
గువాహటి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ బోణీ కొట్టింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ 2–1తో ఒడిశాపై గెలిచింది. నార్త్ ఈస్ట్ ఆటగాళ్లు రెడీమ్ త్లాంగ్ (2వ ని.), గ్యాన్ (84వ ని.) చెరో గోల్ సాధించారు. ఒడిశా తరఫున హెమాండేజ్ (71వ ని.) గోల్ చేశాడు. ఆరంభంలోనే గోల్ సమర్పించుకున్న ఒడిశా ఆ తర్వాత తేరుకుంది. 71వ నిమిషంలో స్కోర్‌ను సమం చేసింది. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలువలేదు. ఒడిశా ప్లేయర్ డెల్గాడోకు రెడ్‌కార్డు లభించడంతో ఆ జట్టు చివరి 18 నిమిషాలు 10 మందితోనే ఆడింది. దీనిని సద్వినియోగం చేసుకుంటూ గ్యాన్ చివర్లో గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment