olympic Associaton
-
అమెరికాలో 2024 టి20 ప్రపంచకప్! ..
2024 T20 WC likely to be hosted by USA: 2024లో జరగాల్సిన టి20 ప్రపంచకప్‌కు వేదికగా అమెరికా నిలిచే అవకాశం ఉంది. ఈ మేరకు 2024 ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులను యూఎస్ఏ క్రికెట్‌తో పాటు క్రికెట్ వెస్టిండీస్‌లకు సంయుక్తంగా కట్టబెట్టే యోచన లో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఉన్నట్లు సమాచారం. 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజెలిస్‌లో జరగనుండటం... అందులో క్రికెట్‌ను చేర్చాలంటూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి ఐసీసీ ఇప్పటికే విజ్ఞప్తి కూడా చేసింది. అందులో భాగంగా 2024 టి20 ప్రపంచకప్‌ను అమెరికాలో విజయవంతంగా నిర్వహిస్తే... 2028 విశ్వ క్రీడల్లో క్రికెట్‌ను చేర్చేందుకు ఉపయోగకరంగా ఉంటుందని ఐసీసీ భావిస్తోంది. అయితే ప్రపంచ కప్ మ్యాచ్‌లన్నింటినీ అమెరికాలోనే నిర్వహించడకుండా... కరీబియన్ దీవుల్లోనూ నిర్వహించేందుకు ఐసీసీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అదే జరిగితే 2014 టి20 ప్రపంచకప్ తర్వాత మరో ఐసీసీ మెగా ఈవెంట్ భారత్, ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ దేశాల్లో కాకుండా మరో దేశంలో జరిగే అవకాశం ఉంటుంది. చదవండి: T20 WC 2021 Winner Australia: మ్యాచ్ చూడలేదా అమిత్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే -
‘టి’ రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడిగా విజయ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇండియన్ స్టయిల్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి.విజయ్‌కుమార్ యాదవ్ ఎన్నికయ్యారు. శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా అభిమన్యు యాదవ్, ఉపాధ్యక్షులుగా హబీబ్ భాయ్, బి.లక్ష్మీనారాయణ యాదవ్, జి.శ్రీనివాస్ యాదవ్, కె.యాదయ్య, నర్సింగరావు, దశరథం ఎన్నికయ్యారు. నిర్వాహక కార్యదర్శిగా ఎ.ఎన్.కె.గోకుల్, కోశాధికారిగా నాసర్ ఖులాకిలను ఎన్నుకున్నారు. ఇండియన్ స్టయిల్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి రోషన్ లాల్జీ సమక్షంలో జరిగిన ఈ ఎన్నికలకు ఏపీ ఒలింపిక్ సంఘంనకు చెందిన ఎస్.సోమయ్య పరిశీలకుడిగా వ్యవహరించారు.