింటికి వెళ్లాల్సిందే.. అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే బంధం అనిర్వచనీయమైంది. మా తమ్ముడికి చిన్నప్పటి నుంచి రాఖీ కడుతున్నాను. పండుగ రోజు ఖచ్చితంగా పుట్టింటికి వెళ్లి, తమ్ముడికి రాఖీ కట్టాల్సిందే. – లక్ష్మీ, బర్ధిపూర్ -
కమ్మర్‌పల్లిలో గంజాయి పట్టివేత
కమ్మర్పల్లి: మండలంలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను భీమ్‌గల్ సీఐ సత్యనారాయణ శుక్రవారం కమ్మర్పల్లి పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ అనిల్‌రెడ్డి, సిబ్బంది కలిసి కమ్మర్‌పల్లిలోని మెట్పల్లి రోడ్లోగల రైస్‌మిల్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో స్కూటీపై ఇద్దరు వ్యక్తులు కమ్మర్పల్లి వైపు వస్తుండగా, పోలీసులు వారిని తనిఖీ చేయగా 4 గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. వెంటనే వాటిని స్వాధీనం చేసుకొని సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు. వారిని జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన నాంపల్లి వికాస్, కమ్మర్‌పల్లికి చెందిన షేక్ ఇమ్రాన్‌గా గుర్తించారు. గంజాయిని కమ్మర్‌పల్లిలో విక్రయించడానికి తీసుకువస్తున్నామని, ఇంతకుముందు కూడా వికాస్ వద్ద గంజాయి కొనుగోలు చేసి కమ్మర్‌పల్లిలో విక్రయించానని షేక్ ఇమ్రాన్ ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. పట్టుకున్న గంజాయి 20 గ్రాములు ఉందన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఎస్ఐ అనిల్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ మహ్మద్ అప్సర్ సిబ్బంది రాజ్‌కుమార్, లక్ష్మణ్‌గౌడ్,, నవీన్‌చంద్ర, లక్ష్మణ్నేత, గణపతినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ఇందల్వాయి: మండలంలోని రూప్లనాయక్ తండా వద్ద గల జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఎస్సై సందీప్ తెలిపిన వివరాలు ఇలా.. తండాకు చెందిన తుంగర్ బాలాజి(50) స్థానిక హోటల్లో పని చేస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి అతడు రూప్లానాయక్ తండా నుంచి దేవి తండాకు నడుచుకుంటూ హైవేపై వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కొడుకు పవన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.ఆలయంలో చోరీ ఖలీల్‌వాడి: నగరంలోని సాయిబాబా ఆలయంలో దొంగతనం జరిగినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి వెండి కిరీటం, ఇత్తడి సాయిబాబా విగ్రహం, ఇత్తడి సామగ్రి అపహరించినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం ఆలయ అర్చకులు గుడికి వెళ్లగా, చోరీని గుర్తించి పోలీసుకలు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి వారు చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడి కిడ్నాప్ మోపాల్: మండలంలోని ముదక్పల్లి తండాకు చెందిన కెతావత్ హరీష్ (17) కిడ్నాప్‌నకు గురైనట్లు ఎస్సై జాడె సుస్మిత శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా.. తండాకు చెందిన హరీష్‌కు అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో వారిని మందలించాడు. ఈక్రమంలో వివాహితను ఆమె భర్త ఈనెల 5న రాంచంద్రపల్లిలోని తల్లిగారింట్లో వదిలేసి వచ్చాడు. 7న సదరు వివాహిత హరీష్‌కు ఫోన్ చేయడంతో అతడు నిజామాబాద్ వెళ్లాడు. అప్పటి నుంచి అతడు తిరిగి ఇంటికి రాలేడు. దీంతో బాలుడి సోదరి హరీష్ కిడ్నాప్‌కు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. దాబాపై పోలీసుల దాడి నిజామాబాద్ రూరల్: మండలంలోని గుండారం శివారులో గల దాబాపై గురువారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఎలాంటి అనుమతి లేకుండా దాబాలో, బెల్టుషాపులో లిక్కర్ అమ్మకాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్‌హెచ్‌వో మహ్మద్‌ఆరీఫ్ తెలిపారు. ఈ దాడిలో ఆరు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు వివరించారు. పేకాడుతున్న పలువురి అరెస్టు పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలో పేకాట స్థావరంపై గురువారం రాత్రి పోలీసులు దాడి చేసి పేకాడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి వద్ద నుంచి రూ.4,320 నగదు, 7 సెల్ ఫోన్లు, 2 బైకులతో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. రుద్రూర్ మండలంలో.. రుద్రూర్: మండలంలోని రాణంపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్టు ఎస్సై సాయన్న తెలిపారు. వీరి వద్ద నుంచి రూ. 4510 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్సై వివరించారు. రెంజల్ మండలంలో.. రెంజల్(బోధన్): మండలంలోని సాటాపూర్ శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురిని పట్టుకున్నట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 8470 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
బ్రహ్మాజివాడిలో ఒకరి ఆత్మహత్య
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని బ్రహ్మాజివాడి గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామాస్తులు తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన జోలే శ్రీకాంత్‌రావు(30) కామారెడ్డిలో ఓ ప్రయివేటు జాబ్ చేస్తున్నాడు. అతడికి వివాహం జరిపించడానికి కుటుంబ సభ్యులు గత కొన్ని సంవత్సరాల నుంచి పెండ్లి సంబంధాలు చూస్తున్నప్పటికీ కుదర లేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన శ్రీకాంత్‌రావు శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి రాజేశ్వర్‌రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకొని, మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒకరు.. బాన్సువాడ రూరల్: ఆత్మహత్యకు యత్నించిన ఓ వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. వివరాలు ఇలా.. మండలంలోని చిన్నరాంపూర్ గ్రామం పులికుచ్చ తండాకు చెందిన జప్పిబాయి (60) అనే వృద్దురాలు గత కొన్ని సంవత్సరాలుగా మతిస్థిమితం కోల్పోయింది. ఈక్రమంలో ఈనెల 7న ఆమె పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్సనిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. మృతురాలి కుమారుడి ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
లక్ష్మి ఆయకట్టులో జోరుగా వరినాట్లు
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి లక్ష్మికాలువ ద్వారా నీటి విడుదలతో ఆయకట్టు రైతు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు నీరు లేక రైతులు వరినాట్లు వేయలేదు. ప్రస్తు తం ఎస్సారెస్పీ నుంచి సాగునీరు విడుదల కావడంతో వరినాట్లు జోరందుకున్నాయి. కాలువ ద్వారా 200 క్యూసెక్కుల నీరు ప్రవహించడంతో లక్ష్మికాలువ చివరి ఆయకట్టు డీ–4 కాలువ వరకు నీటి సరఫరా జరుగుతోంది. డీ–3పై నిర్మించిన వేంపల్లి ఎత్తిపోతల పథకం నుంచి సైతం నీటి విడుదలను శుక్రవారం ప్రారంభించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీటి విడుదలతో రైతుల హర్షం -
రైతుబజార్లను సద్వినియోగం చేసుకోవాలి
● నగరంలో మార్కెట్లను పరిశీలించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● రోడ్లపై కూరగాయలు విక్రయించడంతో ఆగ్రహం ● అమృత్ 2.0 పనుల పరిశీలన నిజామాబాద్ సిటీ: ఇందూరు వాసుల కోసం జిల్లా కేంద్రంలో కేటాయించిన రైతుబజార్లను సద్వినియోగం చేసుకోవాలని, వాటిని ప్రజలకు అందు బాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవా లని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్‌తో కలిసి కలెక్టర్ నగరంలో పర్యటించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు బజార్లను వర్తకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పులాంగ్ వద్దనున్న రైతుబజార్, డీఎస్ మా ర్కెట్‌ను పరీక్షించారు. వీక్లీ మార్కెట్, సుభాష్‌నగర్, శివాజీనగర్ ప్రాంతాలలో రోడ్లమీద కూరగాయలు విక్రయించడంపై అసహనం వ్యక్తం చేశారు. మెప్మా ఆధ్వర్యంలో నిర్మించి వృథాగా ఉన్న మినీ మార్కెట్లను పరిశీలించి వా టిని వినియోగంలోకి తేవాలన్నారు. పాత గంజ్‌లో కొనసాగుతున్న మార్కెట్‌ను చూశారు. ఖలీల్వాడిలో నిర్మిస్తున్న సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణాలను పరిశీలించి మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడారు. రోడ్ల పక్కన కూరగాయల అమ్మకంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుందని స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కూరగాయలు, పండ్ల విక్రేతలు రోడ్ల పక్కన కాకుండా రైతుబజార్లలో అమ్మకాలు జరిపేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు సూచించారు. రైతు బజార్ల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్, మార్కెటింగ్ శాఖల అధికారులను ఆదేశించారు. ఆక్రమణలను గుర్తించి, వాటిని తొలగించేందుకు డీ–మార్కింగ్ చేయాలన్నారు. అనంతరం అమృత్ 2.0 పథకంలో భాగంగా నాందేవ్‌వాడ, గౌతంనగర్లలో చేపడుతున్న మంచినీటి ట్యాంకుల నిర్మాణ పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. నాగారం 300 క్వార్టర్స్‌లోని బస్తీ దవాఖానను కలెక్టర్ సందర్శించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ ఈఈ మురళీ మోహన్ రెడ్డి, డీఈలు సుదర్శన్‌రెడ్డి, ముస్తాక్ అహ్మద్, రషీద్, ఏఈ పావని, ఇనాయత్ కరీం, ఏసీపీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
బాధ్యతల స్వీకరణ
బోధన్‌టౌన్(బోధన్): బోధన్ మున్సిపల్ కమిషనర్‌గా రాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం బల్దియా కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాపై సిబ్బంది ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. బల్దియాకు వచ్చే ఆదాయంతోపాటు బల్దియాకు రావాల్సిన బకాయిలపై శ్రద్ధచూపాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని వెల్లడించారు. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి బల్దియా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. గంటల తరబడి తిప్పాల్సిందే.. బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి లక్ష్మి కాలువ ద్వారా నీటి విడుదల చేపట్టలన్నా.. నీటి విడుదల పెంచాలన్నా.. తగ్గించాలన్నా గంటల తరబడి గేట్లను తిప్పాల్సిందే. లేదంటే గేట్లు లేవవు, దిగవు. గేట్లకు కరెంట్ సరఫరా లేకపోవడంతో సిబ్బంది చేతులతోనే వాటిని ఎత్తుతున్నారు. శుక్రవారం నీటి విడుదల పెంచడం కోసం ఉదయం 7గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు గేట్లను తిప్పితే 200 క్యూసెక్కులకు నీటి విడుదల పెరిగింది. గంటల తరబడి గేట్లను తిప్పడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్‌ను కలిసిన సుధాకర్‌గౌడ్ నిజామాబాద్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం ఓవర్సీస్ కాంగ్రెస్‌పార్టీ ఉపాధ్యక్షుడు సుధాకర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కులగణన విజయవంతంగా పూర్తిచేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు యత్నిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి, ఏఐసీసీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. బీసీ ప్రజల తరపున ఓవర్సీస్ కాంగ్రెస్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. -
సుభాష్‌నగర్‌లో అగ్నిప్రమాదం
ఖలీల్‌వాడి: నగరంలోని సుభాష్ నగర్‌లోగల ఓ ఇంటీరియర్ షాప్‌లో శుక్రవారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగిందని ఫైర్ ఆఫీసర్ శంకర్ తెలిపారు. షాపు నుంచి పొగలు రావడంతో స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని ఫైరింజన్‌తో మంటలను అర్పివేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 20 వేల వరకు ఆస్తినష్టం జరిగినట్లు తెలిపారు. హత్య కేసులో నిందితుడి అరెస్టు మోర్తాడ్(బాల్కొండ): మోర్తాడ్ మండలం దొన్కల్‌లో ఒకరిని హత్య చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు భీమ్‌గల్ సీఐ సత్యనారాయణ తెలిపారు. మోర్తాడ్ పోలీసు స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దొన్కల్లోని వడ్డెర కాలనీలో జూన్ 26న ఒల్లెపు నాగరాజు, షేక్ రహమాన్‌తో మద్యం సేవిస్తూ ఘర్షణ పడ్డారు. ఈక్రమంలో రహమాన్‌ను నాగరాజు కర్రతో కొట్టగా అతడు మృతిచెందాడు. అప్పటి నుంచి నిందితుడు నాగరాజు పరారీలో ఉన్నాడన్నారు. విశ్వసనీయ సమాచారం రావడంతో నాగరాజును పట్టుకొని, రిమాండ్‌కు తరలించినట్లు సీఐం తెలిపారు. ఎస్సై రాము, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇసుక టిప్పర్ల పట్టివేత రుద్రూర్: మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో శుక్రవారం తెల్లవారుజామున రెండు ఇసుక టిప్పర్లను పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాటిని పోలీస్‌స్టేషన్ తరలించినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. సిరికొండ మండలంలో.. సిరికొండ: మండలంలోని గోప్యతండా పరిధిలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై రామకృష్ణ శుక్రవారం తెలిపారు. గడ్డమీదితండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు తమ ట్రాక్టర్లలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తుండగా పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
క్రీడలతోనే మానసికోల్లాసం
నిజామాబాద్ నాగారం: క్రీడలతోనే మానసికోల్లాసం కలుగుతుందని, క్రీడల ద్వారానే విద్యార్థులు మానసికంగా, శారీరకంగా ధృడంగా తయారవుతారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్లో శుక్రవారం ఇందూర్ ఫుట్‌బాల్ అకాడమీ ఆధ్వర్యంలో టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై, పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో క్రీడాకారులకు సరైన సౌకర్యాలతో కూడిన మినీ స్టేడియం కావాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానన్నారు. ఇందూర్ బిడ్డలు జాతీయ, అంతర్జాతీయ, ఒలింపిక్స్ స్థాయిలో రాణించి జిల్లాకు మరింత పేరుప్రతిష్టలు తీసుకురావాలన్నారు. నాయకులు ఎర్రం సుదీర్, నాగోళ్ళ లక్ష్మినారాయణ, కృష్ణ తదితరులు ఉన్నారు. -
స్టేడియం ఊసేదీ..?
సౌకర్యాలు అంతంత మాత్రమే.. అంతంతమాత్రం సౌకర్యాల మధ్యే పలువురు క్రీడాకారులు ప్రతిరోజూ ప్రాక్టీస్ చేసి ఎదిగారు. పలువురు వర్ధమాన క్రీడాకారులు సైతం ఇదేరీతిలో ప్రాక్టీస్ చేస్తుండడం గమనార్హం. జిల్లాలో గత కొన్నేళ్లుగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేసిన దాఖలాలు లేవు. క్రీడాకారుల కోసం కోచ్‌లను సైతం నియమించలేదు. అయినప్పటికీ ఆణిముత్యాల్లాంటి క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటారు. ఇప్పటి వరకు అందరూ పాత కలెక్టరేట్ మైదానంలోనే ఇబ్బందులు పడుతూ ముందుకెళుతున్నారు. ఈ ఒక్క మైదానంలోనే హకీ, బాక్సింగ్, కబడ్డీ, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, ఉషూ, ఖోఖో, వాలీబాల్ తదితర క్రీడలకు సీనియర్ క్రీడాకారులు శిక్షణ ఇస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి, పతకాలతో దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన ప్రతిభావంతమైన క్రీడాకారులు ఉన్న జిల్లా నిజామాబాద్. ఇక్కడ క్రీడాకారులను మరింతగా ప్రోత్సహించేందుకు గాను స్టేడియం, ఇండోర్ స్టేడియం నిర్మాణం చేయాలనే డిమాండ్లు ఏళ్లుగా ఉన్నాయి. ● ఒక అడుగు ముందుకు.. పది అడుగులు వెనక్కి ● ఇండోర్ స్టేడియం విషయంలోనూ ఇదే పరిస్థితి ● సౌకర్యాలు లేకున్నా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు ● పాత కలెక్టరేట్ మైదానంలో ఎల్బీ స్టేడియం తరహాలో నిర్మించాలని ప్రజల డిమాండ్ ● మెడికల్ కళాశాల గ్రౌండ్‌గా ఎంసీఐకు చూపిస్తున్నట్లు చర్చ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నగరం నడిబొడ్డున ఉన్న పాత కలెక్టరేట్ స్థలంలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం తరహాలో నిర్మించాలని ప్రజలు, క్రీడాభిమానులు కోరుతున్నారు. ఇప్పటివరకు ప్ర భుత్వం నుంచి ప్రోత్సాహం అంతంత మాత్రమే ఉన్నప్పటికీ పలువురు క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై అద్భుత ప్రతిభ కనబరిచారు. కాగా, ప్ర భుత్వం నుంచి తగిన సౌకర్యాలు, సహకారం లభించకపోతుండడంతో ప్రతిభ ఉన్నప్పటికీ అనేకమంది ఔత్సాహిక క్రీడాకారులు వెనుకబడిపోతున్నారు. సర్వే పూర్తయినా.. స్టేడియం నిర్మాణం కోసం 2024 నవంబర్ 11న సర్వే పూర్తిచేశారు. నిధుల మంజూరే ఆలస్యమని కీలక నాయకులు ప్రకటనలు చేశారు. కానీ, అది మళ్లీ పది అడుగులు వెనక్కి వెళ్లినట్లు జిల్లాలో చర్చ జరుగుతోంది. పాత కలెక్టరేట్ మైదానాన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాల గ్రౌండ్ కోసం కేటాయించినట్లు ఇప్పటికే ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)కు చూపినట్లు, దీంతో ఇందులో స్టేడియం నిర్మాణం సాధ్యం కాదని చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో స్టేడియం మంజూరు అనేక అడుగులు వెనక్కి వెళ్లినట్లు సమాచారం. ● సర్వే మేరకు ఈ మైదానంలో 8 లేన్లతో 400 మీటర్ల సింథటిక్ ట్రాక్, ఉత్తర దక్షిణాలకు 188 మీటర్లు, తూర్పు పడమరకు 125 మీటర్లు ఉండేలా ప్లాన్ చేశారు. లైన్ వెడల్పు 1.22‘‘బ్లేన్స్‘‘2=19.52 మీటర్లు, కర్వ్ డిస్టెన్స్(వంపు దూరం) 36.50‘‘2=73.00 మీటర్లు, లెంగ్త్ ఆఫ్ స్ట్రెయిట్ 84.39‘‘1=84.39 మీటర్లు, ఫ్రీ జోన్ 05మీ‘‘2=10.00 మీటర్లు, మొత్తం 186.91 మీటర్లతో నిర్మించేందుకు అంచనాలు తయారు చేశారు. విడ్త్ విషయానికి వస్తే లైన్ విడ్త్ 1.22‘‘బ్లేన్స్‘‘2=19.52 మీటర్లు, కర్వ్ డిస్టెన్స్ 36.50‘‘2=73.00 మీటర్లు, లాంగ్ జంప్ కోసం 9 మీటర్ల వెడల్పు, ఫ్రీ జోన్ 5 మీటర్లు+10 మీటర్లు = 15 మీటర్లు ఉండేలా మొత్తం 116.52 మీటర్లతో ప్లాన్ తయారు చేశారు. ● పాత కలెక్టరేట్ మైదానంలో స్టేడియం సమీపంలోని స్థలంలో ఇండోర్ స్టేడియం నిర్మించాలనే డిమాండ్లు ఏళ్లుగా ఉన్నాయి. లోపల ఫుట్‌బాల్ మైదానంతోపాటు దాని చుట్టూ 400 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఏర్పాటు, మరోవైపు బాస్కెట్‌బాల్ కోసం, మరో వైపు బాక్సింగ్ ఇండోర్ స్టేడియం, ఉషు, కబడ్డీ, బ్యాడ్మింటన్, వాలీబాల్ ఇండోర్ స్టేడియాలు నిర్మించాలని డిమాండ్లు ఉన్నాయి. ఇక స్టేడియం చుట్టూ కమర్షియల్ కాంప్లెక్స్ షెట్టర్లు నిర్మించి నిర్వహణ కోసం ఆదాయం రాబట్టుకోవచ్చు. ● తగిన సౌకర్యాలు, ప్రభుత్వ కోచ్‌లు, ప్రోత్సాహం లేకున్నప్పటికీ అంతర్జాతీయ పతకాలు సాధించిన ఆణిముత్యాలైన క్రీడాకారులు నిజామాబాద్ జిల్లాలో ఉన్నారు. బాక్సింగ్‌లో హుస్సాముద్దీన్, నిఖత్ జరీన్, హాకీలో యెండల సౌందర్య, ఫుట్‌బాల్ క్రీడలో గుగులోత్ సౌమ్య అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు. జిల్లాకు చెందిన ఎతెసామ్ భారత ఆర్మీ బాక్సింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ● నగరం నడిబొడ్డున క్రీడా స్టేడియంతో కూడిన మైదానాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తూ అథ్లెటిక్స్ జాతీయ మెడలిస్ట్, ఉస్మానియా యూనివర్సిటీ రికార్డ్ హోల్డర్ సయ్యద్ ఖైసర్ 2010లో మూడు రోజులపాటు నిరాహార దీక్ష చేశారు. అదేవిధంగా నగరంలో స్టేడియం కోసం 4 కిలోమీటర్ల మేర రన్నింగ్ చేశాడు. ఒక్క స్టేడియంతో అనేకమంది క్రీడాకారులు.. నగరంలో స్టేడియం, ఇండోర్ స్టేడియం నిర్మిస్తే అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటే క్రీడాకారులను భారీ సంఖ్యలో తయారు చేయొచ్చు. మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో జిల్లా నుంచి ఎందరో క్రీడాకారులు ఉన్నతంగా ఎదుగుతున్నారు. క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలోనే పతకాలు సాధించినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా మధ్యలోనే ఆపేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం సహాయ సహకారాలు అందించి క్రీడాభివృద్ధికి కృషి చేయాలి. – సయ్యద్ ఖైసర్, జాతీయ అథ్లెటిక్స్ గోల్డ్ మెడలిస్ట్, శిక్షకుడు క్రీడాకారులకు, కోచ్‌లకు గుర్తింపు ఇవ్వాలి.. నగరంలో స్టేడియం కోసం వేలాది క్రీడాకారులు ఎదు రుచూస్తున్నారు. తగిన సౌకర్యాలు కల్పించనప్పటి కీ మావంతుగా క్రీడాకారులకు శిక్షణనిస్తున్నాం. నాలాంటి ఎంతో మంది కోచ్‌లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా కోచ్‌లను అభినందించలేదు. ఫుట్‌బాల్ విషయంలో క్రీడామైదానం లేకుంటే ఖాళీ స్థలాలను అద్దెకు తీసుకుని మరీ శిక్షణ ఇస్తున్నాను. పతకాలు సాధించిన తరువాత ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. – నాగరాజు, ఫుట్‌బాల్ కోచ్ -
ఇలా వచ్చి.. అలా వెళుతున్నారు
● ఆర్‌అండ్‌బీలో ఉన్నతాధికారుల పరిస్థితి ● బాధ్యతలు స్వీకరించిన కొన్ని నెలలకే పదవీవిరమణ ● ఇన్చార్జి అధికారులతో నెట్టుకొస్తున్న వైనంనిజామాబాద్నాగారం: జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ శాఖలో కీలక అధికారులు వచ్చిన కొన్నినెలలకే పదవీ విరమణ చేస్తుండటంతో ఆయా పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. దీంతో ఇన్చార్జి అధికారులతో పాలనను నెట్టుకొస్తున్నారు. ఈక్రమంలో ఎప్పడు అధికారులతో నిండుగా ఉండే జిల్లాకేంద్రంలోని కార్యాలయం ఖాళీల కారణంగా బోసి పోతుంది. ముఖ్యమైన పోస్టులు ఖాళీ.. ఆర్‌అండ్‌బీలో ప్రధానంగా ఎస్ఈ, ఈఈ, డిప్యూటీ ఎస్ఈ మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటీతో పాటు ఎస్ఈ కార్యాలయంలో సూపరింటెండెంట్ పోస్టు ఖాళీగా ఉంది. శాఖలో బాల్కొండ, ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ ఐదు సబ్ డివిజన్లున్నాయి. బాల్కొండ సబ్ డివిజన్‌కు డిప్యూటీ ఈఈ లేకపోవడంతో ఆర్మూర్ సబ్ డివిజన్ డిప్యూటీ ఈఈకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఒక్కో సబ్ డివిజన్‌కు ఒక్కో ఏఈ మాత్రమే ఉండడంతో తమపై పనిభారం పెరుగుతోందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఆర్‌అండ్‌బీలో పోస్టులను భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు.ఇదీ పరిస్థితి..నిజామాబాద్ జిల్లా ఆర్అండ్బీ శాఖలో ఎస్ఈగా విధులు నిర్వహించిన సత్యనారాయణరెడ్డి ఇటీవల పదవీ విరమణ చేశారు. గత నెలలో డిప్యూటి ఎస్ఈ సైతం కొన్ని రోజులు ఈఈగా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. ఈఈగా సురేష్ ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేశారు. అనంతరం డిప్యూటీ ఈఈ శ్రీమాన్ ఇన్చార్జి ఈఈగా వ్యవహారించి ఏప్రిల్ 30న పదవీ విరమణ చేశారు. ఆ తర్వాతా డిప్యూటీ ఎస్ఈ కూడా ఇన్చార్జిగా వ్యవహరించి వీడ్కోలు పలికారు. సత్యనారాయణరెడ్డి కంటే ముందు ఎస్ఈగా విధులు నిర్వహించిన హన్మంత్‌రావు 6 నెలలు గడవకముందే సీఈగా పదోన్నతి పొంది, పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. -
పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలి
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ల పనులను, ఇతర అభివృద్ధి పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో గురువారం ఆయన అదనపు కలెక్టర్ అంకిత్‌తో కలిసి విద్యుత్, మున్సిపల్ అధికారులు, ఆర్అండ్బీ, హౌసింగ్, పంచాయతీ రాజ్ తదితర శాఖల ఇంజినీరింగ్ అధికారులతో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అర్బన్ ఏరియాలల్లో పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను పూర్తిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జీజీహెచ్‌లో మరమ్మతులు కూడా వెంటనే పూర్తి చేయించాలని ఆదేశించారు. పనులపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి డబుల్ బెడ్రూం ఇళ్లు, అసంపూర్తి పనులపై అధికారులతో సమీక్ష -
ఆయిల్‌పామ్‌తో అధిక లాభాలు
డొంకేశ్వర్(ఆర్మూర్): అధిక దిగుబడి, మంచి మ ద్దతు ధరతో గణనీయమైన లాభాలను అందించే ఆయిల్‌పామ్ పంటను సాగు చేసేందుకు జిల్లా లోని ఆదర్శ రైతులు ముందుకు రావాలని కలెక్ట ర్ వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సందర్భంగా, సహకార సంఘం ఎరువుల గోడౌన్ వద్ద స్థానిక రైతులతో భేటీ అయ్యారు. ఆయిల్‌పామ్ సాగు చేపట్టిన నూత్పల్లి గ్రామ ఆదర్శ రైతు గోపిడి గంగారెడ్డి క లెక్టర్ సమక్షంలో తన స్వీయ అనుభవా లను తో టి రైతులకు తెలియజేశారు. కలెక్టర్ మాట్లాడు తూ.. గంగారెడ్డిని అభినందించారు. ఇతర రైతు లు కూడా ఇదే స్ఫూర్తితో ఆయిల్‌పామ్ సాగును చేపట్టి ఆర్థిక పరిపుష్టి సాధించాల ని అన్నారు. ఈ పంట సాగుకు జిల్లాలో అనుకూ ల పరిస్థితులు ఉన్నాయని, ప్రభుత్వం పెద్ద ఎత్తు న రాయితీలతో కూడిన ప్రోత్సాహకాలను అందిస్తోందని వివరించారు. సాగుకు ముందుకు వచ్చే రైతులకు అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామన్నారు. -
శతాధిక వృద్ధురాలు మృతి
బోధన్‌రూరల్: మండలంలోని పెంటాకుర్దు గ్రా మానికి చెందిన శతాధిక వృద్ధురాలు దొబ్బ మా రుబాయి (105) గురువారం మృతిచెందింది. గ్రా మానికి చెందిన ఆమె గ్రామంలో గర్భిణులకు నా ర్మల్ డెలివరీలు చేయడంతో పేరుపొందింది. గత 75 ఏళ్లల్లో గ్రామంలో సుమారు వెయ్యికి పైగా ప్రసవాలు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామపెద్దలు, గ్రామస్తులు మారుబాయి మృతదేహానికి నివాళులు అర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.దాడి ఘటనలో ఇద్దరిపై కేసు నమోదురెంజల్(బోధన్): ఒకరిపై దాడికి పాల్పడిన ఘటనలో మండలంలోని వీరన్నగుట్ట తండా గ్రామానికి చెందిన జాదవ్ రాజుతోపాటు అతడి మిత్రుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రమోహన్ గురువారం తెలిపారు. వీరన్నగుట్ట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు గ్రామానికి చెందిన వీరయ్య నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అతడు బుధవారం అర్ధరాత్రి విధులు నిర్వహిస్తుండగా రాజుతోపాటు అతని స్నేహితుడు అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. దీంతో వీరయ్య వారిని ఈ సమయంలో ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించగా, వారు అతడిపై దాడి చేశారు. ఈమేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.మోపాల్ మండలంలో ముగ్గురిపై..మోపాల్: మండలంలోని కంజర్ గ్రామంలో మహిళపై దాడి చేసిన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుస్మిత తెలిపారు. గ్రామానికి చెందిన కొత్తోళ్ల రాధాతో మోహన్, లక్ష్మి, అనితకు పాత గొడవలు ఉన్నాయి. ఈక్రమంలో రాధకు చెందిన వ్యవసాయ క్షేత్రంలోకి గురువారం వారు వచ్చి అకారణంగా దాడి చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.పేకాడుతున్న 24మంది అరెస్టుమద్నూర్(జుక్కల్): మండలంలోని రెండు పేకాట స్థావరాలపై పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం రావడంతో బిచ్కుంద సీఐ రవికుమార్, మద్నూర్ ఎస్సై విజయ్ కొండ ఆధ్వర్యంలో పేకాట స్థావరాలపై దాడులు చేసి, పేకాడుతున్న 24 మందిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 34వేల నగదు, 19 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిలో డోంగ్లీ మండలం మదన్‌హిప్పర్గాలో 20 మందిని, మద్నూర్ మండలం పెద్ద శక్కర్గాలో నలుగురిని పట్టుకున్నట్లు వారు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.ఇసుక డంపు స్వాధీనంరుద్రూర్: పోతంగల్ మండలం కల్లూర్ శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్‌ను గురువారం తహసీల్దార్ గంగాధర్ స్వాధీనం చేసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించిన ఇసుకను కొందరు అక్రమంగా డంప్ చేసినట్టు గుర్తించారు. ఈ ఇసుకను వర్ని మండలం చింతల్‌పేట్ గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేటాయించినట్టు ఆయన తెలిపారు. -
నగరంలో కుండపోత
నిజామాబాద్ నగరంలో గురువారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది. దీంతో పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపించాయి. నగరంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు భారీగా నిలిచిఉండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దుబ్బ నుంచి ఖానాపూర్‌కు వెళ్లే దారిలో, ఆదర్శనగర్, గౌతమ్‌నగర్, ఎన్జీవోస్ కాలనీ, జన్మభూమిరోడ్డులోని పలు కాలనీలు, రైల్వేస్టేషన్ నుంచి బస్టాండ్‌కు వెళ్లే దారిల్లో రోడ్లపై వర్షపునీరు, మురికినీరు నిలిచాయి. అరుంధతినగర్‌లో ఇళ్లలోకి వర్షపునీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
బీజేపీతోనే సామాజిక న్యాయం
సుభాష్‌నగర్: అన్ని వర్గాల సంక్షేమమే బీజేపీ లక్ష్యమని, సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి అ న్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయ న మాట్లాడారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ఇచ్చి, రిజర్వేషన్లు మైనారిటీలకు అమలుచేయడం మోసం చే యడం కాదా అని ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ బీసీల కోసం ఏం చేశారో చె ప్పాలన్నారు. రాష్ట్ర పార్టీ సూచన మేరకు ఈనెల 15 వరకూ జిల్లాలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. నాయకులు లక్ష్మీనారాయణ, గంగాధర్, శ్రీనివాస్, ఆశన్న, నారాయణ యాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, జగన్‌రెడ్డి, విజయ్‌కుమార్, రాంచందర్, శంకర్, సంతోష్,ముత్యాలు, మల్లేష్ ఉన్నారు. తెలుగులో బాలామణికి డాక్టరేట్ తెయూ(డిచ్పల్లి): తెలంగాణ వ ర్సిటీ తెలుగు విభాగం పరిశోధక విద్యార్థిని బాలామణి పీహెచ్డీ డాక్టరేట్ సాధించారు. తె యూ తెలుగు విభాగం అధ్యాపకులు సీహెచ్ లక్ష్మణ చక్రవర్తి పర్యవేక్షణలో ‘ముదిగొండ వీరభద్రయ్య సాహిత్య విమర్శ– సమగ్ర పరిశీలన’ అనే అంశంపై బాలామణి పరిశోధన పూర్తి చేసి సిద్ధాంత గ్రంథం సమర్పించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వారిజారాణి గురువారం తెయూలో ఎక్స్టర్నల్ ఎగ్జామినర్‌గా హాజరై, పరిశోధకురాలిని పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ఖలీల్‌వాడి: నగర పరిధిలోని జానకంపేట గ్రామ శివారులో ఉన్న అశోక్ సాగర్ చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించినట్లు ఆరో టౌన్ ఎస్సై వెంకట్రావు తెలిపారు. చెరువులో గురువారం ఉదయం మృతదేహం పైకి తేలడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి వయస్సు సుమారు 50 ఏళ్లు ఉంటాయని, అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని ఎస్సై తెలిపారు. మృతుడి వివరాలు తెలిసినవారు ఆరో టౌన్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు. పార్థి దొంగల ముఠా సభ్యుడి అరెస్టు కామారెడ్డి క్రైం: జాతీయ రహదారుల వెంబడి ఆగి ఉన్న వాహనాలను టార్గెట్ చేస్తూ దారి దోపిడీలకు పాల్పడడంతోపాటు ఆయా జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న పార్థి దొంగల ముఠా సభ్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముధ్కేడ్ ప్రాంతానికి చెందిన ముఠాలోని ముగ్గురిని కొంతకాలం క్రితం కామారెడ్డి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో జాతీయ రహదారులపై జరుగుతున్న దారి దోపిడీలు, రోడ్డుకు సమీపంలోని ఇళ్లలో దొంగతనాలకు సంబంధించిన కేసులు ఈ ముఠాపై నమోదై ఉన్నాయి. జిల్లాలోని గాంధారి, పిట్లం, బీర్కూర్, సదాశివనగర్, మద్నూర్, తాడ్వాయి పోలీస్ స్టేషన్లలో పార్థి ముఠాపై కేసులున్నాయి. పోలీసులు ముగ్గురు సభ్యులతోపాటు ఓ రిసీవర్‌ను అరెస్టు చేసిన్పటికీ.. ప్రధాన సభ్యుడు భాస్కర్ బాపూరావు చౌహాన్ ఎనిమిది నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు నిందితుడి కోసం చాలా రోజులుగా గాలిస్తున్నాయి. అతడిని గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐలు శ్రీనివాస్, సంతోష్‌కుమార్, ఎస్సైలు ఆంజనేయులు, రంజిత్, ఉస్మాన్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సిబ్బంది గణపతి, శ్రీనివాస్, రాజేందర్, శ్రావణ్, లక్ష్మీకాంత్, స్వామి, మైసయ్య, రవిని ఎస్పీ అభినందించారు. -
తల్లిపాలు బిడ్డకు అమృతంలాంటివి
డిచ్పల్లి(నిజామాబాద్‌రూరల్): తల్లిపాలు బిడ్డకు అమృతం లాంటివని, తల్లిపాలతో పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని జిల్లా సంక్షేమాధికారిణి ఎస్కే రసూల్‌బీ అన్నారు. మండల కేంద్రంలోని ఎస్ఎల్జీ గార్డెన్స్‌లో గురువారం వారం రోజులుగా కొనసాగుతున్న తల్లి పాల వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. అప్పుడే పు ట్టిన బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు. మహిళా కమిషన్ సభ్యురాలు సూ దం లక్ష్మి, ఇందల్వాయి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ క్రిస్టినా, పిల్లల డాక్టర్ దీపక్‌రాథోడ్ మాట్లాడుతూ.. తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం పలువురు పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ సీడీపీవో జ్యోతి, హెచ్‌ఈవో శంకర్, ఆయుష్ డాక్టర్ మాధవి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు బుజ్జి, మమత, శోభ, సరిత, వరలక్ష్మీ, సునీత, భాగ్యలక్ష్మి, రాధాలక్ష్మి, డిస్ట్రిక్ కోఆర్డినేటర్ రాంబాబు, ఐటీ ప్రకాశ్, బ్లాక్ కోఆర్డినేటర్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా సంక్షేమాధికారిణి రసూల్‌బీ ముగిసిన తల్లి పాల వారోత్సవాలు -
ప్రోత్సహించే వారుంటే కాదేది అసాధ్యం
● రన్నింగ్ పోటీల్లో రాణిస్తున్న ఖానాపూర్ వాసి అజయ్కుమార్నిజామాబాద్ రూరల్: ‘శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది’ అన్న స్వామి వివేకానంద మాటలు గుర్తుంచుకున్న ఖానాపూర్ వాసి గరిపల్లి అజయ్‌కుమార్ నేషనల్ అథ్లెటిక్ పరుగు పందెంలో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన అజయ్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయా డు. తాత–నానమ్మ వద్ద ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. తాత అనారోగ్యానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. అయినా కుంగిపోకుండా తనకంటు జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. పరుగు పందెంలో చిన్ననాటి నుంచే ఆసక్తి ఉన్న అతనికి కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. అంతేకాకుండా గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు ఇచ్చిన ప్రోత్సాహంతో పోటీల్లో రాణిస్తున్నాడు. ఇటీవల వరంగల్‌లో నిర్వహించిన నేషనల్ అథ్లెటిక్ పరుగు పందెంలో మొదటి స్థానంలో నిలిచి మెడల్ సాధించాడు. అదేవిధంగా గత నెల 19న పంజాబ్, బిహార్ లో నిర్వహించిన నేషనల్ అథ్లెటిక్ కాంపిటేషన్‌లో 100 మీటర్ల పరుగు పందెంలో రాణించాడు. అంతకుముందు చైన్నెలో జరిగిన నేషనల్ కాంపిటీషన్లో సైతం ప్రతిభ కనబర్చాడు. తనకు ఆర్థికంగా, ఆత్మస్థైర్యాన్ని నింపిన వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుని ఇతరులకు ఆదర్శంగా నిలుస్తానని అజయ్ కుమార్ అంటున్నాడు. క్రీడల్లో గెలుపోటములు సహజమని ఓడిపోయిన వారు మళ్లీ ఆత్మస్థైర్యంతో గెలవడానికి ప్రయత్నించాలని విద్యార్థులకు, తోటి యువకులకు అతడు తెలుపుతున్నాడు. -
విద్యార్థుల అభ్యున్నతికి సమన్వయంతో పనిచేయాలి
నిజామాబాద్‌అర్బన్: విద్యార్థుల అభ్యున్నతి కోసం అధ్యాపకులు సమన్వయంతో పనిచేసి, మంచి ఫలి తాలను సాధించాలని ఇంటర్ విద్యా జిల్లా ప్రత్యేక అధికారి ఒడ్డెన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ బాలికల జూనియర్ కళాశాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఒడ్డెన్న మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాల్సిందేనని అన్నారు. కళాశాల ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నందున యూనిట్ టెస్టులు నిర్వహించి మార్కుల ఆధారంగా విద్యార్థుల ప్రతిభను గుర్తించాలని అన్నారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి, వారు చదువుకునేవిధంగా ఆసక్తి కలిగించాలని సూచించారు. విద్యార్థులు కళాశాలకు హాజరుకాకుంటే వారి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందజేసే ప్రక్రియను ప్రయోగాత్మకంగా నిజామాబాద్ నుంచి ప్రారంభించాలన్నారు. నిజామాబాద్ బాలికల జూనియర్ కళాశాల రాష్ట్రంలోనే మోడల్ జూనియర్ కళాశాలగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కళాశాల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు సహకారాన్ని అందిస్తానని అన్నారు. జిల్లా ఇంటర్ అధికారి రవికుమార్ తదితరులు ఉన్నారు. -
వరలక్ష్మి.. వరప్రదాయినీ
నిజామాబాద్ రూరల్: శ్రావణ మాసంలో వరలక్ష్మి మాతను మహిళలు ప్రత్యేకంగా కొలుస్తుంటారు. ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వత్రాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈరోజున వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని, వ్రతం ఆచరించేవారు ఉపవాస దీక్ష పాటించడం శ్రేష్టమని పండితులు చెబుతున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో మహిళలు నేడు వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఈరోజు మహిళలు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రపరుచుకుని, ముగ్గులు తోరణాలు పెట్టి శోభాయమానంగా అలంకరిస్తారు. ధనధాన్య, విద్యా, వైద్య, సంతాన, అష్టలక్ష్మిలను పూజించిన ఫలితము ఈ ఒక్క వరలక్ష్మి ప్రతం నాడు అమ్మవారిని పూజించడంతో దక్కుతుందని పండితులు పేర్కొంటున్నారు. పూజా విధానం.. ఇత్తడి, రాగి, వెండి, బంగారు చెంబులో కొబ్బరికాయతో కలశ రూపంలో అమ్మవారిని పూజిస్తారు. కొందరు మహిళలు అమ్మవారిని ప్రార్థించి పాలు తేనె నెయ్యి వంటి వాటితో అభిషేకం నిర్వహిస్తారు. అమ్మవారికి చీరలు, రవికలు పండ్లు బెల్లం నెయ్యితో తయారుచేసిన నైవేద్యాలతో సమర్పించి యధాశక్తిగా పూజిస్తారు. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన మహిళలయితే బిందెలకు చీరలను కట్టి పూలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే విధంగా అమ్మవారిని పూజిస్తారు. వ్రతం చేసేటప్పుడు గోత్రనామాలతో సంకల్పం చేసుకుంటారు. అలాగే కలశ పూజ, గణపతి, గౌరీ పూజలను సైతం నిర్వహి స్తారు. లక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించి, అమ్మవారి నామాలతో, తామర పువ్వులతో పుష్పార్చన కుంకుమార్చన పూజలు నిర్వహించడం శ్రేష్ఠమని పండితులు విశ్లేషిస్తున్నారు. వ్రతం అనంతరం ముత్తయిదువులకు వాయినాలు ఇవ్వడం వల్ల పదికాలాలపాటు అష్టైశ్వర్యాలతో సౌభాగ్యాలతో ఉంటారని భక్తుల నమ్మకం. ఆలయాలు ముస్తాబు.. నగరంలోని దేవిరోడ్లోగల దేవీమాతా ఆలయం, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, లలితాదేవి ఆశ్రమాలయం, దుబ్బ మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అలాగే ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఆలయాలను ముస్తాబు చేస్తున్నారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. నేడు వరలక్ష్మి వ్రతం శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున నిర్వహణ -
ఎస్సారెస్పీ నీటి విడుదల ప్రారంభం
బాల్కొండ: శ్రీరాంసాగర్ జలాశయం నుంచి ప్రాజెక్ట్ అధికారులు, ప్రజాప్రతినిధులు నీటి విడుదలను గురువారం ప్రారంభించారు. కాకతీయ కాలువ ద్వారా జోన్–1 కోసం (డీ–53 వరకు) 3,500 క్యూసెక్కులు, మిడ్‌మానేరు కోసం వరద కాలువ ద్వారా 3వేల క్యూసెక్కులు, లక్ష్మికాలువ ద్వారా 150 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 300 క్యూసెక్కుల నీటి విడుదల చేపట్టారు. కాకతీయ కాలువ ద్వారా జోన్–1 వరకు మాత్రమే ప్రస్తుతం నీటి విడుదల కొనసాగుతుందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఎస్ఈ శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 40.5 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందన్నారు. అందులో 5 టీఎంసీలు డెడ్‌స్టోరేజీ, 5 టీఎంసీలు తాగునీటి అవసరాలకు కేటాయించగా 30 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. నాలుగు తడులుగా విభజించి నీటి విడుదల చేపడుతామన్నారు. జోన్–1, 2ల కోసం వారబందీ అమలు చేస్తూ నీటి విడుదల చేయాలని ఉన్నతాధికారులు సూచించినట్లు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద ఆధారంగా నీటి విడుదల జరుగుతుందని వివరించారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలి ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకుంటూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట్ అన్వేష్‌రెడ్డి అన్నారు. నీటి విడుదల అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుత సంవత్సరం వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, దీంతో ప్రాజెక్ట్‌లోకి ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో నీరు రాలేదన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నీటి విడుదలకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఎస్ఈ శ్రీనివాస్ గుప్తా, ఈఈ చక్రపాణి, పీఏసీఎస్ చైర్మన్జక్క రవి, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జైడి రవి, డీసీసీ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, నాయకులు సంతోష్, మాజీ సర్పంచ్ కట్కం రమేశ్, సుమో రాజేశ్వర్, ఆకుల పెద్ద రాజన్న, నాగంపేట్ గంగాధర్, రైతులు పాల్గొన్నారు. సరస్వతి కాలువకు నీటి విడుదల చేసిన ఎమ్మెల్యే ప్రాజెక్ట్ నుంచి సరస్వతి కాలువ ద్వారా నిర్మల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నీటి విడుదల చేపట్టారు. ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం నిల్వ ఉన్న నీరు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట బీజేపీ నాయకులు ఉన్నారు. విద్యుదుత్పత్తి ప్రారంభం ఎస్సారెస్పీ వద్ద ఉన్న జల విద్యుదుత్పత్తి కేంద్రంలో జెన్కో ఎస్ఈ రమేశ్ విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. కాకతీయ కాలువ ద్వారా 3500 క్యూసెక్కుల నీటిని వదలడంతో ఒక్క టర్బాయిన్ ద్వారా 7 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోందని జెన్కో డీఈఈ శ్రీనివాస్ తెలిపారు. నాలుగు తడులకు నీటి సరఫరా 30 టీఎంసీలు కేటాయింపు స్విచ్ ఆన్ చేసిన అన్వేష్ రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డిగతేడాదీ ఆగస్టు 7నే.. గతేడాది ఖరీఫ్ పంటల కోసం కాలువల ద్వారా ఆగస్టు 7నే ప్రాజెక్ట్ అధికారులు, ప్రజా ప్రతినిధులు నీటి విడుదలను చేపట్టారు. ప్రస్తుత సంవత్సరం కూడా అదే తేదీన నీటి విడుదల ప్రారంభించడం యాదృచ్ఛికంగా జరిగింది. కాగా, గతేడాది ఇదే రోజున ప్రాజెక్ట్‌లో 47 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ప్రస్తుతం 40.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
పంటను ధ్వంసం చేయడమెందుకు?
● ఫారెస్టు అధికారులను ప్రశ్నించిన సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్‌రావు ● గిరిజనులతో కలిసి భూమి పరిశీలన మోపాల్(నిజామాబాద్‌రూరల్): చేతికొచ్చిన మొక్కజొన్న పంటకు గడ్డి మందు కొట్టి ధ్వంసం చే యాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ఫారెస్ట్ అధి కారులను జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్‌రావు ప్రశ్నించారు. మోపాల్ మండలం భైరాపూర్ మోతీరామ్నాయక్ తండాలో గురువారం సాయంత్రం అ టవీ అధికారులు గడ్డి మందు కొట్టిన మొక్కజొన్న పంటను ఆయన పరిశీలించారు. మొక్కజొన్నకు గడ్డిమందు కొట్టడంతో మనస్తాపానికి గురైన రైతు ప్రకాశ్ నాయక్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతు ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు, వాస్తవ పరిస్థితులు, భూముల వివరాలను గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్ భూముల వివరాలను సంబంధిత అధికారుల వద్ద వాకబు చేశారు. మొక్కజొన్న పంట సాగు చేసి రెండున్నర నెలలు గడిచిపోయిందని, చేతికొచ్చే పంటకు గడ్డి మందు కొట్టి ధ్వంసం చేశారని, దీంతో రూ.లక్షకుపైన నష్టం వాటిల్లిందని గిరిజనులు వివరించారు. కాగా, ఆత్మహత్యాయత్నంతో అధికారులను బె దిరించే ప్రయత్నం చేసిన రైతుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుస్మిత తెలిపారు. అటవీ భూమిలో ప్ర కాశ్ అక్రమంగా సాగు చేయడంతోనే తాము అడ్డు కున్నట్లు ఫారెస్ట్ అధికారులు వివరించారు. అన్నివర్గాల నుంచి విషయ సేకరణ చేసిన జడ్జి ఉదయ్ భాస్కర్‌రావు పలు విలువైన సూచనలు చేశారు. చట్టం అందరికీ ఒకేలా ఉంటుందని, చట్టానికి బాధ్యులుగా ఉండాలన్నారు. రైతు ప్రకాశ్‌పై నమోదైన కేసును సామరస్యంగా పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. జడ్జి వెంట న్యాయవాదులు ఆశ నారాయణ, బాల్‌రాజ్ నాయక్, రవిప్రసాద్, న్యాయసేవా సంస్థ సూపరింటెండెంట్ శైలజ, సెక్షన్ ఆఫీసర్ బాసిత్, ఎల్‌హెచ్‌పీఎస్ అధ్యక్షుడు చవాన్ మోహన్ నాయక్, సేవాలాల్ సేన ప్రధాన కార్యదర్శి నరేశ్ నాయక్, ఇందల్ నాయక్, జలందర్, గౌతమ్, జవహర్లాల్ తదితరులు ఉన్నారు. -
2 గంటలు..6 సెంటీమీటర్లు
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసింది. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన వాన ఎనిమిది గంటల వరకు కురిసింది. రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అత్యధికంగా రెండు గంటల్లో 6 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు జిల్లా వాతావరణ శాఖ అధికారి ప్రతాప్ తెలిపారు. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రెయినేజీలు ఉప్పొంగాయి. జిల్లా కేంద్రంలోని సౌత్ మండల పరిధిలో 55.3 మి.మీ, నార్త్ మండలం 50.1 మి.మీ, ఇందల్వాయి 39.9 మి.మీ, మోపాల్ 33.0, జక్రాన్‌పల్లి 29.4, మాక్లూర్ 31.1, వేల్పూర్ 20.1, రెంజల్ 16.1, నవీపేట 15.3, పోతంగల్ 14.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 11.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. నగరంలో దంచికొట్టిన వాన రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదు -
రైతులకు సరిపడా యూరియా
సుభాష్‌నగర్: జిల్లాలోని రైతాంగానికి సరిపడా యూరియా అందుబాటులో ఉందని, ఎక్కడా కొర త లేదని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ పేర్కొన్నారు. నగరంలోని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశపు హాల్లో వ్యవసాయ, హార్టికల్చర్, మార్కెటింగ్ శాఖల పనితీరు, పథకాల అమలు, సబ్సిడీ లు, తదితర అంశాలపై గురువారం ఆయన సమీ క్షించారు. ప్రధానంగా వ్యవసాయ, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో రైతాంగానికి కల్పిస్తున్న రాయితీలు, పంటల విస్తీర్ణం, ఎరువుల నిల్వలపై డీఏవో గోవిందు, జేడీ శ్రీనివాస్‌రావును అడిగారు. 10వేలకు పైగా ఎకరాల్లో ఆయిల్ పావ్‌ు పంటను సాగు చేస్తేనే జిల్లాకు ఫ్యాక్టరీ వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ విషయమై రైతులకు దాని ప్రయోజనాలను వివరించాలన్నారు. జిల్లాలో పసుపు సాగు స్వ ల్పంగా పెరిగిందని అధికారులు వివరించారు. యూరియా కొరత లేకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని గడుగు గంగాధర్ సూచించారు. యేటా టెండర్లు నిర్వహించాలి.. మార్కెట్ కమిటీల్లో సెక్యూరిటీ టెండర్లు ప్రతియేటా నిర్వహించాలని గడుగు గంగాధర్ ఆదేశించా రు. ఏళ్లుగా ఒక్క కాంట్రాక్టర్‌కే అప్పగించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్కెట్‌కు వచ్చే రైతులకు దళారుల ప్రమేయం లేకుండా గిట్టుబాటు ధర దక్కేలా చూడాలని తెలిపారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీలో ఉద్యోగులు, సిబ్బంది కొరత, డిప్యుటేషన్ల వివరాలతోపాటు ఆదాయం, ఖర్చు లు, గోదాములు తదితర అంశాలను సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ అపర్ణ వివరించారు. ఉద్యోగుల కొరత, హోల్‌సేల్ మార్కెట్లో కొత్త లైసెన్సులు, మడిగెల నిర్మాణం తదితర అంశాలపై ఇప్పటికే మంత్రి తు మ్మల నాగేశ్వర్రావు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి వివరించారు. అనంతరం దడువాయిలు, హమాలీలు, చాటా కార్మికులు గడుగు గంగాధర్‌ను కలిసి సమస్యలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ క మిటీ వైస్ చైర్మన్ జంగిటి రాంచందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి గంగు, ఏడీఏ కృష్ణ, డైరెక్టర్లు మా రుతీ మల్లేశ్, గంగారెడ్డి, రాజలింగం, బాగారెడ్డి, దేవ కరుణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అన్నదాతల సమస్యల పరిష్కారానికి కమిషన్ పని చేస్తుంది.. రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ -
పీహెచ్‌సీల్లోనే కాన్పులు జరగాలి
డొంకేశ్వర్(ఆర్మూర్): ప్రభుత్వ ప్రాథమిక ఆరో గ్య కేంద్రాల ద్వారా ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వైద్యాధికారులకు సూచించారు. సాధారణ చికిత్సలతోపాటు గర్భిణులకు స్థానికంగానే సుఖ ప్రసవాలు (కాన్పులు) కూడా చేయాలన్నారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో కలెక్టర్ గురు వారం ఆకస్మిక తనిఖీలు చేశారు. మొదట పీహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్... ఓపీ రిజిస్టర్, సి బ్బంది హాజరును పరిశీలించారు. సేకరించిన బ్లడ్ శాంపిల్స్‌ను టీహబ్‌కు పంపిస్తున్న తీరును పరిశీలించారు. వ్యాక్సినేషన్, టీబీ ముక్త్ భారత్ అభియాన్ అమలు, గ్రామాల్లో ఆరోగ్య శిబిరాల నిర్వహణ తదితర కార్యక్రమాల అమలుపై ఆరా తీశారు. సుశిక్షితులైన స్టాఫ్ నర్స్ ఉన్నప్పటికీ స్థా నికంగా కాన్పులు ఎందుకు చేయడం లేదని కలెక్టర్ ప్రశ్నించారు. ప్రతీ నెల కనీసం రెండు కా న్పులు స్థానికంగా జరిగేలా కృషి చేయాలన్నా రు. గర్భిణులకు స్థానిక పీహెచ్సీలో డెలివరీ సదుపాయం అందుబాటులో ఉందని ఏఎన్ఎంలు, ఆశాల ద్వారా అవగాహన కల్పించాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శుభాకర్‌కు సూచించారు. పీహెచ్సీ పనితీరుపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జెడ్పీ హైస్కూల్, ప్రా థమిక పాఠశాలలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని హెచ్ఎంలు సురేశ్ కుమార్, సాబేర బేగంలను ఆదేశించారు. పలువురు విద్యార్థుల హాజరును ఎఫ్ఆర్ఎస్ ద్వారా నమోదు చేయకపోవడాన్ని గమనించి, ఎంఈవో రామకృష్ణను ఫోన్ ద్వారా కలెక్టర్ ప్రశ్నించారు. ఎఫ్ఆర్ఎస్ అమలును ఎందుకు పర్యవేక్షించడం లేదని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఊరు – మన బడి కింద నూతనంగా నిర్మించిన తరగతి గదుల గోడలపై పెయింటింగ్స్ వేయించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ సహకార సంఘం ఎరువుల సేల్ పాయింట్‌ను సందర్శించి, అందుబాటులో ఉన్న ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని, మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి, ఇందిరమ్మ ఇళ్ల పనులపై స్థానిక అధికారులతో సమీక్షించారు. ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్ సందర్శన చిన్నయానం శివారులోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని కలెక్టర్ సందర్శించారు. కుటుంబసభ్యులతో కలిసి పర్యాటకులు ఈ ప్రదేశానికి వస్తుండడాన్ని గమనించిన కలెక్టర్, ప్రమాదాలు చోటుచేసుకోకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇరిగేషన్ డీఈ రవికి సూచించారు. బ్యాక్ వాటర్ ఏరియాలో నిలువ ఉన్న నీటిమట్టం, గోదావరి ప్రవాహాన్ని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్యాక్ వాటర్ ఏరియాను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దే ప్రతిపాదనలను అడిగి తెలుసుకొని, అందుకు అనుకూలంగా ఉన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలందించాలి డొంకేశ్వర్‌లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు ఎంపీడీవో ఆఫీసు, పాఠశాలలు, సొసైటీ గోదాం సందర్శన -
ఉద్యోగులు అటెన్షన్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘కలెక్టర్ సార్ ఈ రోజు ఏ మండలానికి వస్తున్నారు? మా కార్యాలయానికి వస్తున్నారా?’ అంటూ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిరోజూ ఆరా తీస్తున్నారు. కలెక్టర్ పర్యటన, ఆకస్మిక తనిఖీల విషయమై ప్రతి అంశాన్ని ఉద్యోగులు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఒక్కరోజు కూడా విరామం ఇవ్వకుండా ప్రతిరోజు వివిధ మండలాల్లో పర్యటిస్తూ ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో ఉద్యోగులందరూ పూర్తిగా అటెన్షన్‌తో వ్యవహరిస్తున్నారు. సమయపాలన పాటిస్తున్న ఉద్యోగులు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి క్షేత్ర పర్యటన వివరాలు ఆయన డ్రైవర్ సహా ఎవరికీ తెలియకపోవడంతో మండల స్థాయి అధికారులు, ఉద్యోగుల్లో భయం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రతి ఉద్యోగి కచ్చితంగా సమయపాలన పాటిస్తుండడం గమనార్హం. జూన్ 13న జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వినయ్ కృష్ణారెడ్డి మరుసటి రోజు 14వ తేదీ నుంచే మోపాల్ మండల పర్యటనతో ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టారు. క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. పోస్టాఫీసులను సైతం సందర్శించి తనిఖీలు చేస్తుండడం గమనార్హం. తాను పర్యటించిన మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఎరువుల గోదాములు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఎంపీడీవో, తహసీల్ కార్యాలయాలను తనిఖీ చేస్తున్నారు. పీహెచ్‌సీల్లో వైద్య సేవలు, పాఠశాలలు, అంగన్వాడీల్లో పిల్లల హాజరు, మధ్యాహ్న భోజనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ఎరువుల నిల్వలపై పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ విషయమై ప్రతి అంశాన్ని గురించి క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకుంటున్నారు. ఉరుకులు.. పరుగులు విధి నిర్వహణలో అలసత్వాన్ని సహించేది లేదని కలెక్టర్ చెప్పడంతో పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, వ్యవసాయ శాఖ, రెవెన్యూ ఉద్యోగులు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. ఎక్కడైనా లోటుపాట్లు, సమస్యలు కనిపి స్తే సరిచేసుకోవాలని కలెక్టర్ సూచనలు చేస్తున్నా రు. మళ్లీ 15 రోజుల్లో వస్తానని, ఆ సమయంలో స దరు సమస్యలు లేకుండా చూసుకోవాలని ఆదేశా లు ఇస్తున్నారు. దీంతో అధికారులు ఉరుకులు, ప రుగులు పెడుతున్నారు. మరోవైపు జిల్లా అధికా రుల సమీక్ష సమావేశంలోనూ కలెక్టర్ ప్రతి విషయాన్ని పిన్‌పాయింటెడ్‌గా అడుగుతున్నారు. దీంతో అధికారులు సైతం అలర్ట్‌గా ఉంటున్నారు. అన్ని మండలాల్లో అప్రమత్తం పెద్దసారు ఎటువైపు వెళ్తున్నారో.. ప్రతిరోజూ ఆరా తీస్తున్న ఉద్యోగులు కారెక్కిన తర్వాతే ఏ మండలానికి వెళ్లేది నిర్ణయిస్తున్న ఉన్నతాధికారి సిబ్బందితో కళకళలాడుతున్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సాయంత్రం వరకు తప్పనిసరి విధుల నిర్వహణ అన్ని విభాగాలను చుట్టేస్తూ.. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బయల్దేరిన సమయంలో ఏ మండలం వైపు వెళ్లే విషయాన్ని ఎవరికీ చెప్పడం లేదు. కారులో కూర్చున్న తర్వాత డ్రైవర్‌కు డైరెక్షన్ ఇస్తూ తాను ఎంపిక చేసుకున్న మండలానికి వెళ్తున్నారు. ఆయా మండలాలకు వెళ్లిన తర్వాత సైతం ఎప్పుడు ఏ కార్యాలయానికి వెళతారో, పాఠశాల, ఆస్పత్రులకు వెళతారో అనే విషయమై ఎవరికీ చెప్పకుండా ఆకస్మికంగా సందర్శిస్తున్నారు. అయితే తన పర్యటనలో మాత్రం మండలంలోని అన్ని ప్రభుత్వ విభాగాలను తనిఖీ చేస్తున్నారు. పైగా వెళ్లే దారిలోని గ్రామాల్లోనూ ఆగుతూ వివరాలు తెలుసుకుంటున్నారు. దీంతో ఉద్యోగులు కచ్చితంగా తాము విధులు నిర్వర్తించే ప్రాంతాల్లోనే ఉంటున్నారు. కలెక్టర్ ఎప్పుడు వస్తారో అనే విషయమై తెలియకపోవడంతో సాయంత్రం వరకు ఉద్యోగులు విధుల్లో ఉంటున్నారు. దీంతో అన్ని కార్యాలయాలు కళకళలాడుతున్నాయి. -
గంజాయి తరలిస్తున్న నలుగురి అరెస్టు
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలో గంజాయి తరలిస్తున్న నలుగురి నిందితులను అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ స్వప్న తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బుధవారం నగరంలోని అర్సపల్లి ప్రాంతంలో ఓ కారులో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో నలుగురు నిందితులు పట్టుబడగా వారు హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ మునావర్, మహమ్మద్ ఇర్ఫాన్, అమీర్ పాషా, నిజామాబాద్‌లోని ముజాయిత్నగర్కు చెందిన అన్వర్‌గా పోలీసులు గుర్తించారు. కారులో రెండు కిలోల వంద గ్రాముల ఎండు గంజాయి లభించిందని అన్నారు. నిందితులను అరెస్టు చేసి కారును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దాడిలో ఎస్సైలు రామ్‌కుమార్, చారి, సిబ్బంది హమీద్, శివ, రాజన్న, భోజన్న, ఆశన్న, రాంబచన్, సాయిప్రసాద్ పాల్గొన్నారు. -
