Oneday cricket Match
-
IND Vs SL: వారెవ్వా! సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లి..
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది ఆడిన తొలి మ్యాచ్‌లోనే కోహ్లి సెంచరీ సాధించాడు. గౌహతి వేదికగా శ్రీలంకతో మొదటి వన్డేలో కింగ్ కోహ్లి సెంచరీ చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కేవలం 80 బంతుల్లోనే తన 45వ అంతర్జాతీయ వన్డే సెంచరీ అందుకున్నాడు. ఇక ఓవరాల్‌గా విరాట్‌కు ఇది 73వ అంతర్జాతీయ సెంచరీ. ఇక ఈ మ్యాచ్‌లో 87 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 113 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు,ఒక సిక్స్ ఉన్నాయి. కాగా విరాట్‌కు ఇది వరుసగా రెండో వన్డే శతకం కావడం గమానార్హం. గతేడాది ఆఖరిలో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో విరాట్ అద్భుతమైన సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. అనంతరం విరాట్‌కు ఇదే తొలి వన్డే. Back to back ODI hundreds for @imVkohli 👏👏 Live - https://t.co/MB6gfx9iRy #INDvSL @mastercardindia pic.twitter.com/Crmm45NLNq — BCCI (@BCCI) January 10, 2023 -
మహిళా క్రికెట్లో పెను సంచలనం
డబ్లిన్: రోజురోజుకు ఆదరణ పెరుగుతున్న మహిళా క్రికెట్లో పెనుసంచలనం నమోదయింది. ఐర్లాండ్ ఆతిథ్యమిస్తున్న ముక్కోణపు సిరీస్‌లో న్యూజిలాండ్ మహిళల జట్టు 490 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దీంతో అటు పురుషులు, ఇటు మహిళల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా కివీస్ మహిళల జట్టు నిలిచింది. శుక్రవారం ఆతిథ్య ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన కివీస్ జట్టుకు ఓపెనర్లు కళ్లు చెదిరే రీతిలో శుభారంభం అందించారు. కెప్టెన్ సుజయ్ బేట్స్ 151(94 బంతుల్లో 24 ఫోర్లు, 2 సిక్సర్లు), జెస్సీ వాట్కిన్(62)లు చెలరేగడంతో పాటు.. మాడీ గ్రీన్ 121(77 బంతుల్లో 15ఫోర్లు, 1 సిక్సర్), అమెలియా కెర్(81) మెరుపులు మెరిపియ్యడంతో కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 490 పరుగులు సాధించింది. దీంతో 1997లో పాకిస్తాన్‌పై కివీస్ సాధించిన 455 పరుగుల రికార్డును తాజాగా అదే జట్టు చెరిపివేసి కొత్త చరిత్రను లిఖించింది. ఇక పురుషుల అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఇంగ్లండ్ చేసిన 444 పరుగులే ఇప్పటివరకు అత్యధికం కావడం గమనార్హం. -
క్యాచ్ పట్టాడు.. క్యాష్ కొట్టాడు!
హామిల్టన్: న్యూజిలాండ్ క్రికెట్ అభిమాని ఒకరిని అదృష్టం వరించింది. అద్భుతమైన క్యాచ్ అందుకున్నందుకు 83 వేల అమెరికా డాలర్లు(సుమారు 51 లక్షల రూపాయలు) అతడు గెల్చుకున్నాడు. న్యూజిలాండ్, వెస్టిండీస్ వన్డే మ్యాచ్ సందర్భంగా అతడీ మొత్తం సాధించాడు. బౌండరీ లైన్ దాటిన బంతిని ఒడిసిపట్టిన మైఖేల్ మోర్టాన్ ఈ బహుమతి అందుకున్నాడు. వెస్టిండీస్ ఓపెనర్ కీరన్ పావెల్ కొట్టిన సిక్స్‌ను క్యాచ్ పట్టి క్యాష్ సొంతం చేసుకున్నాడు. పెద్ద మొత్తంలో నగదు గెల్చుకోవడం నమ్మలేకపోతున్నానని స్కై న్యూస్‌తో మైఖేల్ మోర్టాన్ అన్నాడు. తన తండ్రి పక్కన కూర్చుని మ్యాచ్ చూస్తుండగా వచ్చిన బంతిని పైకెగిరి పట్టుకున్నానని తెలిపాడు. ఆరంజ్ రంగు టీ-షర్ట్ ధరించి ఒంటి చేత్తో క్యాచ్ పట్టుకున్న వారికి బహుమతి ఇస్తామని నిర్వాహక సంస్థ బ్రివర్ తుయ్ ప్రకటించింది. స్పాన్సర్షిప్ ప్రమోషన్లో భాగంగా ఈ పోటీ పెట్టింది. అయితే గెలిచిన వారికి ఎంత మొత్తం ఇస్తామనేది ముందుగా వెల్లడించలేదు.