ఓపెన్ డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
అనంతపురం టౌన్ : అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ) ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మహిళా అధ్యయన కేంద్రం కో ఆర్డినేటర్ కె.రామచంద్రుడు ఓ ప్రకటనలో తెలిపారు. 2012 నుంచి 2016 వరకు యూనివర్సిటీ నిర్వహించిన అర్హత పరీక్ష పాసైన వారు అర్హులు. ఇంటర్, ఓపెన్ ఇంటర్, ఐటీఐ, నర్సింగ్, డిప్లొమో, టెన్ ప్లస్ 2 ఉత్తీర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు ట్యూషన్ ఫీజును ఆగస్టు 20లోగా చెల్లించాలని, ఇతర వివరాలకు 08554–245908 ఫోన్ నంబరులో సంప్రదించవచ్చునని సూచించారు.