వేల్పూర్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
వేల్పూర్: మండల కేంద్రంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జెడ్పీ ఉన్నత పాఠశాల, పీహెచ్సీ, సహకార సంఘం ఎరువుల గోడౌన్‌ను పరిశీలించారు. పాఠశాలలో బోధన, బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థుల హాజరును ఫేస్ రికగ్నేషన్ విధానం ద్వారా చేపడుతున్నారా లేదా అని పరిశీలించారు. సాంకేతిక ఇబ్బంది కారణంగా కొంతమంది విద్యార్థుల ముఖ గుర్తింపు హాజరు నమోదు కావడం లేద ని హెచ్ఎం రాజన్న తెలుపగా, కలెక్టర్ అప్పటికప్పు డు ఎఫ్ఆర్ఎస్ పద్ధతిన విద్యార్థుల హాజరును ఆన్లైన్లో నమోదు చేయించారు. అంతకుముందు వే ల్పూర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణులు స్థానికంగానే సుఖ ప్రసవాలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని మెడికల్ ఆఫీసర్ వీణకు సూచించారు. కాగా, పీహెచ్‌సీల్లో బేబీ వా ర్మర్లు పని చేయడం లేదని తెలుసుకున్న కలెక్టర్ టీజీఎంఎస్ ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కు ఫోన్ చేసి, వెంటనే అన్ని పీహెచ్‌సీల్లో బేబీ వార్మర్లకు మరమ్మతులు చేయించాలని, అవసరమైన చోట కొత్తవి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎరువుల గోడౌన్ ను కలెక్టర్ తనిఖీ చేశారు. తహసీల్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో గ్రామం వారీగా రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్ష జరిపారు. భూభారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆదేశించారు. ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఎంపీడీవో బాలకిషన్‌ను వివరాలు అడి గి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగ తి గురించి జీపీ కార్యదర్శి వినోద్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఉన్నారు. -
జయశంకర్ సార్‌కు ఘన నివాళి
ఖలీల్‌వాడి: తెలంగాణ తొలి, మలి దశల ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధనకు జయశంకర్ సార్ మార్గదర్శకులయ్యారన్నారు. ప్రతి ఒక్కరూ బంగారు తెలంగాణ కోసం శ్రమించాలని, భవిష్యత్ తరాల కోసం బంగారు బాట వేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో ఆసియా బేగం, ఆఫీస్ సూపరింటెండెంట్ శంకర్, బషీర్, వనజ, రిజర్వ్ సీఐ శ్రీనివాస్, తిరుపతి, సీఐలు రమేశ్, వీరయ్య, సతీశ్, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.రాఖీ పౌర్ణమికి ప్రత్యేక బస్సులుఖలీల్వాడి: రాఖీ పౌర్ణమి పండుగకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఆర్ఎసం జ్యోత్స్న బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఉమ్మ డి నిజామాబాద్ రీజియన్ పరిధిలో ప్రత్యేక బ స్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ నుంచి ఈనెల 7, 8, 9 లలో నిజామాబాద్, ఆర్మూర్, బాన్సువాడ, కామారెడ్డి తోపా టు బోధన్ వైపునకు అదనపు బస్సులను నడపనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం షెడ్యూల్ బస్సులతో పాటు 149 అదనపు బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచామన్నారు. ఆర్మూరుకు 20, బోధన్‌కు 31, నిజామాబాద్‌కు 35, బాన్సువాడకు 19, కామారెడ్డికి 44 ప్రత్యేక బస్సులను సికింద్రాబాద్‌కు నడుపనున్నట్లు పేర్కొన్నారు.ప్రైవేటు ఆస్పత్రికి నోటీసుబాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని ఓ ప్రైవే టు ఆస్పత్రికి జిల్లా వైద్యాధికారులు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల క్రితం బిచ్కుంద మండలానికి చెందిన ఓ బాలుడికి జ్వరం రావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు బా లుడిని నిజామాబాద్‌కు తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో బాన్సువాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యు ల నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందినట్లు బా లుడి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఆందోళన చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని సముదాయించారు. జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి బాధ్యత రహితంగా వ్యవహరించినట్లు నిర్ధారించి ఆస్పత్రికి నోటీసు జారీ చేశారు. మూడు రోజుల్లో ఆస్పత్రిని మూసివేయాలని సూచించినట్లు తెలిసింది.పగిలిన పైప్లైన్బాల్కొండ: ఎస్సారెస్పీ వద్ద కాకతీయ కాలువ వంతెనపై కాలనీకి నీటి సరఫరా చేసే పైపులైన్ పగిలిపోయింది. దీంతో నీరు లీకేజై వంతెనపై కుంటలా నిలిచింది. గురువారం ప్రాజెక్ట్ నుంచి కాలువల ద్వారా ప్రజాప్రతినిధులు నీటి విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో పైపు లైన్ నుంచి నీరు రాకుండా ఉండేందుకు సిబ్బంది ప్లాస్టిక్ కాగితం టేపును చుట్టారు. ఇనుప పైపుకు చిన్న వెల్డింగ్ మరమ్మతులు చేపడితే సమస్య పరిష్కారమయ్యేది. కానీ అలా కాకుండా కాగితం టేపును చుడుతుండటంపై కాలనీ వాసులు ఇదేమి చోద్యం అంటు ముక్కున వేలేసుకుంటున్నారు. -
అంతర పంటలు.. ఆదాయ వనరులు
ఆర్మూర్: జిల్లాలో సంప్రదాయ వ్యవసాయానికి పెద్ద పీట వేసే రైతులు ప్రధాన పంటలతో పాటు అంతర పంటలు వేస్తూ అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురువడంతో పాటు ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు గ్రామాల్లోని చెరువుల్లోకి చేరుతుండటంతో రైతులు ఈ ఏడు తమ పంటలు పండినట్లేనని ఆనందంగా ఉన్నారు. ప్రధాన పంటలతో పాటు చిన్న చిన్న ఖర్చులు వెల్లదీసుకోవడానికి ప్రతీ రైతు అంతర పంటలను విత్తుకుంటున్నారు. జిల్లాలో వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం సుమారు 32 వేల ఎకరాల్లో పసుపు పంటను పండిస్తున్నారు. పసుపును జూన్ మొదటి వారం నుంచి విత్తుకుంటు ఉంటారు. తొమ్మిది మాసాల పంట అయిన పసుపు జనవరి, ఫిబ్రవరి నెలలో రైతుల చేతికి అందుతుంది. అయితే పసుపు మొలక దశలో నీడ అవసరం ఉంటుంది. లేకుంటే పసుపు మొలక ఎండలకు ఎండిపోయే ప్రమాదం ఉంది. దీంతో రైతులు పసుపు పండించే మళ్లలో అంతర పంటగా పసుపుతో పాటు మొక్కజొన్నను విత్తుకుంటారు. పల్చగా విత్తుకున్న మొక్కజొన్న పసుపు మొలకకు నీడగా ఉండటమే కాకుండా రైతులకు అదనపు ఆదాయాన్ని ఆర్జించి పెడుతుంది. ఒకే మడిలో ఏకకాలంలో రెండు పంటలు విత్తుకొనే అవకాశం ఏర్పడుతుంది. మరో వైపు ఆయిల్ పామ్ మొక్కల మధ్య పసుపు పంటను విత్తుకుంటుంటారు. పసుపు విత్తుకున్న మళ్ల ఒడ్లపై కందులు (తొగర్లు), చిక్కుడు, దోసకాయలు, బంతి పూలను సైతం రైతులు విత్తుకుంటారు. ఈ పంటలు రైతులకు చిన్న చిన్న ఖర్చులు వెల్లదీసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటాయి. పసుపు సాగుకు ఉపయోగించే నీటితోనే అదనంగా మొక్కజొన్న, చిక్కుడు, కందులు, దోసకాయ, బంతిపూల లాంటి పంటలు ఎలాంటి శ్రమ లేకుండా పెరిగిపోయి పంట చేతికి వస్తుంది. దీంతో పసుపు పంటకు పెట్టుబడి వ్యయం అధికంగా అవుతున్న రైతులకు ఆర్థిక భారం కొంతైనా తగ్గే అవకాశం ఉంటుంది. ఆయిల్ పామ్ చెట్ల మధ్య పసుపు పంటతో అదనపు ఆదాయం పసుపులో అంతర పంటగా మొక్కజొన్న విత్తుకుంటున్న రైతులు -
అల్బెండజోల్ మాత్రలు వేయించాలి
నిజామాబాద్‌నాగారం: జిల్లాలో నులి పురుగుల నిర్మూలనకు సమష్టిగా కృషి చేద్దామని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి బీ రాజశ్రీ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంపై జిల్లా స్థాయి సమన్వయ, శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఈ నెల 11న జిల్లా వ్యాప్తంగా 1–19 సంవత్సరాల పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు వేయంచాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు మాత్రలను అందజేస్తామన్నారు. అల్బెండజోల్ మాత్రలపై అపోహలు అవసరం లేదని, మాత్రలు తీసుకోవడం పిల్లల ఆరోగ్యానికి మంచిదన్నారు. నులి పురుగులను నిర్మూలించి పోషకాహార లోపాలని అరికట్టవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అఽ దికారి డాక్టర్ అశోక్, విద్యాశాఖ అకడమిక్ మానిటర్ ఆఫీసర్ శ్రీనివాసరావు, మహిళా శిశు సంక్షేమ శాఖ సీడీపీవో సౌందర్య, ప్రోగ్రా మ్ ఆఫీసర్ డాక్టర్ శ్వేత, ఆర్బీఎస్కే మేనేజర్ సచిన్, వివిధ మండలాల మెడికల్ ఆఫీసర్లు, ఎంఈవోలు తదితరులు పాల్గొన్నారు. ● నులిపురుగుల నిర్మూలనకు కృషి చేయాలి ● జిల్లా వైద్యాధికారి రాజశ్రీ -
విడుదలకు సిద్ధం
నిజామాబాద్ఎస్సారెస్పీ నీటిఅంతర పంటలు.. జిల్లా రైతులు ప్రధాన పంటలతోపాటు అంతర పంటలు సాగుచేస్తూ అదనపు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.గురువారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2025– 8లో uశ్రీరాంసాగర్ జలాశయంజయశంకర్ ఆశయ సాధనకు కృషి ● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్‌అర్బన్: తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, అదే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ 91వ జయంతిని పురస్కరించుకొని నగరంలోని కంఠేశ్వర్ చౌరస్తా వద్ద జయశంకర్ విగ్రహానికి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్, వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పి ంచారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్లో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ త దితరులు పూలమాలలు వేసి నివాళులు ఆ ర్పించారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడి న తరగతుల అభివద్ధి శాఖ సహాయ అధి కారి నర్సయ్య, రాష్ట్ర మహిళా కమిషన్ స భ్యులు సుదాం లక్ష్మి, బుస్స ఆంజనేయులు, బుస్సాపూర్ శంకర్, బీసీ విద్యార్థి సంఘం నాయకుడు శ్రీనివాస్, ఎం.రాజేశ్వర్, హ న్మాండ్లు, చారి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్‌పై సస్పెన్షన్ వేటు● ఉత్తర్వులు జారీ చేసిన కార్యదర్శి డాక్టర్ శ్రీదేవి బోధన్ టౌన్(బోధన్): బోధన్ మున్సిపల్ కమిషనర్ జాద వ్ కృష్ణను సస్పెండ్ చేస్తూ మున్సిపల్ పరిపాలన విభాగం ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ వి షయం చర్చనీయాంశంగా మారింది. జాద వ్ కృష్ణ గతంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీలో రెవెన్యూ ఆఫీసర్(ఆర్వో)గా పనిచే శారు. ఆ సమయంలో విధుల్లో నిర్లక్ష్యం, అ ధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు గు ర్తించిన ఉన్నతాధికారులు జాదవ్ కృష్ణపై సస్పెషన్ వేటు వేశారు. పదోన్నతులు వాయిదా నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. పదోన్నతులకు సంబంధించి సీనియార్టీ జాబితాలో తప్పులను సవరించాలంటూ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ఈ నెల 11 వరకు పదోన్నతుల ప్రక్రియ నిలుపుదల చేస్తూ రాష్ట్ర ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ఆన్లైన్లో తొలగించారు. ఇదిలా ఉండగా బుధవారం కొందరు ఉపాధ్యాయులు నాట్ విల్లింగ్ కోసం డీఈవో కార్యాలయానికి వచ్చారు. దీంతో తప్పనిసరిగా పదోన్నతులు తీసుకోవాల్సిందేనని అధికారులు స్పష్టంచేశారు. అంతలోనే పదోన్నతుల ప్రక్రియ వాయిదా పడినట్లు తెలియడంతో టీచర్లు వెనక్కి మళ్లారు. నేటి నుంచి కాకతీయ కాలువ ద్వారా జోన్–1కు.. బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ఆయకట్టుకు నీటి విడుదలను చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో గురువారం నుంచి కాలువల ద్వారా నీరు విడుదల కానుంది. ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 40.5 టీఎంసీల నీరు నిల్వ ఉండటంతో కాకతీయ కాలువ ద్వారా జోన్–1 (ఎల్ఎండీ ఎగువ భాగాన డీ–54 వరకు) ఆయకట్టు, లక్ష్మి, సరస్వతి కాలువల ఆయకట్టుకు నీటి విడుదల చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ సగం మాత్రమే నిండగా, మరో మూడు నెలలపాటు ఎగువ ప్రాంతాల నుంచి వరద వచ్చే అవకాశం ఉండటంతో నీటి విడుదల కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. నీటి విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. కాకతీయ కాలువ ద్వారా 2.2 లక్షలు, లక్ష్మి కాలువ ద్వారా 50 వేలు, సరస్వతి కాలువ ద్వారా 35 వేల ఎకరాలకు సాగు నీరు అందించనున్నట్లు ప్రాజెక్ట్ ఈఈ చక్రపాణి తెలిపారు. విద్యుదుత్పత్తికి రెడీ.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద ఉన్న జల విద్యుదుత్పత్తి కేంద్రం విద్యుదుత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు జెన్కో అఽధికారులు తెలిపారు. కాకతీయ కాలువ ద్వారా వెయ్యి క్యూసెక్కుల నీటి విడుదలను ప్రారంభిస్తే నాలుగు టర్బాయిన్ల ద్వారా 36 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు. కొనసాగుతున్న ఇన్‌ఫ్లో.. ఎగువ నుంచి ఎస్సారెస్పీలోకి 793 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 100, తాగునీటి అవసరాల కోసం 231, ఆవిరి రూపంలో 462 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్‌లో బుధవారం సాయంత్రానికి 1078.30(40.5 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు. లక్ష్మి కాలువ గేట్లు ● విలీన ఆస్పత్రులలో వైద్యులు, సిబ్బంది నియామకాలకు గతంలో ప్రతిపాదనలు ● ముందుకు సాగని ప్రక్రియ ● మెరుగైన సేవలందక ఇబ్బందులు పడుతున్న రోగులు న్యూస్రీల్లక్ష్మి గేట్లు లేచేనా..?‘మహాలక్ష్మి’పై వదంతులు.. పోస్టాఫీసులో బారులు పోస్టల్ బ్యాంక్ ఖాతా ఉంటేనే మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.2500 వస్తాయనే ప్రచారం జరగడంతో మహిళలు కొత్త ఖాతాల కోసం నగరంలోని పెద్ద పోస్టాఫీసుకు బుధవారం భారీగా తరలివచ్చారు. కౌంటర్ వద్ద తోపులాడుకుంటూ ఖాతాలు తీశారు. ఈ విషయమై పోస్టల్ అధికారులను సంప్రదించగా బయట ఎవరో వదంతులు చేయడంతో మహిళలు తరలివస్తున్నారని చెప్పారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ లక్ష్మి, సరస్వతి కాలువల ఆయకట్టుకు నీరు లక్ష్మి కాలువ ఆయకట్టుకు గురువారం ఉదయం నీటి విడుదల చేపట్టనున్న నేపథ్యంలో కాలువ హెడ్‌రెగ్యులేటర్ గేట్లు లేచేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హెడ్‌రెగ్యులేటర్ వద్ద గేట్లను గతంలో మాన్యువల్‌గా ఎత్తేవారు. లక్ష్మి కాలువ ఆధునికీకరణలో భాగంగా హెడ్ రెగ్యులేటర్ గేట్లను ఎలక్ట్రానిక్ వ్యవస్థలోకి తీసుకువచ్చారు. అందులో భాగంగా ఎస్సారెస్పీ దిగువన నిర్మించిన సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా కోసం కేబుల్ వేశారు. కాగా, గతేడాది నుంచి విద్యుత్ సరఫరా కావడం లేదు. గత యాసంగి సీజన్లోనే గేట్లు ఎత్తడానికి నానా తంటాలు పడ్డారు. ప్రస్తుతం గేట్లు ఎత్తాలంటే మాన్యువల్ ఆపరేటింగ్ చేయాలి. అయినా కూడా గేట్లు లేస్తాయా? లేదా? అని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రెండు నెలల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు సబ్‌స్టేషన్‌లోని ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి ఆయిల్, కాయిల్స్‌ను ఎత్తుకెళ్లారు. అప్పటి నుంచి సబ్‌స్టేషన్‌లో సైతం విద్యుత్ లేదు. కాగా, అధికారులు ఓఅండ్ఎం నిధులతో మరమ్మతులు చేపడతామని చెప్పి అది కూడా మరచిపోవడం గమనార్హం. దిగువనే విద్యుత్‌్ సబ్‌స్టేషన్.. లక్ష్మికాలువ హెడ్‌రెగ్యులేటర్‌కు ఎదురుగా సుమారు 100 మీటర్ల దూరంలోనే ముప్కాల్ మండలం నల్లూర్ గ్రామంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ఉంది. అక్కడి నుంచి విద్యుత్ సరఫరాకు కనెక్షన్ తీసుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కేబుల్ ఖర్చు కూడా తక్కువగా అయ్యే అవకాశం ఉండడంతో అధికారులు స్పందించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. టెండర్లు పూర్తయ్యాయి లక్ష్మి కాలువపై ఉన్న లిఫ్టులకు ప్రభుత్వం రూ. 10 కోట్లు మంజూరు చేసింది. వాటికి టెండర్లు పూర్తయ్యాయి. అందులో నుంచి నూతన విద్యుత్ కనెక్షన్ కోసం ప్రతిపాదనలు చేస్తున్నాం. త్వరలోనే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తాం. – సురేశ్, డిప్యూటీ ఈఈ, మైనర్ ఇరిగేషన్, బాల్కొండ -
క్రైం కార్నర్
పాముకాటుతో యువకుడి మృతి బాన్సువాడ రూరల్: మండలంలోని తిర్మలాపూర్‌కు చెందిన వరగంతం రాజు (25) అనే యువకుడు పాముకాటుతో మృతి చెందినట్లు బాన్సువాడ సీఐ మండల అశోక్ తెలిపారు. దినసరి కూలి అయిన రాజు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటివద్దే ఉంటున్నాడు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాముకాటు వేయడంతో గమనించిన కుటుంబీకులు వెంటనే చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి తల్లి భూమవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్ తెలిపారు. అనారోగ్యంతో వృద్ధురాలి ఆత్మహత్య రెంజల్: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధురాలు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రెంజల్ మండలం దూపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పొతరాజు చిన్న గంగామణి(57) అనే వృద్ధురాలు ఇంట్లో ఒక్కరే ఉంటున్నారు. ఆమె ఐదేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఆస్పత్రుల్లో చూయించినా నయం కావడం లేదు. దీంతో జీవితంపై విరక్తితో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె దేవ గంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని షేక్ చాంద్ హోటల్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న రాజారాందుబ్బాకు చెందిన దాసరి పోశెట్టిని అరెస్ట్ చేసినట్లు సీఐ అశోక్ తెలిపారు. పక్కా సమాచారం మేరకు దాడి చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడు నిజామాబాద్‌కు చెందిన ఆటో డ్రైవర్ బాబాఖాన్ వద్ద కొనుగోలు చేసి బాన్సువాడలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. పోశెట్టి నుంచి 275 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. పోశెట్టిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. -
అక్రమ కేసులు ఎత్తేయాలి
మోపాల్: అటవీ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని బైరాపూర్‌కు చెందిన ప్రకాశ్, కవిత, జలంధర్‌పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలని ఏఐబీఎస్ఎస్ ప్రతినిధులు మూడ్ బాబూరావు, రమావత్ మోహన్ నాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి బానోత్ నరేశ్ నాయక్ డిమాండ్‌చేశారు. కేసులు ఎత్తేయాలని, అటవీ భూమి సాగుకు అనుమతివ్వాలని డిమాండ్ చేస్తూ ఏఐబీఎస్ఎస్ ఆధ్వర్యంలో నగరంలోని వర్నిరోడ్లోగల డీఎఫ్‌వో కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈమేరకు బుధవారం ఏఐబీఎస్ఎస్ నాయకులు డీఎఫ్‌వో కార్యాలయ ముట్టడికి ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. కార్యాలయం గేట్లు మూసేయడంతో అక్కడే బైఠాయించి ధర్నాకు దిగారు. గిరిజనులపై అక్రమ కేసులు ఎత్తేయాలని నినాదాలు చేశారు. పోలీసులు, ఫారెస్ట్ అధికారులు సముదాయించారు. అనంతరం ఎఫ్ఆర్వో రాధికకు మోహన్ నాయక్, నరేష్ నాయక్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు శంకర్ నాయక్, కొర్ర గంగాధర్, పీర్సింగ్, బాలు నాయక్, మోహన్ నాయక్, రవి నాయక్, సురేశ్ నాయక్, డాన్ శ్రీను, ఇందల్ నాయక్, నరేందర్, గోపాల్, శంకర్, సంగ్యానాయక్, పరుశరామ్, తదితరులు పాల్గొన్నారు. బైరాపూర్ గ్రామస్తుల ముందస్తు అరెస్ట్ డీఎఫ్‌వో కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడికి వెళ్లకుండా ముఖ్య నాయకులు, గ్రామస్తులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం 3 గంటల వరకు పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. సీఐ సురేశ్‌కుమార్ సూచనల మేరకు కొందరు నాయకులు మాత్రమే డీఎఫ్‌వో కార్యాలయానికి వెళ్లి ఎఫ్ఆర్వోకు వినతిపత్రం అందజేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. అనంతరం వారిని సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. డీఎఫ్‌వో కార్యాలయ ముట్టడికి ఏఐబీఎస్ఎస్ యత్నం మోపాల్‌లో బైరాపూర్ గ్రామస్తుల ముందస్తు అరెస్ట్ -
బీకేఎస్ కృషితో రైతుకు న్యాయం
మోపాల్: భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో చేసిన పోరాటం, వినతులకు కలెక్టర్, పౌరసరఫరాలశాఖ అధికారులు స్పందించి రైతుకు న్యాయం చేశారు. లారీ కాంట్రాక్టర్ ద్వారా ఇప్పించిన రూ.60వేల చెక్కును బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు దేవుడిగారి సాయిరెడ్డి రైతు బక్క పోతన్నకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని సిర్పూర్ గ్రామానికి చెందిన రైతు బక్క పోతన్న వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని తెలిపారు. మే 18న 400 బస్తాల ధాన్యాన్ని మోపాల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రంలో విక్రయించారన్నారు. కానీ ట్రక్ షీట్లో కేవలం 310 బస్తాలు మాత్రమే అందినట్లు రైస్‌మిల్లు ద్వారా చూయించి ఈ బస్తాలకు మాత్రమే రూ.2,27,680 నగదు బ్యాంకు అకౌంట్లో జమచేశారని పేర్కొన్నారు. ఇదే విషయమై సొసైటీ సిబ్బందిని ప్రశ్నించినా.. నిలదీసినా.. స్పందించలేదని రైతు కలెక్టరేట్లోని ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడన్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న బీకేఎస్ కార్యకర్త గంగారెడ్డి రైతు బాధను విని, భారతీయ కిసాన్ సంఘ్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారన్నారు. అన్ని రుజువులతో రైతు, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డికి విన్నవించగా, ఆయన వెంటనే కలెక్టర్‌కు ఫోన్ చేసి రైతుకు న్యాయం చేయాలని ఆదేశించారని తెలిపారు. ఆ తర్వాత పోతన్న బీకేఎస్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్, పౌరసరఫరాలశాఖ అధికారులను కలువగా, తప్పిదానికి కారణమైన ట్రాన్స్‌ఫోర్ట్ కాంట్రాక్టర్ నుంచి రూ.60వేలను రైతుకు ఇప్పించామని పేర్కొన్నారు. రెండు నెలలపాటు భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు దేవుడిగారి సాయిరెడ్డి, గంగారెడ్డి, జనగాం భూమయ్య, ధశరథ్రెడ్డి తదితరులు కృషికిగాను రైతుకు న్యాయం జరిగిందని తెలిపారు. బీకేఎస్ పోరాటానికి రైతు బక్క పోతన్న ధన్యవాదాలు తెలిపారు. లారీ కాంట్రాక్టర్‌తో రూ.60వేలు ఇప్పించిన నాయకులు -
నిధులు లేక నిలిచిన నియామకాలు
మోర్తాడ్(బాల్కొండ): వైద్య విధాన పరిషత్‌లో వి లీనమైన సామాజిక ఆస్పత్రులలో వైద్య నిపుణులు, ఇతర వైద్య సిబ్బంది పోస్టుల భర్తీ నిధుల కేటా యింపు లేక పెండింగ్‌లో పడింది. వైద్య ఆరోగ్య శా ఖ పరిధిలోనే కొనసాగిన సామాజిక ఆస్పత్రులను గత ప్రభుత్వం వైద్య విధాన పరిషత్‌లోకి విలీనం చేసింది. అనంతరం ప్రత్యేక నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మోర్తాడ్, ధర్పల్లి, డిచ్పల్లి, బాల్కొండ, నవీపేట్, వర్నిలలోని 30 పడకల ఆస్పత్రులు, ఆర్మూర్‌లోని వంద పడకల ఆస్పత్రి వైద్య విధాన పరిషత్‌లో విలీనం చేశారు. భీమ్‌గల్ ఆస్పత్రి నిర్మాణంలో ఉన్నందున ఇక్కడ పోస్టుల భర్తీకి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 30 పడకల ఆస్పత్రులలో 14 మంది చొప్పున వివిధ రకాల నైపుణ్యం గల వైద్యులు, 18 మంది చొప్పున వైద్య సిబ్బంది, వంద పడకల ఆస్పత్రిలో 48 మంది లెక్కన వైద్యులు, 73 మంది చొప్పున వైద్య సిబ్బంది నియామకాలను చేపట్టాలని నిర్ధారించారు. జిల్లాలో అన్ని ఆస్పత్రులలో వైద్యులు, వైద్య సిబ్బంది కలిపి 313 పోస్టులకు నోటిఫికేషన్‌ను జారీ చేయాలని ప్రతిపాదించారు. నిధులు లేకుండా నియామకాలు చేపడితే వేతనాల చెల్లింపు ఎలా అనే సందేహంతో వైద్యు లు, సిబ్బంది పోస్టుల భర్తీని చేపట్టలేకపోయారు. వైద్య విధాన పరిషత్‌లో విలీనం చేసిన తరువాత పోస్టులను భర్తీ చేయకపోవడంతో వైద్య ఆరోగ్య శాఖ పరిఽధిలోని వైద్యులు, ఉద్యోగులతోనే వైద్య సేవలను నెట్టుకొస్తున్నారు. ఫలితంగా మెరుగైన వైద్య సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. వై ద్య విధాన పరిషత్‌కు నిధులను కేటాయిస్తే పోస్టుల భర్తీకి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులపై దృష్టి సారించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. త్వరలోనే నియామకాలు త్వరలోనే వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులలో నియామకాలు జరిగే అవకాశం ఉంది. పీహెచ్సీ వైద్యులు, సిబ్బందిని, వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్న కొంత మంది ఉద్యోగులతో వైద్య సేవలను అందిస్తున్నాం. రోగులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ శ్రీనివాస్‌రావు, వైద్య విధాన పరిషత్ జిల్లా అధికారి -
ఉత్తమ ఫలితాల కోసం దీర్ఘకాలిక ప్రణాళిక
నిజామాబాద్‌అర్బన్: విద్యా బోధనలో ఉత్తమ ఫలితాల కోసం దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని రాష్ట్ర ఇంటర్ విద్య బోర్డు జిల్లా ప్రత్యేకాధికారి ఒడ్డెన్న అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఇంటర్ విద్యా కార్యాలయంలో డీఐఈవో రవికుమార్ అధ్యక్షతన ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా బోధనపై ప్రిన్సిపాళ్లు ఇప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ వహించి దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించి అధ్యాపకులతో అమలు చేయించాలన్నారు. అపార్ గుర్తింపు లేని విద్యార్థులను గుర్తించి వెంటనే అపార్ నంబర్ గుర్తింపుతో పాటు యుడైస్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కళాశాలల్లో విద్యార్థులు, అధ్యాపకులు సమయపాలన పాటించడంలో ప్రిన్సిపాళ్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై అధ్యాపకులు శ్రద్ధ వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. -
ఢిల్లీ మహాధర్నాలో కాంగ్రెస్ నేతలు
సుభాష్‌నగర్: విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లను 42శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ని జంతర్ మంతర్ వద్ద బుధవారం నిర్వహించిన మహాధర్నాకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి హాజరయ్యారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ఆమోదం తెలపాలని కోరుతూ ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. అదే విధంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఢిల్లీలో నిర్వహించిన మహాధర్నాకు హాజరయ్యారు. ఆయన వెంట పార్టీ నాయకులు ఉన్నారు. -
