Odisha Border forest area
-
ఏవోబీలో మావోయిస్టు యాక్షన్ టీమ్‌లు?
ముంచంగిపుట్టు(పెదబయలు): ఆంధ్ర,ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు యాక్షన్ టీమ్‌లు సంచరిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు నిఘా వర్గాల సమాచారం అందినట్టు భోగట్టా. మావోయిస్టులు ఏవోబీలో భారీ అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఇంటలి జెన్స్ వర్గాల సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం ముంచంగిపుట్టు, పెదబయలు మండల కేంద్రాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రం నుంచి జోలాపుట్టు, కుమడ, డుడుమ మార్గాల్లో ప్రయాణించే వాహనాలపై ప్రత్యేక దృష్టిసారించారు. ప్రతీ వాహనాన్ని ఆపి, బ్యాగులు తనిఖీ చేశారు.అనుమానిత వ్యక్తులను ప్రశ్నిం చి విడిచిపెట్టారు. ముంచంగిపుట్టు ఎస్ఐ ప్ర సాదరావు ఆధ్వర్యంలో ముంచంగిపుట్టు నుంచి కుభజంగి జంక్షన్ వరుకు బాంబు స్క్వాడ్‌తో కల్వర్టులు,వంతెనల కింద తనిఖీలు చేశారు. కొన్ని నెలలుగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మావోయిస్టులు పోలీసుల మధ్య వరుసగా ఎదురుకాల్పులు జరుగుతున్న నేప«థ్యంలో ఆంధ్ర, ఒడిశా సరిహద్దు(ఏవోబీ) వైపు మావో యిస్టులు వచ్చి తలదాచుకుంటున్నారనే సమాచారంతో సరిహద్దులో ప్రాంతాల్లో పోలీసు బలగాలు అప్రమత్తమై తనిఖీలు ముమ్మరం చేశాయి. దీనికి తోడుగా మావోయిస్టు యాక్షన్ టీంలు సైతం రంగంలోకి దిగినట్టు పోలీసులు భావించి, సరిహద్దుల్లో నిఘా ఏర్పాటు చేశారు. పెదబయలు మండలంలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లే పన్నెడ జంక్షన్, కొత్తాపుట్టు జంక్షన్లలో పెదబయలు ఎస్ఐ రాజారావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. దీంతో ఏవోబీలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన నెలకొంది. -
అడవులకు వెళ్తున్నా నాన్న
తండ్రితో అబుబాకర్ చెప్పిన ఆఖరి మాట గాజువాక: ‘మా క్యాంపునకు చేరిపోయాను నాన్నా. అడవులకు బయలుదేరి వెళ్తున్నాం. మా ఆపరేషన్ పూర్తయ్యాక గాని మళ్లీ నీకు ఫోన్ చేయను. నువ్వు కూడా నాకు ఫోన్ చేయడానికి ప్రయత్నం చేయకు. మీరు జాగ్రత్తగా ఉండండి. నేను క్షేమంగా వచ్చేస్తాను. భయపడకండి.’ మావోయిస్టులతో జరిగిన ఎన్ కౌంటర్లో దుర్మరణం పాలైన గ్రేహౌండ్స్ సీనియర్ కమాండో మహ్మద్ అబు బాకర్ తన తండ్రికి ఫోన్ లో చెప్పిన ఆఖరి మాటలివి. గత బుధవారం తమ క్యాంపు నుంచి గాజువాకలోని తన తల్లిదండ్రుల వద్దకు వచ్చిన అబు రెండు రోజులపాటు ఇక్కడే గడిపాడు. శుక్రవారం ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లి.. అదే రోజు రాత్రి తన తండ్రికి ఫోన్ చేశాడు. వీరుడిగా తిరిగొస్తాడని ఎదురు చూస్తున్న తన తల్లిదండ్రులకు వీర మరణం పొందాడన్న కబురు రావడంతో వారు శోక సంద్రంలో మునిగిపోయారు. తాతే స్ఫూర్తి : అబు బాకర్ తాత ఎం.డి.ఇస్మాయిల్ 1993 వరకు పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేసి రిటైరయ్యారు. తాతను చూస్తూ స్ఫూర్తి పొందిన బాకర్ పోలీస్ ఉద్యోగం సంపాదించాలని బలంగా నిర్ణయించుకున్నాడు. 2011లోఎంపికై.. ఇష్టపడి మరీ గ్రేహౌండ్స్‌కు వెళ్లాడు. క్యాంప్‌లో ఉంటే ప్రతిరోజు తమకు ఫోన్ చేసి మాట్లాతుండే వాడని అతడి తల్లిదండ్రులు అమీర్ ఉన్నీషా, మహ్మద్ మదీనా తెలిపారు. తన చెల్లి షాబీరా అంటే బాకర్‌కు ప్రాణమని కన్నీటిపర్యంతమయ్యారు. తన మనవడికి పెళ్లి చేయాలని కూడా అనుకొంటున్నామని, ఇంతలోనే ఇలా జరిగిపోయిందంటూ అతడి తాత రోదించారు. అబు అధికారుల వద్ద తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. కూంబింగ్‌కు ఎప్పుడు వెళ్లినా ముందు వరసలో నిలబడి తన బెటాలియన్ లోనే అత్యంత ధైర్యవంతుడుగా పేరు తెచ్చుకొన్నాడు. అతడి ధైర్య సాహసాలను డీజీపీ సాంబశివరావు సైతం ప్రస్తావించడమే దీనికి నిదర్శనం. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ఎన్ కౌంటర్ మృతి చెందిన గ్రేహౌండ్స్ సీనియర్ కమాండో మహ్మద్ అబు బాకర్ అంత్యక్రియలు సోమవారం రాత్రి అధికార లాంఛనాలతో నిర్వహించారు. కేజీహెచ్‌లో పోస్టుమార్టం, ప్రభుత్వ లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం పోలీసు అధికారులు ప్రత్యేక వాహనంలో మృతదేహాన్ని తీసుకొచ్చి, సీతారామ్నగర్లోని అతని తల్లిదండ్రులకు అప్పగించారు. రాత్రి 10.30 గంటల వరకు మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం భారీ జన సందోహంతో అశ్రునయనాల మధ్య అజీమాబాద్ శ్మశానం వరకు బాకర్ అంతిమయాత్ర కొనసాగింది. అక్కడ పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం ముస్లిం మత పెద్దలు తమ ఆచారం ప్రకారం ప్రార్థనలు నిర్వహించి మృతదేహాన్ని ఖననం చేశారు. గ్రేహౌండ్స్ డీఐజీ శ్రీకాంత్‌తోపాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అబు బాకర్ కుటుంబానికి రూ.40 లక్షల చెక్కు అందజేత ఆంధ్రా–ఒడిశా బోర్డర్ (ఏవోబీ)లో జరిగిన ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన గ్రేహౌండ్స్ సీనియర్ కమాండో మహ్మద్ అబు బాకర్ కుటుంబానికి ప్రభుత్వం రూ.40 లక్షల ప్రత్యేక పరిహారం అందజేసింది. దీనికి సంబంధించిన చెక్కును డీజీపీ సాంబశివరావు గాజువాకలోని అతని తండ్రి మహ్మద్ మదీనాకు మంగళ వారం అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ కమాండో కుటుంబంతో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎన్ కౌంటర్లో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారాన్ని తక్షణమే అందజేస్తామన్నారు. ప్రస్తుత సంఘటన ప్రాధాన్యం దృష్ట్యా మరో రూ.15 లక్షలు కలిపి ప్రత్యేక పరిహారంగా ఈ చెక్కును అందజేశామన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కుటుంబానికి ఉద్యోగం, స్థలం, డీజీపీని కోరిన ముస్లిం నేతలు గాజువాక: అబు బాకర్ కుటుంబానికి ఉద్యోగంతోపాటు నివాస స్థలం కూడా కేటాయించి న్యాయం చేయాలని స్థానిక ముస్లిం నేతలు డీజీపీ సాంబశివరావును కోరారు. 63వ వార్డు మాజీ కార్పొరేటర్ మహ్మద్ రఫీ, వైఎస్సార్సీపీ వార్డు అధ్యక్షుడు షౌకత్ ఆలీతోపాటు పలువురు ముస్లిం మత పెద్దలు డీజీపీని కలిశారు. కమాండో సర్వీసు ఉన్నంత కాలం ఆ కుటుంబానికి జీతం వస్తుందని, అతడి సోదరికి పోలీస్ శాఖలో తగిన ఉద్యోగం ఇస్తామని డీపీజీ పేర్కొన్నారు. దీనిపై నాయకులు మాట్లాడుతూ ఆ కుటుంబానికి వెంటనే నివాస స్థలం ఇవ్వాలని కోరారు. కమాండో సోదరికి పోలీస్ శాఖలో కాకుండా రెవెన్యూ, ఇన్ కమ్ టాక్స్ విభాగంలో ఉద్యోగం కల్పించాలన్నారు. స్థలం మంజూరు చేసే విషయంపై కలెక్టర్‌తో సంప్రదిస్తామని, ఉద్యోగం కూడా కుటుంబ సభ్యులు కోరుకొనే విధంగా ఇవ్వడానికి సంబంధిత అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తామని డీజీపీ హామీ ఇచ్చినట్టు నాయకులు తెలిపారు. -
ఏవోబీలో ఇదే భారీ ఎన్కౌంటర్
సాక్షితో విశాఖ, మల్కన్‌గిరి ఎస్పీలు మల్కన్‌గిరి నుంచి సాక్షి ప్రత్యేక బృందం: రాష్ట్ర విభజనకు ముందు.. తరువాత కూడా ఆంధ్ర, ఒడిశా బోర్డర్ అటవీ ప్రాంతంలో సోమవారం జరిగిన భారీ ఎన్‌కౌంటరే అతి పెద్దదని విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, మల్కన్‌గిరి ఎస్పీ మిత్రభాను మహాపాత్రో చెప్పారు. ఒడిశాలోని మల్కన్‌గిరి ఎస్పీ కార్యాలయంలో సాక్షి ప్రతినిధుల బృందంతో వారు ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలోనే ఇద్దరు స్టేట్ జోనల్ కమిటీ సభ్యులతో సహా డివిజన్ కమిటీ, ఏరియా కమిటీ సభ్యులు వంటి అత్యంత కీలక మావోయిస్టు నేతలు ఒకేసారి ఎన్కౌంటర్లో మృతిచెందడం ఇదే తొలిసారన్నారు. కొంతకాలంగా మావోయిస్టుల ఉద్యమం ముఖ్యనేతలను కోల్పోయి బలహీనపడుతోందని, తాజా ఎన్‌కౌంటర్‌తో చావుదెబ్బతగిలిందని అన్నారు. గాలికొండ ఏరియా దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లిపోగా ఇప్పుడు కోరుకొండ, కోరాపుట్ డివిజన్ ఏరియా కమిటీలు కూడా కన్నాళ్లు విరామం తీసుకుంటాయన్నారు. ఈ ఎన్కౌంటర్లో తమ బలగాలు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించినప్పటికీ ఒక గ్రేహౌండ్ సభ్యుడిని కోల్పోవడం బాధాకరమన్నారు.