ఐబీ సర్కిల్లో కొత్త కలెక్టరేట్
వరంగల్ : నూతనంగా ఏర్పాటు కానున్న కలెక్టర్ కార్యాలయాన్ని చిన్న నీటిపారుదల శాఖకు చెందిన సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తామని, అందుకు వెంటనే భవనాన్ని ఖాళీ చేసి అప్పగించాలని కలెక్టర్ కరుణ ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించారు. మంగళవారం ఆమె ఐబీ ఎస్ఈ కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. వరంగల్ జిల్లా నాలుగు జిల్లాలుగా ఏర్పాటు కావడం ఖాయమనే సంకేతాలు అధికారుల నుంచి వెలువడుతున్నాయి. జయశంకర్, మహబూబాబాద్ జిల్లాల ఏర్పాటులో ఎలాంటి సందేహాలు లేవు. వరంగల్, హన్మకొండ లేక వరంగల్ రూరల్, వరంగల్ అర్భ¯ŒSల పేరుతో మరో రెండు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటి వరకు కొత్తగా ఏర్పడే వరంగల్ జిల్లా కలెక్టరేట్‌ను పాత కలెక్టరేట్లోనే కొనసాగిస్తూ కొత్తగా ఏర్పడే జిల్లాకు కలెక్టర్ కార్యాలయం ఐబీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని కలెక్టర్ బావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఐబీ ఎస్ఈ కార్యాలయాన్ని అదే అవరణలో ఉన్న డీఎంసీ(గెస్ట్‌హౌజ్)లో ఏర్పాటు చేసుకోవాలని ఎస్ఈ శ్రీనివాసరెడ్డికి సూచించారు. ఈ విషయాన్ని ఇరిగేష¯ŒS శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులకు ఎస్ఈ వివరించినట్లు తెలిసింది. చిన్న నీటివనరుల పునరుద్ధరణలో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిష¯ŒS కాకతీయ’ కార్యక్రమానికి చిహ్నంగా సర్కిల్ కార్యాలయ అవరణలో పైలా¯ŒS నిర్మించారు. ఈ పథకం మరో మూడేళ్లు సాగనున్నందున ఇక్కడే యథావిధిగా కార్యాలయం కొనసాగించాలన్న డిమాండ్ అ«ధికారుల నుంచి వినిపిస్తోంది.
కదిలిస్తే ఖతం...
జిల్లా చిన్న నీటిపారుదల శాఖ కార్యాలయంలోని రికార్డ్ గదిలో ఉన్న ఫైళ్లు కదిలిస్తే పూర్తిగా శిథిలం అయ్యే అవకాశాలున్నాయి. ఈ కార్యాలయానికి 110 ఏళ్ల చరిత్ర ఉంది. తెలంగాణ రాష్ట్రం అవిర్భవించిన అనంతరం 2015 వరకు ఈ కార్యాలయంలోనే ఖమ్మం, వరంగల్ జిల్లాల పరిధిలోని చిన్న నీటి వనరుల అభివృద్ధి, పర్యవేక్షణ చూసేవారు. ఎన్నో చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల భూములకు సంబంధించిన విలువైన రికార్డులు ఇక్కడ భద్రపరిచారు. ప్రస్తుతం వాటిని తీస్తే పూర్తిగా శిథిలమయ్యే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.