ఢిల్లీలో ఇందూరు కాంగ్రెస్ నేతలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన ఆందోళనకు నిజామాబాద్ జిల్లా నుంచి నాయకులు తరలివెళ్లారు. ఈ రిజర్వేషన్ల విషయమై కేంద్ర ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు పార్టీ తలపెట్టిన ఈ పోరుకు జిల్లా నుంచి మంచి స్పందన వచ్చింది. ఢిల్లీలో తమ గళాన్ని బలంగా వినిపించారు. పీసీసీ అధ్యక్షుడు నిజామాబాద్ జిల్లా నుంచే ఉండడంతో జిల్లా నాయకులు పార్టీ పోరుబాట కార్యక్రమంలో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో మంచి జోష్ వచ్చింది. ఈ పోరుబాటతో రానున్న స్థానిక ఎన్నికల్లో తమకు తిరుగులేని విధంగా కలిసి వస్తుందని పార్టీ శ్రేణులు అంచనాలు వేసుకుంటున్నాయి. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఈ నెల 2, 3 తేదీల్లో ఆర్మూర్ నియోజకవర్గంలో నిర్వహించిన జనహిత పాదయాత్ర కార్యక్రమం, శ్రమదానం కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. అదేవిధంగా పార్టీ కార్యవర్గం, అనుబంధ సంఘాల బాధ్యులు, అన్ని మండలాల బాధ్యులతో నిర్వ హించిన ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశం పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ స్థాయిలో విజయాలు సాధిస్తామని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. జంతర్‌మంతర్‌కు జిల్లా నాయకులు.. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో చేపట్టిన ఆందోళనలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తోపాటు సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. నేడు రాష్ట్రపతికి వినతిపత్రం అందజేయనున్నారు. జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన ఆందోళనలో జిల్లా నుంచి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్‌గౌడ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, ఆకుల లలిత, మునిపల్లి సాయిరెడ్డి, దయాకర్ గౌడ్, బాస వేణుగోపాల్‌యాదవ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్‌గౌడ్, సకినాల శివప్రసాద్, నరాల రత్నాకర్, సుమన్, గన్‌రాజ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన పోరుకు తరలివెళ్లిన శ్రేణులు ఇటీవల జిల్లాలో జనహిత పాదయాత్ర సక్సెస్‌తో మరింత జోష్ పీసీసీ అధ్యక్షుడు జిల్లా నుంచే ఉండడంతో ఢిల్లీ పోరుకు భారీ స్పందనపథకాలపై పాజిటివ్ టాక్.. సన్నబియ్యం పంపిణీ పథకం నేపథ్యంలో ప్రభుత్వంపై సానుకూల స్పందన వస్తోంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం విషయంలోనూ ప్రభుత్వం పకడ్బందీగా ముందుకు వెళ్తోంది. ఇక భూభారతి ద్వారా భూ సమస్యలను పరిష్కరించే విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించనున్నట్లు పార్టీ నాయకులు, ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. రైతుభరోసా, సన్నధాన్యం, రైతులకు ఇవ్వనున్న బోనస్ సైతం తమకు కలిసివస్తాయని పార్టీ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. దీంతో తమకు స్థానిక ఎన్నికల్లో ఎలాంటి ఢోకా లేదనే ఆశాభావంతో ఉన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి భేష్
17,291 ఇళ్లు మంజూరు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతిపై కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవో లు, ఇంజినీరింగ్ విభాగాల అధికారులతో ఎండీ గౌతమ్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల క్షేత్రస్థాయి పరిస్థితిని మండలాల వారీగా పవర్ పాయింట్ ప్ర జెంటేషన్ ద్వారా ఎండీకి వివరించారు. జిల్లా వ్యాప్తంగా 19,306 ఇళ్లను కేటాయించాలని లక్ష్యం కాగా, 17,291 ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. వాటిలో 9,360 ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని, 5,541 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో పురోగతిలో ఉ న్నాయన్నారు. ఇంటి నిర్మాణం ప్రారంభించేందుకు ఆర్థిక స్థోమత లేని లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా రూ.లక్ష వరకు రుణం అందిస్తూ ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 2,637 మందికి రూ. 30.07 కోట్ల రుణాలు ఇప్పించామని వెల్లడించారు. ఇంటి నిర్మాణానికి సుముఖంగా లేని వారి నుంచి రాతపూర్వకంగా లేఖలు తీసుకుని, వారి స్థానంలో అర్హులైన వారికి మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి భేషుగ్గా ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ సెక్రటరీ, మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ జిల్లా యంత్రాంగం పనితీరును ప్రశంసించారు. ప్రత్యేకించి గడిచిన రెండు నెలల నుంచి ఇళ్ల నిర్మాణాల్లో జిల్లా గణనీయ మైన వృద్ధి సాధించిందని, రెండో విడత ఇళ్ల మంజూరు, గ్రౌండింగ్‌లో ఆశించిన స్థాయి కంటే ఎక్కువ పురోగతి సాధించారని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డితోపాటు సంబంధిత శాఖల అధికారులను అభినందించారు. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ బుధవారం జిల్లాలోని ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి, డిచ్పల్లి మండలం ఘన్పూర్ గ్రామాల్లోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఒత్తిళ్లకు తలొగ్గొద్దు.. అర్హులైన వారి పేర్లు ఇందిరమ్మ లబ్ధిదారుల జా బితా నుంచి రద్దు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ సూచించారు. అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాకుండా నిశితంగా పరిశీలించాలని, ఈ విషయంలో ఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గకూడదని స్పష్టం చేశారు. హౌసింగ్ అధికారులు తహసీల్దార్, ఎంపీడీవోలతో సమన్వయం చేసు కొని ఉచితంగా ఇసుక టోకెన్లు అందించాలని సూచించారు. కంకర, ఐరన్, సిమెంటు, ఇటుకలు ఇతర సామగ్రి నిర్ణీత ధరలకే అందించేలా మండల స్థాయి ధరల నియంత్రణ కమిటీ చర్య లు తీసు కోవాలన్నారు. మేసీ్త్రలు నిర్ధారిత రుసుమును మాత్రమే తీసుకునేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో తలెత్తున్న సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారుల ఆధార్ నంబర్‌కు లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతాలోకి బిల్లు మొత్తం జమ అవుతుందని, వారం రోజుల్లో ఈ ప్రక్రియ అమల్లోకి రానుందని ఎండీ గౌతమ్ వెల్లడించారు. లబ్ధిదారుల వివరాలను ప్రధానమంత్రి ఆవాస్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని, జియో ట్యాగింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులై న వారికి కేటాయించేందుకు చర్యలు తీసుకో వాలని అన్నారు. జిల్లా కేంద్రంలోని అభయ హస్తం కాలనీలో 4.32 ఎకరాల ప్రభుత్వ స్థలంలో జీ+3 విధానంలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందించేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని యంత్రాంగానికి సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, ట్రెయినీ కలెక్టర్ కరోలినా చింగ్తియాన్ మావి, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, హౌసింగ్ పీడీ పవన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ కితాబు ఇందల్వాయి, డిచ్పల్లి మండలాల్లో క్షేత్రస్థాయి పరిశీలన -
ముగిసిన విద్యుత్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి హాకీ టోర్నీ
నిజామాబాద్‌నాగారం: నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో రెండు రోజులపాటు నిర్వహించిన విద్యుత్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్ మంగళవారం ముగిసింది. విద్యుత్ స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్, విద్యుత్‌శాఖ ఎస్ఈ రవీంధర్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. వివిధ జిల్లాలకు చెందిన జట్లు పోటీ పడగా, విజేతగా వరంగల్ జట్టు నిలిచింది. రన్నర్‌గా నిజామాబాద్, మూడో స్థానంలో కరీంనగర్ జట్లు నిలిచాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యుత్‌శాఖ ఓఎంసీ పీవీ రావు హాజరై విజేతలకు ట్రోఫీలు, మెడల్స్, జ్ఞాపికలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలన్నారు. అనంతరం సామాజిక కార్యక్రమాలు చేసిన, జాతీయస్థాయి అవార్డు గ్రహీత తోట రాజశేఖర్‌ను సత్కరించారు. డీఈలు రమేష్, విక్రమ్, టోర్నమెంట్ ఆర్గనైజర్స్ తోట రాజశేఖర్, ఏవో గంగారాం, సురేష్ కుమార్, శంకర్ నాయక్, గోపి, ఉత్తమ్, దినేష్, మూర్తి, సీనయ్య, సతీష్, సుభాన్, పఠాన్, సత్యనారాయణ, స్వామి ,శ్రీకాంత్, హరీష్, గంగాధర్ తదితరులు ఉన్నారు. విజేతగా నిలిచిన వరంగల్ జట్టు రన్నర్‌గా నిజామాబాద్ -
సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు
డొంకేశ్వర్(ఆర్మూర్): సాగులో రైతులకు వెన్నుదన్నుగా ఉండేందుకు వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం, మిగతా రైతులకు 40 శాతం సబ్సిడీపై యంత్రాలు అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాకు 6,742 యూనిట్లు మంజూరు కాగా మొత్తం పదకొండు రకాల పరికరాలకు ఈ పథకం వర్తించనుంది. ఇందుకుగాను రూ.5.20కోట్లు కేటాయించగా మొదటి విడతగా రూ.1.67కోట్లు జిల్లాకు వచ్చాయి. అయితే ట్రాక్టర్లు, డ్రోన్లకు అవకాశం కల్పించకపోవడం రైతులను కొంత నిరాశపరిచింది. వ్యవసాయ పరికరాల కోసం రైతులు స్థానిక ఏఈవోలను లేదా మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో సంప్రదించాలని డీఏవో గోవింద్ తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి రైతు పట్టాదార్ పుస్తకం, ఆధార్ కార్డు అందజేయాలని సూచించారు. అలాగే భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించి దానికి సంబంధించిన పత్రాన్ని దగ్గర ఉంచుకోవాలని పేర్కొన్నారు. కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక వ్యవసాయ పరికరాల కోసం వచ్చిన దరఖాస్తుల్లో లబ్ధిదారుల ఎంపిక అధికారులతో కూడిన కమిటీలు ఫైనల్ చేయనున్నాయి. రూ.లక్ష లోపు పరికరాలకు మండల స్థాయి కమిటీ ఎంపిక చేస్తుంది. ఇందులో మండల వ్యవసాయాధికారి, తహసీల్దార్, ఎంపీడీవో ఉంటారు. అలాగే రూ.లక్షకు పైబడిన యంత్రాలుంటే జిల్లా స్థాయి కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. జిల్లా కమిటీలో కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా వ్యవసాయాధికారి, ఆగ్రోస్ ఆర్ఎం, వ్యవసాయ శాస్త్రవేత్త, ఎల్డీఎం సభ్యులుగా ఉంటారు. నియోజకవర్గాల వారీగా మంజూరైన యూనిట్లు, నిధులు నియోజకవర్గం యూనిట్లు నిధులు(లక్షల్లో) నిజామాబాద్‌రూరల్ 1,461 103.28 ఆర్మూర్ 1,077 92.05 భీమ్‌గల్ 1,684 122.35 బోధన్ 1,149 91.25 బాన్సువాడ 1,242 89.60 నిజామాబాద్‌అర్బన్ 98 14.50 యాంత్రీకరణ పథకాన్ని మళ్లీ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 6,742 యూనిట్లు, రూ.5.20 కోట్ల నిధులు కేటాయింపు రైతులు దరఖాస్తులు చేసుకోవాలని కోరిన వ్యవసాయ శాఖ పరికరాలు యూనిట్లు పవర్ స్ప్రేయర్లు 715 పిచికారీ యంత్రాలు 5,098 రోటవేటర్లు 274 సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్లర్స్ 64 డిస్క్హారో రోటవేటర్స్ 347 బండ్ ఫార్మర్ 15 పవర్ వీడర్స్ 33 బ్రష్ కట్టర్స్ 58 పవర్ టిల్లర్స్ 41 మేజ్ షెల్లర్స్ 20 స్ట్రా బాలర్స్ 77 -
బాధ్యతల స్వీకరణ
ఆర్మూర్: ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్‌గా అభిగ్యన్ మాల్వియా ఐఏఎస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. పట్టణంలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, అధికారులు అభినందనలు తెలిపారు. హైవేపై పల్టీలు కొట్టిన కారు ఇందల్వాయి: మండలంలోని గన్నారం గ్రామ శివారులోగల జాతీయ రహదారిపై ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. టోల్‌ప్లాజా సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా.. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన షేక్ హమీద్, షేక్ నదీప్, షేక్ అలీ ముగ్గురు కలిసి మంగళవారం ఉదయం శంషాబాద్ ఏయిర్పోర్టు నుంచి నిజామాబాద్‌కు బయలుదేరారు. గన్నారం గ్రామ శివారులోగల జాతీయ రహదారిపై వారి కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి పల్టీలు కొట్టి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. వెంటనే స్థానికులు గమనించి కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిని సురక్షితంగా బయటకు తీశారు. -
పరుచుకున్న పచ్చదనం
వర్షాకాలంలో ఎక్కడ చూసినా పచ్చదనం నిండుగా పరుచుకుంటుంది. పల్లెలు పచ్చని కోకను చుట్టుకున్నట్లు ప్రకృతి కాంతతో మమేకమై కనిపిస్తుంటాయి. నిజామాబాద్ నుంచి కామారెడ్డి జిల్లా గాంధారి మండలంకు వెళ్లే దారిలో బీర్మల్తండా, గుర్జాల్ తండా , చిన్నగుర్జల్ తండా, యాచారం తండాల చుట్టూ పచ్చదనం పరుచుకుంది. ఈ తండాల్లో వర్షాకాలం వచ్చిందంటే మక్క, పత్తి, సోయా పంటలను గిరిజనులు సాగుచేస్తారు. ఈక్రమంలో పచ్చని పంటపొలాల మధ్య తండాలు పచ్చదనంతో ఆహ్లాదంగా మారాయి. ఈ సుందర దృశ్యాన్ని సాక్షి మంగళవారం క్లిక్‌మనిపించింది. –సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
జంబిహనుమాన్ ఆలయ అధికారులపై విచారణ
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని జంబిహనుమాన్ ఆలయంలో గతేడాది జరిగిన చోరీపై మంగళవారం ఆలయ అధికారులను ఎండోమెంట్ అధికారులు విచారించారు. ఆలయంలో గత సంవత్సరం అక్టోబర్‌లో జరిగిన చోరీపై గతంలో శివసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరి ఎండోమెంట్ అఽధికారులకు ఫిర్యాదు చేశారు. అందులో భాగంగా దేవాదాయ శాఖ విచారణ అధికారి అంజలిదేవి, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ విజయ్రామరావు ఆలయంలో ఈవో రవీంధర్, జూనియర్ అసిస్టెంట్ హరితరాణి, అటెండర్ గోపిపై విచారణ చేపట్టారు. శివసేన పార్టీ నాయకుల, అధికారుల పరస్పర ఆరోపణలను విచారణ అధికారులు నమోదు చేసుకున్నారు. ఈ నివేదికను ఎండోమెంట్ కమిషనర్‌కు ఇవ్వనున్నట్లు అంజలిదేవి తెలిపారు. అలాగే ఈవో రవీంధర్‌ను, జూనియర్ అసిస్టెంట్ హరితరాణిని, అటెండర్ గోపిలను సస్పెండ్ చేయాలని శివసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ విచారణలో దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారయణ, అయ్యప్ప సేవాసమితి సభ్యులు, పంతులు నర్సింగ్‌రావు పాల్గొన్నారు. -
సీఎంసీ మెడికల్ కాలేజ్ పేరిట మోసం!
● పలువురి వద్ద రూ.కోట్లు వసూలు చేసిన నిందితుడు! ● ఆలస్యంగా వెలుగులోకి ఘటననిజామాబాద్నాగారం/డిచ్పల్లి: డిచ్పల్లి మండలం సుద్దపల్లి శివారులో గల సీఎంసీ (క్రిస్టియన్ మెడికల్ కాలేజ్) పేరిట ఓ వ్యక్తి నగరంలోని పలు వురి వద్ద రూ.కోట్లలో డబ్బులను వసూలు చేశాడు. కానీ వైద్యశాలకు అనుమతి రాకపోవడం, సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో నిందితుడిని నిలదీసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా.. కర్ణాటకకు చెందిన షణ్ముఖ మహాలింగం అనే వ్యక్తి సీఎంసీని ఇటీవలే పునఃప్రారంభించారు. ఈక్రమంలో అతడు ఓ ఐఎంఏ నేతకు డైరెక్టర్ పదవి ఇస్తానని చెప్పి రూ. 3కోట్ల వరకు నొక్కేసినట్లు సమాచారం. దీంతోపాటు వైద్యులను ఫ్యాకల్టీగా పెట్టుకుంటానని చెప్పడంతో జిల్లాలో ఉన్న పలువురు వైద్యుల వద్ద షణ్ముక లింగం చెప్పినట్లు అతడు డబ్బులు వసూలు చేసి ఇచ్చినట్లు సమాచారం. అలాగే కాంట్రాక్టర్ ద్వారా పనులు చేయించడంతో పాటు మూడు నెలలుగా కొంతమంది డా క్టర్లు, స్టాప్ నర్సులు, ఇతర ఉద్యోగులను,శానిటేషన్, సెక్యూర్టీగార్డ్స్ తదితర సిబ్బందిని నియమించుకున్నారు. నియామకాల్లో కూడా ఒక్కోక్కరి వద్ద రూ. 50వేల నుంచి రూ. 1లక్ష వరకు వసూలు చేసిన్నట్లు సమాచారం. కానీ జీతాలు ఇవ్వకపోవండతో సీఎంసీ చైర్మన్ అని చెప్పుకునే షణ్ముకమహాలింగంను కొన్ని రోజుల క్రితం సిబ్బంది నిలదీయడంతో వెలుగులోకి వచ్చింది. పోలీసులు వచ్చి షణ్ముకను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో డిచ్పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. అనుమతి ఇవ్వని ఎన్ఎంసీ.. సీఎంసీని పున:ప్రారంభించడంతో నెల కిందటే ఎన్ఎంసీ బృందం ఢిల్లీ నుంచి వచ్చి పరిశీలించింది. నిబంధనలు పాటించలేదని అనుమతి ఇవ్వలేమని తేల్చిచెప్పేశారు. సీఎంసీ కాలేజ్‌లో ఆస్పత్రి ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా వైద్యారోగ్యశాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. దీంతో నిర్వాహకులు అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో మూడు నెలల ప్రాథమిక అనుమతి ఇచ్చారు. ఇందుకోసం అధికారులు పెద్ద ఎత్తున ముడుపులు అందుకున్నారని శాఖలో ఉద్యోగులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. చీటింగ్ కేసు నమోదు చేశాం.. సీఎంసీ కాలేజీకి సంబంధించి డాక్టర్ అజ్జ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు షణ్ముఖ మహాలింగంపై చీటింగ్ కేసు నమోదు చేశాం. విచారణ చేస్తున్నాం. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం. –మహమ్మద్ షరీఫ్, డిచ్పల్లి ఎస్సై -
స్టాక్ ఉండగానే ఎరువులు తెప్పిస్తున్నాం
బోధన్: జిల్లాలో 11వేల మెట్రిక్ టన్నుల ఎరువుల స్టాక్ ఉండగానే మళ్లీ స్టాక్ తెప్పిస్తున్నామని, ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటుండడంతో ఎక్కడా కొరత ఏర్పడలేదని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. గ్రామంలోని పల్లె దవాఖాన, సొసైటీ ఎరువుల గోదామును తనిఖీ చేశారు. పల్లె దవాఖానలో సిబ్బంది హజరు, అవుట్ పేషంట్ల రిజిస్టర్లను తనిఖీ చేశారు. దోమల నియంత్రణకు ఫాగింగ్ చేయడం లేదని తెలిసి గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేశ్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి డీపీవోకు ఫోన్ చేసి ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఫాగింగ్ చేపట్టేలా చూడాలని ఆదేశించారు. సహకార సొసైటీ గోదాములో స్టాక్‌ను తనిఖీ చేసిన కలెక్టర్.. సరిపడా ఎరువులు అందుతున్నాయా? అని అక్కడికి వచ్చిన రైతులను ప్రశ్నించారు. ఒకే సారి కాకుండా అవసరానికి అనుగుణంగా ఎరువులు తీసుకెళ్లాలని రైతులకు సూచించారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు రూ.30కోట్ల రుణాలు ఇందిరమ్మ ఇల్లు మంజూరైనా నిర్మాణానికి ఆర్థికస్థోమత లేని లబ్ధిదారులకు స్వయం సహాయక మహిళా పొదుపు సంఘాల ద్వారా రూ.లక్ష చొప్పున రుణ సదుపాయం కల్పిస్తున్నామని, రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో లబ్ధిదారులకు రూ.30కోట్లకు పైగా రుణాలు అందించామని కలెక్టర్ వెల్లడించారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుండగా, ఉచితంగా ఇసుకను సమకూరుస్తున్నామన్నారు. అయినప్పటికీ లబ్ధిదారులు ఎవరైనా ఇంటి నిర్మాణానికి ముందుకు రాకపోతే వారి నుంచి రాతపూర్వకంగా లేఖలు తీసుకుని జాబితాలో నుంచి వారి పేర్లను తొలగించి వారి స్థానంలో అర్హులకు ఇల్లు కేటాయించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇళ్లను అర్హులకు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో ఆఫీస్‌ల్లో ప్రజా పాలన సేవా కేంద్రాలు కొనసాగుతున్న విషయం ప్రజలందరికీ తెలిసేలా ఆఫీస్‌ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడా కొరత లేదు ఇందిరమ్మ ఇళ్లకు ఎస్‌హెచ్‌జీ ద్వారా రుణం నిర్మాణం పూర్తయిన ‘డబుల్’ ఇళ్లను అర్హులకు కేటాయించాలి అధికారులకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాలు -
క్రైం కార్నర్
చెరువులో పడి ఒకరి మృతి సిరికొండ: మండలంలోని రావుట్ల గ్రామంలోని ఊర చెరువులో పడి ఒకరు మృతిచెందినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన జాగర్ల నరహరి(43) అనే వ్యక్తి ఈ నెల 3న స్నానం చేయడానికి ఊర చెరువులోకి వెళ్లాడు. కానీ ఈత రాకపోవడంతో అతడు నీట మునిగి, మృతిచెందాడు. మృతుడి భార్య లహరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ ఒకరు... మాక్లూర్: ఇటీవల ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని ధర్మోరా గ్రామానికి చెందిన అరుణ్(28) కుటుంబ గొడవల కారణంగా ఈనెల 3న ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మంగళవారం పరిస్థితి విషమించడంతో అతడు మృతిచెందాడు. ఈ ఘటనతో గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తే అవకాశం ఉండటంతో అరుణ్ అంత్యక్రియలు పూర్తయ్యేవరకు పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. చోరీ కేసులో ఒకరికి ఏడాది జైలు శిక్ష బాల్కొండ: మండల కేంద్రంలోని ఓ వైన్స్ దుకాణంలో చోరీకి పాల్పడిని వ్యక్తికి ఆర్మూర్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణ తెలిపారు. వివరాలు ఇలా.. బాల్కొండలోని తుల్జా భవాని వైన్స్ షాపులో 2024 సెప్టెంబర్ 4న నిర్మల్ మండలం కొండపూర్ గ్రామానికి చెందిన నక్క పోశెట్టి చోరీకి పాల్పడ్డాడు. షట్టర్ తాళం పగలగొట్టి రూ. 14వేల నగదుతోపాటు కొన్ని మందు బాటిళ్లను ఎత్తుకెళ్లాడు. ఈఘటనపై అప్పటి ఎస్సై నరేష్ కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకొని, ఆర్మూర్ కోర్టులో హాజరుపర్చారు. జడ్జి సరళరాణి సాక్ష్యాధారాలను పరిశీలించి, మంగళవారం అతడికి ఏడాది జైలుశిక్షతోపాటు రూ.2వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు ఆయన తెలిపారు. అట్రాసిటీ కేసులో ఒకరికి.. నిజామాబాద్ లీగల్: కులం పేరుతో దూషించి, దాడి చేసిన కేసులో ఒకరి కి నిజామాబాద్ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. వివరాలు ఇలా.. నగరంలోని మిర్చి కాంపౌండ్ చెందిన దుర్గయ్యను, తన కొడుకును క్రాంతి కుమార్ అనే వ్యక్తి 24 డిసెంబర్ 2020న కులం పేరుతో దూషించి దాడి చేశాడు. బాధితులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుని కోర్టులో హాజరుపర్చారు. విచారణ చేపట్టిన జడ్జి నిందితుడికి ఏడాది జైలు శిక్షతోపాటు రూ.2,400 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. -
మోతీరాంనాయక్ తండాలో ఉద్రిక్తత
మోపాల్(నిజామాబాద్‌రూరల్): మండలంలోని బైరాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని మోతీరాంనాయక్ తండాలో మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. అటవీభూమిలో పంట సాగుచేయడంతో ఫారెస్టు అధికారులు పంటకు గడ్డి మందు పిచికారి చేయడంతో అధికారులకు, గిరిజనులకు మధ్య వా గ్వాదం చోటుచేసుకుంది. ఈక్రమంలో ఓ రైతు ఆ త్మహత్యకు యత్నించాడు. వివరాలు ఇలా.. తండా కు చెందిన ప్రకాశ్ అనే గిరిజన రైతు అటవీ భూమి లోని 3ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నా డు. ఏప్రిల్ 29న రైతు ఆ భూమి చదును చేయగా, ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు రావడంతో చదును చేయవద్దన్నారు. అవేమీ పట్టించుకోకుండా సదరు రైతు పంట సాగుచేయడంతో మేలో నోటీసులిచ్చా రు. అయినా అతడు స్పందించకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎఫ్ఆర్వో రాధిక స మక్షంలో ఫారెస్ట్ అధికారులు గడ్డి మందు స్ప్రే చేశా రు. వెంటనే అధికారులను ప్రకాష్ కుటుంబంతోపాటు గిరిజనులు అడ్డుకున్నారు. కొన్ని రోజుల్లో పంట చేతికొస్తుందని, ఆ తర్వాత పంట వేయబో మని నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే రెండెకరాల్లో మందును స్ప్రే చేసినట్లు గిరిజనులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువురిని సముదాయించారు. చేతికొచ్చిన పంటను అధికారులు నాశనం చేయడంతో మనస్తాపానికి గురైన రైతు ప్రకాష్ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆయనను వెంటనే నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కాగా ప్రకాశ్ గడ్డి మందు తాగలేదని, తమను బెదిరించేందుకు అలా చేశారని ఫారెస్ట్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా అటవీభూమిని సాగుచేయడమే కాకుండా ఫారెస్టు అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుస్మిత తెలిపారు. అటవీ అధికారుల ఫిర్యాదు మేరకు రైతు ప్రకాష్, అతడి భార్య కవిత, బంధువైన జలెందర్పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అటవీ భూమిలో వేసిన మొక్కజొన్న పంటకు గడ్డిమందు స్ప్రేకు ఫారెస్టు అధికారుల యత్నం అడ్డుకున్న గిరిజనులు మనస్తాపంతో గడ్డి మందు తాగిన రైతు! -
చేయూత పెన్షన్ పెంచాలి
పెర్కిట్(ఆర్మూర్): కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హా మీ మేరకు వెంటనే చేయూత పెన్షన్‌ను పెంచి, అర్హులకు అందించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్య క్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆర్మూ ర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్‌లో మంగళవారం మహాగర్జన సన్నాహక సభ నిర్వహించారు. ఈసందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చే యూత పింఛన్లను రూ.2 వేల నుంచి రూ.4 వేలు, వికలాంగుల పింఛన్లను రూ.4 వేల నుంచి రూ.6 వేలు పెంచుతామని హామీలిచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి పింఛన్ పెంపు విషయంలో ముఖం చాటేస్తున్నారన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి దేశంలోనే నెంబరు వన్ మోసగాడని, అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నించని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ నంబరు వన్ అసమర్థ నాయకుడని అన్నారు. పించను పెంచే విషయంలో ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికే హైదరాబాద్‌లో ఈ నెల 13న చేయూత, వికలాంగుల పింఛన్‌దారులతో మహాగర్జన సభ చేపడుతున్నట్లు వెల్లడించారు. సభను ప్రజలు భారీ గా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపుని చ్చారు. ఎమ్మార్పీఎస్ ప్రతినిధులు సుజాత సూర్యవంశీ, బీరప్ప, సలీం, ఖలీం, స్వామి, పోశెట్టి, బా లు, కనక ప్రమోద్, రాజేశ్, స్వామి దాస్, శ్యామ్, కృష్ణవేణి, సరిత, గంగాధర్ పాల్గొన్నారు. -
ఆగమవుతున్న లక్ష్మి ఆయకట్టు
బాల్కొండ: సాగునీటి కోసం ఎస్సారెస్పీ ప్రధాన కాలువల్లో ఒకటైన లక్ష్మి కాలువ ఆయకట్టు రైతులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. పంటల సాగు తోపాటు చెరువులు నింపేందుకు 2 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని, ప్రాజెక్టులో అవసరానికి అ నుగుణంగా నీరున్నా లక్ష్మి కాలువకు విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది ఆగస్టు మొదటి వారంలో నీటివిడుదల ప్రారంభమయ్యేదని, ప్రాజెక్టు నిర్మాణం కోసం త్యాగం చేసిన తమ పరిస్థితి ఈ ఏడాది అగమ్యగోచరంగా మారిందని అంటున్నారు. శ్రీరాంసాగర్ ప్రా జెక్ట్ నుంచి లక్ష్మి కాలువ ద్వారా 150 క్యూసెక్యుల చొప్పున నీటిని విడుదల చేయాలని పాలకులు అధికారులపై ఒత్తిడి తెస్తుండగా, ఆయకట్టు రైతులు సైతం ఇదే డిమాండ్ చేస్తున్నారు. మెండోరా, ముప్కాల్, బాల్కొండ, వేల్పూర్, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల పరిధిలో కాలువ కింద 50 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇప్పటికే 70 నుంచి 80 శాతం నాట్లు పూర్తికాగా, వర్షాభావ పరిస్థితుల కారణంగా మరో 20 శాతం భూముల్లో నాట్లు ఇప్పటికీ పూర్తికాలేదు. అయితే నాట్లు పూర్తయిన భూములకు నీరందకపోవడంతో అక్కడక్కడ పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇటు వర్షాలు కురవక, అటు ఎస్సారెస్పీ నుంచి లక్ష్మి కాలువ ద్వారా నీరందక రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అవసరం మేరకు నీరున్నా.. లక్ష్మి ఆయకట్టు పరిధిలోని 50వేల ఎకరాల్లో పంటలు గట్టెక్కడంతోపాటు చెరువులను నింపేందుకు 2 టీఎంసీల నీరు సరిపోతుందని ప్రాజెక్టు అధికారుల రికార్డులు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 40.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. లక్ష్మి కాలువ ద్వారా నీటి విడుదల చేపడితే పెద్దగా ప్రాజెక్ట్‌లో నీరు అందకుండా పోయే ప్రమాదమేమీ ఉండదు. కాకతీయ కాలువ ద్వారా నిరంతరం 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారని, అటువంటప్పుడు లక్ష్మికాలువ ద్వారా నీటిని విడుదల చేస్తే తప్పేమిటని ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు. లక్ష్మి కాలువ ఎస్సారెస్పీ నుంచి విడుదల కాని నీరు కాలువ కింద ఇప్పటికీ పూర్తికాని నాట్లు.. వేసిన నాట్లు ఎండిపోయే పరిస్థితి ప్రాజెక్టులో ప్రస్తుతం 40.5 టీఎంసీల నీటి నిల్వ ఆయకట్టుకు 2 టీఎంసీలే అవసరం..కొత్త లొల్లి.. పరిస్థితుల నేపథ్యంలో లక్ష్మి కాలువకు ప్రస్తుతం అనధికారికంగా కొంత నీరు విడుదలవుతోంది. అయితే ఇది ఎక్కడా రికార్డులో నమోదు కావ డం లేదు. అనధికారికంగా విడుదలవుతున్న నీ రు చాలామట్టుకు ఆవిరవుతోంది. డీ3 వరకు అరకొరగా నీరందుతుండగా, డీ4 ఆయకట్టు రై తులకు అసలే లేదు. ముప్కాల్ మండలం న ల్లూర్ వాసులు ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ గ్రామాన్నే కోల్పోయామని గ్రామ శివారులోని కాలువలో అడ్డుకట్ట వేసి నీటిని చెరువులోకి మ ళ్లించుకుంటున్నారు. దీంతో కొత్త లొల్లి షురూ అయ్యిందని రైతులు ఆందోళన చెందుతున్నా రు. లక్ష్మి కాలువ నిర్వహణ మైనర్ ఇరిగేషన్ (బాల్కొండ శాఖ) పర్యవేక్షిస్తుంది. నీరు మా త్రం ప్రాజెక్ట్ అధికారుల కంట్రోల్లో ఉంటుంది. పాలకులు స్పందించి నీటిని విడుదల చేసే లా చర్యలు తీసుకోవాలని, లేకుంటే జల వివా దాలు తలెత్తుతాయని రైతులు అంటున్నారు. వెంటనే నీటిని విడుదల చేయాలి లక్ష్మికాలువ ద్వారా వెంటనే నీటిని విడుదల చేయాలి. కాలువలో ఇప్పుడు వదులుతున్న నీరు చివరాయకట్టు వరకు రావడం లేదు. దీంతో వరి నాట్లు వేయలేక పోతున్నాం. కొన్ని నీళ్లు ఎందుకు ఇస్తున్నారు. కాలువలోనే ఇంకి పోతున్నాయి. పంటలను కాపాడేందుకు నీళ్లు వదలాలి. – ఆకుల రాజన్న, ఆయకట్టు రైతు -
వారిదే ఇష్టారాజ్యం!
నిజామాబాద్సబ్సిడీపై వ్యవసాయ.. సాగులో రైతులకు వెన్నుదన్నుగా ఉండేందుకు వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది. బుధవారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2025– 10లో u● ఆర్మూర్ నియోజకవర్గంలో 192 పనులకుగాను 41 పనులు పూర్తి అయ్యాయి. ఒక పని పురోగతిలో ఉంది. 150 పనులు ఇంకా ప్రారంభించలేదు. ఇప్పటి వరకు రూ.1,11,37,346 ఖర్చు చేశారు. ● బాల్కొండ నియోజకవర్గంలో 290 పనులకు గాను 55 పనులు పూర్తి అయ్యాయి. ఒక పని పురోగతిలో ఉంది. 234 పనులు ఇంకా ప్రారంభించలేదు. రూ.1,70, 52,858 ఖర్చు చేశారు. ● బోధన్ నియోజకవర్గంలో 158 పనులు చేపట్టాలని నిర్ణయించారు. వీటిలో 14 పనులు మాత్రమే పూర్తి అయ్యాయి. ఒక పని పురోగతిలో ఉంది. 143 పనులు ఇంకా ప్రారంభించలేదు. రూ.67,73,847 ఖర్చు చేశారు. ● నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 178 పనులను చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో ఇప్పటి వరకు 29 పనులు మాత్రమే పూర్తి చేశారు. ఒక పని పురోగతిలో ఉంది. 148 పనులు ఇంకా ప్రారంభించలేదు. రూ.1,52,52,025 ఖర్చు చేశారు. ● నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 304 పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో ఇప్పటి వరకు 86 పనులు పూర్తి అయ్యాయి. ఒక పని పురోగతిలో ఉంది. 217 పనులు ప్రారంభం కాలేదు. రూ.1,91,19,168 ఖర్చు చేశారు.సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అధికారం మనదే కదా, మనం ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన ప్రత్యేక నిధులను అధికార పార్టీ నియోజకవర్గాల ఇన్చార్జులు జిల్లా ఇన్చార్జి మంత్రి ద్వారా తమ ఇష్టం వచ్చిన పనులకే ఖర్చు పెడుతున్నారు. జిల్లాలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, బాల్కొండ నియోజకవర్గాలకు 2024–25 సంవత్సరానికి గాను రూ.10 కోట్ల చొప్పున మొత్తం రూ.50 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధుల ద్వారా ఈ ఐదు నియోజకవర్గాల్లో మొత్తం 1,122 పనులు మంజూరయ్యాయి. వీటిలో 225 పనులు పూర్తయ్యాయి. 5 పనులు జరుగుతున్నాయి. మరో 892 పనులు ఇంకా మొదలు కాలేదు. మొత్తం రూ.50 కోట్ల లో ఇప్పటివరకు రూ. 6,93,35,244 ఖర్చు చేశా రు. నియోజకవర్గాల్లో ప్రజలచేత గెలుపొంది ప్రాతి నిధ్యం వహిస్తున్న విపక్ష ఎమ్మెల్యేలను కాదని అధి కార పార్టీ నాయకులు చెప్పినట్లే పనులు చేస్తున్నా రు. ప్రజల ఓట్లతో గెలుపొంది ప్రాతినిధ్యం వహిస్తున్న తమకు అభివృద్ధి పనుల కోసం ఒక్క పైసా లేకుండా చేయడమేమిటని బాల్కొండ బీఆర్ఎస్ ఎ మ్మెల్యే వేముల ప్రశాంత్‌రె డ్డి, ఆర్మూర్ బీజేపీ ఎమ్మె ల్యే పైడి రాకేష్‌రెడ్డి, నిజా మాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు.సీడీపీ నిధులు పైసా ఇవ్వలేదు.. నగరాభివృద్ధిని కాంక్షించిన ప్రజలు నన్ను ప్రజాప్ర తినిధిగా గెలిపించారు. ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్కపైసా సీడీపీ నిధులు ఇవ్వలేదు. ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద వచ్చిన డబ్బుల్లో ఒక్కపైసా కూడా ఎమ్మెల్యే ద్వారా ఖర్చు చేయడం లేదు. అధికార పార్టీ నాయకులే ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తున్నా రు. రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు. – ధన్పాల్ సూర్యనారాయణ, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేఅప్రజాస్వామికం.. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై న ఎమ్మెల్యేలకు అభివృద్ధి నిధులు కేటాయించకపోవడం శోచనీయం. అధికార పార్టీ నాయకులు పూర్తి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థతపై ప్రశ్నిస్తే ఇళ్లపై దాడులు చేసే సంస్కృతికి తెరతీశారు. ఇది మంచి పద్ధతి కాదు. – వేముల ప్రశాంత్‌రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యేఇది మంచి పద్ధతి కాదు.. ఆర్మూర్ ప్రజలు భారీ మెజారిటీతో నన్ను గెలిపించారు. నా దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం కో సం ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌కు మాత్రం రూ.వెయ్యి కోట్లు కేటాయించడం అసమతుల్యానికి నిదర్శనం. అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్లు చేస్తే భవిష్యత్ తరాలకు ఏమి చెప్పాలి. – పైడి రాకేష్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యేన్యూస్రీల్ విపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గ్గాల్లో అధికార పార్టీ నేతల పెత్తనం వారు ప్రతిపాదించిన పనులకే ప్రత్యేక నిధుల వినియోగం జిల్లా ఇన్చార్జి మంత్రి ద్వారా నిధుల కేటాయింపులు నిస్సహాయ స్థితిలో విపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని ఆగ్రహావేశాలు -
నిజాంసాగర్ నీటి విడుదల
నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు మంగళవారం నీటి విడుదల చేపట్టినట్లు నీటిపారుదల శాఖ ఏఈ అక్షయ్ తెలిపారు. 600 క్యూసెక్కుల చొ ప్పున నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ప్రధాన కాలువ ద్వారా ప్రవహిస్తున్న నీటిని ఆయకట్టు ప్రాంత రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎస్సారెస్పీకి తగ్గిన వరద బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగు వ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుము ఖం పట్టింది. ప్రాజెక్ట్‌లోకి 4,150 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 100 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 462 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా తాగు నీటి అవసరాలకు 231 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1078.30(40.5 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేయాలి నిజామాబాద్ సిటీ: అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల ద్వారా కావాల్సిన నీటిని ప్రభుత్వం విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూరు భూమయ్య డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో మంగళవారం ఏర్పా టు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా రైతులు వరి నాట్లు వేశారని, సకాలంలో వర్షాలు పడక వరి నాట్లు ఎండిపోతు న్నాయన్నారు. అధికారులు ప్రతి ఏడాది జూ న్, జూలైలో అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేసేవారని, ఈ ఏ డాది ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి నీటిని విడు దల చేయాలని కోరారు. నాయకులు దేశెట్టి సాయిరెడ్డి, హగ్గు ఎర్రన్న, బోరిగాం సాయి లు, రాపాని గంగాధర్, సాయి పాల్గొన్నారు. ల్యాబ్‌లను సద్వినియోగం చేసుకోవాలి డిచ్పల్లి: సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లను స ద్వినియోగం చేసుకుని చదువుతోపాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు డీఈవో అశోక్ సూచించారు. వ్యాపారవేత్త ఏనుగు దయానంద్‌రెడ్డి సహకారంతో రూ.2.5 లక్షల వ్యయంతో ఖిల్లా డిచ్పల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన సైన్స్, కంప్యూటర్ ల్యా బ్‌ను డీఈవో మంగళవారం ప్రారంభించా రు. ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి, గెజిటెడ్ హెచ్ఎం సీతయ్య, మాజీ సర్పంచ్ సుదర్శన్, గంగాధర్, అమ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సావిత్రి, ఉపాధ్యాయులు, విద్యార్థు లు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సందర్శించారు. ల్యా బ్‌లను పరిశీలించి తరగతి గదుల్లో విద్యార్థులతో మాట్లాడారు. ఎంఈడీ పరీక్ష ఫీజు చెల్లించండి తెయూ(డిచ్పల్లి): తెలంగాణ వర్సిటీ పరిధి లోని ఎంఈడీ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లా గ్ పరీక్ష ఫీజును ఈనెల 18 వరకు చెల్లించాల ని కంట్రోలర్ సంపత్‌కుమార్ ఒక ప్రకటన లో తెలిపారు. ఆగస్టు, సెప్టెంబర్‌లో జరగబోయే ఎంఈడీ 4వ సెమిస్టర్ రెగ్యుల ర్, 1, 2, 3వ సెమిస్టర్ బ్యాక్లాగ్ థియరీ ప రీక్షల కు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 18వరకు ఫీజు చెల్లించాలన్నారు. రూ.100 అపరాధ రుసుముతో 21 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంటుందన్నారు. కారులో పీపీపీ వీక్షించిన వేముల వేల్పూర్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీశ్‌రావు తెలంగాణ భవన్‌నుంచి ఇ చ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్(పీపీపీ)ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కారులో ప్రయాణిస్తూ వీక్షించారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆ రాష్ట్రానికి వెళ్లిన వేముల రాంచీ నుంచి సోరె న్ స్వగ్రామానికి కారులో ప్రయాణిస్తూ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌ను వీక్షించారు. అ నంతరం నిజామాబాద్‌లో పీపీపీని వీక్షించిన నాయకులతో మాట్లాడారు. -
మంజూరైంది.. ఇక ముందుకు
సవాళ్లు ముందున్నాయి.. ● గ్రామీణ విద్యార్థులకు అందుబాటులోకి సాంకేతిక విద్య ● తెయూలో ఇంజినీరింగ్ కళాశాల మంజూరుతో నెరవేరిన ఆకాంక్ష ● నాలుగు కోర్సులు.. 264 సీట్లు ● మూడో విడత కౌన్సెలింగ్‌లో సీట్ల భర్తీ ● కంప్యూటర్ సైన్స్‌లో ఆధునిక కోర్సులు తెయూ(డిచ్పల్లి) : తెలంగాణ వర్సిటీలో రాష్ట్ర ప్ర భుత్వం ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేయడంతో ఉమ్మడి జిల్లా వాసుల దశాబ్దాల కల నెరవేరింది. యూనివర్సిటీ ఏర్పడిన కొత్తలో మొదటి వీసీగా పని చేసిన ప్రొఫెసర్ కాశీరాం వర్సిటీలో సాంప్రదా య కోర్సులతోపాటు సాంకేతిక కోర్సులు ఉంటే బాగుంటుందని భావించారు. అప్పటి నుంచే ప్ర ణాళికలు సిద్ధం చేయగా, సుమారు 18 ఏళ్ల తర్వాత కల నెరవేరింది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబా ద్ జిల్లాలకు చెందిన గ్రామీణ పేద విద్యార్థులకు సాంకేతిక విద్య అందుబాటులోకి వస్తోంది. కంప్యూ టర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) నా లుగు కోర్సులను ప్రభుత్వం మంజూరు చేసింది. కోర్సుకు 60 సీట్లతోపాటు ఈడబ్యుఎస్ కోటా కింద 6 చొప్పున మొత్తం 264 సీట్లు అందుబాటులో ఉ న్నాయి. మూడో విడత ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ద్వా రా సీట్లను భర్తీ చేయనున్నారు. వెబ్ ఆప్షన్స్ విద్యార్థులు ఈనెల 5, 6, 7 తేదీల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఈఏపీసెట్ వెబ్సైట్లో 162 క్రమసంఖ్యలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలకు ‘టీయూసీఈ’ కోడ్ కేటాయించారు. ఇంజినీరింగ్ కళాశాలలో చేరిన వారు ప్రభుత్వం నిర్ణయించిన రూ.50వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అర్హులైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. 10వేల లోపు ర్యాంకు సాధించిన వారు ఫీజు చెల్లించనక్కర్లేదు. 10వేలకు పైగా ర్యాంకు వచ్చిన విద్యార్థులకు రూ.35 వేల ఫీజు రీయింబర్స్మెంట్పోను కేవలం రూ.15 వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నిరంతర పర్యవేక్షణ అవసరం ప్రస్తుతం ప్రవేశ పెట్టి న నాలుగు కోర్సులు మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆధునిక కోర్సులని చెప్పొ చ్చు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకని వారికి సరైన బోధన అందించేందుకు క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీని ఎంపిక చేయాలి. తగినంత కంప్యూటర్ ల్యాబ్స్ సౌకర్యం కల్పించాలి. విద్యార్థులకు రెగ్యులర్ సిలబస్ తో పాటు వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాలపై పూర్తి పట్టు ఉండేటట్లు సిలబస్ డిజైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రసిద్ధి చెందిన కంపెనీలతో వర్సిటీ ఒప్పందం చేసుకుని విద్యార్థులకు ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్, ఉద్యోగాల కల్పన సౌకర్యం కల్పించేందుకు కృషి చేయాల్సి ఉంటుంది. ఈ విషయమై వర్సిటీ ఉన్నతాధికారు లు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్ విద్యలో క్వాలిటీ ప్రమాణాలు చాలా వరకు తగ్గిపోయాయని పలు రిపోర్టులు, రీసెర్చ్‌లు చెబుతున్నాయి. ఉపాధి పొందేందుకు అవసరమైన టెక్నికల్ నైపుణ్యాలు విద్యార్థుల్లో కొరవడ్డాయని తెయూ ఇంజినీరింగ్ కళాశాల కూడా అదే దారిలో ప్రయాణిస్తే ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు ఆవశ్యకత మరుగున పడిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యూనివర్సిటీ అధికారులు ఇంజినీరింగ్ సిలబస్, బోధనా పద్ధతులు, పారిశ్రామిక రంగానికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు అందించడం, ఉద్యోగాల కల్పనపై జాగ్రత్తలు వహించాలని విద్యా వేత్తలు సూచిస్తున్నారు. డిమాండ్ ఉన్న కోర్సులు.. ప్రస్తుతం మంజూరైన నాలు గు కంప్యూటర్ కోర్సులు ప్రస్తుతం మార్కెట్లో బా గా డిమాండ్ ఉన్నవి. విద్యా ర్థులు ఈఏపీసెట్ మూడో విడత కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వచ్చే విద్యా సంవత్సరం ఈసీఈ, ఈఈఈ, ఈఐఈ కోర్సులను ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తాం. – సీహెచ్ ఆరతి. ప్రిన్సిపాల్అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు.. ప్రస్తుతం తెయూ కంప్యూటర్ సైన్స్ విభాగంలో అనుభవం కలిగిన అధ్యాపకులు ఉన్నారు. ఐదుగురు రెగ్యులర్ అధ్యాపకుల్లో ఒకరు సీనియర్ ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండగా, మరో ఇద్దరు కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉన్నారు. అలాగే కంప్యూటర్ ల్యాబ్‌లు ఉన్నాయి. – ఎం.యాదగిరి, రిజిస్ట్రార్, తెయూ -
జాప్యానికి కారణమేమిటి?
నిజామాబాద్ అర్బన్ : భూభారతి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని పదేపదే చెబుతున్నా అర్జీల సత్వర పరిష్కారానికి ఎందుకు చొరవచూపడం లేదని పలు తహసీల్దార్ల తీరుపై కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. దరఖాస్తుల పరిష్కారం ఆలస్యమవుతున్న మండలాల తహసీల్దార్లను జాప్యానికి కారణాలు ఏమిటని ప్రశ్నించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఆర్ఐలు, సర్వేయర్లతో భూభారతిపై మంగళవారం సమీక్షించారు. రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తుల వివరాలు మండలాల వారీగా తెలుసుకున్న కలెక్టర్.. ఎన్ని దరఖాస్తులను పరిష్కరించారు? ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి? ఎంత మందికి నోటీసులు ఇచ్చారు? క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయ్యిందా? తదితర వివరాలను తెలుసుకున్నారు. ఆర్డీవోలు ప్రతిరోజూ ఒక మండలాన్ని తప్పనిసరిగా సందర్శించి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను పర్యవేక్షించాలని, అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లాలని సూచించారు. నిర్ణీత గడువు లోగా అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలని, ఆమోదించిన దరఖాస్తులను 24 గంటలలోగా ఆర్డీవోల ఆమోదం కోసం పంపించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఆన్లైన్లో అందిన దరఖాస్తులను సైతం వెంటనే పరిష్కరించాలన్నారు. సాదా బైనామా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందిన వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వీలుగా నోటీసులు రూపొందించుకుని అన్ని విధాలుగా సమాయత్తం కావాలని సూచించారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ డిచ్పల్లి నుంచి వీసీలో పాల్గొన్నారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై కలెక్టర్ అసంతృప్తి ఎందుకు చొరవ తీసుకోవడం లేదని తహసీల్దార్లకు ప్రశ్న ఆమోదించిన దరఖాస్తులను 24గంటల్లో ఆర్డీవోలకు పంపించండి వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి -
కాళేశ్వరంతో రాష్ట్రం ధాన్యగారమైంది
నిజామాబాద్‌అర్బన్ : కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ ధాన్యగారంగా మారిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ఆన్లైన్లో వీక్షించిన అనంతరం మాజీ ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి జీవన్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అపోహాలను తొలగించేందుకే హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారన్నారు. కాంగ్రెస్, బీజేపీ సృష్టించిన అపోహలను పటాపంచలు చేస్తున్నామన్నారు. కేవలం కేసీఆర్‌ను అరెస్టు చేసేందుకే తప్పుడు నివేది కలు సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం బాగుపడడం ఓర్వలేని ద్రోహులంతా ఒకటై కేసిఆర్ పై కక్ష సాధింపు పాల్పడుతున్నారని విమర్శించారు. ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక అంతా బోగస్ కొట్టిపారేశారు. కేసీఆర్ జోలికి వస్తే తెలంగాణ ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనపై జిల్లా నుంచి సమర శంఖం పూరిస్తామని ప్రకటించారు. నీరు లేక నోరు తెరిచిన నిజాంసాగర్‌ను కాళేశ్వరం ద్వారా నిండుకుండలా మా ర్చిన ఘనత కేసీఆర్‌కు ఉందన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, జెడ్పీ మాజీ చైర్మన్ విఠల్‌రావు, సీనియర్ నాయకులు ప్రభాకర్, సత్యప్రకాశ్, సుజిత్ సింగ్ ఠాకూర్, జగన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.● బోగస్ నివేదికలతో తప్పుడు ప్రచారం ● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి -
ప్రభుత్వ ఆఫీసుల్లో మూవ్మెంట్ రిజిస్టర్లు
రెంజల్(బోధన్): జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మూవ్మెంట్ రిజిస్టర్లను ఏర్పాటు చే యాలని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అధికారులను ఆ దేశించారు. గ్రామ, మండల స్థాయి ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. మండల కేంద్రమైన రెంజల్తోపాటు వీరన్నగుట్ట లో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి సోమవారం పర్యటించి హైస్కూల్, అంగన్వాడీ సెంటర్లు, పీహెచ్‌సీని త నిఖీ చేశారు. వీరన్నగుట్టలో హైస్కూల్‌తోపాటు అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్.. బో ధన, బోధనేతర సిబ్బంది హాజరును ఫేషియల్ రికగ్నిషన్(ముఖ గుర్తింపు) విధానం ద్వారా నమోదు చేస్తున్నారా లేదా అని ఆరా తీశారు. టాయిలెట్స్, కిచెన్, తరగతి గదులను పరిశీలించి వాటిని శుభ్రంగా ఉంచాలని సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని స్కూ ల్ హెచ్ఎంను ఆదేశించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు అవసరమైన ప్రతిపాదనలను అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పంపించాలని సూ చించారు. అనంతరం రెంజల్‌లోని ప్రాథమిక ఆరో గ్య కేంద్రంతోపాటు అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. పీహెచ్సీ డాక్టర్‌తోపాటు కొంత మంది సిబ్బంది లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్ హాజ రు రిజిస్టర్‌ను తనిఖీ చేసి వారందరికీ అబ్సెంట్ వే శారు. డాక్టర్ ఉదయం నుంచి విధులకు హాజరుకాలేదని తెలుసుకున్న ఆయన వెంటనే డీఎంహెచ్‌వోతో ఫొన్లో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన సమయంలో టీచర్ అందుబాటులో లేకపోవడంతో సీడీపీవోకు ఫోన్ చేశారు. టీచర్‌పై చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. అనంతరం సొసైటీ గోడౌన్‌ను సందర్శించి ఎరువుల స్టాక్‌ను పరిశీలించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి రెంజల్ మండలంలో పర్యటన.. తనిఖీలు విధులకు డుమ్మా కొట్టిన పీహెచ్సీ వైద్యుడు, అంగన్వాడీ టీచర్ చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో, సీడీపీవోకు ఆదేశాలు -
డీ–వార్మింగ్ డేపై ప్రచారం చేయాలి
నిజామాబాద్ అర్బన్: నులిపురుగుల నివారణ మాత్రను 0–19 ఏళ్ల వయసున్న ప్రతి ఒక్కరికీ అందించాలని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. డీ–వార్మింగ్ డేపై జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో డీ–వార్మింగ్ డే కార్యక్రమంపై టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలోని విద్యార్థులకు, మదర్సాలు, అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలందరికీ నులిపురుగుల నివారణ కోసం అల్బెండజోల్ మాత్రను అందించాలని తెలిపారు. ప్రతి పాఠశాల, కళాశాలల్లో ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. భోజనం తిన్న తర్వాత ఈ మాత్రను పిల్లలకు వేయాలని తెలిపారు. పిల్లలలో రక్తహీనత, బరువు తగ్గుదల తదితర వ్యాధుల నుంచి కాపాడేందుకు అల్బెండజోల్ మాత్ర దోహదపడుతుందని అన్నారు. ఈ మాత్ర వేసుకోవడం ద్వారా ఎనీమియా, ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయన్నారు. ఆహార పదార్థాలు తినే ముందు పిల్లలు చక్కగా చేతులు శుభ్రం చేసుకునేలా పాఠశాలల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. విద్యా, వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమశాఖలతోపాటు మెప్మా, ఐకేపీ, మున్సిపల్ సిబ్బంది, ఐఎంఏ ప్రతినిధులు, ఇతర శాఖల అధికారులు భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ నెల 11న అన్ని చోట్ల అల్బెండజోల్ మాత్రలు ప్రతి విద్యార్థికి వేశారా లేదా అన్నది పక్కాగా నిర్ధారిస్తూ, ఒకవేళ ఎవరైనా తప్పిపోతే అలాంటి వారిని సైతం గుర్తించి మలివిడతగా ఈ నెల 18న నులి పురుగు నివారణ మాత్ర వేయించాలని అన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. 11న నులి పురుగుల నివారణ దినోత్సవం ఈ నెల 11న నులిపురుగుల నివారణ దినోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నామని డీఎంహెచ్‌వో రాజశ్రీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 19ఏళ్ల లోపు వయసు కలిగిన 4,05,443 మందికి మాత్రలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. మాత్ర వేసుకున్న తర్వాత ఎవరికై నా వాంతులు అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అత్యవసరమైతే సమీప ఆస్పత్రి, పీహెచ్‌సీకి తీసుకెళ్లాలని సూచించారు. ఇప్పటికే అన్ని ప్రాంతాలలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని, నోడల్ అధికారులను గుర్తించామని అన్నారు. అనంతరం డీ–వార్మింగ్ డేపై అవగాహన కల్పించే గోడ ప్రతులను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీపీవో శ్రీనివాస్ రావు, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అశోక్, డీడబ్ల్యూవో రసూల్ బీ పాల్గొన్నారు. 19 ఏళ్లలోపు పిల్లలకు అల్బెండజోల్ మాత్ర అందించాలి కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి -
వాహనం ఆర్సీ మార్పిడి ఇలా...
సమాచారంకమ్మర్పల్లి/ఖలీల్‌వాడి: ఎవరి దగ్గర నుంచైనా పాత వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు ఆర్సీ (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్)ని మధ్యవర్తుల సాయం లేకుండానే మన పేరు మీదకి సులభంగా మార్చుకోవచ్చు. అందుకోసం కింద తెలిపిన పత్రాలు సమకూర్చుకోవాలి. ● ఫారం 29, వాహనం అమ్మిన వారు ఇచ్చే సమాచారం ● ఫారం 30, కొనుగోలుదారుడు దరఖాస్తు కోసం ● ఒరిజినల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ ● పొల్యూషన్(పీయూసీ) ధ్రువీకరణ ● పాన్ కార్డు ● చాసిస్ నంబర్, ఇంజిన్ నంబర్, పెన్సిల్ ఇంప్రింట్ ● చిరునామా ధ్రువీకరణ పత్రం (ఆధార్, ఓటరు కార్డు, ఏదైనా గుర్తింపు కార్డు) ● క్రయ, విక్రయదారుల పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు ● రోడ్డు పన్ను చెల్లించిన రశీదు ● ఫారం 28 ఎన్వోసీ (వాహనం ఇతర రాష్ట్రాలకు చెందినది అయితే) ● ఫైనాన్స్ ఉన్న వాహనాలకు సదరు సంస్థ నుంచి ఎన్వోసీ ఫారం 35 అవసరం అవుతుంది. వాహన యజమాని మరణిస్తే ఫారం 31 మ రణ ధ్రువీకరణ పత్రం, వారసత్వ ధ్రువీకరణ ప త్రం, వారసుల అఫిడవిట్ ఉండాలి. పై పత్రాలు సిద్ధంగా ఉంచుకొని ఆన్లైన్లో transport.telanga na.gov.in వెబ్సైట్లోకి వెళ్లి నమోదు చేసుకోవాలి. వాహన నంబర్, చాసిస్ నంబర్, చివరి 5 అంకె లు, మొబైల్ నంబర్ నమోదు చేసుకోవాలి. ఓటీపీ ద్వారా ధ్రువీకరించాలి. అన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి. సంబంధిత ఫీజు చెల్లించాలి. అనంతరం అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకున్న దరఖాస్తుతోపాటు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన పత్రాలను అందించాలి. అక్కడ ఆర్టీఏ అధికారులు పత్రాలను పరిశీలించి మీ ఫొటో తీస్తారు. నంబర్ నిర్ధారించి, ధ్రువీకరణ అనంతరం కొత్త ఆర్సీ జారీ చేస్తారు. పూర్తి వివరాలకు రవాణా శాఖ హెల్ప్ లైన్ నంబర్ 040–23370081 ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. -
కారు, ఆటో ఢీ.. ఇద్దరికి గాయాలు
వేల్పూర్: మండలంలోని లక్కోర వద్ద 63 నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి కారు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలైనట్లు ఎస్సై సంజీవ్ మంగళవారం తెలిపారు. అంక్సాపూర్ నుంచి ఆర్మూర్‌కు ఆటోను ఆర్మూర్ నుంచి మోర్తాడ్ వైపు కారులో వెళ్తున్న జలందర్ అనే వ్యక్తి అతివేగంగా ఢీకొట్టాడు. దీంతో ఆటోలో ఉన్న లింబాద్రి, ముత్తెన్నలకు బలమైన గాయాలైనట్లు పేర్కొన్నారు. లింబాద్రి కొడుకు నరేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పొలంలో పడి ఒకరి మృతి ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్ గ్రామంలో ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు పొలంలో పడి వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన సంతోష్ రామ్(35) తన భార్యతో కలిసి గోవింద్‌పేట్‌లో నివాసముంటూ వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం పొలం పని చేస్తుండగా మూర్ఛ రావడంతో బోర్లాపడి మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. చేపల వేటకు వెళ్లి ఒకరు..బోధన్: ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామ శివారులో పెద్ద చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన సిరిగంధపు శ్రీనివాస్(36) నీటమునిగి మృతి చెందాడు. ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ తెలిపిన ప్రకారం.. పోచారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో చేపలు పట్టేందుకు వెళ్తున్నానని తండ్రికి చెప్పాడు. రాత్రయినా తిరిగి రాకపోవడంతో సోమవారం చెరువులో ఆచూకీ కోసం వెతికారు. మధ్యాహ్న సమయంలో శ్రీనివాస్ మృతదేహం చెరువులో నీటిపై తేలింది. చేపల వల కాళ్లకు చుట్టుకొని, ఈత రాక నీటమునిగి మృతి చెందాడన్నారు. మృతుడి తండ్రి గంగారాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ ఒకరు..ఆర్మూర్‌టౌన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్(41) గత శుక్రవారం ఆలూరు మండలం మచ్చర్ల శివారులో బైక్‌పై వెళ్తుండగా అడవి పండి ఢీకొని కిందపడ్డాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో ప్రవీణ్‌ను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి సోమవారం చికిత్స పొందుతూ ప్రవీణ్ మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. లెక్చరర్‌పై పోక్సో కేసు నమోదునిజామాబాద్అర్బన్: నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని లైంగిక వేధింపులకు పాల్పడుతున్న గణేశ్ అనే లెక్చరర్‌పై పోక్సో కేసు నమోదైంది. విద్యార్థిని పట్ల లెక్చరర్ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలియడంతో పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ సదరు కళాశాలలో నిరసన తెలిపి నిర్వాహకులను నిలదీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మహిళా ఎస్సై విచారణ చేపట్టగా లెక్చరర్ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తేలింది. పోలీసులు లెక్చరర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీజీవీపీ నాయకుడు కల్యాణ్ కళాశాల ఎదుట ధర్నా చేశారు. -
క్రీడాపోటీలతో సత్సంబంధాలు
నిజామాబాద్‌నాగారం: క్రీడాపోటీలతో ఉద్యోగుల మధ్య సత్సంబంధాలు ఏర్పడుతాయని పోలీస్ కమిషనర్ పి సాయిచైతన్య అన్నారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని క్రీడల ద్వారా అధిగమించొచ్చని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌పరేడ్ గ్రౌండ్లో విద్యుత్ శాఖ ఎస్ఈ రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కమ్స్ ఇంటర్ సర్కిల్ హాకీ టోర్నీని సీపీ సోమవారం ప్రారంభించారు. ముందుగా క్రీడాపతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజూ వినియోగదారులకు మెరుగైన సేవలందించడంతోపాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎంతో కష్టపడే విద్యుత్ ఉద్యోగుల్లో ఈ తరహా టోర్నీల నిర్వహణతో కొత్త ఉత్సాహం వస్తుందన్నారు. ఉద్యోగులు, సిబ్బందిని క్రీడల్లో ప్రోత్సహిస్తున్న విద్యుత్‌సంస్థ సీఎండీ అభినందనీయులని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ ఆపరేషన్ కామారెడ్డి శ్రావణ్ కుమార్, ఎస్ఈ ఓఎంసీ పీవీ రావు, అడిషనల్ డీసీపీ కే రామచంద్రరావు, రాష్ట్ర స్పోర్ట్స్ ఆఫీసర్ జగన్నాథ్, డీఈలు ఏ రమేశ్, విక్రమ్, టోర్నీ ఆర్గనైజర్, ఏడీఈ తోట రాజశేఖర్, ఏఏవో గంగారం నాయక్ తదితరులు పాల్గొన్నారు. మొదటిరోజు టోర్నీలో నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ వరంగల్ జిల్లాల విద్యుత్ క్రీడాకారులు పాల్గొన్నారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయిచైతన్య అట్టహాసంగా ప్రారంభమైన విద్యుత్ హాకీ టోర్నీ -
కాంగ్రెస్ పాదయాత్రలో బందోబస్తు ఎందుకు?
