Open Doors
-
Open Doors: విదేశీ విద్య @ అమెరికా
సాక్షి, న్యూఢిల్లీ: విదేశాల్లో విద్యాభ్యాసానికి వెళ్లే భారతీయ విద్యార్థుల టాప్ చాయిస్ ఇప్పటికీ అమెరికానే! 2021–22లో అమెరికాలో 9.48 లక్షల మంది విదేశీ విద్యార్థులు ప్రవేశాలు పొందగా వారిలో 21 శాతం (1,99,182 మంది) భారతీయులే! 2020–21తో పోలిస్తే ఇది 18 శాతం ఎక్కువని ఓపెన్ డోర్స్ సంస్థ నివేదిక వెల్లడించింది. మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ కరోనా వల్ల 2020–21లో అమెరికాలో అడ్మిషన్లు తీసుకున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 13.2 శాతం తగ్గింది. వైరస్ ప్రభావం తగ్గడంతో 2021–22లో అడ్మిషన్లు భారీగా పెరిగాయి. భారతీయ విద్యార్థుల సంఖ్య 18.9 శాతం పెరిగిందని నివేదిక పేర్కొంది. అమెరికాలోని విదేశీ విద్యార్థుల సంఖ్యలో చైనాదే అగ్రస్థానం. కానీ వారి సంఖ్య 2020–21లో 3.17 లక్షలుండగా 2021–22లో 2.9 లక్షలకు తగ్గింది. అమెరికాలో 9,48,519 మంది విదేశీ విద్యార్థులున్నారని ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో 21.1 శాతం (2 లక్షలు) మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, 19.8 శాతం (1.88 లక్షలు) ఇంజనీరింగ్ చదువుతున్నారు. వచ్చే వేసవిలో భారత విద్యార్థులకు 82 వేలకు పైగా వీసాలు జారీ చేస్తామని యూఎస్ ఎంబసీ ప్రకటించింది. గతేడాది 62 వేల వీసాలు జారీ చేసినట్లు ‘మినిస్టర్ కౌన్సెలర్ ఫర్ పబ్లిక్ డిప్లొమసీ’ గ్లోరియా బెర్బెనా తెలిపారు. -
డోర్లు తెరుచుకునే మెట్రో రైలు రయ్...
సాక్షి, న్యూఢిల్లీ: మహా నగరాలకు మణిహారంగా అభివర్ణించే మెట్రో రైలు ప్రాజెక్టులను... ఆయా ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ వ్యయంతో రూపొందిస్తుంటాయి.అదే సమయంలో ప్రయాణికులకు భద్రతపరమైన హామీని ఇవ్వాల్సిన అవసరం సిబ్బందిపై ఉంటుంది. సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తితే ఘోర ప్రమాదాలు సంభవించే ఆస్కారం ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఢిల్లీలో గత రాత్రి జరిగిన ఓ ఘటన చూద్దాం. కిక్కిరిసిన ప్రయాణికులతో సోమవారం రాత్రి నార్త్ ఢిల్లీ-గుర్గావ్ల మధ్య నడిచే యెల్లో లైన్ బుల్లెట్ ట్రైన్ రయ్ మంటూ దూసుకుపోతుంది. 10 గంటల ప్రాంతంలో చౌరీ బజార్ స్టేషన్ నుంచి బయలుదేరిన రైలు డోర్లు మూతపడలేదు. కశ్మీరే గేట్ స్టేషన్ వెళ్లే దాకా డోర్ అలాగే తెరుచుకుని ఉంది. ఇది గమనించిన ఓ ప్రయాణికుడు వీడియో తీసి ఇంటర్నెట్లో అప్ లోడ్ చేశాడు. దీంతో రైల్వే సిబ్బంది ఎంత జాగ్రత్తగా ఉన్నారో అంటూ విమర్శలు చెలరేగాయి. విషయం తమ దాకా రావటంతో ఢిల్లీ మెట్రో రైల్వే అధికారులు నిర్లక్ష్యం వహించిన ట్రెయిన్ ఆపరేటర్ ను సస్పెండ్ చేశారు. మూడేళ్ల క్రితం ఘితోర్నీ-అర్జంఘడ్ స్టేషన్ల మధ్య ఇలాంటి ఘటనే చోటు చేసుకున్న విషయం తెలిసిందే.