అండర్-14 టెన్నిస్ టోర్నీకి ఓక్రిడ్జ్ విద్యార్థులు
రాయదుర్గం,న్యూస్‌లైన్: ఏషియన్ జూనియర్ అండర్-14 టెన్నీస్ టోర్నమెంట్‌కు శేరిలింగంపల్లి ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. తొమ్మిదవ తరగతి చదివే జి.గౌరవ్‌రెడ్డి, ఆదిత్య కళ్లేపల్లి, 8వ తరగతికి చెందిన ప్రలోక్ ఇక్కుర్తి ఎంపికయ్యారని ఓక్రిడ్జ్ కోచ్ డేవిడ్ రాజ్‌కుమార్ తెలిపారు. గత ఏడాదిగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన టెన్నీస్ పోటీల్లో ఈ విద్యార్థులు సాధించిన పాయింట్లను ఆధారంగా చేసుకొని ఏషియన్ స్థాయి టోర్నీకి ఎంపిక చేశారన్నారు.
ఈ ఏషియన్ జూనియర్ అండర్-14 టెన్నీస్ టోర్నమెంట్‌ను ఏపీఎల్టీఏ ఆధ్వర్యంలో ఎల్.బి. స్టేడియంలో సోమవారం నుంచి నవంబర్ 3వ తేదీ వరకు నిర్వహిస్తారని తెలిపారు. కాగా ఎంపికైన ముగ్గురిలో గౌరవ్‌రెడ్డి మెయిన్ డ్రాకు అర్హత సాధించడం విశేషం. రెండు నెలల క్రితం న్యూఢిల్లీలో నిర్వహించిన సెనెస్టా నేషనల్ టోర్నీలో పాల్గొన్నాడు. ఏషియన్ లెవల్ టోర్నీలకు ముగ్గురు విద్యార్థులు ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రిన్సిపల్ కెప్టన్ రోహిత్‌సేన్ బజాజ్, స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ మార్టిన్ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను అభినందించారు.