officers visit
-
ఉప్పల్ పీహెచ్‌సీకి ‘ఎన్‌క్వాస్’ దక్కేనా?
కమలాపూర్(హుజూరాబాద్): వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జాతీయ నాణ్యతా ప్రమాణాల హామీ సంస్థ (ఎన్‌క్వాస్) గుర్తింపు పొందేం దుకు పోటీపడుతోంది. ఈనెల 4, 5 తేదీల్లో రెండు రోజుల పాటు వైద్య, ఆరోగ్య శాఖ కేంద్ర బృందం సభ్యులు ఉప్పల్ పీహెచ్సీ పరిశీలనకు రానున్నారు. ఈ సందర్భంగా పీహెచ్సీలో ఔట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్లు, ల్యాబోరేటరీ సర్వీసెస్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, ప్రసవాలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు మాతా, శిశు సంరక్షణ, అంధత్వ నివారణ, టీకాలు, హెచ్ఐవీ, టీబీ, ఫైలేరియా, కుష్టు, మలేరియా తదితర విభాగాల్లో పనితీరు, పురోగతిని కేంద్ర బృంద సభ్యులు పరిశీలిస్తారు. అదేవిధంగా ఆస్పత్రిలో నాణ్యతా ప్రమాణాలు, రోగులకు అందించే వైద్యసేవలు, ఆస్పత్రి ఆవరణ, పరిసరాల పరిశుభ్రత, ఆస్పత్రి రికార్డుల నిర్వహణ తదితరాలన్నింటినీ ఇద్దరు సభ్యుల కేంద్ర బృందం పరిశీలించి, వైద్యసేవలు, ఇతరత్రా పలు అంశాలకు సంబంధించి ఆస్పత్రి సిబ్బందిని ఇంటర్వ్యూ చేయనున్నారు. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు.. ఉప్పల్ పీహెచ్సీ ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందింది. గత ఫిబ్రవరి 5న ఉప్పల్ పీహెచ్‌సీని వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర బృందం పరిశీలించి రాష్ట్రస్థాయి ఉత్తమ పీహెచ్సీగా ఎంపిక చేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 19న ఉప్పల్ పీహెచ్సీ స్వచ్ఛభారత్ కింద జిల్లా స్థాయిలో ఉత్తమ పీహెచ్సీగా కాయకల్ప అవార్డుకు ఎంపికైంది. పోటీలో 11 పీహెచ్‌సీలు.. ఎన్‌క్వాస్ గుర్తింపుతో జాతీయ స్థాయిలో ఉత్తమ పీహెచ్సీగా ఎంపికయ్యేందుకు వరంగల్ అర్బన్ జిల్లా నుంచి కమలాపూర్ మండలం ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ పీహెచ్సీ పోటీ పడుతున్నాయి. ఈరెండు పీహెచ్‌సీలతో పాటు నిర్మల్ జిల్లా నుంచి సోనా, నల్లగొండ జిల్లా నుంచి శౌలిగౌరారం, నిజామాబాద్ జిల్లా నుంచి చౌటుప్పల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఏకంగా ఆరు పీహెచ్‌సీల చొప్పున మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు పీహెచ్‌సీలు పోటీ పడుతున్నాయి. ఎన్క్వాన్ గుర్తింపు దక్కితే... జాతీయ స్థాయిలో ఎన్‌క్వాస్ గుర్తింపు దక్కిన పీహెచ్‌సీకి ఏడాదికి రూ.3లక్షల చొప్పున మూడేళ్ల పాటు మొత్తం రూ.9 లక్షల అభివృద్ధి నిధులు అదనంగా రానున్నాయి. ఈ నిధులతో ఆస్పత్రిలో మరిన్ని వసతులు కల్పించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం కలుగుతుంది.ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేసుకోవచ్చు స్వచ్ఛత, వైద్య సేవల్లో ఇప్పటివరకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాం. జాతీయ స్థాయిలో కూడా ఎన్‌క్వాస్ గుర్తింపు వస్తే ఆస్పత్రిని అన్ని విధాల అభివృద్ధి చేసుకోవడంతోపాటు రోగులకు మరిన్ని మెరుగైన వైద్యసేవలు అందించే అవకాశం దక్కుతుంది. కేంద్ర బృందం రావడమంటే మా పనితీరుకు పరీక్షగా భావిస్తున్నాం. – డాక్టర్ రాకేష్‌కుమార్, వైద్యాధికారి ఉప్పల్ -
పెద్దాస్పత్రిని సందర్శించిన ఢిల్లీ బృందం