డిచ్పల్లి(నిజామాబాద్‌రూరల్): జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనహిత పాదయాత్రకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంపై నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయని కారణంగా ప్రజలు ఎక్కడ తమపైకి తిరగబడతారోననే భయంతో వందలాది మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసుకోవడం సిగ్గు చేటన్నారు. సోమవారం ఆయన ‘సాక్షి’ తో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జిల్లాలో రెండు రోజుల కార్యక్రమంలో ప్రజలతో మమేకం అయ్యిందేమీ లేదని కేవలం జనాల్లో హడావుడి సృష్టించేందుకు చేసిన డ్రామా అని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్‌పై పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడిన మాటలను విని జనాలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాదని జోస్యం చెప్పారు. ప్రజలంతా డిసైడ్ అయ్యారని, బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించబోతున్నదని బాజిరెడ్డి గోవర్ధన్ ధీమా వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలతో సహా ఎన్నికల సమయంలో ఇచ్చిన మొత్తం 420 హామీలలో ఎన్ని అమలు చేశారో చెప్పాలని ఆయన నిలదీశారు. జిల్లాలో 2లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదన్న విషయం పాదయాత్ర సందర్భంగా మీ దృష్టికి రాలేదా? అని ప్రశ్నించారు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఇస్తామని ముఖం చాటేయలేదా అని విమర్శించారు. కేసీఆర్ రైతుబంధు ఇచ్చి అన్నదాతలకు అండగా నిలిస్తే, సీఎం రేవంత్ రెడ్డి రైతులకు భరోసా లేకుండా చేసి వారికి వెన్నుపోటు పొడవలేదా? అని బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు. ఆసరా పెన్షన్లు పెంచి రూ.4వేల చొప్పున ఇస్తామన్న హామీ ఏమైందని, ఒక్కరికై నా నిరుద్యోగ భృతి ఇచ్చారా అని పేర్కొన్నారు. మహిళలకు రూ.2,500, విద్యార్థినులకు స్కూటీలు ఎప్పుడిస్తారని నిలదీశారు. ఇచ్చిన హామీలపై మీనాక్షి నటరాజన్‌తో సహా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నోరు విప్పకపోవడం శోచనీయమన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ భేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు. జనాలు తిరగబడతారనే భారీ భద్రత నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శ -
తెయూ సౌత్ క్యాంపస్‌లో విద్యార్థుల ధర్నా
భిక్కనూరు: అందుబాటులో అంబులెన్స్, వైద్య సిబ్బంది ఉంటే పీజీ విద్యార్థిని అశ్విని మరణించి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తూ తెలంగాణ వర్సిటీ సౌత్ క్యాంపస్‌లో విద్యార్థులు ధర్నా చేపట్టారు. సోమవారం ఉదయం 9 గంటలకు ప్రిన్సిపల్ కార్యాలయం ఎదుట ప్రారంభమైన ఆందోళన ఆరు గంటలపాటు కొనసాగింది. ప్రిన్సిపల్ సుధాకర్ గౌడ్‌తోపాటు పలువురు అధ్యాపకులు సముదాయించినా విద్యార్థులు శాంతించలేదు. వీసీ వచ్చే వరకు ధర్నా విరమించేది లేదని మొండికేశారు. దీంతో ప్రిన్సిపాల్ ఈ విషయాన్ని రిజిస్ట్రార్ యాదగిరి, వీసీ యాదగిరిరావుల దృష్టికి తీసుకెళ్లారు. వీసీ అందుబాటులో లేకపోవడంతో రిజిస్ట్రార్ యాదగిరి సౌత్క్యాంపస్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సౌత్ క్యాంపస్‌లో హెల్త్‌కేర్ సెంటర్ లేకపోవడంతో కలుగుతున్న ఇబ్బందులను విద్యార్థులు రిజిస్ట్రార్‌కు వివరించారు. క్యాంపస్‌లో సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ యాదగిరి మాట్లాడుతూ వర్సిటీ లేదా సీఎస్ఐఆర్ నిధుల నుంచి అంబులెన్స్‌ను కొనుగోలు చేసి క్యాంపస్‌కు పంపిస్తామన్నారు. వైద్యుడు లేదా వైద్య సిబ్బంది 24 గంటలపాటు ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. విద్యార్థుల ధర్నా నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అశ్వినికి ఘన నివాళి సౌత్ క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకున్న అశ్వినికి సోమవారం పలువురు ఘన నివాళులర్పించారు. మృతదేహంపై పూలమాలలు వేసి కన్నీటి పర్యంతమయ్యారు. వార్డెన్ సునీత, అధ్యాపకులు ప్రతిజ్ఞ, సరితలు అశ్విని మృతదేహం వద్ద నివాళులర్పించారు. సమస్యల పరిష్కారానికి డిమాండ్ ఆరు గంటలపాటు కొనసాగిన నిరసన రిజిస్ట్రార్ హామీతో ఆందోళన విరమణ -
ఏదీ బోనస్
– 8లో uయాసంగి పంటపోయి వానాకాలం నాట్లు పూర్తవుతున్నా ‘బోనస్’ మాటలకే పరిమితమైంది. ఇదిగో వేస్తాం.. అదిగో వేస్తామంటూ సంబంధిత మంత్రి ప్రకటిస్తుండడంతో రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. సన్నాలు సాగు చేస్తే పంట దిగుబడి తక్కువగా వస్తుందని తెలిసీ.. బోనస్ ఆశతో వానాకాలంలో సైతం రైతులు సన్నాలను విస్తృతంగా సాగు చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన సన్నధాన్యం బోనస్ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. బోనస్ డబ్బుల చెల్లింపు విషయంలో ఆలస్యం అవుతుండడంతో రైతులు పరేషాన్ అవుతున్నారు. రూ.500 బోనస్ ఇస్తుండడంతో గత యాసంగిలో జిల్లాలో రైతులు భారీగా సన్నధాన్యం సాగు చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో రూ.1949.09 కోట్ల విలువైన ధాన్యం సేకరణ జరిగింది. కాగా ఇందులో సన్నధాన్యం 7,38,662 మెట్రిక్ టన్నులు ఉంది. ఇక 1,01,481 మెట్రిక్ టన్నులు దొడ్డు ధాన్యం సేకరించారు. ధాన్యం డబ్బులు మొత్తం రైతుల ఖాతాల్లో జమ చేశారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లింపు మాత్రం ఆలస్యం అవుతోంది. బోనస్ చెల్లింపుల విషయానికి వస్తే జిల్లాలో 1,04,751 మంది రైతులకు రూ.369.38 కోట్లు ఇవ్వాల్సి ఉంది. యాసంగి సీజన్ బోనస్ రాకపోవడంతో రైతులు నిట్టూరుస్తున్నారు. బోనస్ వస్తుందనే ఆశతో రైతు లు దొడ్డు ధాన్యం బదులు అత్యధికంగా సన్నధా న్యం సాగు చేశారు. ఇదిలా ఉండగా జిల్లాలో సాధారణ వరి సాగు సుమారు 4.50 లక్షల ఎకరాల్లో రైతులు వేస్తున్నారు. ప్రస్తుతం ఇందులో దాదాపు 95 శాతం వరి నాట్లు పూర్తయ్యాయి. కాగా ప్రభు త్వం మాత్రం ఇప్పటివరకు బోనస్ చెల్లించే విషయంలో ఆలస్యం చేస్తుండడం పై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. త్వరలో బోనస్ చెల్లింపులు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలుసార్లు చెప్పినప్పటికీ మాటలకే పరిమితమవుతూ ఆలస్యం చేస్తుండడం ఏమిటని రైతులు అంటున్నారు. తక్షణమే బోనస్ విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
అహ్మదాబాద్ నుంచి..
కంటైనర్‌లో నుంచి బ్యాలెట్ బాక్సులను దించుతున్న సిబ్బంది● నాలుగు కంటైనర్లు.. 3,440 బ్యాలెట్ బాక్సులుస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికీ.. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం మాత్రం పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నుంచి 4 కంటైనర్లలో 3,440 బ్యాలెట్ బాక్సులు (పెద్దవి) సోమవారం జిల్లా కేంద్రానికి చేరాయి. కలెక్టరేట్, జిల్లాపరిషత్‌లోని గదుల్లో బ్యాలెట్ బాక్సులను భద్రపర్చారు. జిల్లాలో ఇప్పటికే 2,530 పెద్ద, 1315 చిన్న బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉండగా, మరో 1200 బాక్సులు వస్తాయని జిల్లా పంచాయతీ అధికారులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలోనే మండల కేంద్రాలు, పంచాయతీలకు బాక్సులను తరలిస్తామని పేర్కొన్నారు. – సుభాష్‌నగర్ -
సొసైటీల ఆర్థిక స్థితిపై ఆరా!
డొంకేశ్వర్(ఆర్మూర్): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం ఆరా తీ స్తోంది. అప్పుల బకాయిలు, నిల్వల వివరాలను సమర్పించాలని సీఈవోలను ఆదేశించింది. ఇందుకోసం మూడు రోజుల క్రితం ప్రత్యేక ఆన్లైన్ ఫా ర్మాట్ను ఇవ్వగా, అందులో సొసైటీల్లో నిల్వ ఉన్న నగదు, బకాయిలు, అప్పులు తీసుకున్న డైరెక్టర్ల వి వరాలను ఎంట్రీ చేసి ప్రభుత్వానికి పంపుతున్నా రు. అయితే ప్రభుత్వం ఈ వివరాలను ఎందుకు సేకరిస్తుందో సంబంధిత అధికారులకు కూడా తెలియడం లేదు. బకాయిలు చెల్లించని డైరెక్టర్ల పేర్లను అడగడంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటోదనన్న ఆసక్తి నెలకొంది. పదవీకాలాన్ని పొడిగిస్తారా? సొసైటీ పాలకవర్గాల పదవీకాలాన్ని ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 14 నుంచి ఆరు నెలలు పెంచింది. ఈనెల 14వ తేదీతో పదవీకాలం ముగియనుండగా పది రోజుల ముందుగానే సహకార సంఘాల ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వం ఆరా తీయడం సొసైటీల్లో చర్చనీయాంశమైంది. మరో ఆరు నెలలపాటు పాలకవర్గాల పదవీకాలం పొడగింపు ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహణకు ఆసక్తి చూపకపోవడం, కనీసం ఆ దిశగా చర్యలు కూడా చేపట్టకపోవడం చూస్తుంటే పదవీకాలం పెంపు తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో మొత్తం 89 సొసైటీలు ఉండగా ఇందులో 2.70లక్షల మంది వరకు రైతులు సభ్యులుగా ఉన్నారు. సొసైటీల పదవీకాలం నిబంధనల ప్రకారం ఐదేళ్లు మాత్రమే అయినప్పటికీ ఇప్పటికే పదవీకాలాన్ని ఒకసారి పొడిగించింది. జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్‌రావును వివరణ కోరగా... ప్రభుత్వం అడిగిన సొసైటీల ఆర్థిక వివరాలు సీఈవోలు పంపించారని, పాలకవర్గాల పదవీకాలం పొడగింపుపై తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. బకాయిలు, నిల్వల వివరాలు కోరిన ప్రభుత్వం పది రోజుల్లో ముగియనున్న పాలకవర్గాల పదవీకాలం -
రంగుమారుతున్న ఎస్సారెస్పీ నీరు
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో నిల్వ ఉన్న నీరు ఒక్కసారిగా రంగు మారింది. గతేడాది ఇదే సమయంలో ప్రాజెక్ట్ నీరు ఆకుపచ్చ రంగులా మారింది. కాలువల ద్వారా నీటి విడుదల చేపడితే పంటలకు తెగుళ్లు వ్యాపించాయని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆ నీటిని ప్రస్తుతం ఆయకట్టుకు సరఫరా చేస్తే పంటల పరిస్థితి ఏంటని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. మత్స్యకారులు సైతం చేపలు మృత్యువాత పడే అవకాశం ఉందని ఆవేదన చెందుతున్నారు. నీరు సైతం దుర్వాసన రావడంతో పర్యాటకులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకు రంగు మారుతుంది? ప్రతి సంవత్సరం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరదలు వచ్చిన వారం రోజుల తరువాత నీటి రంగు మారుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి వరదలు వచ్చినప్పుడే ప్రాజెక్ట్నీరు రంగు మారుతుంది. ప్రాజెక్ట్ ఎగువన మహారాష్ట్రలోని ధర్మాబాద్ వద్ద పలు ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలను గోదావరిలోకి అధికంగా వదలడంతో ప్రాజెక్ట్‌లోకి కొట్టుకు వచ్చి రంగు మారుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. కానీ అధికారులు, పాలకులు మాత్రం ఈ సమస్యపై దృష్టి సారించడం లేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి మిషన్ భగీరథ ద్వారా ప్రతి రోజు 231 క్యూసెక్కుల నీటిని తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. గత రెండేళ్ల క్రితం పరీక్ష కోసం నీటి నమూనాలను సేకరించారు. కానీ, నీరు కలుషితం కావడం లేదని నివేదిక ఇచ్చారు. నీరు కలుషితం కానప్పుడు వ్యర్థంతో నీరు రంగు ఎందుకు మారుతుందనే ప్రశ్నకు ఎవరి వద్దా సమాధానం ఉండదు. ప్రాజెక్ట్ నీరు రంగు మారడంపై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే తప్ప నిజాలు బయటకు వచ్చేలా లేవని ఆయకట్టు రైతులు అంటున్నారు. ప్రతియేటా ఇదే పరిస్థితి పరీక్షలు జరిపి, కలుషితం కాలేదంటున్న అధికారులుఫిర్యాదు రాలేదు.. మిషన్ భగీరథ వారి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు. నీరు మాత్రం రంగు మారింది. మిషన్ భగీరథ అధికారులు నిత్యం నీటిని పరీక్షలకు పంపుతున్నారు. అవసరమైతే మళ్లీ శాంపిళ్లను పరీక్షల కోసం పంపుతాం. – చక్రపాణి, ఈఈ, ఎస్సారెస్పీ -
క్యాంపస్‌లో తీజ్ ఉత్సవాలు ప్రారంభం
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో సోమవారం సాయంత్రం తీజ్ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బంజారాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్ చిత్రపటానికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపల్ మామిడాల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. బంజారా విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం హర్షనీయమన్నారు. తొమ్మిది రోజులపాటు తీజ్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెయూ గిరిజన శక్తి విద్యార్థి సంఘం అధ్యక్షుడు శ్రీను రాథోడ్ తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ శాంతాబాయి, అకడమిక్ కన్సల్టెంట్ కిరణ్రాథోడ్, సిబ్బంది ప్రవీణ్ కుమార్, బికోజీ, నరేశ్, మహవీర్, రవీందర్ నాయక్, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు సాగర్ నాయక్, ఏబీవీపీ అధ్యక్షుడు పృథ్వి, విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఆయకట్టుకు ‘సాగర్’ నీరు
బాన్సువాడ : ప్రస్తుతం నెలకొన్న వర్షభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిజాంసాగర్ ఆయకట్ట కింద పంటలను కాపాడేందుకు ప్రాజెక్టునుంచి నీటి విడుదలకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. బాన్సువాడ ఎత్తిపోతల పథకం పైపులైన్‌కు లీకేజీలు ఏర్పడడంతో చివరి ఆయకట్టకు నీరందడం లేదని రైతులు పోచారం దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సోమవారం పైప్‌లైన్‌ను పరిశీలించారు. పైపులైన్ వేసి చాలాకాలం కావడంతో అక్కడక్కడ లీకేజీలు ఏర్పడుతున్నాయని, కొత్తపైపు లైన్ ఏర్పాటు, మోటార్ల కోసం ప్రతిపాదనలు పంపామని పోచారం తెలిపారు. ప్రస్తుతం సాగు చేస్తున్న పంటలు ఎండకుండా చూసేందుకు పైపులైన్ లీకేజీలకు మరమ్మతులు చేయిస్తామన్నారు. నిజాంసాగర్ నుంచి విడుదల చేసే నీటిని వృథా చేయొద్దన్నారు. కార్యక్రమంలో ఎత్తిపోతల పథకం అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, నాయకులు మోహన్‌నాయక్, దాసరి శ్రీనివాస్, గులెపల్లి శంకర్, రైతులు రెంజర్ల సాయిలు, గొల్ల సాయిలు, నర్సగొండ, అశోక్‌రెడ్డి, నగేష్, రాజు, సత్యపాల్‌రెడ్డి, రఘువీర్, ధనగారి రాజు, గులెపల్లి గంగాధర్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. నేటినుంచి విడుదల ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి -
డిచ్పల్లి సీఎంసీ పాస్టరేట్ కమిటీ ఎన్నిక
డిచ్పల్లి: డిచ్పల్లి సీఎంసీ పాస్టరేట్ కమిటీని సభ్యులు ఆదివారం రాత్రి ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆరుగురు పోటీ పడగా కమిటీ సభ్యులుగా మె ట్టు శ్యాంసన్ దైవాశీర్వాదం, ముల్కల డానియల్ సురానా, మద్దెల ప్రశాంత్‌రాజ్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా సీఎంసీ మినిస్టీరియల్ సెక్రటరీ జయానంద్, ప్రెసిబిటర్ ఇన్చార్జి ఏసుకుమార్, సహాయకులుగా దినకర్, స్టీవెన్ కుమార్ వ్యవహారించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికా రి జయానంద్ మాట్లాడుతూ.. డిచ్పల్లి సీఎంసీ ఫాస్టరేట్ కమిటీ ఎన్నికల్లో ముగ్గురు సభ్యులుగా ఎన్నికై నట్లు తెలిపారు. సీఎస్ఐ మెదక్ డయాసిస్ ద్వారా మరో ఇద్దరు సభ్యులను నామినేషన్ విధానంలో నియమిస్తారని వివరించారు. నూతనంగా ఎన్నికై న శ్యాంసన్, డేనియల్ సురానా, ప్రశాంత్‌రాజ్ లను సభ్యులు ఘనంగా సన్మానించారు. -
తడి పొడి.. పర్యవేక్షణ కొరవడి
నిజామాబాద్ సిటీ: మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెత్తపై ప్రత్యేక దృష్టి సారించడం లేదు. మొ క్కుబడిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యే క పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని సీడీఎంఏ అధికారులు వంద రోజుల ప్రణాళిక రూపొందించారు. ఆ ప్రణాళిక కేవలం పేపర్లకే పరిమితమవుతోంది.చెత్త ఎలా సేకరించాలి అనే అంశంపై మ హిళలకు అవగాహన కల్పించడంలో అధికారులు క్షేత్రస్థాయిలో దృష్టిసారించడం లేదు. దీంతో చెత్తపై అవగాహన కరువైంది. నగరంలో ప్రతీరోజు వంద టన్నుల చెత్త తయారవుతోంది. ఈ చెత్తను ఇంటింటికి తిరిగి సేకరించి వాహనాల ద్వారా నాగారంలోని డంపింగ్ యార్డుకు తరలిస్తారు. అయితే చెత్త మొత్తం ఒకే చోట కాకుండా వేర్వేరుగా నిల్వ చేయాలి. తడి, పొడి, హానికరమైన చెత్తగా మూడు విభాగాలుగా విభజిస్తారు. తడి చెత్త అంటే ఇంట్లో పాచిపోయిన ఆహారపదార్థాలు, కుళ్లిపోయిన పండ్లు వంటివి. పొడి చెత్త అంటే పేపర్లు, పాలిథిన్, ప్లాస్టిక్ కవర్లు. హానికర చెత్త అంటే హాస్పిటల్స్‌లో వాడే సిరంజీలు, ఇంజక్షన్ బాటిళ్లు, ఆపరేషన్‌కు వాడే బ్లేడ్స్, కాటన్, ప్యాడ్ వంటివి. వీటిలో పై రెండు మున్సిపల్ సిబ్బంది తమ వాహనాల ద్వారా సేకరిస్తారు. మూడోది హానికరమైన చెత్త సేకరించేందుకు ప్రత్యేకమై ఏజెన్సీలు తమ వాహనాల ద్వారా చెత్త సేకరించి వారికి కేటాయించిన స్థలంలో నగరశివార్లలో వాటిని కాల్చివేసి, బూడిదను పూడ్చివేస్తారు. తడి–పొడిచెత్త వేరుచేసేదెలా.. తడి–పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలి. ప్రతి రోజు పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. అయితే గృహిణులు చెత్తను ఒకే బుట్టలో వేస్తున్నారు. దీంతో అదే చెత్తను కార్మికులు చెత్త వాహనంలో వేస్తున్నారు. దానిని డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. ఈ అంశంపై అధికారులు అవగాహన కల్పించడం లేదు. వేర్వేరు డబ్బాల్లో.. ప్రతి ఒక్కరు ఇంట్లో, దుకాణాల్లో తయారయ్యే చెత్తను వేర్వేరుగా నిల్వచేయాలి. వాటి కోసం ప్రత్యేకంగా రెండు బుట్టలు(డబ్బాలు) వాడాలి. ఈ అంశంపై గృహిణులకు అధికారులు అవగాహన కల్పించడం లేదు. పదేళ్ల క్రితం 2014లో నాటి ప్రభుత్వం ఇంటింటికి రెండు డబ్బాల(నీలి, ఆకుపచ్చరంగు)ను ఉచితంగా అందించింది. నాటి నుంచి ఇప్పటివరకు మళ్లీ డబ్బాలను పంపిణీ చేయలేదు. మహిళలకు చెత్తపై వివరించడం లేదు. అవగాహన అవసరం చెత్త తయారీ, చెత్త నిల్వలో మహిళలదే ప్రధాన భూమిక. వారికి అవగాహన కల్పించడం అధికారుల కంటే మహిళా సంఘాలదే ప్రధాన బాధ్యత. మహిళా సమాఖ్య, సీ్త్రనిధి, స్వయం సహాయ సంఘాలు వంటి పలు సంఘాలు మెప్మా ఆధీనంలోనే ఉంటాయి. వీరంతా మహిళలే నిర్వహిస్తారు. కాబట్టి మహిళలకు, గృహిణులకు చెత్త నిల్వ, చెత్త సేకరణ వంటి అంశాలు వీరే వివరించాలి. ఈ విషయంలో బల్దియా అధికారులు, ఇన్చార్జి ఎంహెచ్వో, డిప్యూటీ కమిషనర్ వంటి ఉన్నతాధికారులు దృష్టి సేకరించాలి. వారితో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఈ తడి–పొడిచెత్త వేర్వేరుగా సేకరించడం విజయవంతంగా సేకరించగలుగుతాం. ప్రజలకు చెత్తపై అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం మహిళా సంఘాల ద్వారా ప్రచారం నిల్ అవగాహన కల్పిస్తున్నాం చెత్త సేకరణపై ప్రతిరోజు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. మహిళలకు అవగాహన కల్పించినా ఇంకా పూర్తిస్థాయి లో వివరించలేకపోతున్నాం. మెప్మా సంఘాలకు బాధ్యత అప్పగిస్తాం. – రవిబాబు, ఇన్చార్జి ఎంహెచ్వో -
‘ప్రజలే తగిన బుద్ధి చెబుతారు’
ఆర్మూర్‌టౌన్: జనహిత పాదయాత్రకు లభించిన విశేష జనదారణను జీర్ణించుకోలేని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మారచంద్రమోహన్, ఏఎంసీ చైర్మన్ సాయిబాబాగౌడ్ ఎద్దేవా చేశారు. పాదయాత్ర విజయంతం కావడాన్ని పుర్కరించుకొని స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలను గుర్తించడానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేపట్టారన్నారు. కాంగ్రెస్ అగ్రనాయకులపై మరోసారి నోరు జారితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ విట్టం జీవన్, కాంగ్రెస్ నాయకులు చిన్నా రెడ్డి, పండిత్ పవన్, ఫయాజ్, మాజిద్, రేగుల సత్యనారాయణ, భూపేందర్ తదితరులు పాల్గొన్నారు. -
దేశాభివృద్ధి కోసం పని చేయాలి
డిచ్పల్లి: విద్యార్థులు జాతీయ భావాలతో, దేశం కో సం, దేశాభివృద్ధి కోసం పని చేయాలని ఏబీవీపీ జా తీయ కార్యవర్గ సభ్యుడు బి.శివ పిలుపునిచ్చారు. సోమవారం ఏబీవీపీ డిచ్పల్లి శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఎస్పీఆర్ ఇంటర్, డిగ్రీ కళాశాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో సభ్యత నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ అని విద్యారంగ సమస్యలు, విద్యార్థుల కోసం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఏబీవీపీలో సభ్యత్వం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తెయూ ఏబీవీపీ సెక్రెటరీ సమీర్, నాయకులు లెనిన్, అనిల్, నెహ్రూ, రామకృష్ణ, హర్షనందన్, విద్యార్థులు పాల్గొన్నారు. -
విద్యుత్ సమస్య లేకుండా చూడండి
వేల్పూర్: మండలంలోని పడగల్ గ్రామంలో సాగు కు నెలకొన్న విద్యుత్ సమస్య తీర్చాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి జిల్లా ట్రాన్స్‌కో ఎస్ఈ రవీందర్‌ను సోమవారం ఫోన్లో కోరారు. పడగల్లో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సక్రమంగా జరగడం లేదని, దాంతో మొక్కజొన్న పంట ఎండిపోయే పరిస్థితి నెలకొందని స్థానిక రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గత కొద్ది రోజులుగా ఒకవైపు ఆరుగంటలు, మరోవైపు ఆరుగంటలు కరెంటు సరఫరా ఇస్తున్నారని దీంతో పంటలకు నీరు సరిగ్గా అందక ఎండిపోయే ప్రమాదముందని ఎమ్మెల్యే వేముల ఎస్ఈ దృష్టికి తీసుకెళ్లారు. రైతులు సబ్‌స్టేషన్‌కు వెళ్లి అడిగితే లో వోల్టేజి సమస్య ఉందని, 3 కెపాసిటర్ సెల్స్, 4 బ్యాటరీలు ఉంటే సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నారన్నారు. మెటీరియల్ అందజేసి రైతులకు విద్యుత్ సమస్య లేకుండా చూడాలని ఎస్.ఈ.కి ఎమ్మెల్యే సూచించారు. -
గల్ఫ్ మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత
ఇందల్వాయి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గల్ఫ్ పాలసీ పథకం ద్వారా ఇందల్వాయి మండలానికి చెందిన ముగ్గురికి మంజూరైన రూ. ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియాను రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అర్గుల్‌లో సోమవారం అందజేశారు. గన్నారంకు చెందిన కషెట్టు లక్ష్మి, చంద్రాయన్‌పల్లికి చెందిన బండ్ల సుజాత, అన్సాన్పల్లికి చెందిన షేక్ హసీన వీరి భర్తలు గతంలో గల్ఫ్‌లో మృతి చెందగా పరిహారం మంజూరైనట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్ తెలిపారు. గల్ఫ్ బాధిత కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ పాలసీని అమలు చేయడం గొప్ప విషయమని అన్నారు. పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌లో పలువురి చేరిక
సిరికొండ: మండలంలోని కొండాపూర్ గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే భూపతిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వీరికి ఎమ్మెల్యే కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరవేసి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్‌రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు బుచ్చన్న, శ్రీధర్, ఆకుల జగన్, గౌసొద్దీన్, ఎల్లయ్య, కిశోర్‌గౌడ్, జీవన్, ఇషాక్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలి మోపాల్: విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. మోపాల్ మండలంలోని సిర్పూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సంస్థ ఆధ్వర్యంలో 400 నోట్‌బుక్స్, 200 పెన్నులను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గత 21 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సభ్యులు అమర్, రామ్మోహన్, టీఎస్ వ్యాస్, ఉపాధ్యాయులు నాగమణి, రాము, అనురాధ, గంగాప్రసాద్, వీడీసీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. రేషన్ కార్డుల పంపిణీ ధర్పల్లి: మండలంలోని ఆయా గ్రామాల్లో అధికారులు, కాంగ్రెస్ నాయకులు నూతన రేషన్ కార్డులను సోమవారం పంపిణీ చేశారు. రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని రాని వారు ఆందోళన చెందవద్దని అధికారులు పేర్కొన్నారు. నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి
డిచ్పల్లి: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం డిమాండ్ చేశారు. సోమవారం డిచ్పల్లి మండల కేంద్రంలోని ఎస్పీఆర్ జూనియర్ కళాశాలలో నవీన్ అధ్యక్షతన నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ రూరల్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ డబ్బులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో రాష్ట్రంలో ఉన్నత వి ద్యను అభ్యసిస్తున్న పేద, మధ్య తరగతి విద్యార్థు లు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ రూరల్ నియోజకవర్గ కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కుశాల్, నాయకులు నవీన్, కృష్ణ, మహిపాల్, అబ్దుల్, కుమార్, విజయ్, శశికాంత్, చరణ్, విక్రమ్, నితిన్, శివ తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత
నిజామాబాద్‌అర్బన్: ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల, తపస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ వలంటీర్స్, విద్యార్థులు సోమవారం గిరిరాజ్ కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో తపస్ ఫౌండేషన్ అధ్యక్షుడు విపుల్ సింగ్, వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ నరేశ్, నాగజ్యోతి, దస్తప్ప, రజిత, వెంకటరమణ, సుధాకర్, పీఆర్వో దండు స్వామి, రంజిత, వినయ్ కుమార్, ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ రామస్వామి, అధ్యాపకులు పాల్గొన్నారు. సిద్ధి యోగా భవన్లో..నిజామాబాద్ రూరల్: వినాయక్‌నగర్‌లోని సిద్ధి యోగా భవన్లో ఇందూరు జిల్లా భారత్ స్వాభిమాన్ ట్రస్ట్, పతంజలి యోగా సమితి, కిసాన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఆయుర్వేద ఔషద మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఇంజినీర్ గంగాధర్, బుచ్చన్న, కిషన్, లింబాద్రి, నాగరాజు, గంజి సాయన్న తదితరులు పాల్గొన్నారు. -
26 రోజుల పనిదినాలు కల్పించాలి
డిచ్పల్లి: నెలలో 26 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం బీ డీ కార్మికులు డిచ్పల్లి మండల కేంద్రంలోని శివాజీ బీడీ కంపెనీని ముట్టడించారు. ముందుగా బీడీ కంపెనీ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం కంపెనీలోకి వెళ్లి బైఠాయించారు. కొద్దిసేపు అందోళన చేసి న అనంతరం కననీ మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధా న కార్యదర్శి వెంకటి మాట్లాడుతూ.. కొన్ని నెలలుగా బీడీ కార్మికులకు నెలకు 10 రోజుల పని మా త్రమే పని కల్పిస్తున్నారన్నారు. చేతినిండా పని లేకపోవడంతో బీడీ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం తక్షణం కార్మికులకు 26 రోజుల పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బీడీ పరిశ్రమపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో టీ యూసీఐ ఏరియా కార్యదర్శి కిషన్, జిల్లా నాయకుడు మురళి, బీడీ టేకేదార్లు నర్సయ్య, సాయినా థ్, సుదర్శన్, శ్రీధర్, గణేశ్, రవి, కార్మికులు లక్ష్మి, సుజాత, నర్సయ్య, గౌతమి, జమున, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. -
చలో ఢిల్లీకి కాంగ్రెస్ బీసీ నాయకులు
మోపాల్: బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు కోసం పార్లమెంట్లో బిల్లు ఆమోదించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ నెల 5, 6 తేదీల్లో చేపట్టిన నిరసన కార్యక్రమానికి బీసీ నాయకులు సోమవారం తరలివెళ్లారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, వాకిటి శ్రీహరితో కలిసి టీపీసీసీ డెలిగేట్, నిర్మల్ జిల్లా పరిశీలకుడు బాడ్సి శేఖర్ గౌడ్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రైల్లో బయలు దేరారు. వీరి వెంట బీసీ నాయకులు ఉన్నారు. సిరికొండ: మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు దేశ రాజధాని ఢిల్లీకి సోమవారం వెళ్లారు. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ధర్నాలో పాల్గొనడానికి వారు తరలివెళ్లారు. పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి, దేగాం సాయన్న, ఉమ్మాజి నరేశ్, డీలర్ రమేశ్, బడాల మహిపాల్ తదితరులు ఉన్నారు. -
పింఛన్ ఇప్పించాలని వినతి
డిచ్పల్లి: ప్రతి నెలా పింఛన్ పంపిణీ ప్రారంభం కాగానే ముందుగా తమకు అందించేలా చూడాలని డిచ్పల్లి మండలం దేవునగర్ క్యాంప్, దేవుపల్లి క్యాంప్ గ్రామస్తులు సోమవారం ఎంపీడీవో రాజ్‌వీర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ గ్రామస్తుల్లో ఎక్కువ మంది గతంలో కుష్టు వ్యాధికి గురవడం వలన వేలి ముద్రలు నమోదు కావని ఎంపీడీవోకు వివరించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన చేయూత పెన్షన్ ఫేస్ రికగ్నయిజ్ యాప్ లో సైతం తాము సమస్య ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. దేవునగర్ క్యాంప్ కు ప్రత్యేకంగా ఒక బీపీఎంను కేటాయించాలన్నారు. పై అధికారులతో మాట్లాడి తమ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్ ఖతిజా యూసుఫ్ కోరారు. స్పందించిన ఎంపీడీవో వెంటనే డీఆర్డీవోతో పాటు, డిచ్పల్లి ఎస్పీఎం తో మాట్లాడి సమస్యను వివరించారు. వచ్చే నెల నుంచి పింఛన్ పంపిణీ ప్రారంభం కాగానే ముందుగా దేవునగర్ క్యాంప్ వారికి ఇవ్వాలని తపాలా శాఖ వారికి, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. -
జాతీయ మహాసభలకు బయల్దేరిన నాయకులు
నిజామాబాద్‌నాగారం: గోవాలో నిర్వహించే జాతీయ బీసీ మహాసభలకు జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు సోమవారం బస్సులో బయలుదేరారు. బీసీ నేతల ప్రయాణాన్ని ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. బీసీ మేలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని తాహెర్‌బిన్ హందాన్ అన్నారు. బీసీలు అన్ని రంగాల్లో రాణించాలంటే 42శాతం రిజర్వేషన్లు రావాల్సిందేనన్నారు. బీసీలు సామాజిక ఇంజినీర్లు అని గ్రంథాలయ చైర్మన్ అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, ఆకుల ప్రసాద్, బుస్స ఆంజనేయులు, పొల్కం గంగాకిషన్, దర్శనం దేవేందర్, మాడవేడి వినోద్, కొయ్యాడ శంకర్, శ్రీలత, బగ్గలి అజయ్, చంద్రకాంత్, నారాయణ రెడ్డి, కోడూరు స్వామి, బసవ సాయి, అన్నయ్య, విజయ్, జయ, రుక్మిణి, మహేశ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్‌శాఖ సేవలపై అవగాహన
ఇందల్వాయి: మండలంలోని నల్లవెల్లి గ్రామంలో పోలీస్‌శాఖ సేవలు, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు కళా బృందం సభ్యులు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాటలు, నాటికల రూపంలో కల్తీ కల్లు, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సైబర్ మోసాలకు గురికాకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహిళల రక్షణ, సమాజ సేవ, చట్టాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్సై సందీప్, వీడీసీ అధ్యక్షుడు నోముల శ్రీనివాస్‌రెడ్డి, కళాబృందం సభ్యులు పాల్గొన్నారు. సదస్సును విజయవంతం చేయాలి నిజామాబాద్ అర్బన్: ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్మూర్‌లో నిర్వహించే సన్నాహక సదస్సును పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు పోశెట్టి సోమవారం కోరారు. వికలాంగుల పింఛన్ పెంపు, పార్టీ సన్నాహక సదస్సును నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సదస్సుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ రానున్నట్లు తెలిపారు. వికలాంగులు, బహుజనులు సదస్సును విజయవంతం చేయాలని ఆయన కోరారు. బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు తగవు నిజామాబాద్ రూరల్: బీఆర్ఎస్ పార్టీ, మాజీ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలు తగవని జెడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదాన్నగారి విఠల్ రావు సోమవారం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి 40 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించిందన్నారు. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అనేక అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేస్తోందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిజానిజాలు తెలియకుండా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అనవసంగా నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ జయకేతనం ఎగురవేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ పై అనుచిత వాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గస్తీ దళాల ఏర్పాటు మోపాల్: మండలంలోని కులాస్పూర్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో దొంగతనాల నివారణకు గస్తీ దళాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల గ్రామంలో ఒకేరోజు 11 తాళాలు వేసిన ఇళ్లల్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. అన్ని కుల సంఘాల నుంచి ఇద్దరు చొప్పున రాత్రి 10 నుంచి ఉదయం 4 గంటల వరకు గస్తీ కాస్తున్నారు. అంతేగాకుండా అనుమానాస్పద వ్యక్తులు గ్రామంలో సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారమిచ్చేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. డాక్టరేట్ గ్రహీతకు సన్మానం సిరికొండ: తెలంగాణ విశ్వవిద్యాలయంలో చదివి డాక్టరేట్ సాధించిన తోటి మిత్రుడిని క్లాస్మేట్స్ ఘనంగా సన్మానించారు. మండలంలోని గడ్కోల్ గ్రామానికి చెందిన కర్క గణేశ్ ‘ఎఫెక్ట్ ఆఫ్ సింటరింగ్ మెథడాలజీ ఆన్ స్ట్రక్చరల్, మాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కాంపోసిట్ ఫెర్రైట్స్’ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందాడు. గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్లో 2007–08లో పదో తరగతి పూర్తి చేసిన అతడిని బ్యాచ్ మిత్రులు సన్మానించారు. డాక్టరేట్ సాధించినందుకు అభినందించారు. -
చోరీ కేసుల్లో పురోగతేదీ?
