అధికారిక కార్లు వాడొద్దు
న్యూఢిల్లీ: జి–20 సమావేశాల్లో విందు వేదికను చేరుకోవడానికి అధికారిక కార్లను వాడొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులకు సూచించారు. బుధవారం జరిగిన భేటీలో మంత్రులకు విధినిõÙధాలను వివరించారు. భారత్‌కు వస్తున్న వివిధ దేశాల బృందాలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా మసలుకోవాలని సూచించారు. ప్రధాన వేదిక భారత మండపం, ఇతర వేదికలను చేరుకోవడానికి షటిల్ సరీ్వసును ఉపయోగించుకోవాలని చెప్పారు. తాము బాధ్యత వహిస్తున్న విదేశీ బృందాలకు సంబంధించి ఆచారవ్యవహారాలను తెలుసుకోవాలని మంత్రులను కోరారు.
వారి సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకొని.. అందుకు అనుగుణంగా అతిథ్యమివ్వాలని చెప్పారు. జీ–20 సమావేశాలకు సంబంధించి అధీకృత వ్యక్తులు తప్పితే మరెవరూ మీడియాతో మాట్లాడవద్దని సూచించారు. ఈనెల తొమ్మిదో తేదీన జరిగే రాత్రి విందుకు ఆహా్వనించిన ముఖ్యమంత్రులందరూ సొంత కార్లలో రావాలని, వేదిక వద్ద షటిల్ సరీ్వసును ఉపయోగించుకొని విందు జరిగే ప్రదేశానికి చేరుకోవాలని ఇదివరకే సూచనలు వెళ్లాయి. కేంద్ర మంత్రులందరూ జీ–20 యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని, ఇందులో జీ–20 దేశాల భాషలతో పాటు భారతీయ భాషలన్నింటిలోనూ అనువాద సదుపాయం ఉందని ప్రధాని వివరించారు.
వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి 40 మంది ప్రపంచ నాయకులు సెప్టెంబరు 9, 10వ తేదీల్లో జరిగే జీ–20 సదస్సుకు హాజరవుతారని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్‌మోహన్ క్వాత్రా మంత్రులకు తెలిపారు. పాటించాల్సిన ప్రొటోకాల్ నిబంధనల గురించి వివరించారు. భారత్, ఇండియా వివాదంపై అ«దీకృత వ్యక్తులు మాత్రమే మాట్లాడాలని ప్రధాని మోదీ మంత్రివర్గ సహచరులకు సూచించారు.
చరిత్రలోకి వెళ్లకుండా రాజ్యాంగానికి లోబడి వాస్తవాలను మాట్లాడాలని కోరారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాలతో పోలి్చన డీఎంకే నాయకుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు తగురీతిలో సమాధానమివ్వాలని ప్రధాని ఈ భేటీలో అభిప్రాయపడ్డారు. ఉదయనిధి వ్యాఖ్యలపై పలు రాజకీయ పారీ్టలు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఉదయనిధి స్టాలిన్, ఆయన వ్యాఖ్యలకు మద్దతు పలికి ప్రియాంక్ ఖర్గేలపై మతవిశ్వాసాలను దెబ్బతీశారనే అభియోగాలపై బుధవారం ఎఫ్ఐఆర్ నమోదైంది.