the nomination
-
సేన, బీజేపీ మధ్య ‘స్పీకర్’ చిచ్చు!
నోటిఫికేషన్ రద్దుకు శివసేన డిమాండ్ ముంబై: ఇప్పటికే వరుస జగడాలతో దూరమవుతున్న బీజేపీ, శివసేన పార్టీల మధ్య మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎన్నికల అంశం మరో వివాదానికి కారణమైంది. స్పీకర్ ఎన్నికలో నామినేషన్ వేసేందుకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకే గడువు ఉండగా... ఇంకా చాలా మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేయని నేపథ్యంలో ఎన్నిక నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని శివసేన డిమాండ్ చేసింది. దీంతో ప్రొటెం స్పీకర్ నామినేషన్ గడువును పొడిగించారు. ఇక స్పీకర్ పదవి కోసం అధికారపక్షానికి పోటీగా శివసేన, కాంగ్రెస్ తమ అభ్యర్థులను రంగంలోకి దించాయి. మరోవైపు ఫడ్నవిస్ సర్కారు బుధవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మినహా మిగతా అన్ని పక్షాల మద్దతునూ స్వాగతిస్తామని బీజేపీ ప్రకటించడం గమనార్హం. మంగళవారం మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశమైన కొద్దిసేపటికే.. శివసేన నేత ఏక్నాథ్ షిండే పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తారు. సభలో ఇంకా 106 మంది సభ్యులు ప్రమాణస్వీకారం చేయాల్సి ఉందని.. అంతవరకూ వారికి స్పీకర్ ఎన్నికల్లో పోటీకిగానీ, అభ్యర్థులను బలపర్చడానికిగానీ అవకాశముండదని స్పష్టం చేశారు. అందువల్ల స్పీకర్ ఎన్నిక నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే శివసేన సభ్యులంతా లేచి దీనిపై నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. దీనికి పీడబ్ల్యూపీ, ఎన్సీపీ మద్దతు పలికాయి. ముక్కోణపు పోటీ.. అసెంబ్లీ స్పీకర్ ఎన్నికలో అధికార బీజేపీతో పాటు శివసేన, కాంగ్రెస్ కూడా తమ తరఫున అభ్యర్థులను నిలపడంతో ముక్కోణపు పోటీ నెలకొంది. బీజేపీ తరఫున హరిభావూ బాగ్డే, శివసేన నుంచి విజయ్ ఔటి, కాంగ్రెస్ తరఫున వర్షా నామినేషన్లు వేశారు. ‘కాంగ్రెస్ మినహా ఎవరి మద్దతైనా ఓకే’ కాగా, రాష్ట్ర అసెంబ్లీలో దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం నేడు విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. సభలో మొత్తం 288 మంది సభ్యులు ఉండగా.. బీజేపీ తాజా ఎమ్మెల్యే గోవింద్ మృతిచెందారు. మిగతా 287 మంది సభ్యుల్లో 144 మంది మద్దతును ప్రభుత్వం పొందాల్సి ఉంటుంది. ఒకవేళ సభ్యులెవరైనా గైర్హాజరై, కోరం సరిపోయిన పక్షంలో... హాజరైనవారిలో సగం మందికిపైగా మద్దతును ప్రభుత్వం పొందాల్సి ఉంటుంది. పరీక్ష నేపథ్యంలో.. కాంగ్రెస్ మినహా ఏ పార్టీ మద్దతునైనా తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని బీజేపీ ప్రకటించింది. -
అచ్చం అమ్మలాగే. ..
ఆళ్లగడ్డ : ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 1.32 గంటలకు తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుధాకర్‌రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమం నిరాడంబరంగా ముగి సింది. భూమా కుటుంబం రాజకీయూల్లోకి వచ్చిన తర్వాత నుంచి పాటిస్తున్న సంప్రదాయాన్ని అఖిలప్రియ కొనసాగించారు. ముందుగా ఆమె పట్టణంలోని టీబీ రోడ్డులో ఉన్న నివాసగృహం నుంచి తండ్రి భూమా నాగిరెడ్డి, సోదరి మౌనికారెడ్డి, సోదరుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి, భూమా జగన్నాథరెడ్డి, మహేశ్వరరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, కిశోర్‌రెడ్డి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి శోభా ఘాట్‌కు చేరుకున్నారు. అక్కడ నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చే శారు. ఆ సమయంలో భూమా కుటుంబ సభ్యులంతా కన్నీటి పర్యంతమయ్యూరు. అనంతరం పట్టణంలోని శివాలయం, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయస్వామి ఆలయూల్లో అఖిల ప్రియ ప్రత్యేక పూజలు చేశారు. లింగమయ్య వీధిలోని పాత నివాసగృహానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కుటుంబ పెద్దల సమాధుల వద్దకు వెళ్లి ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత నామినేషన్ దాఖలు చేశారు. అఖిల ప్రియ సోదరి మౌనికారెడ్డి పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కార్యక్రమంలో కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎస్వీమోహన్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, సాయిప్రసాదరెడ్డి, బాలనాగిరెడ్డి, మణిగాంధీ, ఐజయ్య, జయరాం, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, పార్టీ నాయకులు ఏవీ సుబ్బారెడ్డి, భూమా నారాయణరెడ్డి, న్యాయవాది సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమ్మ ఆశయాలు నెరవేర్చడానికే... అమ్మ దివంగత శోభా నాగిరెడ్డి ఆశయాలు నెరవెర్చడానికే రాజకీయాల్లోకి వస్తున్నట్లు అఖిల ప్రియ తెలిపారు. నామినేషన్ వేసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘అమ్మ లేని లోటు మా కుటుంబానికి, నియోజకవర్గానికి తీర్చలేనిది. ఆమె స్థానంలో పోటీ చేయాల్సి రావడం చాలా బాధాకరం. నన్ను అమ్మ ఆశీర్వాదం, నాన్న, కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తల బలమే నడిపిస్తుంది. ఆళ్లగడ్డ ప్రజలు ‘మన అఖిల’ అని అనుకునేలా పనిచేస్తా. ప్రజలందరూ మా కుటుంబం వెంట నడుస్తారనే నమ్మకముంది. ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహన కలిగివున్నాను. అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలోని సమస్యలను డెయిరీలో రాసింది. వాటిని పరిష్కరించినప్పుడే అమ్మకు నిజమైన నివాళి. అప్పట్లో అమ్మ ఇచ్చిన హామీలను నెరవెర్చడమే నా ప్రథమ కర్తవ్యం. ఆమె మాదిరే పార్టీ శ్రేణులకు,ప్రజలకు అందుబాటులో ఉంటా’’నని అన్నారు. టీడీపీ పోటీపై విలేకరులు అఖిలను ప్రశ్నించగా... ‘నందిగామలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మానవతాదృక్పథంతో పోటీ పెట్టలేదు. ఇక్కడ కూడా టీడీపీ పోటీ పెట్టదని భావిస్తున్నాం. పార్టీ తరఫున వేసిన కమిటీ ఈ విషయంపై చర్చిస్తుంద’ని చెప్పారు. అఖిల ప్రజల మద్దతు సంపాదిస్తుంది.. అఖిలప్రియ తప్పకుండా ప్రజల మద్దతు సంపాదిస్తుందనే విశ్వాసం ఉందని ఆమె తండ్రి, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. ‘దివంగత శోభా నాగిరెడ్డి తరహాలోనే అంకితభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందుతుంది. శోభాలాగానే నియోజకవర్గ ప్రజలకు ‘అమ్మ’ అరుు్య.. ఆమె స్థానాన్ని భర్తీ చేస్తుంద’ని విశ్వాసం వ్యక్తం చేశారు. మెజార్టీ ఎంత రావచ్చని అనుకుంటున్నారని విలేకరులు ప్రశ్నించగా.. ‘దాని గురించి ఎప్పుడూ ఆలోచించము. ఎంత సేవ చేశామని మాత్రమే ఆలోచిస్తాం. అఖిల ప్రియ ప్రజా సమస్యలను దగ్గర నుంచి చూసింది. కాబట్టి వాటిని తప్పక పరిష్కరిస్తుంద’ని అన్నారు. -
నాణ్యతకు పాతర
పీలేరు నియోజకవర్గంలో నాసిరకంగా సీసీ రోడ్ల నిర్మాణం ఏడాదిలోపే మారిన రూపురేఖలు రూ.122.75 కోట్ల ప్రజాధనం మట్టిపాలు పీలేరు: పీలేరు నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి హయూంలో నిర్మించిన సీసీ రోడ్లలో నాణ్యతకు పాతర వేశారు. ఫలితంగా ఆ రోడ్లు నిర్మించిన ఏడాదికే రూపురేఖలు కోల్పోయూయి. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో పీలేరు నియోజకవర్గంలో ఏడు విడతల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.122.75 కోట్ల నిధులు మంజూరు చేశారు. రెండేళ్ల క్రితం ‘పడా’ ఆధ్వర్యంలో సీసీ రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఏమైందో ఏమో ఆ టెండర్లను రద్దు చేసి నామినేషన్ ప్రాతిపదికన హేబిటేషన్ కమిటీల పేరిట పనులు కేటాయించారు. రూ.122 కోట్లకు పైగా సీసీ రోడ్లు నిర్మించారు. పనులకు నిబంధనలివీ.. రూ.5 లక్షల లోపు నామినేషన్ పనులు చేపట్టడానికి ఐదుగురు సభ్యులతో హేబిటేషన్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఏ ప్రాంతంలో సీసీరోడ్డు నిర్మిస్తామో అక్కడి ప్రజలతో కూడా