online tenders
-
ఊరూరా వైరా నీరు
వైరా : వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా వైరా రిజర్వాయర్ రూపురేఖలు మారనున్నాయి. ప్రస్తుతం ఈ రిజర్వాయర్ నుంచి ఆరు మండలాలకు తాగునీరు, 25వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా జిల్లాలోని వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల ప్రజల తాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. దీనిలో భాగంగా పాలేరు, వైరా, దుమ్ముగూడెం వాటర్‌గ్రిడ్ పథకాల ఇన్‌టెక్‌వెల్ పనులు ప్రారంభమవుతున్నాయి. వైరా వాటర్‌గ్రిడ్ పథకం కోసం గతంలో తయారు చేసిన ప్రతిపాదనల్లో అధికారులు మార్పులు చేశారు. కొత్త ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందించారు. వాటికి ఆమోదం కూడా లభించింది. ఇదీ వైరా వాటర్‌గ్రిడ్ స్వరూపం వైరా రిజర్వాయర్ నుంచి మూడు నియోజకవర్గాల్లో 12 మండలాలకు తాగునీరు అందించనున్నారు. మొదటి ప్రతిపాదనలో నియోజకవర్గంలోని వైరా, కొణిజర్ల మండలాలు మాత్రమే ఉండగా ఇప్పుడు ఏన్కూరు, జూలూరుపాడు మండలాలను చేర్చారు. పూర్తిస్థాయిలో ఈ ప్రతిపాదనలు పూర్తిచేసి నిధుల కోసం ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఇదే ఖాయమైతే వైరా, కొణిజర్ల, ఏన్కూరు, జూలూరుపాడు, సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ, కల్లూరు, వేంసూరు, పెనుబల్లి, మధిర నియోజకవర్గంలోని మధిర, బోనకల్, ఎర్రుపాలెం మండలాల పరిధిలో 493 గ్రామాలు 6.5 లక్షల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. అశ్వారావుపేటలోని అశ్వారావుపేట, దమ్మపేట మండలాలను దుమ్ముగూడెం వాటర్‌గ్రిడ్ పథకంలోకి మార్చారు. ఓ ఇన్‌టెక్‌వెల్- 309 తాగునీటి పథకాలు వైరా రిజర్వాయర్ వాటర్‌గ్రిడ్ పథకానికి మూడు నియోజకవర్గాల్లో 309 మంచినీటి ట్యాంకులు, రిజర్వాయర్ వద్ద ఓ ఇన్‌టెక్‌వెల్ నిర్మించనున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 153 ట్యాంకులు వినియోగంలో ఉన్నాయి. కొత్తగా 260 ట్యాంకులు అవసరం ఉన్నాయని సత్తుపల్లి నియోజకవర్గంలో 107 మంచినీటి ట్యాంకులు, మధిర నియోజకవర్గంలో మరో 54 ట్యాంకుల నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఆయా పంచాయతీల అధికారులకు స్థల సేకరణ కోసం ఆదేశాలు కూడా జారీ చేశారు. భారీగా అంచనా వ్యయం వాటర్‌గ్రిడ్ పథకానికి 1,220 కోట్లు అవసరం ఉందని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 12 మండలాల్లో సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీలకు రిజర్వాయర్ నుంచి రా వాటర్‌ను మాత్రమే అందించి వాటి వినియోగాన్ని ఆయా మున్సిపాలిటీలు చూసుకునేలా నిబంధనలు పెట్టారు. వీటిలో కొణిజర్ల మండల బస్వాపురం, కల్లూరు మండలం కనెగిరి, కనెగిరి గుట్టల వద్ద ఎర్రుపాలెం మండలం రామన్నపాలెం, బోనకల్ క్రాస్ రోడ్డు వద్ద నీటిశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. వైరా రిజర్వాయర్ వద్ద 300 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న ఏడు మోటార్లను ఏర్పాటు చేస్తారు. ఆన్లైన్ టెండర్లకు ఏర్పాట్లు వైరా రిజర్వాయర్ నుంచి 12 మండలాలకు తాగునీటిని అందించేందుకు ఈనెల చివరి వరకు ఆన్లైన్ టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు హరి ఉమాకాంతారావు తెలిపారు. ఇటీవల ఆయన రిజర్వాయర్‌ను సందర్శించారు. వాటర్‌గ్రిడ్ పథకానికి సంబంధించిన పైపులైన్లు, ఇన్‌టెక్‌వెల్, ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణం కోసం ఈ టెండర్లను ఆహ్వానిస్తున్నామన్నారు. -
ఆన్లైన్ టెండర్ల విధానాల్లో మార్పులు!
