మా ఆస్పత్రుల్లో ఉద్యోగాలిస్తా.. రండి!!
ఇరాక్ అల్లర్ల పుణ్యమాని ఉద్యోగాలు పోగొట్టుకుని, ఉగ్రవాదుల చెరలో చిక్కి, ఎట్టకేలకు మాతృభూమికి తిరిగివెళ్లిన 46 మంది నర్సులకు తన ఆస్పత్రులలో ఉద్యోగాలు ఇస్తానని దుబాయ్‌కి చెందిన భారతీయ వ్యాపారవేత్త ఒకరు పిలిచారు. గల్ఫ్ దేశాలతో పాటు భారత్, నేపాల్, భూటాన్ దేశాల్లో ఆస్పత్రులున్న బీఆర్ శెట్లి వాళ్లకు ఈ ఆఫర్ ఇచ్చారు.
ఈ మేరకు ఆయన కేరళలోని వార్తాపత్రికలలో ప్రకటనలు ఇచ్చారు. ఇరాక్ నుంచి తిరిగొచ్చిన నర్సులు ఈ ఆఫర్ పట్ల ఆసక్తి ఉంటే తన కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు. తిక్రిత్‌లో ఉన్న ఈ నర్సులను సున్నీ తీవ్రవాదులు మోసుల్కు తీసుకొచ్చి.. చివరకు శుక్రవారం నాడు కుర్దిష్ రాజధాని ఎర్బిల్‌లో విడిచిపెట్టారు. ప్రత్యేక విమానంలో వాళ్లంతా భారతదేశానికి చేరుకున్నారు. యూఏఈ సహా పలు దేశాల్లో శెట్టికి చెందిన ఎన్ఎంసీ గ్రూపునకు ఆస్పత్రులు, క్లినిక్‌లు ఉన్నాయి.