కష్టే ఫలి! | siva balaji visit nova engineering college | Sakshi
Sakshi News home page

కష్టే ఫలి!

Published Thu, Sep 22 2016 8:42 AM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

కష్టే ఫలి! - Sakshi

కష్టే ఫలి!

ఇబ్రహీంపట్నం : ఏ రంగంలోనైనా కష్టపడితేనే విజయం దక్కుతుందని చందమామ సినిమా ఫేమ్ హీరో శివబాలాజీ చెప్పారు. బుధవారం ఆయన స్థానిక నోవా ఇంజినీరింగ్ కళాశాలను సందర్శించారు. ఆయన రాకతో కళాశాలలో సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థులు ఆయనతో కరచాలం చేసేందుకు పోటీపడ్డారు. కొందరైతే సెల్ఫీలు దిగి ముచ్చట తీర్చుకున్నారు.
 
శివబాలాజీ మాట్లాడుతూ.. ఏ రంగంలోనైనా ఎదగాలంటే బాగా శ్రమించాలని విద్యార్థులకు సూచించారు. కెరీర్ గెడైన్స్‌పై అవగాహన కల్పించారు. వచ్చిన అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలో వివరించారు. అనంతరం కళాశాల చైర్మన్ ఎం.కృష్ణారావు, డెరైక్టర్ జె.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ శ్రీనాథ్‌లు శివబాలాజీని ఘనం గా సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement