Nubia phone
-
సూపర్ ఫీచర్స్‌తో నుబియా స్మార్ట్‌ఫోన్
బీజింగ్ : స్మార్ట్ ప్రపంచంలోకి సరికొత్త ఫోన్ రాబోతుంది. జీటీఈ అనుబంధ సంస్థ నుబియా, నుబియా ఎన్3 పేరుతో అదిరిపోయే ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి తేనుంది. ఈ కంపెనీ నుంచి అద్భుతమైన ఫీచర్స్‌తో ఫోన్ రిలీజ్ కాబోతుందని పుకార్లు షికార్లు చేశాయి. వాటిని నిజం చేస్తూ.. కంపెనీ నుబియా ఎన్3ని ఈ నెల 24న చైనా మార్కెట్లో విడుదల చేయనుంది. భారీ బ్యాటరీ, బిగ్ స్క్రీన్ దీని ప్రత్యేకతలుగా కంపెనీ చెబుతోంది. మొత్తం మూడు రంగుల్లో ఫోన్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అయితే ఫోన్ ధరను కంపెనీ ఇంకా నిర్ణయించలేదు. ఆండ్రాయిడ్ ఓరియో అప్డేట్తో ప్రపంచ మార్కెట్లను అలరించనుందనే అంచనా ఉన్నప్పటికీ.. ఎప్పటి వరకు అందుబాటులోకి వస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్సే. నుబియా ఎన్3 ఫీచర్స్ 18:9 ఐపీఎస్ ఎల్సీడీ 5.99 అంగుళాల డిస్ప్లే ఆండ్రాయిడ్ నౌగాట్ 7.1 4 జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ 128జీబీ వరకు విస్తరించుకోవచ్చు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఆటో ఫోకస్‌తో వెనుక రెండు కెమెరాలు 5000 యంఏహెచ్ బ్యాటరీ ఫింగర్ ప్రింట్ లాక్ సిస్టమ్ -
భారత్‌లో జడ్‌టీఈ నుబియా ఫోన్
- నుబియా జడ్9 మిని @ రూ.16,999 - అమెజాన్ ఇండియా ద్వారా లభ్యం న్యూఢిల్లీ: చైనాకు చెందిన జడ్‌టీఈ కంపెనీ తన ప్రీమియం ఫోన్ల బ్రాండ్ నుబియాలో తొలి ఫోన్ జడ్9 మినీను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ధర రూ.16,999. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా ద్వారా లభ్యమని జడ్‌టీఈ పేర్కొంది. ఆండ్రాయిడ్ లాలిపాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ డ్యుయల్ సిమ్ 4జీ ఫోన్లో 5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఆక్టా కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 16 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి.