నూకాంభికాను దర్శించుకున్న లోక్సభ స్పీకర్
విశాఖ : లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ గురువారం విశాఖ జిల్లా కసింకోట మండలంలో పర్యటించారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆమె ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కసింకోట మండలం లల్లపాలెంలో సంసాద్ ఆదర్శ్ గ్రామయోజన కార్యక్రమాన్ని సుమిత్రా మహాజన్ ప్రారంభించారు.
భారతదేశాన్ని ప్రపంచంలోనే శ్రేష్టమైన దేశంగా తీర్చిదిద్దడానికి ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని ఆమె ఈ సందర్భంగా అన్నారు. గ్రామాల అభివృద్ధిలో, స్వచ్ఛ భారత్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సుమిత్రా మహాజన్ పిలుపునిచ్చారు. అనంతరం ఆమె అనకాపల్లిలో నూకాంభికా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.