కమిటీ ఏర్పాటు చేయూలి. అనంతరం పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ ఆమోదంతో ఆ శాఖ జేఈ, డీఈలు ఆ పని మంజూరు కోసం ఈఈకి ప్రతి పాదనలు పంపాలి. ఈఈ హేబిటేషన్ కమిటీ సిఫార్సు చేసిన ఒక వ్యక్తి పేరిట పనులు చేపట్టడానికి వర్క్ ఆర్డర్ ఇస్తారు. నిబంధనలకు నీళ్లు.. సీసీ రోడ్ల నిర్మాణంలో నిబంధనలకు నీళ్లు వదిలారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. శాఖాపరంగా కాంట్రాక్టర్‌కు 14 శాతం ఆదాయం ఉంటుందని, అయితే నిబంధనల ప్రకారం పనులు చేపట్టకపోవడంతో ఎక్కువగా లబ్ధిపొందారని విమర్శలున్నాయి. అప్పట్లో అధికార పార్టీకి చెందిన ఓ కీలక వ్యక్తి ఆదేశాల మేర కే ఈ మేరకు పనులు జరిగాయన్న ఆరోపణలున్నాయి. కనిపించని ఎం20 కాంక్రీట్.. టెండర్లు లేకుండా జరిగే సీసీ రోడ్లను ఎం20 కాంక్రీట్‌తో నిర్మించాల్సి ఉంది. ఈ నిబంధన మేరకు ఒక క్యూబిక్ మీటర్‌కు 330 కిలోల సిమెంట్, 45 క్యూబిక్ మీటర్ల ఇసుక, 9 క్యూబిక్ మీటర్ల కంకరతో నిర్మాణ పనులు చేపట్టాలి. నిర్మాణం పూర్తయిన 21 రోజులపాటు నీటితో క్యూరింగ్ చేయాలి. పనుల్లో ఎక్కడా ఎం20 కాంక్రీట్ వేయడం లేదనే ఆరోపణలున్నాయి. తూతూమంత్రంగా తనిఖీలు క్వాలిటీ కంట్రోల్ అధికారులు సీసీ రోడ్ల పనులను తూతూమంత్రంగా తనిఖీలు చేస్తున్నారు. పనులు పూర్తయిన అనంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇందులో రోడ్డుకు చివరిలో కొలతలు మాత్రమే చూపుతున్నారనే ఆరోపణ లున్నాయి. పీలేరు నియోజకవర్గంలో భారీ స్థాయిలో సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతున్నా ఒక డీఈనే పనులను పర్యవేక్షించడంపై ఆరోపణలు గుప్పుమన్నాయి. ధనార్జనే ధ్యేయంగా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన రియల్ ఎస్టేట్ భూముల్లో సీసీ రోడ్లు వేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నాణ్యత లో రాజీలేదు సీసీ రోడ్ల నిర్మాణంలో భాగంగా నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో ఎక్కడా రాజీపడలేదు. నియోజకవర్గంలో దాదాపు రూ.80 కోట్లతో సిమెంట్ రోడ్లు నిర్మించాం. సకాలంలో పనులు ప్రారంభించక రూ.42 కోట్లు వెనక్కిపోయాయి. ఒకటి రెండు చోట్ల నాణ్యత లోపించి ఉంటే తక్షణం పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ నిబంధనల మేరకు హేబిటేషన్ కమిటీ ఆధ్వర్యంలోనే పనులన్నీ చేపట్టాం. -రమణయ్య, పీలేరు పంచాయతీరాజ్ డీఈ -
ప్రజల బాధలు మీకు తెలుసా?
మండ్య, న్యూస్‌లైన్ : పేదలు, రైతుల కష్టాలను చూడలేక కన్నీళ్లు పెట్టుకుంటే దాన్ని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేయడం సిగ్గుచేటని మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి అన్నారు. సోమవారం ఉదయం ఆయన మండ్య పార్లమెంట్ అభ్యర్థి సీఎం పుట్టరాజు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నా కన్నీటిని చూసి నవ్వే ఆడదాన్ని... ఏడ్చే మగవాన్ని నమ్మరాదని మాట్లాడటం తగదన్నారు. ఆయన ఉద్దేశ్యంలో ఇక ఆడవాళ్లు నవ్వకూడదని, మగవాళ్లు ఏడ్వ కూడదని అన్నట్లు ఉందన్నారు. ప్రజలు, రైతుల బాధలు సిద్దరామయ్యకు తెలుసా అని కుమార ప్రశ్నించారు. తాను సీఎంగా ఉన్నప్పుడుగా రైతుల సమస్యలు దగ్గరగా పరిశీలించానన్నారు. రాష్ట్రంలో జేడీఎస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలవదని సీఎం అధికారంతో అహంకారం చూపిస్తున్నారని కుమార ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి బరిలోఉన్న సీఎస్ పుటన్న ఈసారి తప్పకుండ విజయం సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జేడీఎస్ పార్టీని నడిపించేది డబ్బు కాదని, కార్యకర్తలని కుమార అన్నారు. అనంతరం వేలాది మంది కార్యకర్తల మధ్య సీఎస్ పుట్టరాజు తన నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చలూరాయస్వామి, సారా మహేష్, డీసీ తమ్మణ్ణ, మాజీ ఎమ్మెల్యే అన్నదాని, శ్రీనివాస్, శ్రీకంఠేగౌడ, శివకుమార్, నాయకులు రమేష్, సురేష్కంఠి, శీవరామ్ తదితరులు పాల్గొన్నారు.