NorthEast United
-
నార్త్ఈస్ట్ యునైటెడ్ తొలి ఓటమి
గువాహటి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఆరో సీజన్లో నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీకి తొలి ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో నార్త్ఈస్ట్ యునైటెడ్ 0–3 గోల్స్ తేడాతో అట్లెటికో డి కోల్‌కతా చేతిలో పరాజయం పాలైంది. రాయ్ కృష్ణ (35వ, 90+4వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... డేవిడ్ విలియమ్స్ (11వ నిమిషంలో) గోల్ చేశాడు. ఆట ఆరంభంలో నార్త్ఈస్ట్ ప్రధాన ఆటగాడు అసమో జ్యాన్ గాయం కారణంగా మైదానాన్ని వీడటం ఆ జట్టు ఆటతీరుపై ప్రభావం చూపింది. నేటి మ్యాచ్‌లో గోవా ఎఫ్‌సీతో హైదరాబాద్ ఎఫ్‌సీ తలపడుతుంది. -
నార్త్ ఈస్ట్ యునైటెడ్ బోణీ
గువాహటి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ బోణీ కొట్టింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ 2–1తో ఒడిశాపై గెలిచింది. నార్త్ ఈస్ట్ ఆటగాళ్లు రెడీమ్ త్లాంగ్ (2వ ని.), గ్యాన్ (84వ ని.) చెరో గోల్ సాధించారు. ఒడిశా తరఫున హెమాండేజ్ (71వ ని.) గోల్ చేశాడు. ఆరంభంలోనే గోల్ సమర్పించుకున్న ఒడిశా ఆ తర్వాత తేరుకుంది. 71వ నిమిషంలో స్కోర్‌ను సమం చేసింది. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలువలేదు. ఒడిశా ప్లేయర్ డెల్గాడోకు రెడ్‌కార్డు లభించడంతో ఆ జట్టు చివరి 18 నిమిషాలు 10 మందితోనే ఆడింది. దీనిని సద్వినియోగం చేసుకుంటూ గ్యాన్ చివర్లో గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. -
కేరళను సెమీస్‌కు చేర్చిన వినీత్
కీలకమ్యాచ్‌లో నార్త్ ఈస్ట్‌పై విజయం కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ లీగ్ దశ ముగిసింది. కీలక మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ యునెటైడ్ జట్టుపై కేరళ బ్లాస్టర్స్ విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్ 1-0తో నార్త్ ఈస్ట్ జట్టును ఓడించింది. ఆట 66వ నిమిషంలో వినీత్ చేసిన గోల్‌తో కేరళ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న బ్లాస్టర్స్ విజయాన్ని ఖాయం చేసుకుంది. సెమీస్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ ఓటమిపాలై నాకౌట్ దశకు అర్హత పొందలేకపోయింది. ఈ విజయంతో కేరళ బ్లాస్టర్స్ మొత్తం 22 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. ఇప్పటికే ముంబై సిటీ, ఢిల్లీ డైనమోస్, అట్లెటికో డి కోల్‌కతా సెమీస్‌కు చేరాయి. ఈనెల 10 నుంచి 14 వరకు జరిగే సెమీఫైనల్స్‌లో ఢిల్లీ డైనమోస్‌తో కేరళ బ్లాస్టర్స్; కోల్‌కతాతో ముంబై సిటీ ఎఫ్‌సీ తలపడతాయి.