నొప్పి నివారణ మందులతో గుండెజబ్బులూ వస్తాయి!
నొప్పి నివారణ మందులను ఎక్కువగా ఉపయోగిస్తే మూత్రపిండాలు పాడవడం వంటి అనర్థాలు తలెత్తుతాయన్నది తెలిసిందే. దానికి తోడు గుండెజబ్బులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఇప్పుడు తాజా పరిశోధనల్లో తేలింది. నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎస్ఏఐడీ) అనే మందుల వాడకం గుండెజబ్బుల రిస్క్‌ను 20 శాతం పెంచుతుందని ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ మిలానో-బికోక్సాలో జరిగిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అక్కడ నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఆండ్రియా ఆర్ఫే అనే పీహెచ్డీ స్కాలర్ దాదాపు పది లక్షల మందికి పైగా రోగుల రికార్డులను పరిశీలించిన ఆండ్రియా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఎన్ఎస్ఏఐడీలకు హార్ట్ ఫెయిల్యుర్‌కు నేరుగా ఉన్న సంబంధంపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.