మెర్సిడెస్ బెంజ్.. లిమిటెడ్ ఎడిషన్లు
ముంబై: లగ్జరీ కార్లు తయారు చేసే మెర్సిడెస్-బెంజ్ కంపెనీ ఏ-క్లాస్, బీ-క్లాస్ మోడళ్లలో లిమిటెడ్ ఎడిషన్స్ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఏ-క్లాస్ ఎడిషన్ 1 ధర రూ.26.17 లక్షలు, బీ-క్లాస్ ఎడిషన్ 1 ధర రూ.28.75 లక్షలు(రెండు ధరలూ ఎక్స్ షోరూమ్, ముంబై).
తమ మొత్తం అమ్మకాల్లో 20% వాటా ఈ రెండు కార్లదేనని.. ఆ ఉత్సాహంతోనే ఈ రెండు కార్లలో లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లను అందిస్తున్నామని మెర్సిడెస్-బెంజ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ బొరిస్ ఫిట్జ్ చెప్పారు. 200 కార్లనే అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. వీటిలో పనోరమిక్ సన్రూఫ్, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టబుల్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్, రివర్స్ కెమెరా తదితర ఫీచర్లున్నాయి.