ఎన్టీపీసీ ఐదవ యూనిట్ ట్రిప్
కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ ఐదవ యూనిట్ మంగళవారం ఉదయం ట్రిప్ అయింది. దీంతో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యే కారణమని అధికారులు తెలిపారు. మరోవైపు 500 మెగావాట్ల నాల్గవ యూనిట్లో వార్షిక మరమ్మతులు జరుగుతున్నాయి. దీంతో 2600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఇక్కడి ఎన్టీపీసీ ప్రాజెక్టులో ప్రస్తుతం 1600 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది.