Oil deposits
-
నదీ తీరంలో.. చమురు నిక్షేపాలు!
అలంపూర్ రూరల్: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ వద్ద భూగర్భంలో క్రూడాయిల్, పెట్రోల్, గ్యాస్ వంటి చమురు నిక్షేపాలు ఉన్న ట్టు భారతీయ ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీ సీ) గుర్తించినట్లు సమాచారం. సహజ సిద్ధ వాయువులు గ్యాస్, పెట్రో, డీజిల్‌పై నిత్య పరిశోధనల్లో భాగంగా శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా ఈ ప్రాంతంలో చమురు నిక్షేపాలు ఉండటాన్ని గుర్తించారు. మరింత సమాచారం కోసం పరిశోధనల బాధ్యతలను ‘గ్లోబల్ ఎకాలజిస్ట్ ప్రైవేట్ లిమిటెడ్’కు అప్పగించారు. ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగులు మూడు రోజులుగా జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ తుంగభద్ర నదీ తీరమైన సుల్తానాపూర్ నుంచి నదీ తీర గ్రామాలైన అలంపూర్, కాశీపురం, సింగవరం, భైరాపురం పరిసరాల్లో చమురు నిక్షేపాల అన్వేషణకు పరిశోధనలు జరిపారు. చమురు నిక్షేపాల ప్రకంపనల వివరాలను ఉప గ్రహాల ద్వారా గమనిస్తూ వాటి నిష్పత్తిని ఓఎన్జీసీ ప్రధాన కార్యాలయమైన డెహ్రాడూన్‌కు పంపారు. అలంపూర్‌లో మూడు రోజుల పాటు చేపట్టిన పరిశోధనలు సోమవారం ముగియగా.. ప్రస్తుతం కర్నూలు జిల్లా పంచ లింగాలకు వెళ్లారు. తెలంగాణలోని రాజోళిలో కూడా పరిశోధన సాగే అవకాశం ఉంది. ఖమ్మం వంటి ప్రాంతాల్లో కూడా పరిశోధనలు చేసే అవకాశముందని సమాచారం. -
నదుల తీరం.. చమురు క్షేత్రం !
అలంపూర్ రూరల్: తెలంగాణకు దక్షిణ సరిహద్దులో ప్రవహించే కృష్ణా, తుంగభద్ర నదుల తీరాల్లో చమురు నిక్షేపాలు ఉన్నట్లు పరిశోధనలు సాగుతున్నాయి. అలంపూర్ మండలంలో భారత ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) జీపీఎస్ శాటిలైట్ ద్వారా న్యాచురల్ గ్యాస్(సహజ వాయువు), పెట్రోల్ , క్రూడాయిల్ వంటి ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో రెండు రోజులుగా అలంపూర్ ప్రాంతంలోని తుంగభద్ర నది బిడ్జి కేంద్రంగా పరిసర ప్రాంతాలైన సుల్తానాపురం, ర్యాలంపాడు, కాశీపురం, సింగవరం తదితర గ్రామాల్లో రిగ్గు బోర్లు వేస్తూ మట్టి, నీటి నమూనాలను సేకరించారు. అత్యాధునిక రాడార్ వాహనం ద్వారా చమురు నిక్షేపాలను గుర్తించే తరంగాలను రిగ్గులోకి పంపుతూ అక్కడి పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని క్రోడీకరించుకుని తమ వద్ద ఉన్న ప్రత్యేక కంప్యూటర్లలో సమాచారాన్ని ఎప్పటికప్పుడు నిక్షిప్తం చేస్తూ డెహ్రాడూన్‌లోని తమ ప్రధాన కార్యాలయానికి చేరవేస్తున్నారు. ఈ ప్రక్రియనంతా డేటా కలెక్షన్గా పేర్కొంటున్నట్లు ప్రాజెక్టు మేనేజర్ మురిగేషన్ ‘సాక్షి’కి వెల్లడించారు. 40 ఏళ్ల క్రితమే సర్వే.. ఈ ప్రాంతంలో చమురు నిక్షేపాలు ఉన్నట్టు గత 40 ఏళ్ల క్రితమే నాటి సర్వే ఆఫ్ ఇండియా నివేదికలు పంపినట్లు ప్రాజెక్టు మేనేజర్ మురుగేషన్ తెలిపారు. ప్రస్తుతం క్రూడాయిల్ కోసం పశ్చిమ దేశాలపై ఆధారపడ్డాం. దేశంలోని మోదీ ప్రభుత్వంలో సహజ వాయువులు, చమురు నిక్షేపాలను గుర్తించేందుకు జీపీఎస్ టెక్నాలజీని ఉపయోగించుకుని పరిశోధన నియమాలను సులభతరం చేసినందుకు డాటా కలెక్షన్ ప్రారంభమైందన్నారు. గతంలో డీబేర్స్ అనే వజ్రాల సంస్థ నడిగడ్డ ప్రాంతమైన కృష్ణా– తుంగభద్ర నదీతీర ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన విషయం కూడా విధితమే. చమురు నిక్షేపాలను గుర్తించడం నదీతీరాల దగ్గర చమురు నిక్షేపాలు అధికంగా ఉన్నాయని జీపీఎస్ శాటిలైట్ సిస్టం ద్వారా గుర్తించిన ఓఎన్జీసీ ఈ నిక్షేపాల పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు 60 మీటర్ల విస్తీర్ణంలో శాటిలైట్ గుర్తించిన ప్రదేశాల్లో రిగ్గులను తవ్వి రాడార్ సంకేతాలను ఆ రిగ్గులోకి పంపుతున్నారు. అలా పంపిన సంకేతాలతో అక్కడ ఖనిజ నిక్షేపాలు, సహజ సిద్ధమైన వాయువులు, వాటి పీడనాలు ఏ విధంగా ఉన్నాయో సేకరిస్తున్నారు. జియోగ్రాఫికల్ సంకేతాల ఆధారంగా సేకరించిన సమాచారాన్ని ఓఎన్జీసీ సంస్థ విశ్లేషించి మరికొన్ని సార్లు పరిశోధించి చమురు నిక్షేపాలు లభ్యమయ్యే ప్రాంతాన్ని గుర్తిస్తుంది. అనంతరం నిర్ధారించుకున్న తర్వాత వాటిపై పరిశోధనలు జరిపి ఖనిజ నిక్షేపాలను భావితరాల అవసరాలకు అందేలా చర్యలు చేపడుతుంది. -
భూ అయస్కాంత క్షేత్రాలపై ప్రపంచ దేశాల పరిశోధన
నేటి నుంచి 9 రోజులపాటు వర్క్‌షాప్ చౌటుప్పల్: ప్రకృతి విపత్తులు, సునామీలు, భూకంపాలను ముందుగా పసిగట్టేందుకు, భూగర్భంలోని ఖనిజ, చమురు నిక్షేపాలను గుర్తించేందుకు భూ అయస్కాంత క్షేత్రాలపై ప్రపంచవ్యాప్తంగా నిత్యం 150 కేంద్రాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. అందులోభాగంగా భూ అయస్కాంత క్షేత్ర పరిశీలనకు హైదరాబాద్‌లోని నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెం శివారులో ఉన్న 105 ఎకరాల విస్తీర్ణంలో 2012లో ఈ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ అత్యంత ఆధునికమైన డిజిటల్ మాగ్నటోమీటర్ను ఏర్పాటు చేశారు. ఇందులో అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా భూ అయస్కాంత క్షేత్ర మార్పులపై ప్రతి నిమిషానికి 120 నమూనాలు నమోదవుతాయి. వీటి ఆధారంగా నిరంతరం పరిశోధనలు జరుగుతుంటాయి. వచ్చే 10 వేల ఏళ్లలో దక్షిణ, ఉత్తర ధ్రువాలు తారుమారు వచ్చే 10 వేల ఏళ్లలో దక్షిణ, ఉత్తర ధృవాలు పరస్పరం మారుతున్నాయి. గతంలో 70 వేల ఏళ్ల క్రితం ఇలా జరిగింది. సాధారణంగా 50 వేల ఏళ్లకోసారి ఇలా మారుతుంటాయి. ఆ సమయంలో భూమిలో ఎలాంటి మార్పులు జరుగుతాయనే అంశంపై ఈ వర్క్‌షాప్‌లో పరిశోధనలు చేయనున్నారు. -వైజే.భాస్కర్‌రావు, డెరైక్టర్, ఎన్జీఆర్ఐ