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్స్‌కి చెందిన ఢిల్లీ బృందం సోమవారం సందర్శించింది. డాక్టర్ టన్ను నాతోగి, డాక్టర్ వినోద్, సందీప్‌షా ఆధ్వర్యంలో బృందం సభ్యులు ఆస్పత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు. తొలుత మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి.. మెటర్నిటీ, ఎస్ఎన్సీయూ, ఎన్ఆర్సీ, లేబర్ రూం, ఓపీ సేవలను పరిశీలించారు. అనంతరం పాత ఆస్పత్రిలోని క్యాజువాలిటీ, ఓపీలను పరిశీలించి.. పనితీరును పూర్తిస్థాయిలో తెలుసుకున్నారు. ఆస్పత్రి నిర్వహణ, రోగులకు అందుతున్న సేవల పట్ల బృందం సభ్యులు సంతృప్తిని వ్యక్తం చేసినట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. బృందం సభ్యులు 18 విభాగాలను పరిశీలించాల్సి ఉండగా.. తొలిరోజు 9 విభాగాల పరిశీలన పూర్తయింది. రెండు బృందాలు రాగా.. ఒక బృందం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని, మరో బృందం భద్రాచలం ఏరియా ఆస్పత్రిని సందర్శించింది. మూడు రోజుల పరిశీలన అనంతరం నివేదిక తయారు చేసి నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్స్‌కు నివేదిస్తారు. పరిశీలనలో రాష్ట్ర బృందం సభ్యులు, ఉమ్మడి జిల్లాల నోడల్ ఆఫీసర్ అశోక్‌కుమార్, ఎన్హెచ్ఎం స్టేట్ కోఆర్డినేటర్ నిరంజన్, రాంబాబునాయక్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మదన్‌సింగ్, ఆర్ఎంఓ శోభాదేవి, బి.వెంకటేశ్వర్లు, బి.శ్రీనివాసరావు, కృప ఉషశ్రీ, బాలు, నాగేశ్వరరావు, రామ్మూర్తి, ఆర్వీఎస్ సాగర్, నయీమ్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆస్పత్రిలో ఎన్‌క్వాస్ బృందం పరిశీలన భద్రాచలంఅర్బన్: పట్టణ శాంతినగర్ కాలనీలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సోమవారం ఉదయం జాతీయ నాణ్యత ప్రమాణాలును ధృవీకరించే (ఎన్‌క్వాస్) అధికారుల బృందం పర్యటించింది. కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ బృందంలో మనోరంజన్ మహాపాత్ర, ఎంఎం.లీసమ్మ, కొచ్చా నవీన్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. మూడు రోజలు పాటు ఆస్పత్రిలోని అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే పారిశుద్ధ్య విషయంలో, రోగులకు వైద్య సేవలు అందించడంలో మంచి పేరు సొంతం చేసుకున్న ఈ ఆసుపత్రికి ఎన్‌క్వాస్ గుర్తింపు లభిస్తే దేశంలోనే ఏజెన్సీ ప్రాంతంలో గుర్తింపు పొందిన ఆసుపత్రిగా పేరు అందుకుంటుంది. ఎన్‌క్వాస్ గుర్తింపు వల్ల వచ్చే ప్రోత్సాహంతో ఏజెన్సీ ప్రాంతంలోని ఈ ఆసుపత్రిలో మరిన్ని సౌకర్యాలు కల్పించేందకు వీలు కలుగుతుంది. ఈ బృందంతో పాటు ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎంవీ కోటిరెడ్డి, ఆర్ఎంఓ చావా యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. -
నెక్కంటిలో అధికార యంత్రాంగం తనిఖీలు
జె.తిమ్మాపురం (పెద్దాపురం) : స్థానిక జగ్గంపేట రోడ్డులోని జె.తిమ్మాపురం పంచాయతీ పరిధిలో గల నెక్కంటి సీ ఫుడ్ (రొయ్యల పరిశ్రమ)లో శుక్రవారం పలు శాఖల అధికారులు అకస్మిక తనిఖీ చేశారు. గత నెల 24వ తేదీన అమోనియా గ్యాస్ లీకై పలువురు అస్వస్థతకు గురి కావడం, తదుపరి అధికారుల తనిఖీ అనంతరం తాత్కాలికంగా పరిశ్రమను మూసివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో శుక్రవారం కలెక్టర్ ఆదేశాల మేరకు పెద్దాపురం ఆర్డీవో వి.