విజేత ఏఓసీ
జింఖానా, న్యూస్‌లైన్: ఓపెన్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో ఏఓసీ జట్టు విజేతగా నిలిచింది. విక్టరీ ప్లేగ్రౌండ్‌లో ముంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఏఓసీ జట్టు 75-72తో ఎస్సీఆర్ జట్టుపై నెగ్గి టైటిల్ కైవసం చేసుకుంది. తుది పోరులో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మొదటి అర్ధ భాగం ముగిసే సమయానికి 39-37తో ఏఓసీ ఆధిక్యంలో నిలిచింది.
ముందు నుంచి దూకుడుగా ఆడిన జలీల్ (30), సత్యనారాయణ (12), నాగరాజు (11) చివరి వరకు అదే ఆటతీరును ప్రదర్శించారు. ఎస్సీఆర్ క్రీడాకారులు నిహాల్ యాదవ్ (23), మురళి (19) చెమటోడ్చినప్పటికీ ఫలితం దక్కలేదు. విజేతలకు జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ అడిషనల్ కంట్రోలర్ ఎస్.అన్నపూర్ణ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి బీడీఎల్ మాజీ సీనియర్ జనరల్ మేనేజర్ కృష్ణ, ఏపీ బాస్కెట్‌బాల్ సంఘం కార్యదర్శి సంపత్ తదితరులు పాల్గొన్నారు.