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి● కులాస్‌పూర్‌లో ఒకేరోజు 11 ఇళ్లల్లో దొంగతనాలు ● పదిరోజులైనా లభ్యం కాని నిందితుడి ఆచూకీ ● రెండు బృందాలు గాలిస్తున్నా ఫలితం శూన్యందేమికలాన్లో ఒకరి ఆత్మహత్య తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని దేమికలాన్ గ్రామంలో ఒకరు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మురళి తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన కొనింటి గంగయ్య(71)కు భార్య సంగవ్వ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సంగవ్వ కొన్నేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. ఎన్ని ఆస్పత్రుల్లో చూపించిన్నప్పటికీ వ్యాధి నయం కాలేదు. తనకున్న అర ఎకరం భూమిని అమ్మి, వచ్చిన డబ్బుతో భార్యకు వైద్యచికిత్స అందించాడు. అలాగే తన ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేయించడం అప్పులపాలయ్యారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన గంగయ్య శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ధర్మోరాలో ఒకరి ఆత్మహత్యాయత్నంమాక్లూర్: మండలంలోని ధర్మోరా గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన అరుణ్ ఆదివారం కుటుంబంలో గొడవల కారణంగా ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. స్థానికులు, కుటుంబసభ్యులు గమనించి వెంటనే నీళ్లు పోసి, మంటలను ఆర్పివేశారు. కానీ అప్పటికే అరుణ్ శరీరం చాలావరకు కాలిపోయింది. చికిత్స నిమిత్తం అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అరుణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారని గ్రామస్తులు తెలిపారు. మహిళ అదృశ్యం మోపాల్: మండలంలోని చిన్నాపూర్ గ్రామానికి చెందిన కోతోళ్ల భారతి అదృశ్యమైనట్లు ఎస్ఐ జాడె సుస్మిత ఆదివారం తెలిపారు. భారతికి, ఆమె భర్త నర్సయ్యకు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం కూడా గొడవ జరగడంతో తాను చనిపోతానని ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో భారతి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.మోపాల్(నిజామాబాద్‌రూరల్): మండలంలోని కులాస్పూర్ గ్రామంలో ఇటీవల జరిగిన చోరీ ఘటనపై పురోగతి కన్పించడం లేదు. దుండగులు ఒకే రోజు ఏకంగా 11 ఇళ్లల్లో దొంగతనానికి పాల్పడి భారీగా సొత్తు దోచుకెళ్లినా.. పోలీసులు కేసును ఇప్పటివరకు ఛేదించలేకపోయారు. పోలీసులు మాత్రం రెండు బృందాల ద్వారా గాలిస్తున్నామని చెబుతున్నా.. నిందితులను పట్టుకోవడంలో సఫలీకృతం కావడంలేదు. గత నెలలో జరిగిన ఘటనలు.. మోపాల్ ఎస్ఐగా జాడే సుస్మిత బాధ్యతలు స్వీకరించిన రోజే (జూలై 6న) నర్సింగ్‌పల్లిలో ఓ చోరీ ఘటన జరిగింది. దుండగులు 11 తులాల బంగారం, రూ.35వేల నగదును దోచుకెళ్లారు. అదే నెలలో 23న అర్ధరాత్రి కులాస్‌పూర్‌లో తాళం వేసిఉన్న 11ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. పక్కనున్న ఇళ్లకు బయటి నుంచి గొళ్లాలు బిగించి తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డారు. మొత్తం 7.3 తులాల బంగారం, 54 తులాల వెండి, రూ.3.85లక్షల నగదు చోరీకి గురైంది. అంతేగాకుండా ముదక్పల్లి చిలుకల చిన్నమ్మ ఆలయం, మంచిప్పలోని గండి మైసమ్మ ఆలయాల్లో కూడా దొంగతనాలు జరిగాయి. సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. చోరీ కేసులను జిల్లా పోలీస్ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. సీపీ సాయి చైతన్య స్వయంగా కులాస్పూర్ గ్రామాన్ని సందర్శించి ఘటనపై ఆరా తీశారు. నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను నియమించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించినా ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీస్‌వర్గాల భోగట్టా. కానీ నిందితుడు బోధన్‌కు చెందిన పాత నేరస్తుడిగా అనుమానిస్తున్నారు. మండలంలో వరుస దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. చోరీల నివారణకు గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేలా పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించాలని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి రాత్రివేళల్లో పోలీస్ పెట్రోలింగ్ పెంచాలని ప్రజలు కోరుతున్నారు.● ఇద్దరికి గాయాలుత్వరలోనే పట్టుకుంటాం.. కులాస్పూర్ చోరీ కేసులో నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశాం. దీని కోసం ప్రత్యేకంగా రెండు బృందాలు గాలిస్తున్నాయి. కొన్ని ఆధారాలు లభించాయి. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటాం. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇళ్లకు తాళం వేసి వెళ్తే పక్కంటి వారికి సమాచారమివ్వాలి. – సురేష్‌కుమార్, నిజామాబాద్ నార్త్ సీఐ -
ఫ్రెండ్షిప్ డే.. ఒక్కచోటికి చేరిన బాల్య మిత్రులు
సాక్షి, నెట్వర్క్: ఉమ్మడి జిల్లాలోని పలు పాఠశాలలకు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం’ నిర్వహించారు. ఈసందర్భంగా చిన్నానాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. అరే ఎన్నాళ్లయింది కలుసుకుని.. పూర్తిగా మారిపోయావంటూ ఆనాటి స్నేహితులు ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యారు. నాడు చదువు నేర్పిన ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి, సన్మానించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. అనంతరం విద్యార్థులు, గురువులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. జిల్లాలో పలుచోట్ల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన పూర్వవిద్యార్థులు ఆత్మీయ పలకరింపులతో భావోద్వేగానికి గురైన చిన్ననాటి మిత్రులు -
శ్రామికుల కష్టాలను గుర్తించడమే నాయకుల లక్షణం
పెర్కిట్(ఆర్మూర్): శ్రామికుల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకొని వారి జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన రాజకీయ నాయకుని లక్షణమని ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. జనహిత పాదయాత్రలో భాగంగా ఆలూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో బడుగు బలహీన వర్గాల కష్టాలను గుర్తించడానికే పాదయాత్ర, శ్రమదానం చేపట్టామన్నారు. ప్రజలకు సేవ చేయడంలో ఉన్న సంతృప్తి ఎందులోనూ లభించదన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్, కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల ఇన్చార్జీలు పొద్దుటూరి వినయ్ రెడ్డి, ముత్యాల సునీల్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, కాంగ్రెస్ పార్టీ ఆలూర్ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఖాందేశ్ శ్రీనివాస్, కోల వెంకటేశ్, సుర్భిర్యాల్ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ -
ముగిసిన ‘జనహిత’ పాదయాత్ర
ఆర్మూర్: ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ చేపట్టిన జనహిత పాదయాత్ర ఆర్మూర్ నియోజకవర్గంలో ఆదివారం ముగిసింది. ఆలూర్‌లో శ్రమదానం అనంతరం అంకాపూర్‌లో పాదయాత్ర చేపట్టారు. అనంతరం జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ శివారులోని యమునా గార్డెన్స్‌లో ఉమ్మడి జిల్లాస్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందుకున్న గల్ఫ్ మృతుల కు టుంబాలు ఫ్లెక్సీ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలిపాయి. అనంతరం వారితో సహపంక్తి భోజనాలు చేశారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లోనూ ముస్లింలకు రిజర్వేషన్లు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగిస్తూ తెలంగాణలో మాత్రం రిజర్వేషన్లు ఇవ్వొద్దని చెప్పడం ఆ పార్టీ నేతలకు సరైంది కాదని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు డబ్బులు సంపాదించుకునే పార్టీలే కాని, పేదలకు చేసింది శూన్యమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతి రాజకీయ నాయకుడు ప్రజల్లో ఉండాలన్నారు. కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో వెనకబడినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ సూచించారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. పదేళ్లలో విద్యారంగం అధ్వానం పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో విద్యారంగం అధ్వానంగా మారిందని, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ తన కుటుంబం కోసం వేల కోట్ల రూపాయలు సంపాదించి రేపటి రోజు జైలుకు వెళ్లే పరిస్థితికి వచ్చాడన్నారు. ఈ విషయాలన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. కార్యకర్తలను గెలిపించుకుంటాం స్థానిక సంస్థల ఎన్నిక ల్లో కార్యకర్తలను గెలిపించుకోవడం పార్టీ బాధ్యత అని ప్రభుత్వ సలహాదారు షబ్బీ ర్ అలీ అన్నారు. బీసీ బిల్లు పై అసెంబ్లీలో మద్దతు తెలిపిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ వస్తుందంటూ అభ్యంతరం తెలపడం సరికాదన్నారు. కాంగ్రెస్‌దే విజయం స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు భవిష్యత్‌లో వ చ్చే ఏ ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీదే విజయమని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ఎర్రజొన్న, పసుపు రైతులు చేపట్టిన ఉద్యమాల్లో కాంగ్రెస్ నాయకులపైనే ఎక్కువ కేసులు ఉన్నాయని, కేసులను ఎత్తివేయాలని కోరారు. కార్యకర్తల పాత్ర కీలకం.. జుక్కల్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్ని కల్లో 50కి పైగా పంచాయతీలను ఏకగ్రీవం చేసేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తల పాత్ర కీలకమైందని తెలిపారు. సామాజిక న్యాయంతోనే.. బీసీ రిజర్వేషన్లు అమలైతే రాహుల్ గాంధీ నాయకత్వం బలోపేతం అవుతుందనే భయంతో ఎన్డీఏ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. -
జీవితంలో విలువైన బంధం ‘స్నేహం’
సుభాష్‌నగర్: స్నేహమనేది మానవ జీవితంలో అత్యంత విలువైన బంధమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని ఎల్లమ్మగుట్ట మున్నూరుకాపు సంఘంలో ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా కలం స్నేహం అసోసియేషన్ ఆధ్వర్యంలో సంగీత, సాహిత్య కవుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ధన్పాల్ మాట్లాడుతూ.. కలం ద్వారా స్నేహం పెంచుకుంటూ, భావాల పరస్పర మార్పిడికి వేదికలను కల్పిస్తున్న కలం స్నేహం అసోసియేషన్ వంటి సంస్థల సేవలు ప్రశంసనీయమన్నారు. సమాజాన్ని చైతన్యపర్చడంలో కవులు, కళాకారులు కీలకపాత్ర పోషిస్తారని, కళలు మానవ వికాసానికి తోడ్పడుతాయని తెలిపారు. మహిళా సాధికారతలో భాగంగా ఎందరో కవులను తీర్చిదిద్దుతున్న అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్ ఆచార్య, ఉపాధ్యక్షుడు హరిప్రియను ప్రత్యేకంగా అభినందించారు. సమ్మేళనంలో కవిత్వాలు, సంగీత ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో సాహితీ, సంగీత కవులు, మహిళలు పాల్గొన్నారు. జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం కార్యవర్గం ఎన్నికఆర్మూర్టౌన్: హ్యాండ్‌బాల్ సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆర్మూర్ పట్టణంలోని నటరాజ ఫంక్షన్ హాల్లో జిల్లా హ్యాండ్‌బాల్ సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం చైర్మన్‌గా అల్జాపూర్ దేవేందర్, ప్యాట్రన్‌గా టీ విద్యాసాగర్‌రెడ్డి, అధ్యక్షుడిగా కోల గంగామోహన్ చక్రు, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, ఓ.సునీత, సౌడ సురేశ్, బీ శ్యామ్, బాపూరావు, ప్రధాన కార్యదరిగా పింజ సురేందర్, సంయుక్త కార్యదర్శులుగా అనుపల రజిత, రమణమూర్తి, మాధురి, సతీశ్ రెడ్డి, లింగం, కోశాధికారి గట్టడి రాజేశ్, నిర్వహణ కార్యదర్శిగా రాహుల్, ఎం.సాయికుమార్, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర హ్యాండ్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి, హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శిగా ఎన్నికై న శ్యామల పవన్‌కుమార్ సంఘం సభ్యులు సన్మానించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ నగరంలో ఘనంగా సంగీత, సాహిత్య కవుల ఆత్మీయ సమ్మేళనం -
అమృతం తల్లిపాలు
నిజామాబాద్ నాగారం: బిడ్డకు అమృతంతో సమానమైన తల్లి పాల ప్రాముఖ్యాన్ని మహిళలకు వివరించేందుకు ప్రభుత్వం ప్రతి ఏడాది ఆగస్టు మొదటి వారంలో తల్లి పాల వారోత్సవాలను నిర్వహిస్తోంది. సమగ్ర శిశు అభివృద్ధి సేవా సంస్థ (ఐసీడీఎస్) ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో వారం రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి గర్భిణులు, బాలింతలకు తల్లిపాల విశిష్టతను వివరిస్తున్నారు. అపోహలను పోగొట్టేందుకు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారులు తల్లిపాల వారోత్సవాలకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. బిడ్డ పుట్టిన గంటలో 41 శాతం మంది పిల్లలకు మాత్రమే తల్లిపాలు ఇస్తున్నారు. బిడ్డ సంపూ ర్ణ ఆరోగ్యంతో ఉండేందుకు అవసరమైన అన్ని రకాల పోషక విలువలు తల్లి పాలలో ఉంటాయి. బిడ్డకు జ న్మనిచ్చిన తర్వాత గంటలోపే బిడ్డకు తల్లి పాలు ఇ వ్వాలి. దీంతో బిడ్డకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సాధారణంగా పిల్లలకు ఐదేళ్లలోపు వచ్చే డయేరియా, వైరల్ జ్వరాలు, కామెర్లు వంటి రకరకాల వ్యాధుల నుంచి తల్లిపాలు రక్షిస్తాయి. పిల్లలకు శ్వాసకోశ వ్యా ధులు, ఆస్తమా, అలర్జీ, డయాబెటిస్ క్యాన్సర్, ఊబకాయం, చెవిలో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.వారోత్సవాల్లో.. తల్లిపాల ప్రాధాన్యాన్ని వివరిస్తారు. పిల్లల ఎదుగుదలపై అవగాహన కల్పిస్తారు. 7 నుంచి 9 నెలల గర్భిణుల ఇంటికి వెళ్లి ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెబుతారు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందేలా చూడాలని కుటుంబసభ్యులకు వివరిస్తారు. పిల్లల మానసిక ఎదుగుదలకు తల్లి పాలు ఎంతో దోహదం చేస్తాయని, పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు బిడ్డకు తల్లి పాలను తప్పక ఇవ్వాలని వైద్యులు సూచిస్తారు. 7 నుంచి 24 నెలల పిల్లలకు తల్లిపాలతో అదనంగా ఆహారం ఇవ్వాలని సూచిస్తారు. ఇంట్లోనే సమతుల ఆహారం తయారీపై అవగాహన కల్పిస్తారు. బాలింతలు, గర్భిణుల ఇంటికి వెళ్లి కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు పూర్తి వివరాలు నమోదు చేస్తారు. ఆరు నెలల్లోపు వయసున్న చిన్నారుల ఇళ్లను సందర్శిస్తూ వారికి తల్లి పాలు అందుతున్నాయా? లేదా? అని ఆరా తీస్తారు. డబ్బాపాలతో అనారోగ్య సమస్యలు ఇంటింటికీ అంగన్వాడీ పేరుతో అవగాహన కొనసాగుతున్న తల్లిపాల వారోత్సవాలుశిశువుకు అమృతం అమ్మపాలు శిశువుకు అమృతం వంటివి. శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే ముర్రు పాలు పట్టించాలి. కృత్రి మ పాలు తాగిస్తే కలిగే నష్టాలపై గర్భిణులు, బాలింతలకు అంగన్వాడీ టీచర్లు అవగాహన కల్పించాలి. ప్రభుత్వ లక్ష్యాలు, అందిస్తున్న పథకాలను వివరించా ల్సి ఉంది. – రసూల్‌బీ, జిల్లా సంక్షేమ శాఖ అధికారిణిఐసీడీఎస్ ప్రాజెక్టులు: నిజామాబాద్ అర్బన్, బోధన్, నిజామాబాద్ రూరల్, భీమ్‌గల్, ఆర్మూర్ అంగన్వాడీ కేంద్రాలు : 1501 బాలింతలు : 6099 గర్భిణులు : 9771 -
క్లిక్ చేస్తే.. ఖాతా ఖల్లాస్
ఖలీల్‌వాడి: రోజురోజుకూ సైబర్ మోసాలు పెచ్చరిల్లుతున్నాయి. ఆఫర్ల పేరిట పుట్టుకొస్తున్న ఆన్లైన్ మోసాలకు చాలా మంది బలవుతున్నారు. క్లిక్ చేస్తే చాలు ఖాతాలు ఖాళీ అవుతున్నా యి. ఫైల్స్ ఓపెన్ చేసి సైబర్ క్రైమ్‌కు కొందరు గురైతే, ట్రేడింగ్ పేరిట వాట్సాప్‌కు వచ్చే మెసేజ్‌లను క్లిక్ చేసి దగా పడుతున్నారు. ఆఫర్ల పేరిట మోసం ఫోన్లకు వచ్చే ఆఫర్ల మెసేజ్‌లతో చాలా మంది అత్యాశకు పోయి నష్టపోతున్నారు. సైబర్ నేరగాళ్లు డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన యాప్‌లను ఆసరాగా చేసుకొని లింకులు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. కాగా, సైబర్‌మోసాల బారిన పడిన వారిలో అధికంగా చదువుకున్న వారే కావడం గమనార్హం. ప్రధానంగా ట్రేడింగ్ ఎక్స్పర్ట్లమని ఆన్లైన్లో పరిచయమవుతారు. కొంత ఇన్వెస్ట్ చేయించి అధిక లాభాలు చూపుతారు. మరింత ఇన్వెస్ట్ చేయించి మాయమవుతారు. ఇంకొందరు సీబీఐ, ఈడీ అధికారులమంటూ ఫోన్ చేసి మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారని భయపెడతారు. డిజిటల్ అరెస్టు పేరిట వీడియో కాల్స్ చేసి మీ ఖాతాలోని డబ్బులను ఖాళీ చేస్తారు. మరోవైపు కొరియర్, పార్సిల్ సర్వీస్, ప్రభుత్వ పథకాల పేరిట వచ్చే ఏపీకే ఫైల్స్‌ను ఓపెన్ చేసి చాలా మంది మోసపోవడం గమనార్హం. ఖాతాల ఫ్రీజ్.. నిజామాబాద్ కమిషనరేట్‌లో పరిధిలో 1 జనవరి 2024 నుంచి 29 జూలై 2025 వరకు మొత్తం 759 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసి వారి ఖాతాల నుంచి రూ. 3.27 కోట్లు రికవరీ చేశారు. కోర్టు ద్వారా బాధితులకు డబ్బులు అందజేశారు. తీసుకోవాల్సిన జాగ్రతలు ఆఫర్ల పేరిట గాలం సెల్ఫోన్లకు లింకులు పంపిస్తున్న సైబర్ కేటుగాళ్లు రెండేళ్లలో 759 కేసులు.. రూ.3.27కోట్ల రికవరీ బాధితుల్లో చదువుకున్న వారే అధికం జూలై 27న బాల్కొండ మండల కేంద్రానికి చెందిన యువకుడిని అమెజాన్ డెలివరీ హబ్ ఏర్పాటు పేరుతో సైబర్ నేరగాడు నమ్మించి రూ.1.71 లక్షలు కాజేశాడు. మోసపోయినట్లు గ్రహించిన యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. జూలై 24న నగరంలోని కోటగల్లీకి చెందిన యువకుడి అకౌంట్ నుంచి ట్రేడింగ్ పేరిట రూ.5.40 లక్షలు విడతల వారీగా బ్యాంక్ ఖాతాల నుంచి విత్‌డ్రా అయ్యాయి. దీంతో సదరు యువకుడు నాల్గో టౌన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు ఆరో టౌన్‌కు, అక్కడి నుంచి ఐదో టౌన్‌కు మారింది. డిజిటల్ అరెస్ట్‌లు ఉండవు.. స్మార్ట్‌ఫోన్‌కు వచ్చే లింక్ మెసేజ్‌లను తెరువద్దు. జాగ్రత్తగా ఉంటే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడలేం. డిజిటల్ అరెస్ట్‌లు ఉండవు. బాధితులు అరగంట, గంటలోపు ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930కి లేదా cyber.crime.gov.inకు ఫిర్యాదు చేస్తే రికవరీ చేసే అవకాశం ఉంటుంది. – వెంకటేశ్వర్లు, సైబర్ క్రైం, ఏసీపీ, నిజామాబాద్ సెల్ఫోన్లకు వచ్చే లింకులు నిర్ధారణ అయిన తర్వాతే ఓపెన్ చేయాలి. గుర్తు తెలియని ఫోన్ నెంబర్ల నుంచి గానీ, వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లు, కాల్స్ లిఫ్ట్ చేసి బ్యాంక్ వివరాలు, ఓటీపీలు, ఆధార్, పాన్‌కార్డుల వివరాలు చెప్పొద్దు. గంటలోపు ఫిర్యాదు చేస్తే సైబర్ క్రైం పోలీసు లు ఆ లింక్ ద్వారా మోసగాళ్ల బ్యాంక్ ఖాతా లను ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. జిల్లా పోలీస్ స్టేషన్లలో రూ. 1000 నుంచి రూ. 7లక్షల వరకు, అంతకు మించి ఉంటే సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. -
దేవుళ్ల పేరుతో ఓట్లడిగితే నమ్మరు
ఆర్మూర్ : దేవుళ్ల పేరుతో ఓట్లడిగితే ప్రజలు నమ్మరని, ఏ పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చిన బీఆర్ఎస్ నాలుగు ముక్కల ఆటతో పార్టీ భూస్థాపితమైందన్నారు. రాబోయే 15 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గంలో చేపట్టిన ‘జనహిత పాదయాత్ర’ రెండోరోజైన ఆదివారం కొనసాగింది. ముందుగా ఆలూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క శ్రమదానం చేశారు. అక్కడి నుంచి ఆర్మూర్ మండలం అంకాపూర్‌కు చేరుకున్నారు. మహేశ్‌కుమార్ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం గ్రామంలో పాదయాత్ర నిర్వహించి అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. అనంతరం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ శివారులో ఉన్న యమునా గార్డెన్స్‌లో ఉమ్మడి జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముందుగా ప్రతి నియోజకవర్గం నుంచి ఇద్దరు కార్యకర్తలతో మాట్లాడించి స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహేశ్‌కుమార్‌గౌడ్ మా ట్లాడుతూ.. ఓట్ల సమయం వస్తేనే జైశ్రీరామ్ అంటూ మాట్లాడే బీజేపీ నేతలు పేదల గురించి ఆలోచించరని విమర్శించారు. శ్రీరాముడికి బీజేపీలో మెంబర్షిప్ ఇచ్చారా అని ప్రశ్నించారు. తాము కూడా శ్రీరాముడిని పూజిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి ఉండి సమష్టిగా పని చేయా ల ని పిలుపునిచ్చారు. కార్యకర్తల వల్లే తాము ఈ రోజు పదవుల్లో ఉన్నామని, రాబోయే స్థానిక ఎ న్నికల్లో కార్యకర్తలకు పదవులు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన పాత కార్యకర్తలకు సము చిత స్థానం ఉంటుందని అలాగే కొత్తవారికి ప్రాఽ దాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. పదేళ్లు పార్టీ కోసం కష్ట నష్టాలకోర్చి లాఠీ దెబ్బలు తిని, జైళ్ల పాలైన వారిని పార్టీ విస్మరించబోదన్నారు. త్వరలో వ్యవసాయ కళాశాల.. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ క ళాశాల ఏర్పాటు చేసుకున్నామని త్వరలోనే వ్యవసాయ కళాశాలను తీసుకొస్తామని హామీ ఇచ్చా రు. వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల కూడా మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే నిజామాబాద్ జిల్లాలో మెడికల్ కళాశాల, గుత్ప ఎత్తిపోతల పథకం, తెలంగాణ యూనివర్సిటీ ఏర్పా టు చేయడంతోపాటు ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టామని గుర్తు చేశారు. షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై నిపుణులతో అధ్యయనం కొనసాగుతోందని తెలిపారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఇన్చార్జి మంత్రి సీతక్క, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, లక్ష్మీకాంతారావు, ఎ మ్మెల్సీ బల్మూరి వెంకట్, మాజీ ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి, ఆకుల లలిత, ఆర్మూర్, బాల్కొండ ని యోజకవర్గాల ఇన్చార్జులు వినయ్‌రెడ్డి, సునీల్ రెడ్డి, ఈరవత్రి అనిల్, మార గంగారె డ్డి, మార చంద్రమోహన్, బాడ్సి శేఖర్‌రెడ్డి, గడ్కోల్ భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఖాందేశ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు మేము కూడా శ్రీరాముడిని పూజిస్తాం నాలుగు ముక్కల ఆటతో బీఆర్ఎస్ భూస్థాపితమైంది మరో 15 ఏళ్లు కాంగ్రెస్‌దే అధికారం.. పార్టీలో పాత, కొత్త నాయకులకు సముచిత స్థానం పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ముగిసిన జనహిత పాదయాత్ర రాహుల్ స్ఫూర్తితోనే ‘జనహిత’ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3,500 కిలో మీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలను తెలుసుకున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను స్ఫూర్తిగా తీసుకొనే జనహిత పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. దేశంలోని కాంగ్రెస్ కార్యకర్తలంతా ఒకే కుటుంబమన్నారు. రాహుల్ గాంధీ సూచన మేరకు తెలంగాణలో శాసీ్త్రయ పద్ధతిలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించేలా కృషి చేయడంతో అందరూ తెలంగాణ వైపు ఆసక్తిగా చూస్తున్నారన్నారు. బీజేపీ మాత్రం నాగ్‌పూర్ నుంచి ఆర్ఎస్ఎస్ ఇచ్చే ఆదేశాలను పాటిస్తూ దేశ ప్రజలను మతం పేరిట విడదీస్తోందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో నిర్వహించే ఆందోళన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. -
అడవులను ఆక్రమించనివ్వొద్దు
వర్ని: అడవులను ఆక్రమించనివ్వొద్దని, పర్యావరణానికి హాని కలిగించే చర్యలకు పాల్పడే వారిపై అటవీశాఖ అధికారులు శాఖాపరమైన చర్యలు తీ సుకోవాలని జిల్లా ఇన్చార్జి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మో స్రా, చందూర్ మండలాల్లో ఆదివారం ఆమె పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. చందూర్‌లో లబ్ధిదారులకు రేషన్‌కార్డులు, మండల మహిళా సమాఖ్యకు రుణాలకు సంబంధించిన చెక్కును అందజేశారు. ఆయాచోట్ల ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఇదివరకే అటవీ భూములు సాగు చేసుకుంటున్న వారికి ఇబ్బంది కలిగించకుండా సంయమనం పాటించా లని సూచించారు. మహిళా సమాఖ్యల ద్వారా ఆర్టీ సీలో అద్దె బస్సులను పెట్టించి ప్రతి నెలా రూ.70 వే ల ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మహిళలకు ఆదాయ వనరు ను సృష్టించామని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి డ్వా క్రా సంఘాల్లో రుణాలు ఇప్పిస్తున్నట్లు వెల్లడించా రు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ అధి కారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లే దన్నారు. ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ బాలరాజు, జహీరాబా ద్ ఎంపీ సురేశ్ షెట్కార్, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్లు సురేశ్‌బాబా, శ్యామల, మాజీ ఎంపీపీలు శ్రీనివాస్‌గౌడ్, లావణ్య, మాజీ జెడ్పీటీసీలు అంబర్‌సింగ్, హరిదాసు, గంగారాం, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. ఇప్పటికే సాగు చేసుకుంటున్నవారికి ఇబ్బందులు కలిగించొద్దు పర్యావరణానికి హాని కలిగించే వారిపై చర్యలు తీసుకోండి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క -
వెతల వసతి..
