'వన్ ప్లస్ 3టీ మిడ్నైట్ బ్లాక్' సేల్ నేటినుంచే
చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్ నూతనంగా లాంచ్ చేసిన వన్ ప్లస్ 3టీ మిడ్నైట్ బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్ శుక్రవారం నుంచి భారత మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. కేవలం 128 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్ లోనే అందుబాటులో ఉండే దీని ధర రూ.34,999. అయితే ఎన్ని డివైజ్లను విక్రయానికి ఉంచుతుందో కంపెనీ ప్రకటించలేదు. వన్ ప్లస్ ఇండియా స్టోర్, అమెజాన్, వన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ స్టోర్ బెంగళూరులో ఇది మధ్యాహ్నం 2గంటల నుంచి ఈ ఫోన్ ను విక్రయించడం ప్రారంభించింది. ఈ కొత్త కలర్ ఆప్షన్ ఫోన్ అచ్చం వన్ ప్లస్ 3టీ బ్లాక్ కొలెట్టే ఎడిషన్ మాదిరే ఉండనుంది.
యూనిక్ కలర్లకు మారుపేరుగా నిలుస్తున్న వన్ ప్లస్.. ఈ ఫోన్ను ప్రస్తుతం ఓ ప్రత్యేక రంగులో మార్కెట్లోకి తీసుకొచ్చింది. 128జీబీ ఇంటర్నెట్ స్టోరేజ్ మినహా మిగతా ఫీచర్లన్నీ ఈ ఫోన్ కు ఒకేలా ఉంటాయి. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 821, 6జీబీ ర్యామ్, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ విత్ డ్యాష్ ఛార్జ్ దీని ప్రత్యేకతలు. అంతేకాక వన్ ప్లస్ 3కి స్వల్ప మార్పులతో ఈ ఫోన్ ను కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వన్ ప్లస్ 3 కంటే వేగవంతమైన ఎస్ఓసీ, స్టోరేజ్ పెంపు, ఫ్రంట్ కెమెరాకు మెరుగులు, పెద్ద బ్యాటరీ వంటివి దీనిలో మార్పులు.