Non Political JAC
-
అమరావతే రాజధాని అని బీఆర్ఎస్ ప్రకటించడం తగదు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): అమరావతే రాజధానిగా కొనసాగాలని, మూడు రాజధానులు అవసరం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రకటించడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికేంద్రీకరణ నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ ఖండించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాటు పడుతుంటే.. అందుకు విరుద్ధంగా ప్రకటనలు చేయడం తగదని అన్నారు. విశాఖపట్నం పరిపాలన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా కాకుండా ఎవరు అడ్డుకున్నా ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇంకా పురిటిలోనే ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా అత్యంత సున్నితమైన ఈ అంశాన్ని టచ్ చేస్తే వారికే ప్రమాదకరమన్నారు. తెలంగాణలో దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 26 బీసీ కులాలకు బీసీ, ఓబీసీ రిజర్వేషన్ తొలగించడంతో గత నాలుగేళ్లుగా తీవ్ర సామాజిక అన్యాయానికి గురయ్యారన్నారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించకుండా కొత్త వాటిని నెత్తినేసుకోవడం తోట చంద్రశేఖర్ రాజకీయ అపరిపక్వతను సూచిస్తోందన్నారు. -
పవన్.. గో బ్యాక్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖపట్నానికి రాజధాని వద్దని, అమరావతికే తాను మద్దతిస్తానని చెప్పటానికి వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు విశాఖలో చుక్కెదురైంది. ఊహించని రీతిలో స్థానికుల నుంచి నిరసనల సెగ తగిలింది. ‘పవన్ గో బ్యాక్’ అంటూ యావత్తు విశాఖ నినదించింది. ఆదివారం ఉదయాన్నే పవన్ ‘జనవాణి’ నిర్వహించనున్న పోర్టు స్టేడియం ప్రాంతానికి పెద్ద ఎత్తున చేరుకున్న స్థానిక మహిళలు, నాన్ పొలిటికల్ జేఏసీ మద్దతుదారులు, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వపన్ కల్యాణ్‌కు విశాఖలో అడుగుపెట్టే అర్హతలేదని నినదించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. అయినా నిరసనకారులు అక్కడికి వస్తూనే ఉండటంతో.. పరిస్థితి అనుకూలంగా లేదని భావించిన పవన్ కల్యాణ్.. తన జనవాణి కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఒక దశలో విశాఖ నుంచి తిరిగి వెళ్లిపోవటానికి సిద్ధమై.. మళ్లీ అంతలోనే మనసు మార్చుకున్నారు. ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ సిగ్నల్ వద్ద మానవహారంగా ఏర్పడిన స్థానికులు విశాఖ గర్జనను పక్కదారి పట్టించాలని.. వికేంద్రీకరణకు మద్దతుగా శనివారం జోరు వానలోనూ విశాఖ గర్జన విజయవంతం అయిన నేపథ్యంలో.. తమ ప్రాంతంలో తమకు వ్యతిరేకంగా కార్యక్రమాన్ని ఎలా చేపడతారంటూ ఆదివారం జనవాణి కార్యక్రమం నిర్వహించతలపెట్టిన పోర్టు స్టేడియం వద్దకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ‘ఉత్తరాంధ్ర ద్రోహి.. పవన్ కల్యాణ్ గో బ్యాక్..’ అంటూ నినదించారు. ఉత్తరాంధ్రకు వ్యతిరేకంగా ఎవరూ వ్యవహరించినా, నిరసన సెగ తప్పదని స్పష్టం చేశారు. వీరికి వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా తోడయ్యాయి. ఉత్తరాంధ్ర జేఏసీ నేతలతో పాటు విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇంచార్జ్ కేకే రాజు నేతృత్వంలో పలువురు నేతలు భారీగా అక్కడికి చేరుకుని నినాదాలు చేశారు. ఫలితంగా తమ పార్టీ నేతలపై పెట్టిన కేసులను నిరసిస్తూ జనవాణి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు పవన్ కల్యాణ్ ప్రకటించారు. రోడ్డుపై పడుకుని మహిళల నిరసన తమ కార్యకర్తలు బయటకు వచ్చే వరకూ విశాఖ వదిలి వెళ్లనని నోవాటెల్ హోటల్లోనే ఉండిపోయారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న ఉత్తరాంధ్ర ప్రజలు.. వికేంద్రీకరణకు జనసేన పూర్తిగా వ్యతిరేకమని, విశాఖ పరిపాలన రాజధాని కావడం ఏ మాత్రం ఇష్టం లేదని మరోసారి ప్రత్యక్షంగా స్పష్టమైందని వ్యాఖ్యానిస్తున్నారు. -
