Nova Engineering College
-
కష్టే ఫలి!
ఇబ్రహీంపట్నం : ఏ రంగంలోనైనా కష్టపడితేనే విజయం దక్కుతుందని చందమామ సినిమా ఫేమ్ హీరో శివబాలాజీ చెప్పారు. బుధవారం ఆయన స్థానిక నోవా ఇంజినీరింగ్ కళాశాలను సందర్శించారు. ఆయన రాకతో కళాశాలలో సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థులు ఆయనతో కరచాలం చేసేందుకు పోటీపడ్డారు. కొందరైతే సెల్ఫీలు దిగి ముచ్చట తీర్చుకున్నారు. శివబాలాజీ మాట్లాడుతూ.. ఏ రంగంలోనైనా ఎదగాలంటే బాగా శ్రమించాలని విద్యార్థులకు సూచించారు. కెరీర్ గెడైన్స్‌పై అవగాహన కల్పించారు. వచ్చిన అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలో వివరించారు. అనంతరం కళాశాల చైర్మన్ ఎం.కృష్ణారావు, డెరైక్టర్ జె.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ శ్రీనాథ్‌లు శివబాలాజీని ఘనం గా సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కళాశాల యాజమాన్యం వేధింపులు తాళలేక...
కళాశాల యాజమాన్యం వధింపులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వివరాలు.. హయాత్‌నగర్ మండలం గుంతపల్లిలో కన్సెల్టెన్సీ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న బీహార్‌కు చెందిన ఆశుతోష్ అనే వ్యక్తి నోవా ఇంజనీరింగ్ కళాశాలలో తన కన్సల్టెన్సీ ద్వార విద్యార్థులని జాయిన్ చేయించాడు. దానికి సంబంధించి రావాల్సిన డబ్బులు కళాశాల యాజమాన్యం ఇవ్వకపోవడంతో.. మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.