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో సంక్షేమ వసతిగృహాల పరిస్థితి అధ్వానంగా మారింది. మరమ్మతులకు సంబంధించి కేటాయించే ప్రత్యేక నిధులు రెండేళ్లుగా మంజూరుకాకపోవడంతో మరమ్మతులు కరువయ్యాయి. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఇబ్బందులు పడుతూ విద్యార్థులు కాలం గడుపుతున్నారు. మరమ్మతుల కోసం సంబంధిత అధికారులు రెండుసార్లు ఎస్టిమేషన్ వేసి నివేదికలు పంపినా నిధులు మాత్రం మంజూరు కావడం లేదు. ● జిల్లాలోని వసతిగృహాల్లో నెలకొన్న ప్రధాన సమస్య గదులకు, కిటికీలకు తలుపులు లేకపోవడం, బాత్రూమ్లు అధ్వానంగా మారడం. ● జిల్లా కేంద్రంలోని నాందేవాడలో ఉన్న బీసీ వసతి గృహంలో విద్యార్థుల రూములకు తలుపులు సక్రమంగా లేవు. టాయిలెట్స్ అధ్వానంగా ఉన్నాయి. ● నాందేవ్‌వాడలోని ఎస్టీ వసతి గృహంలో తలుపులు సక్రమంగా లేవు. బాత్రూమ్లకు డోర్లు లే కపోవడంతో అట్టలు, పరదాలు ఏర్పాటు చేసి విద్యార్థులు వాడుకుంటున్నారు. వంటగదికి తక్షణ మే మరమ్మతులు చేయాల్సి ఉన్నప్పటికీ నిధులు లేక పాత రేకుల షెడ్డులో కొనసాగిస్తున్నారు. ● గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని వసతిగృహం శిథిలావస్థకు చేరింది. పై పెచ్చులు ఉడిపడుతున్నాయి. తక్షణమే మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. ● దుబ్బ ప్రాంతంలోని బీసీ వసతి గృహం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నిధులు లేక మరమ్మతులు చేపట్టకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ● ఆర్మూర్‌లోని బాలికల వసతి గృహంలో మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. వర్షం కురిస్తే గదులు ఊరుస్తున్నాయి. ● బోధన్‌లోని ఎస్సీ వసతి గృహంలో గదులకు, కిటికీలకు తలుపులు లేకపోవడం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నూతన భవనాలకు మోక్షం లేదు ఎస్సీ సంక్షేమ వసతిగృహాలకు నూతన భవనాల కోసం గతేడాది రూ.30 కోట్ల నిధులు మంజూరయ్యాయి. మొత్తం 42 హాస్టళ్లు ఉండగా.. తొమ్మిదిచోట్ల నూతన భవనాలు నిర్మించాలని ఆదేశాలు వచ్చాయి. నందిపేట మండలం అయిలాపూర్ వసతి గృహం అధ్వానస్థితిలో ఉందనే అంశాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి అసెంబ్లీలో లేవనెత్తగా భవనం నిర్మించాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కానీ మిగతా ఎనిమిది భవనాల నిర్మాణానికి మాత్రం అనుమతులు జారీ కాలేదు. అనుమతులు వస్తే నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. జిల్లాలో వసతిగృహాలు విద్యార్థులు ఎస్సీ - 42 6324బీసీ - 33 2,800ఎస్టీ - 08 1,4802024లో నివేదికలు తక్షణం మరమ్మతులు చేపట్టాల్సినవి.. అధ్వానంగా సంక్షేమ వసతి గృహాలు మరమ్మతులు మరిచారా? రెండేళ్లుగా మంజూరుకాని నిధులు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు నూతన భవనాలకు నిధులున్నా నిర్మాణానికి అనుమతిలేదు 2024 మార్చిలో సంబంధిత అధికారులు జిల్లాలోని సంక్షేమ వసతిగృహాలను పరిశీలించి మరమ్మతులకు సంబంధించిన నివేదికలను తయారు చేశారు. ఇందుకు రూ.8 కోట్లు అవసరమని ఉన్నతాధికారులకు విన్నవించారు. మళ్లీ ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో వసతిగృహాల మరమ్మతులకు సంబంధించి నివేదికలు పంపించాలని ఉన్నతాధికారులు ఆదేశించగా.. జిల్లా అధికారులు చేపట్టాల్సిన పనులకు సంబంధించి నివేదికలు రూపొందించి రూ.9 కోట్ల 70 లక్షలు అవసరం ఉంటాయని పేర్కొన్నారు. రెండుసార్లు నివేదికలు అందినా ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు. -
నిజామాబాద్
సోమవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2025గిరిరాజ్ కళాశాల సమీపంలోని ఎస్సీ వసతి గృహంలో పెచ్చులూడిన పైభాగం సంక్షేమ వసతిగృహాల్లో మౌలిక వసతులు కరువయ్యాయి. హాస్టళ్లలో చేపట్టాల్సిన మరమ్మతులపై సుమారు ఏడాదిన్నర కాలంలో అధికారులు రెండుసార్లు ప్రతిపాదనలు పంపినా ఇప్పటి వరకు నిధు లు మంజూరు కాలేదు. గదులకు, బాత్రూమ్లకు తలుపు లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నూతన హాస్టల్ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరైనా అనుమతులు రాకపోవడంతో పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఒక్క అయిలాపూర్‌లో మాత్రమే ఆర్మూర్ ఎమ్మెల్యే చొరవతో పనులను ప్రారంభించారు. న్యూస్‌రీల్ -
గుంతను పూడ్చిన అధికారులు
డిచ్పల్లి: మండలంలోని నడిపల్లి సమీపంలో రోడ్డుపై ఏర్పడిన పెద్ద గుంతను ఆర్అండ్బీ అధికారులు పూడ్చివేశారు. నడిరోడ్డుపై గుంత.. వాహనదారులకు చింత అనే కథనాన్ని సాక్షి దినపత్రికలో జూలై 29న ప్రచురితమైంది. ముందుగా స్పందించిన గ్రామ పంచాయతీ సిబ్బంది వాహనదారులకు హెచ్చరికగా రోడ్డుపై ఏర్పడిన గుంతలో ఎర్రజెండాను ఏర్పాటు చేసి సమస్యను ఆర్అండ్బీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం అధికారులు రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా ఏర్పడిన గుంతలను పూడ్చివేశారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఇందిర ఆత్మీయ భరోసా కోసం ఆందోళనలు
సిరికొండ: ఇందిర ఆత్మీయ భరోసా అమలుకు కోసం ఈ నెల 20 నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కిషన్, రమేశ్ తెలిపారు. మండలంలోని గడ్కోల్‌లో శనివారం సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ నెల 5న కలెక్టరేట్, 20న జీపీలు, 21 నుంచి 30 వరకు తహసీల్ కార్యాలయాలు, సెప్టెంబర్ 10న చలో సెక్రటేరియట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. బాల్‌రెడ్డి, సాయారెడ్డి, అశోక్, దయాల్‌సింగ్, ఎర్రన్న, కిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
లెక్చరర్లను నియమించాలి
సుభాష్‌నగర్: జిల్లాకేంద్రంలోని గిరిరాజ్ కళాశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని పీడీఎస్‌యూ కళాశాల కమిటీ కార్యదర్శి నసీర్, ఉపాధ్యక్షుడు వినోద్ డిమాండ్ చేశారు. శని వారం ఈమేరకు ప్రిన్సిపాల్ రామ్మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కళాశాలలో ప్రతి కోర్సుకు సంబంధించిన పుస్తకాలు లైబ్రరీలో విద్యార్థుల సంఖ్యకు తగినట్లు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. తరగతులు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా.. ఇంతవరకూ సరిపడా అధ్యాపకులు లేరన్నా రు. వెంటనే లెక్చరర్లను నియమించాలని డిమాండ్‌చేశారు. నాయకులు సృజన్, అజయ్, కిరణ్, ధీరజ్, భీమేశ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. -
స్నేహితులకు అండగా..
ఇందల్వాయి: ఇరవై ఏళ్ల క్రితం పదో తరగతిలో మొదలైన స్నేహం ఇంకా కొనసాగిస్తూ వారిలో ఎవరికి ఆపదొచ్చినా అన్ని విధాల అండగా నిలుస్తూ, తాము చదివిన పాఠశాలకు కూడా సేవలు చేస్తున్నారు ఎల్లరెడ్డిపల్లెకి చెందిన 2005–06 పదో తరగతి పూర్వ విద్యార్థులు. తమ స్నేహానికి గుర్తుగా మొదట చదివిన పాఠశాలలో స్వామి వివేకానంద విగ్రహాన్ని 2010 లో ఏర్పాటు చేశారు. అనంతరం తమ మిత్ర బృందంలో ఉంటూ అకాల మరణం చెందిన స తీశ్ కుటుంబానికి రూ. 35 వేలు, ప్రమాదంలో గాయపడ్డ గంగాధర్‌కు రూ. 85 వేలు, స్నేహి తురాలు భర్తకి పక్షవాతం వస్తే వైద్య ఖర్చుల ని మిత్తం రూ. 30 వేలు అందించారు. తమ స్నేహి తుల్లో ఎవరికి ఆపద వచ్చినా అన్ని విధాల ముందుంటామని ధీమాగా చెబుతున్నారు. -
బీజేపీ బీసీ ధర్నాలో జిల్లా నాయకులు
సుభాష్‌నగర్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి నయవంచన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనకు జిల్లా నాయకులు హాజరయ్యారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్ నేతృత్వంలో ఓబీసీ మోర్చా కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. ధర్నాలో ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల ఓట్లతో గెలిచి వారి ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టిందని ఆరోపించారు. నాయకులు రంజిత్, శ్రీనివాస్, మారుతి, సురేశ్ తదితరులు ఉన్నారు. -
ట్రెండు మారినా.. ఫ్రెండు మారడు!
నేడు స్నేహితుల దినోత్సవం సిరికొండ: హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన ఆ స్నేహితులు ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూనే పర్యావరణ పరిరక్షణ బాధ్యతను తీసుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు. మండలంలోని తూంపల్లిలో 2010–11 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన 23 మంది స్నేహితులు 2021లో హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించారు. అనంతరం సేవా భావంతో అన్ని దానాల్లో కెల్లా రక్తదానం మిన్న అనే నినాదంతో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తు, ఇప్పటి వరకు 160 యూనిట్ల రక్తాన్ని సేకరించి చికిత్స పొందుతున్న వారికి అందించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో రోడ్లపై ఏర్పడ్డ గుంతలను పూడ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వె య్యికి పైగా మొక్కలు నాటారు. వారు చదువుకున్న పాఠశాలలో పేద విద్యార్థులకు నోటు పుస్త కాలు, స్టేషనరీ అందిస్తున్నారు. ఇటీవల కొండాపూర్‌లో చెరువులో పడి మృతి చెందిన వీఆర్ఏ తూము సుదర్శన్ ముగ్గురు పిల్లలను సంస్థ ద్వారా చదివిస్తున్నారు. స్వచ్ఛ ఘన్పూర్.. డిచ్పల్లి: తమ గ్రామాన్ని స్వచ్ఛంగా తయారు చే యాలనే సంకల్పంతో స్నేహితులంతా కలిసి స్వచ్ఛ ఘన్పూర్ పేరుతో బృందంగా ఏర్పడ్డారు. డిచ్పల్లి మండలం ఘన్‌పూర్‌లో మూడేళ్ల క్రితం 15 మంది తో ప్రారంభించిన ఈ బృందంలో ఇప్పుడు 40 మంది వరకు చేరారు. గ్రామంలోని కాలనీల్లో ఎక్క డ చెత్త, పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు కనిపించినా స్వచ్ఛ ఘన్పూర్ సభ్యులు వెంటనే శుభ్రం చేస్తారు. మురికి కాలువలు ధ్వంసమైతే వెంటనే వాటిని సరిచేస్తారు. ప్రతి నెలా రూ.100 చొప్పున డబ్బులు జమచేసి గ్రామంలో ఎవరైనా పేద కుటుంబానికి చెందిన వారు మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక సా యం అందజేస్తున్నారు. ఇటీవల గణేశ్ అనే యువ కుడు చనిపోతే వారి కుటుంబానికి రూ.50వేలు ఆర్థి క సాయం అందజేశారు. ఇలా స్నేహితులంతా కలి సి సమాజసేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మన జీవితంలో ఒక్కసారి మధుర క్షణాల్ని గుర్తు చేసుకుంటే అందులో అత్యధికం స్నేహితులు మన వెంట ఉన్నవే ఎక్కువగా ఉంటాయి. అందులోనూ స్కూల్, కాలేజీ స్నేహం ప్రత్యేకం. జిల్లాలో కొందరు చిన్న నాటి నుంచి మొదలైన స్నేహం ఇంకా కొనసాగిస్తూ వారిలో ఎవరికై న ఆపద వస్తే అండగా నిలుస్తూ స్నేహానికి నిదర్శనంగా నిలుస్తున్నారు. మరికొందరు తమ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, ఇంకొందరు రక్తదానంతో ఆపదలో ఉన్న వారిని కాపాడాలని మిత్రులతో కలిసి స్వచ్ఛంద సంస్థలను ఏర్పాటు చేశారు. -
సమస్యలు పరిష్కరించాలి
తెయూ(డిచ్పల్లి): తెయూలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వర్సిటీ పీడీఎస్‌యూ నాయకులు గౌతమ్‌రాజ్ డిమాండ్ చేశారు. క్యాంపస్‌లోని ఓల్డ్ బాయ్స్ హాస్టల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్యాంపస్‌లోని బాలుర, బాలికల హాస్టల్స్‌లో సమస్యలు నెలకొన్నాయన్నారు. వాష్ బేసిన్స్‌లో నల్లాలు రావడం లేదని, కిటీలకు జాలీలు లేక దోమలు కుట్టడంతో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆరోపించారు. బాలికల హాస్టల్లో గదులు సరిపోక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని,వెంటనే పనులను ప్రారంభించాలని డి మాండ్ చేశారు. నాయకులు రాకేశ్, ఆకాశ్, ప్రభాస్, తిరుపతి తదితదిరులు పాల్గొన్నారు. ఆర్థిక సాయం అందజేతసిరికొండ: ఆపదలో ఉన్న మిత్రుడికి ఆర్థిక సాయం చేసి ఆదర్శంగా నిలిచారు మిత్ర బృందం. పోత్నూర్ గ్రామానికి చెందిన దర్శనం బాలయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పెద్దవాల్గోట్ జెడ్పీహెచ్ఎస్లో 2000–01 బ్యాచ్ అతడి పదో తరగతి మిత్రులు పెద్దవాల్గోట్, చిన్నవాల్గోట్, పోత్నూర్, రేకుల్‌పల్లి గ్రామాలకు చెందిన వారు రూ. 44500 లను బాలయ్యకు ఆయన ఇంట్లో శనివారం అందజేశారు. బాలయ్య కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. నియామకం ఖలీల్‌వాడి: చేనేత పద్మ సమైఖ్య రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా సిలివేరి గణేశ్‌ను నియామిస్తూ శనివారం రాష్ట్ర చేనేత పద్మ సమైఖ్య అధ్యక్షుడు కొండా రామమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లో రాష్ట్ర కమిటీ సమావేశంలో ప్రత్యేక తీర్మానం చేసినట్లు ఆయన తెలిపారు. పద్మశాలిల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం మోపాల్: మండలంలోని కంజర్ శివారులో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఫిజిక్స్ జూనియల్ లెక్చరర్ పార్ట్ టైమ్ పోస్టుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ విజయలలిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెస్సీ ఫిజిక్స్, బీఈడీ విద్యార్హతలు కలిగిన వారు అర్హులన్నారు. మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని, అర్హులైన అభ్యర్థులు తమ విద్యార్హతల ధ్రువపత్రాలతో కళాశాలలో సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు 9949356342 నంబర్‌ను సంప్రదించాలని ఆమె కోరారు. 11న పెన్షనర్ల ధర్నా ఖలీల్‌వాడి: పెండింగ్ డీఏల విడుదల, కొత్త పీఆర్సీ అమలు, నగదు రహిత వైద్యసేవలు, పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపు వంటి ప్రధాన డిమాండ్ల సాధనకు ఈ నెల 11న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ భవన్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ సమస్యలపై మంత్రులను, అధికారులను పదేపదే కలిసి విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. ధర్నాను పెన్షనర్లు విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో శిర్ప హనుమాండ్లు, నారాయ ణ, జార్జ్, భోజారావు, నరేందర్, సాంబశివరా వు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో ఫ్రెండ్షిప్ డే వేడుకలు సిరికొండ: మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాలలో ఫ్రెండ్షిప్ డే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇంగ్లిషు అక్షరాల ఆకారంలో కూర్చుని శుభాకాంక్షలు తెలిపారు. ప్రిన్సిపాల్ నర్సయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మోడల్ కళాశాలలో ఫ్రెషర్స్ డే..జక్రాన్‌పల్లి: మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన నృత్యాలు అలరించాయి. ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫ్రెషర్స్ పార్టీ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుధారాణి, రవికుమార్, నజీర్, సత్యం సాయి, బాల రాజు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రేషన్ కార్డుల పంపిణీ
డిచ్పల్లి: ప్రభుత్వం అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులను జారీ చేసిందని కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు డాక్టర్ షాదుల్లా అన్నారు. శనివారం డిచ్పల్లి మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన కొత్త రేషన్‌కార్డులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని షాదుల్లా అన్నారు. కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ, డాక్టర్ లింబాద్రి, బాజేందర్, హరీశ్, గంగిభూపతి, సాగర్, రాంచందర్, సతీశ్‌రెడ్డి, దేవేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు. -
క్యాంపస్‌లో బాలికల హాస్టల్‌ను నిర్మించాలి
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్‌లో వెంటనే నూతన బాలికల హాస్టల్‌ను నిర్మించాలని వర్సిటీ ఏబీవీపీ అధ్యక్ష, కార్యదర్శులు పృథ్వి, సమీర్ డిమాండ్ చేశారు. శనివారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణ పేరుతో ఏర్పడిన యూనివర్సిటీలో అడుగడుగునా సమస్యలు నెలకొన్నాయన్నారు. రూసా నిధులు మంజూరై, టెండరు ప్రక్రియ పూర్తయినప్పటికీ బాలికల హాస్టల్ నిర్మాణ పనులు ప్రారంభించక పోవడంలో వీసీ అలసత్వం, స్థానిక ఎమ్మెల్యే రాజకీయం కారణమని ఆరోపించారు. యూనివర్సిటీకి ప్రభుత్వం ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమని ఇప్పుడు కొత్తగా కళాశాలలో చేరే విద్యార్థినులకు ఏ విధంగా వసతి కల్పిస్తారో వర్సిటీ ఉన్నతాధికారులు చెప్పాలని పేర్కొన్నారు. హాస్టల్ నిర్మాణ పనులను ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ మోహన్, నాయకులు మనోజ్, అనిల్, అఖిల్, సంతోష్, సాయి, శ్రీనిత్య, వర్షిణి, నిఖిత తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి జన్మదిన వేడుకలు
సుభాష్‌నగర్/ నిజామాబాద్ సిటీ: జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి, పార్టీ జిల్లా యువ నేత విజయ్‌పాల్ రెడ్డి హైదరాబాద్‌లో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ భవన్లో డీసీసీ అధక్షుడు, రాష్ట్ర సహకార సంఘం లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా కేంద్రంలోని బాపూజీ వచనాలయంలో అధ్యక్షుడు భక్తవత్సలం, ప్రధాన కార్యదర్శి మీసాల సుధాకర్ కేక్ కట్ చేశారు. -
బీసీల రిజర్వేషన్ల సాధనకే జనహిత పాదయాత్ర
జక్రాన్‌పల్లి: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడానికే జనహిత పాదయాత్ర చేపడుతున్నట్లు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. శనివారం అర్గుల్ పీవీఆర్ గార్డెన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనహిత పాదయాత్రలో భాగంగా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌లో ఆదివారం నిర్వహించే ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్తకర్తల సమావేశాన్ని కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్, మంత్రి సీతక్క హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. పాదయాత్రలో గ్రామాల్లోని సమస్యలు తెలుసుకుని అప్పటికప్పుడే పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్ధేశం చేస్తారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. ఇప్పుడు రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ నాయకులు దీక్ష చేస్తామనడం హాస్యస్పదమన్నారు. సమావేశంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయరెడ్డి, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు గోర్త రాజేందర్, మాజీ ఎంపీపీ అప్పాల రాజన్న, పార్టీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, నాయకులు చిన్న సాయారెడ్డి, వసంత్‌రావు, సొప్పరి వినోద్, కాట్పల్లి నర్సారెడ్డి, గంగారెడ్డి, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి -
ఎరువుల వివరాలు పక్కాగా ఉండాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఇందల్వాయి/ధర్పల్లి: ఎరువుల నిల్వలను ఎప్పటికప్పుడు రిజిస్టర్లో నమోదు చేసి ఆ వివరాలను స్టాక్ బోర్డుపై రైతులకు తెలిసేలా ప్రదర్శించాలని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి సొసైటీ సీఈవోలను ఆదేశించారు. ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లె , ధర్పల్లి మండలం హోన్నాజిపేట్ గ్రామాల్లో శ నివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎ రువుల గోదాములు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలను తనిఖీ చేశారు. రైతుల అవసరాల మేరకు ఎరువుల అందుబాటులో ఉండేలా చూడాలని సూ చించారు. అనంతరం పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్.. పాఠశాలల్లో టీచర్ల హాజరును ఫేస్ రికగ్నేషన్ పద్ధతిలో చేపట్టాలన్నారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలన్నారు. అంగన్వాడీల్లో విద్యార్థుల ప్రవేశాలు, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబర్చేలా అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ఎల్లారెడ్డిపల్లె పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి నుంచి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులందరూ ఇంటి నిర్మాణం చేపట్టేలా చూడాలన్నారు. ఇల్లు నిర్మించుకునే వారందరికీ సకాలంలో బిల్లులు చెల్లిస్తామని కలెక్టర్ తెలిపారు. -
వేర్వేరు చోట్ల జీవాలపై చిరుతల దాడి
● మహంతంలో దూడ, గడ్కోల్‌లో మేక మృతి నవీపేట/సిరికొండ: జిల్లాలోని నవీపేట, సిరికొండ మండలాల్లో చిరుతలు జీవాలపై దాడి చేసి చంపేశాయి. వివరాలు ఇలా ఉన్నాయి. నవీపేట మండలం మహంతం గ్రామానికి చెందిన మేకల లక్ష్మన్‌కు నాలుగు గేదెలు, రెండు దూడలు ఉన్నాయి. మేత మేశాక ఎప్పటిలాగే గుట్ట కింద భాగంలోని రేకుల షెడ్డులో వీటిని కట్టేసి ఇంటికి వెళ్లాడు. శనివారం ఉదయం వచ్చి చూసేసరికి అందులోని దూడ చనిపోయి ఉంది. చిరుత దాడిగా అనుమానించి బాధితుడు ఫారెస్టు అధికారులకు సమాచారమిచ్చాడు. ఘటనా స్థలాన్ని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు జెహూర్, కుద్బుద్దీన్, బీట్ ఆఫీసర్ సుధీర్ పరిశీలించారు. మహంతం గుట్ట నుంచి వచ్చిన చిరుత దూడపై దాడి చేసినట్లుగా నిర్ధారించారు. వెటర్నరీ వైద్యుడు నరేందర్‌రెడ్డి పోస్టుమార్టం నిర్వహించారు. గడ్కోల్‌లో.. సిరికొండ మండలం గడ్కోల్ గ్రామానికి చెందిన మనోజ్ శనివారం తన మేకల మందను బొగ్గులకుంట అటవీ ప్రాంతంలోకి మేతకు తీసుకెళ్లాడు. పొదల్లో నుంచి వచ్చిన చిరుత, మేక మెడ భాగంలో దాడి చేసింది. అరుపులు విన్న కాపరులు గట్టిగా కేకలు వేయడంతో మేకను వదిలేసి చిరుత అడవిలోకి వెళ్లిపోయిందని తెలిపారు. గడ్కోల్ బీట్ ఆఫీసర్ దిలీప్ మేకను పరిశీలించారు. ఘటన స్థలంలో మొత్తం గడ్డి ఉండటంతో చిరుత అడుగులు కనబడలేనది ఆయన పేర్కొన్నారు. -
స్నేహం పేరిట దోపిడీలు..
కామారెడ్డి క్రైం: స్నేహం పేరు మీద సోషల్ మీడియాలో నుంచి పలు యాప్‌లను డౌన్లోడ్ చేయడం, వాటిలో గ్రూప్‌లు తయారు చేసి సభ్యులను చేర్చడం, ఆపై అమాయకులను టార్గెట్ చేసి దాడులు, దోపిడీలకు పాల్పడటం వారి పని. కామారెడ్డితో పాటు చుట్టు పక్కల జిల్లాలలో నాలుగేళ్లుగా ఓ కొత్త రకం దోపిడీలను గుట్టుచప్పుడు కాకుండా చేస్తూ, లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్న ఓ ముఠాను కామారెడ్డి పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తలించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర వివరాలు వెల్లడించారు. గత నెల 25 న ఓ బాధితుడు పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. సోషల్ మీడియా యాప్‌ల ద్వారా పరిచయమైన కొందరు వ్యక్తులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మెగా కార్ షెడ్డు వద్దకు తనను పిలిపించి తన ఫొటోలు తీసి, వాటిని అసభ్యకరంగా మార్ఫింగ్ చేయడమే కాకుండా డబ్బులు ఇవ్వకుంటే వాటిని అందరికీ పంపిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశాడు. ఫోన్‌పే ద్వారా బలవంతంగా డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కామారెడ్డి పట్టణానికి చెందిన షేక్ జోహెబ్, మహమ్మద్ మిరాజ్ పాషా, సయ్యద్ ముజాఫర్ అలీ, సిరిసిల్ల జిల్లా చంద్రంపేట్ గ్రామానికి చెందిన షేక్ సొహైల్ లతో పాటు ఓ మైనర్ లను నిందితులుగా గుర్తించారు. వారంతా గత నాలుగేళ్లుగా సోషల్ మీడియా యాప్‌ల ద్వారా అమాయకులకు వల వేస్తున్నట్లు విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు. కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, మేడ్చల్ ప్రాంతాల్లోని 41 ఘటనల్లో ఈ ముఠా దాడులు, వసూళ్లకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. వసూళ్ల మొత్తం ఇప్పటికి రూ. 8 లక్షల వరకు నిర్ధారణ జరిగిందన్నారు. కాగా రూ. 40 లక్షలకు పైగా వసూలు చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులపై కామారెడ్డిలో 6, సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి పీఎస్ పరిధిలో 2, నిజామాబాద్‌లో ఒకటి చొప్పున మొత్తం 9 కేసులు నమోదైనట్లు ఎస్పీ వెల్లడించారు. ఇంకా చాలామంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఎవరైనా బాధితులు ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ ముఠా సభ్యులపై గతంలో కూడా కామారెడ్డి, సిరిసిల్ల, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో 11 కేసులు ఉన్నాయన్నారు. వాటిలో నిజామాబాద్‌లో ఓ యువకుడిని గతంలో ఇదే తరహాలో నమ్మించి హత్యకు పాల్పడిన కేసు కూడా ఉందని వివరించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని అన్నారు. సోషల్ మీడియా యాప్‌లతో పరిచయాలు.. నిందితులు సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకుంటారు. యూత్, ట్రాన్స్‌జెండర్, లెస్బియన్స్, తదితర వాట్సప్ గ్రూప్ లను డౌన్లోడ్ చేసి వాటిలో చాలామందిని యాడ్ చేస్తూ గ్రూప్‌లుగా తయారు చేస్తారు. ముఖ్యంగా స్వలింగ సంపర్కులను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. పరిచయాలు పెంచుకుని అమయకులైన లెబ్బియన్ లను నిర్మాణుష్య ప్రదేశాలకు పిలుస్తారు. రాగానే దాడులకు పాల్పడి ఉన్నదంతా దోచుకుంటారు. అంతే కాకుండా ఫొటోలు తీసి, డబ్బులు ఇవ్వాలనీ, లేకుంటే మార్ఫింగ్ చేసి అందరికీ షేర్ చేస్తామని బెదిరిస్తారు. నిందితుల్లో షేక్ సోహైల్ ఇదివరకు ఆర్మీలో పని చేసి వచ్చాడు. సోషల్ మీడియా పరిచయాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన ఎస్పీ సూచించారు. కేసు చేధనలో కృషి చేసిన పట్టణ సీఐ నరహరి, సీసీఎస్ ఎస్సైలు శ్రీనివాస్, ఉస్మాన్, నరేష్, వినయ్ సాగర్, రాజారాం, బాల్ రెడ్డి, నరేష్, సిబ్బంది మైసయ్య, రవి, కమలాకర్, నరే ష్, రాజు, భాస్కర్ లను అభినందించారు. సోషల్ మీడియా వేదికగా యాప్‌లతో వల నిర్మానుష్య ప్రాంతాలకు పిలిచి దాడులు, దోపిడీ ఐదుగురి అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్ చంద్ర