పిల్లలు నా పేరు చెప్పడానికి కూడా ఇష్టపడరు: శ్రీకాంత్
హీరో శ్రీకాంత్‌తో మూడునాలుగు సినిమాలే చేసింది ఊహ. అప్పటివరకు ఆన్‌స్క్రీన్‌పై జోడీ కట్టిన ఆమె రియల్ లైఫ్‌లోనూ తనతో జత కట్టింది. శ్రీకాంత్‌ను పెళ్లాడింది. వీరి పెళ్లయి దాదాపు పాతికేళ్లవుతోంది. వివాహం తర్వాత ఊహ సినిమాలకు దూరమైంది. ముగ్గురు పిల్లలను చూసుకుంటూ ఇంటికే పరిమితమైంది. ఊహ సినిమాలు మానేయడానికి గల కారణంపై తాజాగా శ్రీకాంత్ స్పందించాడు.అది తన నిర్ణయమేఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. 'సినిమాలు మానేయమని ఊహకు మేమెవరం చెప్పలేదు. తనే వద్దనుకుంది. అప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేశాకే పెళ్లి చేసుకుంది. సినిమాలకు దూరమవ్వాలన్నది కేవలం తన నిర్ణయమే! ముగ్గురు పిల్లలు (రోషన్, మేధ, రోహన్) పుట్టాక వాళ్లే తన ప్రపంచమైపోయింది. ఏమాటకామాట.. అర్థం చేసుకునే వ్యక్తి దొరకడం పెద్ద అదృష్టం. ఊహను పెళ్లి చేసుకున్న క్షణాలు నా జీవితంలోనే బెస్ట్.ఎక్కడా పేరు చెప్పుకోరుపిల్లల విషయానికి వస్తే.. రోషన్ సైకాలజీ చదివాడు. ఇప్పుడిప్పుడే నటుడిగా ఎదుగుతున్నాడు. నేను శ్రీకాంత్ కుమారుడిని అని ఎక్కడా చెప్పుకోడు. నా కూతురు మేధ కెనడాలో చదువుతోంది. అక్కడున్న తెలుగువారితో ఎన్నడూ కూడా శ్రీకాంత్ మా నాన్న అని చెప్పలేదు. ఎక్కడికైనా వెళ్లాలన్నా కూడా వీళ్లు నా పేరు ఉపయోగించుకోరు. శ్రీకాంత్ వాళ్ల అబ్బాయిని అని రికమండేషన్ చేయించుకోరు. వాళ్లంతట వాళ్లే సొంతంగా ఎదగాలని కష్టపడతారు' అని చెప్పుకొచ్చాడు.చదవండి: బాలీవుడ్ నటికి సర్జరీ.. ఇప్పుడెలా ఉందంటే?