పూలే జీవితం ఆదర్శప్రాయం
ఘనంగా జ్యోతీరావుపూలే జయంతి ఉత్సవాలు పరకాల: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహాత్మ జ్యోతీరావు పూలే జీవితం ఆదర్శప్రాయమని నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ సిరికొండ శ్రీనివాసచారి అన్నారు. జ్యోతిరావు పూలే 109వ జయంతిని పట్టణంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. జ్యోతీబాపూలే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. బీసీ సంఘాల ఐక్యత కోసం నిర్విరామంగా కృషి చేశారన్నారు. సామాజిక సంస్కరణలు చేపట్టడమే కాకుండా మహిళ విద్యాభివృద్ధికి పాటుపడ్డారన్నారు. తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర సహ అధ్యక్షులు కామిడి సతీష్‌రెడ్డి, అధ్యాపకులు శ్రీనివాస్, సతీష్, రాజు, రమేష్, సదయ్య, హబీబ్ తదితరులు పాల్గొన్నారు. డీబీఏఎస్‌ఎస్ ఆధ్వర్యంలో.. దళిత బహుజన అభివృద్ధి సాధన సమితి(డీబీఏఎస్‌ఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ మడికొండ రఘుపతి, బొమ్మకంటి సదానందం, ప్రభాకర్, వెంకటలక్ష్మీ, ఎలిషా, జన్ను జయ, మేదరి శ్రీకాంత్, డి. నరహరి పాల్గొన్నారు. ఆత్మకూరులో.. ఆత్మకూరు : మండలకేంద్రంలో బీసీజేఏసీ నాయకుడు మిర్యాల రవికుమార్ ఆధ్వర్యంలో ఫూలేచిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్శ రవిందర్, రణధీర్, నాగరాజు, చరణ్, నితీష్, కిరణ్, సాయికిరణ్, నితిన్, వివేక్, వంశీ, కార్తికేయ, భరత్, ఓంకార్, నాగరాజు, నవీన్ పాల్గొన్నారు. అలాగే ఊరుగొండలో అంబేద్కర్ యువజనసంఘం ప్రధానకార్యదర్శి సాంబయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో శ్రీను, శ్రీకాంత్, రమేష్, రమేష్, సుమన్, ప్రశాంత్, దయాకర్, వినయ్, విజయ్, వినీత్ పాల్గొన్నారు. పూలే ఆశయసాధనకు కృషి చేయాలి సంగెం : మండల కేంద్రంలో పూలే జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు మునుకుంట్ల కోటేశ్వర్ మాట్లాడారు. కందకట్ల నరహరి, కోడూరి సదయ్య, మునుకుంట్ల మోహన్, ఆగపాటి రాజ్‌కుమార్, నల్లతీగల రవి, పులి సాంబయ్య, బాబు, లవ్‌కుమార్, రాజు, ప్రకాశ్, వెంకన్న, సునీల్ తదితరులు పాల్గొన్నారు. గొర్రెకుంటలో చలివేంద్రం ప్రారంభం ధర్మారం : మహాత్మా జ్యోతీరావుపూలే జీవితం ఆదర్శనీయమని జీడబ్ల్యూఎంసీ 2వ డివిజన్ కార్పొరేటర్ ల్యాదల్ల బాలు అన్నారు. 2వ డివిజన్లోని గొర్రెకుంటలో జ్యోతీరావుపూలే జయంతిని సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేం ద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ నిర్వాహకులను అభినందిం చారు. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు చిలువేరు రవి, అనిల్, ఉద్యోగ సంఘం కన్వీనర్ కార్తీక్, టీఆర్ఎస్ నాయకులు లవ్రాజు, నర్సయ్య, కరుణాకర్, చిన్ని, మాజీ ఎంపీటీసీ రవి పాల్గొన్నారు. -
సమరనాదం
సాక్షి, అనంతపురం: సమైక్యవాదుల ర్యాలీలతో 24వ రోజు అనంతపురం నగరం హోరెత్తింది. నాన్‌పొలిటికల్ జేఏసీ కన్వీనర్ బీసీ నాగరాజు ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థులకు రోడ్లపైనే చదువులు చెప్పి నిరసన తెలిపారు. ఆర్ట్స్‌కళాశాల అధ్యాపకులు, జాక్టో, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు, జాతీయ రహదారులు, డ్వామా, ఐకేపీ, ఆస్పత్రి ఉద్యోగులు, సీఐటీయూ, వాణిజ్య పన్నులశాఖ, పంచాతీరాజ్ ఉద్యోగుల, విద్యత్, మున్సిపల్ ఉద్యోగులు, నీటిపారుదల ఉద్యోగులు, ఆల్‌మేవా ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షా శిబిరాల్లో సమైక్య వాదులు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు సమైక్యాంధ్రపై అవగాహన కల్పించారు. నగరంలోని ప్రజలు గ్రూపులు.. గ్రూపులుగా ప్లకార్డులు చేతబూని ర్యాలీ నిర్వహించారు. సప్తగిరి, టవర్‌క్లాక్, శ్రీకంఠం సర్కిళ్లలో సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఎస్కేయూలో కొనసాగుతున్న దీక్షలు ఎస్కేయూలో విద్యార్థి, బోధన, బోధనేతర జేఏసీ ఆద్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఎస్ఎస్బీఎన్ ప్రొఫెసర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఆ కళాశాల అధ్యాపకులు యూనివర్సిటీకి చేరుకుని రిలేదీక్షలకు మద్దతు తెలిపారు. ఆకుతోటపల్లి ఆటోస్టాండ్ డ్రైవర్లు ఆట్లోలతో ఎస్కేయూ వరకు ర్యాలీ చేశారు. రాజు అనే ఆటో డ్రైవర్ ఆకుతోటపల్లె నుంచి రోడ్డుపై పొర్లుదండాలు పెట్టుకుంటూ యూనివర్సిటీకి వచ్చాడు. అనంతపురం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నాయకుడు ఆధ్వర్యంలో ఇటుకలపల్లి వద్ద రాస్తారోకో చేశారు. అనంతరం చెక్కభజన, కోలాటాలతో ర్యాలీగా వర్సిటీకి వ చ్చి రిలేదీక్ష చేస్తున్న జేఏసీ నాయకులకు మద్దతు తెలిపారు. ఇటుకలపల్లె గ్రామస్తులతో వంటా వార్పు నిర్వహించారు. సోనియాగాంధీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. నిరసనల హోరు ధర్మవరంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. విద్యుత్ ఉద్యోగులు, ఆటో యునియన్ వైఎస్సార్సీపీ, ఐక్య ఉపాధ్యాయ సంఘం చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఐక్య ఉపాధ్యాయ సంఘం దీక్షలకు ఎమ్మెల్సీ గేయానంద్, చార్లెస్ చిరంజీవిరెడ్డితో పాటు నగరంలోని న్యాయవాదులు సంఘీభావం ప్రకటించారు. ఎరికల సంఘం ఆధ్వర్యంలో రోడ్లపై వంటా-వార్పు చేపట్టారు. బత్తలపల్లి, ముదిగుబ్బలలో వైఎస్సార్సీపీ చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. గుంతక ల్లులో న్యాయవాదులు భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో దీక్షా శిబిరం వద్ద ఉపాధ్యాయులు వ్యాయామం చేస్తూ నిరసన తెలిపారు. గుత్తి, పామిడిలో జాక్టో దీక్షలు కొనసాగుతున్నాయి. హిందూపురంలో రవాణా శాఖ అధికారుల ఆధ్వర్యంలో తెలుగుతల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. కుల సంఘాల వారు పట్టణంలో పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు.చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో వడ్డెర్లు, మైనార్టీలు, పశుసంవర్థక శాఖ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. కదిరిలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉపాధ్యాయులు రిలే దీక్ష చేపట్టారు. డివిజన్ పరిధిలోని ఉపాధ్యాయులు గొడుగులు చేతబట్టి వినూత్నంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు జాతీయ జెండాతో కుటుంబ సమేతంగా ర్యాలీ చేశారు. నల్లచెరువులో ముస్లింలు వారి పద్దతి మేరకు సోనియా దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. తలుపులలో ఆర్టీసీ కార్మికులు రిలేదీక్షలు చేపట్టారు. గాండ్లపెంటలో సమైక్యవాదులు రోడ్డుపైనే వంటా-వార్పు చేపట్టారు. కళ్యాణదుర్గంలో సమైక్యాంధ్రకు మద్దతుగా బంజారాల భారీ ప్రదర్శన నిర్వహించారు. సమైక్యవాదులు మాయల పకీర్ వేషధారణతో ప్రదర్శన నిర్వహించి.. కేసీఆర్, సోనియాగాంధీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. శెట్టూరులో రజకులు గాడిదలతో ర్యాలీ చేశారు. వ్యవసాయశాఖ అధికారులు రిలేదీక్షలు చేపట్టారు. కుందుర్పిలో ఉపాధ్యాయులు రిలేదీక్షలు చేపట్టారు. కంబదూరులో విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. మడకశిరలో మహిళా టీచర్లు రోడ్డుపై ముగ్గులు వేసి నిరసన తెలిపారు. జేఏసీ నాయకులు పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. అమరాపురంలో సమైక్యవాదులు ఆటో ర్యాలీ నిర్వహించి రోడ్డుపై వంటా-వార్పు చేపట్టారు. పుట్టపర్తిలో బలిజసంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఓడీసీ, అమడగూరు, నల్లమాడ, బుక్కపట్నం, కొత్తచెరువులో ప్రజాసంఘాలు, ఉపాధ్యాయులు, సమైక్యవాదులు చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. పెనుకొండలో యాదవ కులస్తుల ఆధ్వర్యంలో జాతీయరహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేసి..రాష్ర్ట విభజన ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. సోమందేపల్లెలో రెవిన్యూ ఉద్యోగులు ర్యాలీ చేశారు. రొద్దం, గోరంట్ల మండలాల్లో వైఎస్సార్సీపీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. పరిగిలో వడ్డెర్లు ర్యాలీ నిర్వహించారు. శ్రీవెంకటేశ్వర కాలేజీ విద్యార్థులు, పండ్లవ్యాపారుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి..రోడ్డుపైనే వంటా-వార్పు కార్యక్రమం నిర్వహించారు. తెలుగుతల్లి చేతులకు సంకెళ్లు వేసి జేఏసీ నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు రోడ్డుపైనే క్రికెట్ ఆడి..వంటా-వార్పు చేపట్టారు. కణేకల్లులో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సమైక్యవాదుల రిలేదీక్షలకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మద్దతు తెలిపారు. రాప్తాడులో వైఎస్సార్సీపీ కార్యకర్తల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. సీకేపల్లెలో జాతీయరహదారిపై వాల్మీకిసంఘం కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించి..వంటా -వార్పు చేపట్టారు. ఆత్మకూరులో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. శింగనమల, గార్లదిన్నె, పుట్టూరు, యల్లనూరు, బీకేఎస్ మండలాల్లో వైఎస్సార్సీపీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. తాడిపత్రిలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కేసీఆర్‌కు శవయాత్ర నిర్వహించి.. పిండప్రదానం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై స్నానం చేసి.. కేసీఆర్‌కు పిండ ప్రదానం చేశారు. వికలాంగుల సంక్షేమసంఘం గౌరవాధ్యక్షులు నాగార్జునరెడ్డి చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. పెద్దపప్పూరులో సమైక్యవాదులు చేపట్టిన రిలేదీక్షలకు వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ మద్దతు తెలిపారు. ట్రాన్స్‌కో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. యాడికిలో వాల్మీకిసంఘం నేతల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఉరవకొండలో విద్యుత్‌శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. బెళుగుప్పలో వైఎస్సార్సీపీ నాయకులు రాస్తారోకో నిర్వహించి వాహనాలను అడ్డుకున్నారు. వజ్రకరూరులో సమైక్యవాదులు రోడ్డుపై వంటా-వార్పు చేపట్టారు. -
బిల్లు పెడితే కోర్టుకెళతాం:నాన్ పొలిటికల్ జెఎసి
విశాఖపట్నం: పార్లమెంట్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం బిల్లు ప్రవేశ పెడితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని నాన్ పొలిటికల్ జేఏసీ నేత కర్రి ఆదిబాబు చెప్పారు. సుప్రీం కోర్టులో కచ్చితంగా స్టే వస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. సమన్యాయం చేయకుండా రాష్ట్ర విభజన చేస్తే న్యాయస్థానంసైతం ఊరుకోదన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం విశాఖలో ఉధృతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.