NPDCL office
-
కరీంనగర్లో భారీ అగ్ని ప్రమాదం
-
కరీంనగర్లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, కరీంనగర్: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదాన్ని ఇంకా మరవక ముందే రాష్ట్రంలో మరో విద్యుత్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు.. కరీంనగర్‌లోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం సమీపంలోని ఎలక్ట్రిసిటీ స్టోర్‌లో శనివారం భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. పదుల సంఖ్యలో ఉన్న కొత్త ట్రాన్స్ఫార్మర్లు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదానికి కల కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకొని ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. (ట్విస్ట్ : శ్రీశైలం అగ్ని ప్రమాదంలో కొత్త కోణం) ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ శశాంక, సిపి కమలాసన్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి ప్రమాదంపై ఆరా తీశారు. ఎలక్ట్రిసిటీ స్టోర్ రూమ్ ప్రక్కనే ఉన్న విద్యుత్ వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించారు. -
సెస్ ఎండీగా రామకృష్ణ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఎట్టకేలకు ప్రభుత్వం తప్పును సరిదిద్దుకుంది. వారం రోజులు తిరక్కముందే సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ(సెస్) ఎండీగా మరొకరిని నియమించింది. గతంలో జరిగిన రూ.3.08 కోట్ల అవినీతికి సంబంధించిన ఆరోపణలు.. అభియోగాలు ఎదుర్కొంటున్న ఎండీ స్వర్గం రంగారావుపై బదిలీ వేటు వేసింది. తిరిగి వరంగల్‌లోని ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో గతంలో ఆయన పనిచేసిన ప్రాజెక్టు విభాగం జీఎంగా పాత పోస్టింగ్ ఇచ్చింది. ఆయన స్థానంలో ఎన్పీడీసీఎల్ ఆపరేషన్స్ విభాగంలో జీఎంగా పనిచేస్తున్న రామకృష్ణను సెస్ కొత్త ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈనెల 23న ఎండీగా బాధ్యతలు చేపట్టిన రంగారావు హుటాహుటిన బదిలీ కావటం గమనార్హం. అయిదేళ్ల కిందట సెస్ ఎండీగా పని చేసిన రంగారావు హయాంలోనే సెస్ పరిధిలో దాదాపు రూ.3.08 కోట్ల అవినీతి జరిగింది. ఇప్పటికీ ఆ విచారణ కొలిక్కి రాలేదు. తిరిగి ఆయనకే బాధ్యతలు అప్పగించటంలో ఆంతర్యమేమిటో అని ‘స్వర్గమా... సెస్‌కు నరకమా..’ శీర్షికతో రంగారావు నియామకాన్ని ‘సాక్షి’ ఎండగట్టింది. బదిలీ ఉత్తర్వులు వెలువడిన మరునాడే ఈనెల 22న ప్రత్యేక కథనాన్ని అందించింది. స్వయానా ముఖ్యమంత్రి కుమారుడు మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గానికి సంబంధించిన వ్యవహారం కావటంతో అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. ఈ కథనంపై స్పందించిన ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయమిశ్రా ఈ బదిలీ ఫైలును పునః పరిశీలించారు. గతంలో జరిగిన అవినీతిపై విచారణ నివేదికలను పరిశీలించారు. వారం రోజులు తిరగకముందే కొత్త ఎండీగా రామకృష్ణను నియమించారు. ‘గతంలో సెస్‌లో ఎండీగా పనిచేసినప్పుడు రంగారావుపై అవినీతి ఆరోపణలున్నాయి. దానిపై విచారణ కొనసాగుతోంది. ఓ కోర్టు కేసు కూడా పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో సెస్ ఎండీగా ఉంచితే విచారణకు ఆటంకం ఎదురవుతుందనే ఆయనను బదిలీ చేయటం జరిగింది...’ అని సీఎండీ కార్తికేయమిశ్రా ఈ బదిలీపై వివరణ ఇచ్చారు.