విశ్వేశ్వరరావు, చీఫ్ ఇ¯ŒSస్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివకుమార్‌రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి జిల్లా ఈఈ రవీంద్రబాబు, అడిష¯ŒS డీఎంహెచ్ఓ సత్యనారాయణ, తహసీల్దార్ గోగుల వరహాలయ్య, సాంకేతిక నిపుణులు ఫ్యాక్టరీలో తనిఖీలు చేపట్టారు. కార్మికుల రక్షణకు తీసుకున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రధానంగా ప్రొసెసింగ్ జరిగే ప్రదేశంలో కావాల్సిన ఏహెచ్, ఏసీ మెషీన్ పరికరాల అమరిక. గ్యాస్ లీక్, ఆక్సిజ¯ŒS పరిశీ లించి సంతృప్తిని వ్యక్తం చేశారు. తదుపరి చేపట్టాల్సిన థర్డ్‌పార్టీ ఏజెన్సీ ఏర్పాటు చేయాల్సిందని, తదుపరి తనిఖీ ల అనంతరం పరిశ్రమ పునః ప్రారంభమౌతుందని అధికారులు తెలిపారు. ఆయా ప్రదేశా ల్లో కోరమండ ల్, ఎ¯ŒSఎఫ్‌సీఎల్ సాంకేతిక నిపుణుల బృం దం ప్లాంట్‌లో ఉన్న ఆక్సిజన్, అమోనియా సెన్సార్ల స్థా యిని క్షుణ్ణంగా తనిఖీ చేసి నివేదికలు ఇచ్చారు. ఆ ర్డీవో విశ్వేశ్వరరావు మాట్లాడుతూ మరో సారి సంబం«ధి త అధికారులతో తనిఖీ చేశామని, నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పి స్తామన్నారు. త దుపరి ఆదేశాల మేరకు పరిశ్రమను ప్రారంభి స్తామని అన్నారు. -
పాదగయ ఫ్లోరింగ్ పనుల పరిశీలన
మిగిలిన బిల్లులు నిలిపివేస్తామన్న పర్యాటక శాఖ అధికారులు పిఠాపురం : పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పిఠాపురం పాదగయ క్షేత్రంలో నిర్మించిన గ్రానైట్ ఫ్లోరింగ్ పనుల్లో రూ.లక్షలు మెక్కిందెవరో తేలుస్తామని ఆ శాఖ అధికారులు తెలిపారు. ‘మూడు నెలలకే ముక్కలు.. రూ.లక్షలు మెక్కుడు’ అనే శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం వచ్చిన వార్తకు పర్యాటక శాఖ అధికారులు స్పందించారు. ఆ శాఖ డీఈ సత్యనారాయణ తన సిబ్బందితో ఆయా పనులను పరిశీలించారు. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించలేదని, మిగిలి ఉన్న బిల్లులు నిలిపివేస్తామని చెప్పారు. పూర్తిగా విచారణ జరిపి, అవినీతి జరిగినట్టు తేలితే.. సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. లోపభూయిష్టంగా, ఇష్టానుసారం పనులు చేసిన కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టాలని, ఆలయంలో ఏ పనినీ ఆ కాంట్రాక్టర్‌కు అప్పగించరాదని ఆలయ ఈఓ చందక దారబాబు పర్యాటక శాఖ అధికారులకు సూచించారు. ఆ పనులు అసంతృప్తిగా ఉన్నాయి గ్రానైట్ ఫ్లోరింగ్ పనులు అసంతృప్తిగానే ఉన్నాయని స్థానిక ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. ఆయన ఫ్లోరింగ్ పనులను పరిశీలించి, వెంటనే దీనిపై విచారణ జరిపించాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. -
గోశాలను సందర్శించిన అధికారులు
కోడెల రక్తనమూనాల సేకరణ మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం : ఈవో వేములవాడ : వేములవాడ రాజన్న గోశాలను అధికారులు సందర్శించారు. కోడెలకు పౌష్టికాహారం అందించడంతోపాటు మెరుగైన వసతులు కల్పిస్తామని తెలిపారు. రాజన్నకు భక్తులు సమర్పించుకునే కోడెలు మృత్యువాత పడుతుండటంతో ‘రాజన్న కోడెల మృత్యుఘోష’ శీర్షికన ఈనెల 23న ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. స్పందించిన ఈవో దూస రాజేశ్వర్ అధికారులతో కలిసి మంగళవారం గోశాలలను సందర్శించారు. కోడెలకు రక్షణ, పౌష్టికాహారం విషయంలో రాజీ పడబోమని, మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. పశువైద్యాధికారులతో రక్తనమూనాలు సేకరించారు. కోడెలు మృత్యువాతపడకుండా చర్యలు తీసుకోవాలని గోశాల నిర్వాహకులను ఆదేశించారు. అనారోగ్యంతో కనిపించిన కోడెలకు సత్వరమే వైద్యం చేయించాలనీ, లేకుంటే మరో ప్రాంతానికి తరలించాలని ఆదేశించారు. మరో కోడె మృతి వేములవాడ రూరల్ : రాజన్న గోశాలను అధికారులు పరిశీలించి.. మెరుగైన వైద్యం అందిస్తామని పేర్కొన్న రోజే మరో కోడె మృతిచెందడం చర్చనీయాంశమైంది. కోడెల రక్షణకు తిప్పాపూర్‌లో ఏర్పాటు చేసిన గోశాలలో సిబ్బందితోపాటు, వెటర్నరీ డాక్టర్‌ను అధికారులు నియమించారు. 20రోజుల వ్యవధిలోనే ఐదు కోడెలు మృతిచెందగా.. మంగళవారం మరో కోడె మృత్యువాత పడింది.