పది పంచాయతీలకు మున్సిపాల్టీ హోదా
బెంగళూరు : రాష్ట్రంలోని 10 పట్టణ పంచాయతీలను పురసభలుగా, తొమ్మిది పురసభలను నగర సభలుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి శుక్రవారం సాయంత్రం అధికారిక ప్రకటనను వెలువరించింది.
కొత్త పురసభలు:
కల్బుర్గి జిల్లాలోని అఫ్జల్పుర, జీవర్గి, చించోళి, యాదగిరి జిల్లాలోని గురుమిట్కళ్, బాగల్కోటె జిల్లా హునగుంద, బెళగావి జిల్లాలోని కుడచి, హుక్కేరి, సదలగ, మండ్య జిల్లా పాండవపుర, మైసూరు జిల్లా టి.నరసీపుర
కొత్త నగర సభలు:
హాసన్ జిల్లా అరసికెరె, చిత్రదుర్గ జిల్లా హిరియూరు, బెంగళూరు గ్రామాంతర జిల్లా హొసకోటె, రామనగర జిల్లా కనకపుర, బాగల్కోటె జిల్లా ముథోళ్, చిక్కబళ్లాపుర జిల్లా శిడ్లఘట్ట, బళ్లారి జిల్లా సిరిగుప్ప, యాదగిరి జిల్లా సురపుర, దక్షిణ కన్నడ జిల్లా ఉళ్లాల.