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ టెండర్ల విధివిధానాలను పునః సమీక్షించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ-ప్రొక్యూర్మెంట్ టెండర్ల ప్రక్రియలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించడంతో పాటు టెండర్ల నియమనిబంధనల్లో సైతం మార్పులు చేర్పులు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా ఐటీ శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీస్ సర్వీసెస్(ఏపీటీఎస్) ఎండీతో పాటు నీటిపారుదల, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ, పబ్లిక్ హెల్త్ తదితర ఇంజనీరింగ్ శాఖల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నెల 9న ఏపీటీఎస్ ఎండీ కార్యాలయంలో ఈ కమిటీ సమావేశమై ఈ-ప్రొక్యూర్మెంట్ విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై చర్చించి ప్రభుత్వానికి సిఫారసులు చేయనుంది. ఈ విషయుంలో సలహాలు, సూచనలు అందించాలని ముఖ్య ఇంజనీర్లకు ఐటీ శాఖ ఆహ్వానం పంపింది. ఆన్లైన్లో టెండర్ బిడ్లు తెరుచుకోకపోవడం, టెక్నికల్ బిడ్‌ను తెరిస్తే ఫైనాన్షియల్ బిడ్ తెరుచుకోవడం, ఒక్కోసారి ఆన్లైన్ నుంచి టెండర్ బిడ్లు అదృశ్యం కావడం తదితర సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని ఇంజనీరింగ్ శాఖలు తరుచుగా ఫిర్యాదు చేస్తున్నాయి. ఇలాంటి సాంకేతిక లోపాల పరిష్కారంతో పాటు విధానపర మార్పులపై కమిటీ నిర్ణయం తీసుకోనుందని అధికారవర్గాలు తెలిపాయి. -
అనుకున్నట్లే అయింది
సాక్షి ప్రతినిధి, కడప: ‘కొండను తవ్వి ఎలుకను పట్టారన్నట్లు’గా ఎంపీఎండీసీ పరిస్థితి తయారైంది. ఆన్లైన్ టెండర్ల ద్వారా లాభాలు గడిస్తామని చెప్పుకురావడం మినహా భారీ నష్టాలను చవిచూశారు. ఇదంతా బడా పారిశ్రామికవేత్తలకు వంతపాడేందుకేనని రూఢీ అయ్యింది. అధికార పార్టీ కనుసన్నల్లో ప్రజాధనం లూటీకి పరోక్షంగా సహకరించారు. ప్రస్తుత ధరతో కొనుగోలు చేస్తామని ముందుకు వచ్చిన బయ్యర్ల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించారు. వెరసి చిన్నతరహా పరిశ్రమల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చారు. ‘వడ్డించేవారు మనవారైతే కడబంతి అయితేనేం’ అన్నట్లుగా బడా పారిశ్రామికవేత్తలకు అనుగుణంగా అధికారులు చేతివాటం ప్రదర్శించారు. చిత్త శుద్ధితో టెండర్లు నిర్వహిస్తున్నామని చెప్పుకుంటూనే, పాలకపక్షాన్ని నమ్ముకున్న వారికి న్యాయం చేయడంలో సఫలమయ్యారు. సొరచేపల ఎదుట చిన్న చేపల ఉనికి ప్రశ్నార్థకంగా మారినట్లుగా మంగంపేట సీ, డీ గ్రేడ్ బెరైటీస్ టెండర్ల ప్రక్రియ తయారైంది. ఆ బెరైటీస్‌నే నమ్ముకొని జీవిస్తున్న 150 పల్వరైజింగ్ మిల్లులు, వాటిలో పనిచేస్తున్న ఐదువేల మందికి పైగా కార్మికుల ఉపాధి భవిష్యత్ ప్రశ్నార్థంగా మారింది. ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) బడా బయ్యర్లకు అనుకూలంగా వ్యవహరించింది. అందులో భాగంగా మంగళవారం నిర్వహించిన టెండర్లలో రూ.112.65 కోట్ల ఆదాయానికి గండికొట్టారు. ఆ మొత్తం బడా వ్యక్తులకు దోచిపెట్టేందుకు సహకరించారు. ప్రజాధనం లూటీకి సహకారం.. ఏపీఎండీసీ యంత్రాంగం వైఖరి కారణంగా పెద్ద ఎత్తున ప్రజాధనానికి గండి పడింది. పరోక్షంగా బడా పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టేందుకు తోడ్పాటునిచ్చారు. ప్రస్తుతం టన్ను రూ.1926లతో కొనుగోలు చేస్తున్నారు. అయితే ఆన్లైన్ టెండర్ల నిర్వహణలో టన్ను ధర రూ.1120గా నిర్ణయించారు. పోటీ కారణంగా మరింత ఆదాయం గడిస్తామని ప్రగల్భాలు పలికారు. అయితే అత్యధిక ధరగా రూ.1175 టన్ను ధరను చెన్నైకి చెందిన ఓరన్ హైడ్రోకార్బొరేట్ కంపెనీ కోట్ చేసింది. మిగతా కంపెనీలు అంతకంటే తక్కువ ధరకు కోట్ చేసినట్లు సమాచారం. ఈ లెక్కన ప్రస్తుత ధరతో పోలిస్తే టన్నుకు రూ.751 ఆదాయాన్ని ఏపీఎండీసీ కోల్పోవలసి వచ్చింది. అంటే 15లక్షల టన్నులపై సుమారు రూ.112.65కోట్లు పైబడి నష్టాన్ని చవిచూస్తోంది. ఒకవిధంగా చెప్పాలంటే ప్రజాధనాన్ని బడావ్యక్తులకు యాజమాన్యం దోచి పెట్టిందనే చెప్పవచ్చు. తాము మునపటి రేటుకు కొనుగోలు చేస్తామని ముందుకు వచ్చిన స్థానిక బయ్యర్లను కాదని ఎగుమతిదారులకు అవకాశం కల్పించేందుకు యంత్రాంగం ప్రత్యక్షంగా సహకరించిందనే ఆరోపణలు నిజం చేస్తున్నాయి. ప్రశ్నార్థకంగా మారిన చిన్నతరహా పరిశ్రమలు మంగంపేట బెరైటీస్ ఆధారంగా నెలకొల్పిన సుమారు 150 పల్వరైజింగ్ మిల్లుల భవిష్యత్ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారనుంది. ఆన్లైన్ టెండర్లలో పాల్గొన్నవారికి మాత్రమే సీ, డీ గ్రేడ్ బెరైటీస్ అప్పగించనున్నట్లు నిబంధనలు పొందుపర్చారు. గత ఏడాది మార్చిలో నిర్వహించిన ఆన్లైన్ టెండర్లలో హెచ్చు పాటదారుడు రేటు చెల్లించిన ప్రతి మిల్లు యజమానికి సంవత్సరంలో 5వేల మెట్రిక్ టన్నుల బెరైటీస్ అప్పగించేలా చర్యలు తీసుకున్నారు. ఈమారు టెండర్లలో పాల్గొన్నవారు మినహా ఇతరులకు ఖనిజం కేటాయించే అవకాశాలు లేవని స్పష్టంగా నిబంధనల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం 15లక్షల మెట్రిక్ టన్నులను బడా పారిశ్రామిక వేత్తలు దక్కించుకున్నారు. రూ.50లక్షల ఈఎండీ చెల్లించగల్గిన స్థోమత ఉన్న వారు మాత్రమే పాల్గొనడంతో చిన్నతరహా మిల్లుల యజమానుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. వీటిపై ఆధారపడి జీవిస్తున్న ఐదు వేల మంది కార్మికుల ఉపాధి కూడా ప్రశ్నార్థకం కానుంది. మునుపటి లాగా ప్రతి మిల్లుకు 5వేల మెట్రిక్ టన్నులు కేటాయించే సాంప్రదాయాన్ని కొనసాగించే మిల్లుల యజమానులకు కూడా లబ్ధి చేకూరనుంది.